logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పా జంక్షన్ వద్ద ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి గచ్చిబౌలి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పరిస్థితిని గమనించిన కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వెంటనే దిగిపోయి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన సాయంత్రం సమయంలో చోటుచేసుకోవడంతో, ఇంటికి వెళ్లే వాహనదారులతో రహదారి ఇప్పటికే రద్దీగా ఉండగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టడంతో పాటు, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

1 hr ago
user_Mediya wgl medical wgl
Mediya wgl medical wgl
Doctor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
1 hr ago

నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అప్పా జంక్షన్ వద్ద ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగిన ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి గచ్చిబౌలి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పరిస్థితిని గమనించిన కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వెంటనే దిగిపోయి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన సాయంత్రం సమయంలో చోటుచేసుకోవడంతో, ఇంటికి వెళ్లే వాహనదారులతో రహదారి ఇప్పటికే రద్దీగా ఉండగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టడంతో పాటు, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్ లో త్రీ టౌన్ ఎస్ఐ వీరంగం సృష్టించాడు. సెల్యూట్ షాప్ నిర్వాకుడుని దూషిస్తూ దాడి చేశాడు.‌ ఖాన్ పురాలోని సేవింగ్ చేయించుకోవడానికి త్రీటౌన్ ఎస్‌ఐ చందర్ వెళ్ళారు. రాము, సేవింగ్ చేయాలని ఎస్ఐ కోరగా ‘అన్నా’ కూర్చొ అని షాప్ నిర్వాకుడు రాము అన్నాడు. అన్నా ఏందిరా బే అంటూ ఎస్ఐ బూతులు తిడుతూ దాడి చేశాడు. విచక్షణారహితంగా సెల్యూన్ షాప్ నిర్వాకుడు రాముపై చేయి చేసుకున్నాడు. ఎస్ఐ ని అన్నా అన్నందుకే దాడి చేయడం సర్వతా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ అమానుష దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సిసి పటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షాపు నిర్వాకుడు పై విచక్షణ రహితంగా ప్రవర్తించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐ పై శాఖ పరమైన చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.
    2
    కరీంనగర్ లో త్రీ టౌన్ ఎస్ఐ వీరంగం సృష్టించాడు. సెల్యూట్ షాప్ నిర్వాకుడుని దూషిస్తూ దాడి చేశాడు.‌ ఖాన్ పురాలోని సేవింగ్ చేయించుకోవడానికి త్రీటౌన్ ఎస్‌ఐ చందర్ వెళ్ళారు. రాము, సేవింగ్ చేయాలని ఎస్ఐ కోరగా ‘అన్నా’ కూర్చొ అని షాప్ నిర్వాకుడు రాము అన్నాడు. అన్నా ఏందిరా బే అంటూ ఎస్ఐ బూతులు తిడుతూ దాడి చేశాడు.  విచక్షణారహితంగా సెల్యూన్ షాప్ నిర్వాకుడు రాముపై చేయి చేసుకున్నాడు. ఎస్ఐ ని అన్నా అన్నందుకే దాడి చేయడం సర్వతా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ అమానుష దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సిసి పటేజ్  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షాపు నిర్వాకుడు పై విచక్షణ రహితంగా ప్రవర్తించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  ఎస్ఐ పై శాఖ పరమైన చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • *తెలంగాణ ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, 11% పీఆర్సీ ప్రకటించడంతో పాటు అన్ని డిమాండ్లను నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కరీంనగర్‌లో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వన్ డిపో వద్ద సంబరాలు అంబరాన్నంటాయి.* *కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ నేతృత్వంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు, అనంతరం ఆర్టీసీ కార్మిక సోదరులకు కాంగ్రెస్ నేతలు మిఠాయిలు పంచి సంబరాలు చేసినారు.* కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ "ఆర్టీసీ కార్మిక సోదరులకు ఇది చారిత్రక రోజు.. మాటలు చెప్పి మోసం చేసిన గత పాలకుల కళ్ళు తెరిపించిన రోజు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి సహకారం, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి కృషితో నేడు ఆర్టీసీ విలీనం, 11% పీఆర్సీ సాకారమయ్యాయి. ఇది కార్మిక పక్షపాత ప్రభుత్వానికి నిదర్శనం. దశాబ్దాలుగా కన్నీళ్లు పెట్టుకున్న ఆర్టీసీ కుటుంబాల్లో నేడు వెలుగులు నింపాం. కార్మికుల ఉసురు పోసుకున్న వాళ్లకు ఇది చెంపపెట్టు. మా ప్రభుత్వం ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటుంది అని అన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘం ఐ ఎన్ టి యు సి జిల్లా కార్యదర్శి టి ఆర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మా గోడు విన్నారు. మా బతుకులు మార్చారు. ప్రభుత్వంలో విలీనం అంటే మాకు ఉద్యోగ భద్రత. 11% పీఆర్సీ అంటే మా పిల్లల భవిష్యత్తు. మా కుటుంబాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సభ్యులకు కరీంనగర్ జిల్లా ఆర్టీసీ కార్మికుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముస్తాక్ అహ్మద్, కుంభాల రాజు కుమార్,వీర దేవేందర్, శ్రీరాముల రమేష్,ఇమ్రాన్, గడప శ్రీనివాస్, ఇమ్రాన్, పెంట శేఖర్, అరుణ్, శ్రీనివాస్ గౌడ్, వసీం,యూనియన్ నాయకులు టిఆర్ రెడ్డి, ఎన్ కె దాసు, లతోపాటు పలువురు యూనియన్ నాయకులు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
    3
    *తెలంగాణ ఆర్టీసీ కార్మికుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, 11% పీఆర్సీ ప్రకటించడంతో పాటు అన్ని డిమాండ్లను నెరవేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ కరీంనగర్‌లో కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వన్ డిపో వద్ద సంబరాలు అంబరాన్నంటాయి.*
*కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్  నేతృత్వంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు, అనంతరం ఆర్టీసీ కార్మిక సోదరులకు కాంగ్రెస్ నేతలు మిఠాయిలు పంచి సంబరాలు చేసినారు.*
కార్యక్రమాన్ని ఉద్దేశించి వైద్యుల అంజన్ కుమార్ మాట్లాడుతూ
"ఆర్టీసీ కార్మిక సోదరులకు ఇది చారిత్రక రోజు.. మాటలు చెప్పి మోసం చేసిన గత పాలకుల కళ్ళు తెరిపించిన రోజు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి సహకారం, రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి కృషితో నేడు ఆర్టీసీ విలీనం, 11% పీఆర్సీ సాకారమయ్యాయి. ఇది కార్మిక పక్షపాత ప్రభుత్వానికి నిదర్శనం. 
దశాబ్దాలుగా కన్నీళ్లు పెట్టుకున్న ఆర్టీసీ కుటుంబాల్లో నేడు వెలుగులు నింపాం. కార్మికుల ఉసురు పోసుకున్న వాళ్లకు ఇది చెంపపెట్టు. మా ప్రభుత్వం ఎప్పుడూ కార్మికుల పక్షానే ఉంటుంది అని అన్నారు.
ఆర్టీసీ కార్మిక సంఘం ఐ ఎన్ టి యు సి జిల్లా కార్యదర్శి టి ఆర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ సారు మా గోడు విన్నారు. మా బతుకులు మార్చారు. 
ప్రభుత్వంలో విలీనం అంటే మాకు ఉద్యోగ భద్రత. 11% పీఆర్సీ అంటే మా పిల్లల భవిష్యత్తు. మా కుటుంబాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. ముఖ్యమంత్రికి, మంత్రివర్గ సభ్యులకు  కరీంనగర్ జిల్లా ఆర్టీసీ కార్మికుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ముస్తాక్ అహ్మద్, కుంభాల రాజు కుమార్,వీర దేవేందర్, శ్రీరాముల రమేష్,ఇమ్రాన్, గడప శ్రీనివాస్, ఇమ్రాన్, పెంట శేఖర్, అరుణ్, శ్రీనివాస్ గౌడ్, వసీం,యూనియన్ నాయకులు టిఆర్ రెడ్డి, ఎన్ కె  దాసు, లతోపాటు పలువురు యూనియన్ నాయకులు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 25 ఐ3 న్యూస్ *విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక వీడియో. బడి సెలవుల నేపథ్యంలో బయట ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.*...
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 25 ఐ3 న్యూస్ 
*విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక వీడియో. బడి సెలవుల నేపథ్యంలో బయట ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.*...
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    13 hrs ago
  • రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మెప్మా ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. ముందుగా ధాన్యం కుప్పలు, వసతులు పరిశీలించి.. పలు సూచనలు చేశారు.టార్ఫాలిన్లు, గన్ని సంచులు, నీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయా అని ఆరా తీసి.. పరిశీలించారు. ఇప్పటిదాకా ఎంత ధాన్యం వచ్చింది? సన్న రకం వడ్లు వచ్చాయా? అని అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లుల కేటాయింపు.. ఆన్లైన్లో వివరాల నమోదు పై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చే రైతులు ప్యాడీ క్లీనర్లు వినియోగించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కేటాయించిన మిల్లులకు ధాన్యాన్ని పంపించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని సూచించారు. పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ మహేష్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    1
    రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. 
మెప్మా ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. ముందుగా ధాన్యం కుప్పలు, వసతులు పరిశీలించి.. పలు సూచనలు చేశారు.టార్ఫాలిన్లు, గన్ని సంచులు, నీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయా అని ఆరా తీసి.. పరిశీలించారు. ఇప్పటిదాకా ఎంత ధాన్యం వచ్చింది? సన్న రకం వడ్లు వచ్చాయా? అని అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లుల కేటాయింపు.. ఆన్లైన్లో వివరాల నమోదు పై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చే రైతులు ప్యాడీ క్లీనర్లు వినియోగించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కేటాయించిన మిల్లులకు ధాన్యాన్ని పంపించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని సూచించారు. పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ మహేష్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • * నకిరేకల్ నియోజకవర్గం కేతపల్లి 25 : ​ఐకేపీ కేంద్రాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సినవి, కానీ వాస్తవానికి ఇవి ఇప్పుడు అధికార పార్టీ నాయకులు మరియు వారి అనుచరుల కనుసన్నల్లో నడిచే ప్రైవేటు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. అసలు విషయం ఏమిటంటే, ఈ కేంద్రాల నిర్వహణ పూర్తిగా అధికార పార్టీ నాయకులు మరియు కార్యకర్తల చేతుల్లోనే ఉంది; అధికారులు కేవలం నామమాత్రంగా ఉంటూ, వీరి అక్రమాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. పద్ధతి ప్రకారం మాచర్ వచ్చిన రైతుల సీరియల్ నంబర్ల వారీగా వడ్లను సేకరించాల్సింది పోయి, ఇక్కడ మాత్రం అధికార పార్టీ నాయకులు తమ సొంత నిర్ణయాలతో గ్రామాలలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఉదాహరణకి కేతేపల్లి గ్రామంలో 20 రోజుల క్రితం మాచర్ వచ్చి సీరియల్ వచ్చిన వారి కాకుండా అధికార పార్టీ వారివి లేదా వారికి అనుకూలంగా ఉన్న వారివి మాత్రమే కాటాలు వేస్తున్నారు ఈ విధంగా జరుగుతుందని కేతేపల్లి మండల తాసిల్దార్ గారికి తెలియజేసిన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ధాన్యం కొనుగోలు సెంటర్ల మండల మానిటరింగ్ ఆఫీసర్ వంశీ గారికి ఫిర్యాదు చేసిన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే వంశీ అధికారి గారు సీరియల్ ప్రకారంగా వచ్చిన రైతులకి బస్తాలు ఇప్పిస్తే ఆ అధికారికి నియోజకవర్గ స్థాయి నాయకునితో ఫోన్ చేపించి మళ్లీ ఆ రైతుల వద్ద నుండి బస్తాలు తిరిగి తెప్పించుకోవడం జరిగింది అంటే దాన్యం కొనుగోలు ఒక్క అధికార పార్టీకి సంబంధించిన రైతులకు మాత్రమే చేస్తారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మొదటి రోజే సీరియల్ వచ్చిన రైతులని కాదని వారికి అనుకూలంగా ఉన్న వారివి మాత్రమే కాటా పెడతారా *ఇదేనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన ప్రజాపాలన భాగమేనా ఈ కొనుగోలు* కేంద్రాలు చేసే నిర్వహణ మీకు సాక్ష్యంగా ఈ క్రింది వీడియోలు చూస్తే తెలిసిపోతుంది ఇచ్చిన బస్తాలు రైతుల వద్ద నుంచి అధికారులను బెదిరించి తెప్పించుకుంటున్నారు
    1
    * నకిరేకల్ నియోజకవర్గం కేతపల్లి 25 :
​ఐకేపీ కేంద్రాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సినవి, కానీ వాస్తవానికి ఇవి ఇప్పుడు అధికార పార్టీ నాయకులు మరియు వారి అనుచరుల కనుసన్నల్లో నడిచే ప్రైవేటు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. అసలు విషయం ఏమిటంటే, ఈ కేంద్రాల నిర్వహణ పూర్తిగా అధికార పార్టీ నాయకులు మరియు కార్యకర్తల చేతుల్లోనే ఉంది; అధికారులు కేవలం నామమాత్రంగా ఉంటూ, వీరి అక్రమాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. పద్ధతి ప్రకారం మాచర్ వచ్చిన రైతుల సీరియల్ నంబర్ల వారీగా వడ్లను సేకరించాల్సింది పోయి, ఇక్కడ మాత్రం అధికార పార్టీ నాయకులు తమ సొంత నిర్ణయాలతో గ్రామాలలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఉదాహరణకి కేతేపల్లి గ్రామంలో 20 రోజుల క్రితం మాచర్ వచ్చి సీరియల్ వచ్చిన వారి కాకుండా అధికార పార్టీ వారివి లేదా వారికి అనుకూలంగా ఉన్న వారివి మాత్రమే కాటాలు వేస్తున్నారు ఈ విధంగా జరుగుతుందని కేతేపల్లి మండల తాసిల్దార్ గారికి తెలియజేసిన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది  ధాన్యం కొనుగోలు సెంటర్ల మండల మానిటరింగ్ ఆఫీసర్ వంశీ గారికి ఫిర్యాదు చేసిన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే వంశీ  అధికారి గారు సీరియల్ ప్రకారంగా వచ్చిన రైతులకి  బస్తాలు ఇప్పిస్తే ఆ అధికారికి నియోజకవర్గ స్థాయి నాయకునితో ఫోన్ చేపించి మళ్లీ ఆ రైతుల వద్ద నుండి బస్తాలు తిరిగి తెప్పించుకోవడం జరిగింది అంటే దాన్యం కొనుగోలు ఒక్క అధికార పార్టీకి సంబంధించిన రైతులకు మాత్రమే చేస్తారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మొదటి రోజే సీరియల్ వచ్చిన రైతులని కాదని వారికి అనుకూలంగా ఉన్న వారివి మాత్రమే కాటా పెడతారా *ఇదేనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన ప్రజాపాలన భాగమేనా ఈ కొనుగోలు* కేంద్రాలు చేసే నిర్వహణ మీకు సాక్ష్యంగా ఈ క్రింది వీడియోలు చూస్తే తెలిసిపోతుంది ఇచ్చిన బస్తాలు రైతుల వద్ద నుంచి అధికారులను బెదిరించి తెప్పించుకుంటున్నారు
    user_PRK
    PRK
    Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
    2 hrs ago
  • ​యువతకు పోలీస్ మేడం పిలుపు: "ఆత్మవిశ్వాసంతో ఎదగండి.. తల్లిదండ్రుల కలలను నిజం చేయండి" ​నమస్తే ప్రతినిధి: నేటి యువత తమ కాళ్ళ మీద తాము నిలబడి, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడపాలని పోలీస్ మేడం గారు కీలక సూచనలు చేశారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, విద్యార్థులకు మరియు యువతకు దిశానిర్దేశం చేస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. ​ముఖ్య అంశాలు: ​తల్లిదండ్రులే స్ఫూర్తి: పిల్లలు సాధించే విజయాలే తల్లిదండ్రులకు నిజమైన గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడతాయని ఆమె పేర్కొన్నారు. ఉన్నతమైన సంపాదనతో పాటు, సమాజంలో మంచి పేరు సంపాదించుకోవడం ముఖ్యమని తెలిపారు. ​స్వయంశక్తి: ఇతరులపై ఆధారపడకుండా, నీ మీద నీవు నమ్మకం ఉంచుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ​నిబద్ధత - క్రమశిక్షణ: చేసే పని ఏదైనా అందులో నిబద్ధత, క్రమశిక్షణ ఉండాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుందని వివరించారు. ​బాధ్యత: తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలను చదివిస్తారని, వారి ఆశలను వమ్ము చేయకుండా బాధ్యతగా మెలగాలని హితవు పలికారు. ​"మీ ఆత్మవిశ్వాసమే మీ ఆయుధం. కష్టపడే తత్వం, క్రమశిక్షణ ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు." - పోలీస్ మేడం ​ఈ వార్తను మీ లోకల్ గ్రూప్స్‌లో లేదా న్యూస్ ఛానల్‌లో ప్రసారం చేయడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఏవైనా మార్పులు కావాలంటే చెప్పండి!
    1
    ​యువతకు పోలీస్ మేడం పిలుపు: "ఆత్మవిశ్వాసంతో ఎదగండి.. తల్లిదండ్రుల కలలను నిజం చేయండి"
​నమస్తే ప్రతినిధి:
నేటి యువత తమ కాళ్ళ మీద తాము నిలబడి, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని గడపాలని పోలీస్ మేడం గారు కీలక సూచనలు చేశారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, విద్యార్థులకు మరియు యువతకు దిశానిర్దేశం చేస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు.
​ముఖ్య అంశాలు:
​తల్లిదండ్రులే స్ఫూర్తి: పిల్లలు సాధించే విజయాలే తల్లిదండ్రులకు నిజమైన గౌరవాన్ని, కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడతాయని ఆమె పేర్కొన్నారు. ఉన్నతమైన సంపాదనతో పాటు, సమాజంలో మంచి పేరు సంపాదించుకోవడం ముఖ్యమని తెలిపారు.
​స్వయంశక్తి: ఇతరులపై ఆధారపడకుండా, నీ మీద నీవు నమ్మకం ఉంచుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
​నిబద్ధత - క్రమశిక్షణ: చేసే పని ఏదైనా అందులో నిబద్ధత, క్రమశిక్షణ ఉండాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం సాధ్యమవుతుందని వివరించారు.
​బాధ్యత: తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో పిల్లలను చదివిస్తారని, వారి ఆశలను వమ్ము చేయకుండా బాధ్యతగా మెలగాలని హితవు పలికారు.
​"మీ ఆత్మవిశ్వాసమే మీ ఆయుధం. కష్టపడే తత్వం, క్రమశిక్షణ ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు." - పోలీస్ మేడం
​ఈ వార్తను మీ లోకల్ గ్రూప్స్‌లో లేదా న్యూస్ ఛానల్‌లో ప్రసారం చేయడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా ఏవైనా మార్పులు కావాలంటే చెప్పండి!
    user_Laxman -st- reporter
    Laxman -st- reporter
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    55 min ago
  • జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలోని ముర్సుగడ్డ తండా రోడ్డుపై ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో కాసోజు సంగీత్ (15) అనే మైనర్ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ బానెట్‌పై కూర్చున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రాక్టర్ బోల్తా పడినట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
    1
    జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలోని ముర్సుగడ్డ తండా రోడ్డుపై ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో కాసోజు సంగీత్ (15) అనే మైనర్ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ బానెట్‌పై కూర్చున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రాక్టర్ బోల్తా పడినట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బిజెపి మరో విజయాన్ని కైవసం చేసుకుంది. ఐదు కోఆప్షన్ పదవులను ఏకపక్షంగా బిజేపి దక్కించుకుంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో 66 డివిజన్లు ఉండగా ఐదు కోఆప్షన్ పదవులకు శనివారం ఎన్నిక నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో బిజెపికి చెందిన ఐదుగురిని కో ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేశారు.‌ బండి సంజయ్ సూచించిన కన్న కృష్ణ, నందకుమార్, బల్బీర్ సింగ్, ఆఫీసాబేగం, వెంకటమ్మను ఏకగ్రీవంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఎన్నుకున్నారు. కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన ఐదుగురిని కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు బిజెపికి చెందిన ఐదుగురు సభ్యుల పేర్లను ప్రతిపాదించారు. పోటీకి కాంగ్రెస్ దూరంగా ఉండగా బిఆర్ఎస్ రెండుగా చీలిపోయింది. సమావేశానికి హాజరై బిఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు పోటీలో పాల్గొనకుండా సైలెంట్ ఉండిపోయారు. ‌5 కోఆప్షన్ సభ్యుల పదవులకు 46 మంది దరఖాస్తు చేసుకోగా మెజార్టీ ఉన్న బిజెపి ఐదుగురిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపిక చేసి ఏకగ్రీవంగా అయ్యేలా చూడడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. మేయర్ డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్లు మున్సిపల్ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచి డప్పు నృత్యాలు చేశారు.
    3
    కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బిజెపి మరో విజయాన్ని కైవసం చేసుకుంది. ఐదు కోఆప్షన్ పదవులను ఏకపక్షంగా బిజేపి దక్కించుకుంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో 66 డివిజన్లు ఉండగా ఐదు కోఆప్షన్ పదవులకు శనివారం ఎన్నిక నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో బిజెపికి చెందిన ఐదుగురిని కో ఆప్షన్  సభ్యులుగా ఎంపిక చేశారు.‌ బండి సంజయ్ సూచించిన కన్న కృష్ణ, నందకుమార్, బల్బీర్ సింగ్, ఆఫీసాబేగం, వెంకటమ్మను ఏకగ్రీవంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఎన్నుకున్నారు. కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన ఐదుగురిని కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు బిజెపికి చెందిన ఐదుగురు సభ్యుల పేర్లను ప్రతిపాదించారు. పోటీకి కాంగ్రెస్ దూరంగా ఉండగా బిఆర్ఎస్ రెండుగా చీలిపోయింది. సమావేశానికి హాజరై బిఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు పోటీలో పాల్గొనకుండా సైలెంట్ ఉండిపోయారు. ‌5 కోఆప్షన్ సభ్యుల పదవులకు 46 మంది దరఖాస్తు చేసుకోగా మెజార్టీ ఉన్న బిజెపి ఐదుగురిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపిక చేసి ఏకగ్రీవంగా అయ్యేలా చూడడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. మేయర్ డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్లు మున్సిపల్ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచి డప్పు నృత్యాలు చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    6 hrs ago
  • అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 10000 పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను విడుదల చేయాలని కలెక్టరేట్ మెయిన్ గేట్ ముందు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ పేద,బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతవిద్యను ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో తీసుకొచ్చిన "ఫీజు రీయింబర్స్మెంట్" పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని,దీనిని ABVP తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ABVP జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు గౌరవ హైకోర్టును ఆశ్రఉంచినప్పుడు,ప్రభుత్వం ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని గౌరవ హైకోర్టు పదే పదే కోరినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయని కారణంగానే "విద్యార్థుల దగ్గరనుండే ఫీజులు వసూలు చేసుకోవచ్చని గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని,ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టిందని, ఇది రీయింబర్స్ మెంట్ పథకాన్ని బొంద పెట్టడంలో భాగమే అని అన్నారు.ఈ స్కీమ్ ద్వారా లక్షల మంది పేద వర్గాల పిల్లలు ఇంజనీరింగ్,మెడిసిన్,ఫార్మసీ, లా లాంటి కోర్సులు పూర్తిచేసి దేశ విదేశాల్లో స్థిరపడి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇస్తున్నారన్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అయ్యే పరిస్థితి దాపురించిందన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడి యేటా 14 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని,కోర్సుల్లో ప్రవేశం పొందేటప్పుడే ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందన్న హామీ మేరకే విద్యార్థులు అడ్మిషన్ పొందుతారని,హామీ మేరకు ప్రవేశం పొందాక ఫీజు చెల్లించకుండా, 10000 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థులను నయవంచనకు గురిచేస్తుందన్నారు.విద్య పై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి రాష్ట్ర,దేశ అభివృద్ధికి ఉపయోగపడే మానవవనరుల సృష్టి కోసమేనని, ఇది ఏ మాత్రం ఉచిత పథకం కాదని,ఈ విషయాన్ని ప్రభుత్వం,సమాజం అర్థం చేసుకోవాలన్నారు.ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పేద విద్యార్థులకు విద్యాప్రదాయినిగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని BRS ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని,ఈ పథకాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని,మేము అధికారంలోకి వస్తే బకాయిలు చెల్లించడమే కాకుండా ఇంకా గొప్పగా అమలుచేస్తామని హామీ ఇచ్చారని,తీర అధికారం లోకి వచ్చాక స్వయంగా తానే విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేతకు కుట్రలు చేస్తున్నారన్నారు.నా దగ్గర పంచడానికి భూములు లేవు,కానీ జీవితాన్ని నిలబెట్టే విద్యను మాత్రం అందిస్తానని పదే పదే వల్లే వేసే రేవంత్ రెడ్డి గారు ఎందుకు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు.తల్లిదండ్రులు, విద్యార్థులు,సమాజం అంతా కూడా ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై స్పందించాలని,ABVP ఆధ్వర్యంలో ఈ విద్యావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వంపై చేయబోయే ఉద్యమంలో మాతో పాటు కలిసి రావాలని పిలునిచ్చారు.విద్యార్థులతో గెలుక్కున్న ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలువలేదని,నీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయని,నీ ప్రభుత్వ మెడలు వంచైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తుందో దానికి వ్యతిరేకంగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ SFD CO -CONVER గోస్కుల అజయ్. స్టేట్ హాస్టల్స్ CO - CONVER భామండ్ల నందు. నగర కార్యదర్శి యోగేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మురళి జిల్లా SFD CONVER శ్రీపతి వంశీ,జిల్లా SFS CONVER నాగరాజు , జిల్లా హాస్టల్ కన్వీనర్ విగ్నేష్ , జిల్లా కేల్ కన్వీనర్ విష్ణు, నితీష్, శ్రీ వర్ధన్, ఆకాష్, శివ, మనోజ్ ,అనూష తదితరులు పాల్గొన్నారు
    3
    అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా  శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 10000 పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను విడుదల చేయాలని కలెక్టరేట్  మెయిన్ గేట్ ముందు నిరాహార దీక్ష చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ పేద,బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతవిద్యను ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో తీసుకొచ్చిన "ఫీజు రీయింబర్స్మెంట్" పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని,దీనిని ABVP తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ABVP జిల్లా  కన్వీనర్ పూసాల విష్ణు   అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు గౌరవ హైకోర్టును ఆశ్రఉంచినప్పుడు,ప్రభుత్వం ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని గౌరవ హైకోర్టు పదే పదే కోరినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయని కారణంగానే "విద్యార్థుల దగ్గరనుండే ఫీజులు వసూలు చేసుకోవచ్చని గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని,ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టిందని, ఇది రీయింబర్స్ మెంట్ పథకాన్ని బొంద పెట్టడంలో భాగమే అని అన్నారు.ఈ స్కీమ్ ద్వారా లక్షల మంది పేద వర్గాల పిల్లలు ఇంజనీరింగ్,మెడిసిన్,ఫార్మసీ, లా లాంటి కోర్సులు పూర్తిచేసి దేశ విదేశాల్లో స్థిరపడి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇస్తున్నారన్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అయ్యే పరిస్థితి దాపురించిందన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడి యేటా 14 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని,కోర్సుల్లో ప్రవేశం పొందేటప్పుడే ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందన్న హామీ మేరకే విద్యార్థులు అడ్మిషన్ పొందుతారని,హామీ మేరకు ప్రవేశం పొందాక ఫీజు చెల్లించకుండా, 10000 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థులను నయవంచనకు గురిచేస్తుందన్నారు.విద్య పై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి రాష్ట్ర,దేశ అభివృద్ధికి ఉపయోగపడే మానవవనరుల సృష్టి కోసమేనని, ఇది ఏ మాత్రం ఉచిత పథకం కాదని,ఈ విషయాన్ని ప్రభుత్వం,సమాజం అర్థం చేసుకోవాలన్నారు.ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పేద విద్యార్థులకు విద్యాప్రదాయినిగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని BRS ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని,ఈ పథకాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని,మేము అధికారంలోకి వస్తే బకాయిలు చెల్లించడమే కాకుండా ఇంకా గొప్పగా అమలుచేస్తామని హామీ ఇచ్చారని,తీర అధికారం లోకి వచ్చాక స్వయంగా తానే విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేతకు కుట్రలు చేస్తున్నారన్నారు.నా దగ్గర పంచడానికి భూములు లేవు,కానీ జీవితాన్ని నిలబెట్టే విద్యను మాత్రం అందిస్తానని పదే పదే వల్లే వేసే రేవంత్ రెడ్డి గారు ఎందుకు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు.తల్లిదండ్రులు, విద్యార్థులు,సమాజం అంతా కూడా ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై స్పందించాలని,ABVP ఆధ్వర్యంలో ఈ విద్యావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వంపై చేయబోయే ఉద్యమంలో మాతో పాటు కలిసి రావాలని పిలునిచ్చారు.విద్యార్థులతో గెలుక్కున్న ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలువలేదని,నీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయని,నీ ప్రభుత్వ మెడలు వంచైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకుంటామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తుందో దానికి వ్యతిరేకంగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో స్టేట్ SFD CO -CONVER గోస్కుల అజయ్. స్టేట్ హాస్టల్స్  CO - CONVER భామండ్ల నందు. నగర కార్యదర్శి యోగేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మురళి జిల్లా SFD CONVER శ్రీపతి వంశీ,జిల్లా SFS CONVER నాగరాజు , జిల్లా హాస్టల్ కన్వీనర్ విగ్నేష్ , జిల్లా కేల్ కన్వీనర్ విష్ణు, నితీష్, శ్రీ వర్ధన్, ఆకాష్, శివ, మనోజ్ ,అనూష తదితరులు పాల్గొన్నారు
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.