logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఐదు కో ఆప్షన్ పదవులను ఏకపక్షంగా కైవసం చేసుకున్న బీజేపీ...పోటీకి దూరమైన కాంగ్రెస్, రెండుగా చీలిన బిఆర్ఎస్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బిజెపి మరో విజయాన్ని కైవసం చేసుకుంది. ఐదు కోఆప్షన్ పదవులను ఏకపక్షంగా బిజేపి దక్కించుకుంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో 66 డివిజన్లు ఉండగా ఐదు కోఆప్షన్ పదవులకు శనివారం ఎన్నిక నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో బిజెపికి చెందిన ఐదుగురిని కో ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేశారు.‌ బండి సంజయ్ సూచించిన కన్న కృష్ణ, నందకుమార్, బల్బీర్ సింగ్, ఆఫీసాబేగం, వెంకటమ్మను ఏకగ్రీవంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఎన్నుకున్నారు. కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన ఐదుగురిని కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు బిజెపికి చెందిన ఐదుగురు సభ్యుల పేర్లను ప్రతిపాదించారు. పోటీకి కాంగ్రెస్ దూరంగా ఉండగా బిఆర్ఎస్ రెండుగా చీలిపోయింది. సమావేశానికి హాజరై బిఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు పోటీలో పాల్గొనకుండా సైలెంట్ ఉండిపోయారు. ‌5 కోఆప్షన్ సభ్యుల పదవులకు 46 మంది దరఖాస్తు చేసుకోగా మెజార్టీ ఉన్న బిజెపి ఐదుగురిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపిక చేసి ఏకగ్రీవంగా అయ్యేలా చూడడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. మేయర్ డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్లు మున్సిపల్ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచి డప్పు నృత్యాలు చేశారు.

5 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
5 hrs ago

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఐదు కో ఆప్షన్ పదవులను ఏకపక్షంగా కైవసం చేసుకున్న బీజేపీ...పోటీకి దూరమైన కాంగ్రెస్, రెండుగా చీలిన బిఆర్ఎస్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బిజెపి మరో విజయాన్ని కైవసం చేసుకుంది. ఐదు కోఆప్షన్ పదవులను ఏకపక్షంగా బిజేపి దక్కించుకుంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో 66 డివిజన్లు ఉండగా ఐదు కోఆప్షన్ పదవులకు శనివారం ఎన్నిక నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో బిజెపికి చెందిన ఐదుగురిని కో ఆప్షన్

సభ్యులుగా ఎంపిక చేశారు.‌ బండి సంజయ్ సూచించిన కన్న కృష్ణ, నందకుమార్, బల్బీర్ సింగ్, ఆఫీసాబేగం, వెంకటమ్మను ఏకగ్రీవంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఎన్నుకున్నారు. కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన ఐదుగురిని కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు బిజెపికి చెందిన ఐదుగురు సభ్యుల పేర్లను ప్రతిపాదించారు. పోటీకి కాంగ్రెస్ దూరంగా ఉండగా బిఆర్ఎస్ రెండుగా చీలిపోయింది. సమావేశానికి

హాజరై బిఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు పోటీలో పాల్గొనకుండా సైలెంట్ ఉండిపోయారు. ‌5 కోఆప్షన్ సభ్యుల పదవులకు 46 మంది దరఖాస్తు చేసుకోగా మెజార్టీ ఉన్న బిజెపి ఐదుగురిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపిక చేసి ఏకగ్రీవంగా అయ్యేలా చూడడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. మేయర్ డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్లు మున్సిపల్ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచి డప్పు నృత్యాలు చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్, తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల గోస పై ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు జరగక రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి ధాన్యం కొనుగోలు కాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ధాన్యం ఎండి కుప్ప పోసి 15 రోజులవుతున్న కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరికాయ కొట్టారు, కానీ కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదనతో తెలిపారు. మహిళా రైతు మాత్రం ప్రభుత్వం కొనకుంటే మీరు కొనండి సూచించారు. రెండేళ్లు ఓపిక పట్టండి మళ్లీ కెసిఆర్ వస్తాడు అప్పుడు మేమే కొంటామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గొప్పలు చెబుతుంది తప్ప రైతుల గౌసను అర్థం చేసుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొనుగోళ్ళు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించిన పంట దళారుల పాలు కాకుండా మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. రైస్ మిల్ అలాట్మెంట్ చేసి సోమవారం లోగా ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతుల పక్షాన బిఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతు సోదరులు ధైర్యంగా ఉండండి... రెండేళ్లయితే కేసీఆర్ మళ్ళీ వస్తాడని కేటీఆర్ తెలిపారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్, 
తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల గోస పై ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు జరగక రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి ధాన్యం కొనుగోలు కాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ధాన్యం ఎండి కుప్ప పోసి 15 రోజులవుతున్న కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరికాయ కొట్టారు, కానీ కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదనతో తెలిపారు. మహిళా రైతు మాత్రం ప్రభుత్వం కొనకుంటే మీరు కొనండి సూచించారు. రెండేళ్లు ఓపిక పట్టండి మళ్లీ కెసిఆర్ వస్తాడు అప్పుడు మేమే కొంటామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గొప్పలు చెబుతుంది తప్ప రైతుల గౌసను అర్థం చేసుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొనుగోళ్ళు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించిన పంట దళారుల పాలు కాకుండా మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. రైస్ మిల్ అలాట్మెంట్ చేసి సోమవారం లోగా ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతుల పక్షాన బిఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతు సోదరులు ధైర్యంగా ఉండండి... రెండేళ్లయితే కేసీఆర్ మళ్ళీ వస్తాడని  కేటీఆర్ తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్:జిల్లాలో కొంతమంది వైద్యులే సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ద్వారా తప్పుడు వైద్య ప్రచారం చేస్తూ పేద ప్రజలను, అమాయక రోగులను మోసం చేస్తున్నారని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. dyfi నాయకుల సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు అనంతరం నరేష్ పటేల్ మాట్లాడుతూ ముఖ్యంగా షుగర్ (మధుమేహం), బీపీ (రక్తపోటు) వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు అవసరం లేదని, ఇంటి చిట్కాలతో పూర్తిగా నయం అవుతుంది“ఒక్క మందుతో శాశ్వతంగా పోతుంది వంటి అవాస్తవాలు ప్రచారం చేస్తూ వీడియోలు విడుదల చేయడం ప్రజల ప్రాణాలతో ఆటలాడటమేనని విమర్శించారు. వైద్యులపై ఉన్న నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి తప్పుడు వీడియోలు విడుదల చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని తెలిపారు. ప్రజలు ఈ ప్రచారాలను నమ్మి వైద్యుల సలహా లేకుండా మందులు ఆపేస్తే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వంటి ప్రాణాపాయకర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పేదలు ఈ మోసాలకు ఎక్కువగా బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హతలేని వ్యక్తులు మాత్రమే కాకుండా కొంతమంది వైద్యులే ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడటం అత్యంత ఆందోళనకరమని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారు లాభాల కోసం ఇలా వ్యవహరించడం ఖండనీయమని పేర్కొన్నారు. ఇక మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ప్రజల పరిస్థితిని దుర్వినియోగం చేస్తూ తీవ్ర దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. అవసరం లేని పరీక్షలు చేయించడం, అధిక బిల్లులు వేయడం, అప్రామాణిక చికిత్సలు సూచించడం, పారదర్శకత లేకుండా ఫీజులు వసూలు చేయడం ద్వారా పేద ప్రజలను ఆర్థికంగా నాశనం చేస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో భయాన్ని ఉపయోగించుకుని లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతోందని విమర్శించారు. వైద్య రంగం సేవా ధర్మాన్ని కోల్పోయి పూర్తిగా వ్యాపారంగా మారడం దురదృష్టకరమని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వైద్య ప్రచారం చేస్తున్న వైద్యులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఇలాంటి వైద్యుల లైసెన్సులను రద్దు చేయాలని, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఉన్న ఫేక్ మెడికల్ వీడియోలను తక్షణమే తొలగించాలని, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయాలని, అవసరం లేని టెస్టులు, అధిక బిల్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, వైద్య సేవలపై ప్రభుత్వ పర్యవేక్షణను కఠినంగా అమలు చేయాలని, ప్రజల్లో సరైన వైద్య అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (DMHO) అధికారులు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శివ కుమార్,సహాయ కార్యదర్శులు,అరవింద్ నాయకులు సిన.రాజేష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు
    1
    కరీంనగర్:జిల్లాలో కొంతమంది వైద్యులే సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ద్వారా తప్పుడు వైద్య ప్రచారం చేస్తూ పేద ప్రజలను, అమాయక రోగులను మోసం చేస్తున్నారని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 
dyfi నాయకుల సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు అనంతరం నరేష్ పటేల్ మాట్లాడుతూ ముఖ్యంగా షుగర్ (మధుమేహం), బీపీ (రక్తపోటు) వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు అవసరం లేదని, ఇంటి చిట్కాలతో పూర్తిగా నయం అవుతుంది“ఒక్క మందుతో శాశ్వతంగా పోతుంది వంటి అవాస్తవాలు ప్రచారం చేస్తూ వీడియోలు విడుదల చేయడం ప్రజల ప్రాణాలతో ఆటలాడటమేనని విమర్శించారు.
వైద్యులపై ఉన్న నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి తప్పుడు వీడియోలు విడుదల చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని తెలిపారు. ప్రజలు ఈ ప్రచారాలను నమ్మి వైద్యుల సలహా లేకుండా మందులు ఆపేస్తే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వంటి ప్రాణాపాయకర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పేదలు ఈ మోసాలకు ఎక్కువగా బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అర్హతలేని వ్యక్తులు మాత్రమే కాకుండా కొంతమంది వైద్యులే ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడటం అత్యంత ఆందోళనకరమని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారు లాభాల కోసం ఇలా వ్యవహరించడం ఖండనీయమని పేర్కొన్నారు.
ఇక మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ప్రజల పరిస్థితిని దుర్వినియోగం చేస్తూ తీవ్ర దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. అవసరం లేని పరీక్షలు చేయించడం, అధిక బిల్లులు వేయడం, అప్రామాణిక చికిత్సలు సూచించడం, పారదర్శకత లేకుండా ఫీజులు వసూలు చేయడం ద్వారా పేద ప్రజలను ఆర్థికంగా నాశనం చేస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో భయాన్ని ఉపయోగించుకుని లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతోందని విమర్శించారు. వైద్య రంగం సేవా ధర్మాన్ని కోల్పోయి పూర్తిగా వ్యాపారంగా మారడం దురదృష్టకరమని అన్నారు.
సోషల్ మీడియాలో తప్పుడు వైద్య ప్రచారం చేస్తున్న వైద్యులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఇలాంటి వైద్యుల లైసెన్సులను రద్దు చేయాలని, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఉన్న ఫేక్ మెడికల్ వీడియోలను తక్షణమే తొలగించాలని, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయాలని, అవసరం లేని టెస్టులు, అధిక బిల్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, వైద్య సేవలపై ప్రభుత్వ పర్యవేక్షణను కఠినంగా అమలు చేయాలని, ప్రజల్లో సరైన వైద్య అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (DMHO) అధికారులు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శివ కుమార్,సహాయ కార్యదర్శులు,అరవింద్ నాయకులు సిన.రాజేష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    43 min ago
  • కౌన్సిలర్ సభ్యులు వేముల రాములు తల్లి కీర్తిశేషులు వేముల హన్మవ్వ ఈనెల 22వ తేదీన స్వర్గస్థులు కాగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేముల రాములు ఇంటికి చేరుకుని వేముల హన్మవ్వ చిత్రపటానికి పూలతో నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
    1
    కౌన్సిలర్ సభ్యులు వేముల రాములు తల్లి కీర్తిశేషులు వేముల హన్మవ్వ ఈనెల 22వ తేదీన స్వర్గస్థులు కాగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేముల రాములు ఇంటికి చేరుకుని వేముల హన్మవ్వ  చిత్రపటానికి పూలతో నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 min ago
  • రంగారెడ్డి గచ్చిబౌలి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పరిస్థితిని గమనించిన కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వెంటనే దిగిపోయి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన సాయంత్రం సమయంలో చోటుచేసుకోవడంతో, ఇంటికి వెళ్లే వాహనదారులతో రహదారి ఇప్పటికే రద్దీగా ఉండగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టడంతో పాటు, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
    3
    రంగారెడ్డి 
గచ్చిబౌలి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. 
పరిస్థితిని గమనించిన కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వెంటనే దిగిపోయి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
ఈ ఘటన సాయంత్రం సమయంలో చోటుచేసుకోవడంతో, ఇంటికి వెళ్లే వాహనదారులతో రహదారి ఇప్పటికే రద్దీగా ఉండగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టడంతో పాటు, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    19 min ago
  • వరంగల్‌లో జరుగుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజున అమ్మవారిని సుగంధ గంధాలతో అలంకరించి ప్రత్యేక శోభను కలిగించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అమ్మవారి గంధాలంకరణను దర్శించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు మరింత వైభవంగా కొనసాగుతున్నాయని, భక్తులు నియమాలను పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని అధికారులు సూచించారు.
    1
    వరంగల్‌లో జరుగుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజున అమ్మవారిని సుగంధ గంధాలతో అలంకరించి ప్రత్యేక శోభను కలిగించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
అమ్మవారి గంధాలంకరణను దర్శించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు మరింత వైభవంగా కొనసాగుతున్నాయని, భక్తులు నియమాలను పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని అధికారులు సూచించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 25 ఐ3 న్యూస్ *విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక వీడియో. బడి సెలవుల నేపథ్యంలో బయట ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.*...
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 25 ఐ3 న్యూస్ 
*విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక వీడియో. బడి సెలవుల నేపథ్యంలో బయట ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.*...
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    11 hrs ago
  • *అన్నా అన్నందుకు సెఎస్ఐ దాడిలూన్ వ్యక్తిపై * కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఖాన్ పురాలో ఎస్ఐ దాష్టీకం స్థానిక సెలూన్‌కు వెళ్లిన త్రీటౌన్ ఎస్ఐ చందర్, తనను అన్నా అని పిలిచినందుకు రాములు అనే వ్యక్తిపై దాడి ఆగ్రహంతో బూతులు తిడుతూ సదరు వ్యక్తిని చితకబాదిన ఎస్ఐ
    1
    *అన్నా అన్నందుకు సెఎస్ఐ దాడిలూన్ వ్యక్తిపై *
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఖాన్ పురాలో ఎస్ఐ దాష్టీకం 
స్థానిక సెలూన్‌కు వెళ్లిన త్రీటౌన్ ఎస్ఐ చందర్, తనను అన్నా అని పిలిచినందుకు రాములు అనే వ్యక్తిపై దాడి 
ఆగ్రహంతో బూతులు తిడుతూ సదరు వ్యక్తిని చితకబాదిన ఎస్ఐ
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • కరీంనగర్ లో త్రీ టౌన్ ఎస్ఐ వీరంగం సృష్టించాడు. సెల్యూట్ షాప్ నిర్వాకుడుని దూషిస్తూ దాడి చేశాడు.‌ ఖాన్ పురాలోని సేవింగ్ చేయించుకోవడానికి త్రీటౌన్ ఎస్‌ఐ చందర్ వెళ్ళారు. రాము, సేవింగ్ చేయాలని ఎస్ఐ కోరగా ‘అన్నా’ కూర్చొ అని షాప్ నిర్వాకుడు రాము అన్నాడు. అన్నా ఏందిరా బే అంటూ ఎస్ఐ బూతులు తిడుతూ దాడి చేశాడు. విచక్షణారహితంగా సెల్యూన్ షాప్ నిర్వాకుడు రాముపై చేయి చేసుకున్నాడు. ఎస్ఐ ని అన్నా అన్నందుకే దాడి చేయడం సర్వతా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ అమానుష దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సిసి పటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షాపు నిర్వాకుడు పై విచక్షణ రహితంగా ప్రవర్తించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐ పై శాఖ పరమైన చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.
    2
    కరీంనగర్ లో త్రీ టౌన్ ఎస్ఐ వీరంగం సృష్టించాడు. సెల్యూట్ షాప్ నిర్వాకుడుని దూషిస్తూ దాడి చేశాడు.‌ ఖాన్ పురాలోని సేవింగ్ చేయించుకోవడానికి త్రీటౌన్ ఎస్‌ఐ చందర్ వెళ్ళారు. రాము, సేవింగ్ చేయాలని ఎస్ఐ కోరగా ‘అన్నా’ కూర్చొ అని షాప్ నిర్వాకుడు రాము అన్నాడు. అన్నా ఏందిరా బే అంటూ ఎస్ఐ బూతులు తిడుతూ దాడి చేశాడు.  విచక్షణారహితంగా సెల్యూన్ షాప్ నిర్వాకుడు రాముపై చేయి చేసుకున్నాడు. ఎస్ఐ ని అన్నా అన్నందుకే దాడి చేయడం సర్వతా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ అమానుష దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సిసి పటేజ్  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షాపు నిర్వాకుడు పై విచక్షణ రహితంగా ప్రవర్తించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  ఎస్ఐ పై శాఖ పరమైన చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.