Shuru
Apke Nagar Ki App…
కెసిఆర్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమం కేసీఆర్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా సిరిసిల్లలో బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.
Satheesh gangu
కెసిఆర్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధాన కార్యక్రమం కేసీఆర్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా సిరిసిల్లలో బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.
More news from తెలంగాణ and nearby areas
- ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి రాత్రి సమయంలో లింగన్నపేట ఎల్లమ్మ ఆలయ తాళాలు పగలగొట్టాడు. అనంతరం లోపలికి ప్రవేశించి ఆలయంలోని హుండీని దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను గమనించిన గౌడ కులస్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆలయం వద్దకు చేరుకుని దొంగతనం చేస్తున్న అట్టి వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.1
- కరీంనగర్:జిల్లాలో కొంతమంది వైద్యులే సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ద్వారా తప్పుడు వైద్య ప్రచారం చేస్తూ పేద ప్రజలను, అమాయక రోగులను మోసం చేస్తున్నారని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. dyfi నాయకుల సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు అనంతరం నరేష్ పటేల్ మాట్లాడుతూ ముఖ్యంగా షుగర్ (మధుమేహం), బీపీ (రక్తపోటు) వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు అవసరం లేదని, ఇంటి చిట్కాలతో పూర్తిగా నయం అవుతుంది“ఒక్క మందుతో శాశ్వతంగా పోతుంది వంటి అవాస్తవాలు ప్రచారం చేస్తూ వీడియోలు విడుదల చేయడం ప్రజల ప్రాణాలతో ఆటలాడటమేనని విమర్శించారు. వైద్యులపై ఉన్న నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి తప్పుడు వీడియోలు విడుదల చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని తెలిపారు. ప్రజలు ఈ ప్రచారాలను నమ్మి వైద్యుల సలహా లేకుండా మందులు ఆపేస్తే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వంటి ప్రాణాపాయకర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పేదలు ఈ మోసాలకు ఎక్కువగా బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హతలేని వ్యక్తులు మాత్రమే కాకుండా కొంతమంది వైద్యులే ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడటం అత్యంత ఆందోళనకరమని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారు లాభాల కోసం ఇలా వ్యవహరించడం ఖండనీయమని పేర్కొన్నారు. ఇక మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ప్రజల పరిస్థితిని దుర్వినియోగం చేస్తూ తీవ్ర దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. అవసరం లేని పరీక్షలు చేయించడం, అధిక బిల్లులు వేయడం, అప్రామాణిక చికిత్సలు సూచించడం, పారదర్శకత లేకుండా ఫీజులు వసూలు చేయడం ద్వారా పేద ప్రజలను ఆర్థికంగా నాశనం చేస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో భయాన్ని ఉపయోగించుకుని లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతోందని విమర్శించారు. వైద్య రంగం సేవా ధర్మాన్ని కోల్పోయి పూర్తిగా వ్యాపారంగా మారడం దురదృష్టకరమని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వైద్య ప్రచారం చేస్తున్న వైద్యులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఇలాంటి వైద్యుల లైసెన్సులను రద్దు చేయాలని, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఉన్న ఫేక్ మెడికల్ వీడియోలను తక్షణమే తొలగించాలని, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయాలని, అవసరం లేని టెస్టులు, అధిక బిల్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, వైద్య సేవలపై ప్రభుత్వ పర్యవేక్షణను కఠినంగా అమలు చేయాలని, ప్రజల్లో సరైన వైద్య అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (DMHO) అధికారులు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శివ కుమార్,సహాయ కార్యదర్శులు,అరవింద్ నాయకులు సిన.రాజేష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు1
- జగిత్యాల తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ ను మర మనిషి అనే మాట సరైంది కాదనీ.. ఆ మాటను ఉప సంహరించుకుంటే మీకు గౌరవం ఉంటుంది అని కవితకు బీ ఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిజీవన్ రెడ్డి హితవు పలికారు. జగిత్యాల పట్టణంలో మాజీ మంత్రి, బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి ఆయన తన స్వగృహంలో శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీ ఎవరైనా ఏర్పాటు చేయవచ్చన్నారు. కానీ, మాజీ ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటు సందర్భంగా...కేసీఆర్ తో ఉన్న అనుబంధం, ఆత్మీయతను మరిచి, కుటుంబ సభ్యురాలిగాన్నే కాకుండా, ఉద్యమ నేత అయిన కెసిఆర్ ను మర మనిషి అనటం సరికాదన్నారు .బీ ఆర్ ఎస్ తో విభేదాలు రావొచ్చు..కానీ గత వాస్తవాలను విస్మరించడం సరైంది కాదు. కెసిఆర్ వంటి గొప్పమనసున్న మనిషిని మర మనిషిగా పేర్కొనడం సరి కాదన్నారు. కేసీఆర్ తో మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంది. కవిత కూడా తెలంగాణ ఉద్యమ బలోపేతానికి జాగృతి ద్వారా, ప్రజలను జాగృతం చేశారు. కేసీఆర్ కు హృదయం లేకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం లేదనీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అధికార పార్టీ పై తన లక్ష్యం ఉండాల్సి ఉండగా..పక్క పార్టీ పై లక్ష్యం ఉంటుందా..అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు1
- కరీంనగర్ లో సెలూన్ షాప్ నిర్వాకుడిపై దాడి చేసిన త్రీ టౌన్ ఎస్ఐ ఎన్.చైతన్య చందర్ పై సస్పెన్షన్ వేటు పడింది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో షేవింగ్ చేసుకోవడానికి ఎస్ఐ దారిలో ఖాన్ ఫురలోని సెలూన్ షాప్ వద్ద ఆగారు. షాప్ లోకి వెళ్ళి రాము షేవింగ్ చేయాలని కోరారు. వెంటనే రాము కూర్చోండి అన్నా అన్నాడు. అన్నా అని పిలుస్తావరా అంటూ అసభ్యపదజాలంతో దూషించి దాడి చేశాడు. ఎస్ఐ వీరంగం సిసి కెమెరాల్లో రికార్డు అయింది. సిసి ఫుటేజ్ తో మీడియాలో కథనాలు, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ అధికారులు విచారణ జరిపారు. సామాన్య పౌరుడిపై దాడి చేయడం అధికార దుర్వినియోగానికి పాల్పడడం విధి నిర్వహణలో అనుచితంగా ప్రవర్తించినట్లు పోలీస్ అధికారులు నిర్థారించడంతో డిఐజి సిఫార్సు మేరకు ఎస్ఐ ని సస్పెండ్ చేస్తు కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి పోలీసులు ప్రజలతో అసభ్యకరంగా ప్రవర్తించిన చట్టాన్ని అతిక్రమించి అధికారాన్ని దుర్వినియోగం చేసిన కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు.1
- *తేదీ: 25-04-2026* *పత్రికా ప్రకటన* *కామారెడ్డి నియోజక అభివృద్ధిపై ఎమ్మెల్యే మరియు కలెక్టర్ సంయుక్త సమీక్ష* కామారెడ్డి: కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ "రైతే రాజు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా తార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలి" అని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ గారికి సూచించారు. "ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం మనందరి బాధ్యత. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్య అందించాలి. ‘బడిబాట’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి" అని పిలుపునిచ్చారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. "తాగునీటి పైప్‌లైన్లు ధ్వంసమై సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలి. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరిపడా మంచినీరు అందించాలి" అని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేసి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ "ఎమ్మెల్యే సూచనల మేరకు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారుడికి చేరేలా చూడాలి" అని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కలిసి పనిచేస్తే కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి, కామారెడ్డి.1
- యువతకు పోలీస్ మేడం పిలుపు: "ఆత్మవిశ్వాసంతో ఎదగండి.. తల్లిదండ్రుల కలలను నిజం చేయండి" నమస్తే ప్రతినిధి: నేటి యువత తమ కాళ్ళ మీద తాము నిలబడి, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడపాలని పోలీస్ మేడం గారు కీలక సూచనలు చేశారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, విద్యార్థులకు మరియు యువతకు దిశానిర్దేశం చేస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ముఖ్య అంశాలు: తల్లిదండ్రులే స్ఫూర్తి: పిల్లలు సాధించే విజయాలే తల్లిదండ్రులకు నిజమైన గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడతాయని ఆమె పేర్కొన్నారు. ఉన్నతమైన సంపాదనతో పాటు, సమాజంలో మంచి పేరు సంపాదించుకోవడం ముఖ్యమని తెలిపారు. స్వయంశక్తి: ఇతరులపై ఆధారపడకుండా, నీ మీద నీవు నమ్మకం ఉంచుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నిబద్ధత - క్రమశిక్షణ: చేసే పని ఏదైనా అందులో నిబద్ధత, క్రమశిక్షణ ఉండాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుందని వివరించారు. బాధ్యత: తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలను చదివిస్తారని, వారి ఆశలను వమ్ము చేయకుండా బాధ్యతగా మెలగాలని హితవు పలికారు. "మీ ఆత్మవిశ్వాసమే మీ ఆయుధం. కష్టపడే తత్వం, క్రమశిక్షణ ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు." - పోలీస్ మేడం ఈ వార్తను మీ లోకల్ గ్రూప్స్‌లో లేదా న్యూస్ ఛానల్‌లో ప్రసారం చేయడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఏవైనా మార్పులు కావాలంటే చెప్పండి!1
- మొన్న కురిసిన వడగండ్ల వర్షం రైతు వెన్నెముకను విరిచేసిందని, ఎకరాకు 25వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం కారణంగా చేగుంట మండలంలోని కర్నాల్ పల్లి, మక్కరాజుపేట్, గొల్లపల్లి, రాంపూర్, కన్యారం గ్రామాలతో పాటు చేగుంట, నార్సింగి మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వయంగా నష్టపోయిన పంట పొలాలను శనివారం పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుగాలం చెమటతో పండించిన పంట క్షణాల్లో నేలమట్టం కావడం ఎంతో బాధాకరమని, పంట మాత్రమే కాదు, రైతుల ఆశలు కూడా తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వర్షం దెబ్బకు పంటలు పూర్తిగా నాశనం కావడంతో గడ్డి కూడా మిగలని పరిస్థితి ఏర్పడిందని, అప్పులు చేసి, కౌలు తీసుకుని సాగు చేసిన రైతులు ఈ విపత్తుతో పూర్తిగా ఆగమైపోయారని, ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతులకు ఇది మరింత భారంగా మారిందన్నారు. గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ప్రభుత్వం సరైన సహాయం అందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఎకరాకు కనీసం ₹25,000 వేల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు బతికితేనే దేశం బతుకుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.1
- కేసీఆర్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా సిరిసిల్లలో బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.1