కరీంనగర్ లో సెలూన్ షాప్ నిర్వాకుడిపై దాడి చేసిన త్రీ టౌన్ ఎస్ఐ చైతన్య చందర్ సస్పెండ్... అధికారాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరిక కరీంనగర్ లో సెలూన్ షాప్ నిర్వాకుడిపై దాడి చేసిన త్రీ టౌన్ ఎస్ఐ ఎన్.చైతన్య చందర్ పై సస్పెన్షన్ వేటు పడింది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో షేవింగ్ చేసుకోవడానికి ఎస్ఐ దారిలో ఖాన్ ఫురలోని సెలూన్ షాప్ వద్ద ఆగారు. షాప్ లోకి వెళ్ళి రాము షేవింగ్ చేయాలని కోరారు. వెంటనే రాము కూర్చోండి అన్నా అన్నాడు. అన్నా అని పిలుస్తావరా అంటూ అసభ్యపదజాలంతో దూషించి దాడి చేశాడు. ఎస్ఐ వీరంగం సిసి కెమెరాల్లో రికార్డు అయింది. సిసి ఫుటేజ్ తో మీడియాలో కథనాలు, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ అధికారులు విచారణ జరిపారు. సామాన్య పౌరుడిపై దాడి చేయడం అధికార దుర్వినియోగానికి పాల్పడడం విధి నిర్వహణలో అనుచితంగా ప్రవర్తించినట్లు పోలీస్ అధికారులు నిర్థారించడంతో డిఐజి సిఫార్సు మేరకు ఎస్ఐ ని సస్పెండ్ చేస్తు కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి పోలీసులు ప్రజలతో అసభ్యకరంగా ప్రవర్తించిన చట్టాన్ని అతిక్రమించి అధికారాన్ని దుర్వినియోగం చేసిన కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు.
కరీంనగర్ లో సెలూన్ షాప్ నిర్వాకుడిపై దాడి చేసిన త్రీ టౌన్ ఎస్ఐ చైతన్య చందర్ సస్పెండ్... అధికారాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరిక కరీంనగర్ లో సెలూన్ షాప్ నిర్వాకుడిపై దాడి చేసిన త్రీ టౌన్ ఎస్ఐ ఎన్.చైతన్య చందర్ పై సస్పెన్షన్ వేటు పడింది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో షేవింగ్ చేసుకోవడానికి ఎస్ఐ దారిలో ఖాన్ ఫురలోని సెలూన్ షాప్ వద్ద ఆగారు. షాప్ లోకి వెళ్ళి రాము షేవింగ్ చేయాలని కోరారు. వెంటనే రాము కూర్చోండి అన్నా అన్నాడు. అన్నా అని పిలుస్తావరా అంటూ అసభ్యపదజాలంతో దూషించి దాడి చేశాడు. ఎస్ఐ వీరంగం సిసి కెమెరాల్లో రికార్డు అయింది. సిసి ఫుటేజ్ తో మీడియాలో కథనాలు, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీస్ అధికారులు విచారణ జరిపారు. సామాన్య పౌరుడిపై దాడి చేయడం అధికార దుర్వినియోగానికి పాల్పడడం విధి నిర్వహణలో అనుచితంగా ప్రవర్తించినట్లు పోలీస్ అధికారులు నిర్థారించడంతో డిఐజి సిఫార్సు మేరకు ఎస్ఐ ని సస్పెండ్ చేస్తు కరీంనగర్ సిపి గౌస్ ఆలం ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచి పోలీసులు ప్రజలతో అసభ్యకరంగా ప్రవర్తించిన చట్టాన్ని అతిక్రమించి అధికారాన్ని దుర్వినియోగం చేసిన కఠిన చర్యలు తప్పవని సిపి హెచ్చరించారు.
- *తెలంగాణ ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, 11% పీఆర్సీ ప్రకటించడంతో పాటు అన్ని డిమాండ్లను నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కరీంనగర్‌లో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వన్ డిపో వద్ద సంబరాలు అంబరాన్నంటాయి.* *కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ నేతృత్వంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు, అనంతరం ఆర్టీసీ కార్మిక సోదరులకు కాంగ్రెస్ నేతలు మిఠాయిలు పంచి సంబరాలు చేసినారు.* కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ "ఆర్టీసీ కార్మిక సోదరులకు ఇది చారిత్రక రోజు.. మాటలు చెప్పి మోసం చేసిన గత పాలకుల కళ్ళు తెరిపించిన రోజు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి సహకారం, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి కృషితో నేడు ఆర్టీసీ విలీనం, 11% పీఆర్సీ సాకారమయ్యాయి. ఇది కార్మిక పక్షపాత ప్రభుత్వానికి నిదర్శనం. దశాబ్దాలుగా కన్నీళ్లు పెట్టుకున్న ఆర్టీసీ కుటుంబాల్లో నేడు వెలుగులు నింపాం. కార్మికుల ఉసురు పోసుకున్న వాళ్లకు ఇది చెంపపెట్టు. మా ప్రభుత్వం ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటుంది అని అన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘం ఐ ఎన్ టి యు సి జిల్లా కార్యదర్శి టి ఆర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మా గోడు విన్నారు. మా బతుకులు మార్చారు. ప్రభుత్వంలో విలీనం అంటే మాకు ఉద్యోగ భద్రత. 11% పీఆర్సీ అంటే మా పిల్లల భవిష్యత్తు. మా కుటుంబాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సభ్యులకు కరీంనగర్ జిల్లా ఆర్టీసీ కార్మికుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముస్తాక్ అహ్మద్, కుంభాల రాజు కుమార్,వీర దేవేందర్, శ్రీరాముల రమేష్,ఇమ్రాన్, గడప శ్రీనివాస్, ఇమ్రాన్, పెంట శేఖర్, అరుణ్, శ్రీనివాస్ గౌడ్, వసీం,యూనియన్ నాయకులు టిఆర్ రెడ్డి, ఎన్ కె దాసు, లతోపాటు పలువురు యూనియన్ నాయకులు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.3
- కేసీఆర్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా సిరిసిల్లలో బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.1
- జగిత్యాల: మూడు రోజుల్లోనే ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికి, పల్లెల్లో ప్రగతి రథ చక్రాలు కదిలేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్న సందర్బంగా జగిత్యాలలో శనివారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో పొన్నాల గార్డెన్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆర్టీసీ జేఏసీ నాయకులు కలిసి సన్మానం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరోమారు ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు అండగా నిలుస్తామని మంత్రికి జేఏసీ నాయకులు హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే నాటి ప్రభుత్వం కనీసం కార్మిక సంఘాలను చర్చలకు పిలవలేదని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సమ్మె చేస్తున్న కార్మికులను డిస్మిస్ చేస్తామని హెచ్చరించారని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మె సమస్యను పరిష్కరించి కార్మికులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు వివేక్ గారితో పాటు తాను ఆర్టీసీ కి చెందిన 24 కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ఆర్టీసీ కార్మికులు సుమారు 52 రోజులు సమ్మె చేస్తే కార్మిక సంఘాలను నాటి ప్రభుత్వ పెద్దలు కనీసం చర్చలకు పిలవలేదని మంత్రి అన్నారు. విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తామని స్వయంగా నాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆనాడు కార్మికులను భయభ్రాంతులకు గురి చేశారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మూడు రోజుల్లోనే ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మరణించడం చాలా బాధాకరమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.1
- వరంగల్ జిల్లా:ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో స్థానిక పీహెచ్సీ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ్ చంద్ర, యాదయ్య, రాజు, స్వర్ణ కుమారి, మచ్చస్ రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 25 ఐ3 న్యూస్ *విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక వీడియో. బడి సెలవుల నేపథ్యంలో బయట ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.*...1
- *అన్నా అన్నందుకు సెఎస్ఐ దాడిలూన్ వ్యక్తిపై * కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఖాన్ పురాలో ఎస్ఐ దాష్టీకం స్థానిక సెలూన్‌కు వెళ్లిన త్రీటౌన్ ఎస్ఐ చందర్, తనను అన్నా అని పిలిచినందుకు రాములు అనే వ్యక్తిపై దాడి ఆగ్రహంతో బూతులు తిడుతూ సదరు వ్యక్తిని చితకబాదిన ఎస్ఐ1
- కరీంనగర్ లో త్రీ టౌన్ ఎస్ఐ వీరంగం సృష్టించాడు. సెల్యూట్ షాప్ నిర్వాకుడుని దూషిస్తూ దాడి చేశాడు. ఖాన్ పురాలోని సేవింగ్ చేయించుకోవడానికి త్రీటౌన్ ఎస్ఐ చందర్ వెళ్ళారు. రాము, సేవింగ్ చేయాలని ఎస్ఐ కోరగా ‘అన్నా’ కూర్చొ అని షాప్ నిర్వాకుడు రాము అన్నాడు. అన్నా ఏందిరా బే అంటూ ఎస్ఐ బూతులు తిడుతూ దాడి చేశాడు. విచక్షణారహితంగా సెల్యూన్ షాప్ నిర్వాకుడు రాముపై చేయి చేసుకున్నాడు. ఎస్ఐ ని అన్నా అన్నందుకే దాడి చేయడం సర్వతా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ అమానుష దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సిసి పటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షాపు నిర్వాకుడు పై విచక్షణ రహితంగా ప్రవర్తించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐ పై శాఖ పరమైన చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.2
- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 10000 పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను విడుదల చేయాలని కలెక్టరేట్ మెయిన్ గేట్ ముందు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ పేద,బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతవిద్యను ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో తీసుకొచ్చిన "ఫీజు రీయింబర్స్మెంట్" పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని,దీనిని ABVP తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ABVP జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు గౌరవ హైకోర్టును ఆశ్రఉంచినప్పుడు,ప్రభుత్వం ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని గౌరవ హైకోర్టు పదే పదే కోరినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయని కారణంగానే "విద్యార్థుల దగ్గరనుండే ఫీజులు వసూలు చేసుకోవచ్చని గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని,ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టిందని, ఇది రీయింబర్స్ మెంట్ పథకాన్ని బొంద పెట్టడంలో భాగమే అని అన్నారు.ఈ స్కీమ్ ద్వారా లక్షల మంది పేద వర్గాల పిల్లలు ఇంజనీరింగ్,మెడిసిన్,ఫార్మసీ, లా లాంటి కోర్సులు పూర్తిచేసి దేశ విదేశాల్లో స్థిరపడి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇస్తున్నారన్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అయ్యే పరిస్థితి దాపురించిందన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడి యేటా 14 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని,కోర్సుల్లో ప్రవేశం పొందేటప్పుడే ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందన్న హామీ మేరకే విద్యార్థులు అడ్మిషన్ పొందుతారని,హామీ మేరకు ప్రవేశం పొందాక ఫీజు చెల్లించకుండా, 10000 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థులను నయవంచనకు గురిచేస్తుందన్నారు.విద్య పై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి రాష్ట్ర,దేశ అభివృద్ధికి ఉపయోగపడే మానవవనరుల సృష్టి కోసమేనని, ఇది ఏ మాత్రం ఉచిత పథకం కాదని,ఈ విషయాన్ని ప్రభుత్వం,సమాజం అర్థం చేసుకోవాలన్నారు.ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పేద విద్యార్థులకు విద్యాప్రదాయినిగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని BRS ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని,ఈ పథకాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని,మేము అధికారంలోకి వస్తే బకాయిలు చెల్లించడమే కాకుండా ఇంకా గొప్పగా అమలుచేస్తామని హామీ ఇచ్చారని,తీర అధికారం లోకి వచ్చాక స్వయంగా తానే విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేతకు కుట్రలు చేస్తున్నారన్నారు.నా దగ్గర పంచడానికి భూములు లేవు,కానీ జీవితాన్ని నిలబెట్టే విద్యను మాత్రం అందిస్తానని పదే పదే వల్లే వేసే రేవంత్ రెడ్డి గారు ఎందుకు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు.తల్లిదండ్రులు, విద్యార్థులు,సమాజం అంతా కూడా ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై స్పందించాలని,ABVP ఆధ్వర్యంలో ఈ విద్యావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వంపై చేయబోయే ఉద్యమంలో మాతో పాటు కలిసి రావాలని పిలునిచ్చారు.విద్యార్థులతో గెలుక్కున్న ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలువలేదని,నీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయని,నీ ప్రభుత్వ మెడలు వంచైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తుందో దానికి వ్యతిరేకంగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ SFD CO -CONVER గోస్కుల అజయ్. స్టేట్ హాస్టల్స్ CO - CONVER భామండ్ల నందు. నగర కార్యదర్శి యోగేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మురళి జిల్లా SFD CONVER శ్రీపతి వంశీ,జిల్లా SFS CONVER నాగరాజు , జిల్లా హాస్టల్ కన్వీనర్ విగ్నేష్ , జిల్లా కేల్ కన్వీనర్ విష్ణు, నితీష్, శ్రీ వర్ధన్, ఆకాష్, శివ, మనోజ్ ,అనూష తదితరులు పాల్గొన్నారు3
- రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మెప్మా ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. ముందుగా ధాన్యం కుప్పలు, వసతులు పరిశీలించి.. పలు సూచనలు చేశారు.టార్ఫాలిన్లు, గన్ని సంచులు, నీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయా అని ఆరా తీసి.. పరిశీలించారు. ఇప్పటిదాకా ఎంత ధాన్యం వచ్చింది? సన్న రకం వడ్లు వచ్చాయా? అని అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లుల కేటాయింపు.. ఆన్లైన్లో వివరాల నమోదు పై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చే రైతులు ప్యాడీ క్లీనర్లు వినియోగించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కేటాయించిన మిల్లులకు ధాన్యాన్ని పంపించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని సూచించారు. పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ మహేష్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.1