వడ్ల కొనుగోలులో అక్రమాలు: ఐకేపీ కేంద్రాలు అధికార పార్టీ నాయకుల ప్రైవేటు ఆస్తులా?* * నకిరేకల్ నియోజకవర్గం కేతపల్లి 25 : ఐకేపీ కేంద్రాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సినవి, కానీ వాస్తవానికి ఇవి ఇప్పుడు అధికార పార్టీ నాయకులు మరియు వారి అనుచరుల కనుసన్నల్లో నడిచే ప్రైవేటు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. అసలు విషయం ఏమిటంటే, ఈ కేంద్రాల నిర్వహణ పూర్తిగా అధికార పార్టీ నాయకులు మరియు కార్యకర్తల చేతుల్లోనే ఉంది; అధికారులు కేవలం నామమాత్రంగా ఉంటూ, వీరి అక్రమాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. పద్ధతి ప్రకారం మాచర్ వచ్చిన రైతుల సీరియల్ నంబర్ల వారీగా వడ్లను సేకరించాల్సింది పోయి, ఇక్కడ మాత్రం అధికార పార్టీ నాయకులు తమ సొంత నిర్ణయాలతో గ్రామాలలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఉదాహరణకి కేతేపల్లి గ్రామంలో 20 రోజుల క్రితం మాచర్ వచ్చి సీరియల్ వచ్చిన వారి కాకుండా అధికార పార్టీ వారివి లేదా వారికి అనుకూలంగా ఉన్న వారివి మాత్రమే కాటాలు వేస్తున్నారు ఈ విధంగా జరుగుతుందని కేతేపల్లి మండల తాసిల్దార్ గారికి తెలియజేసిన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ధాన్యం కొనుగోలు సెంటర్ల మండల మానిటరింగ్ ఆఫీసర్ వంశీ గారికి ఫిర్యాదు చేసిన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే వంశీ అధికారి గారు సీరియల్ ప్రకారంగా వచ్చిన రైతులకి బస్తాలు ఇప్పిస్తే ఆ అధికారికి నియోజకవర్గ స్థాయి నాయకునితో ఫోన్ చేపించి మళ్లీ ఆ రైతుల వద్ద నుండి బస్తాలు తిరిగి తెప్పించుకోవడం జరిగింది అంటే దాన్యం కొనుగోలు ఒక్క అధికార పార్టీకి సంబంధించిన రైతులకు మాత్రమే చేస్తారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మొదటి రోజే సీరియల్ వచ్చిన రైతులని కాదని వారికి అనుకూలంగా ఉన్న వారివి మాత్రమే కాటా పెడతారా *ఇదేనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన ప్రజాపాలన భాగమేనా ఈ కొనుగోలు* కేంద్రాలు చేసే నిర్వహణ మీకు సాక్ష్యంగా ఈ క్రింది వీడియోలు చూస్తే తెలిసిపోతుంది ఇచ్చిన బస్తాలు రైతుల వద్ద నుంచి అధికారులను బెదిరించి తెప్పించుకుంటున్నారు

- హైదరాబాద్ లో రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు, ఎంజెఏ మార్కెట్ చౌరస్తాలో ఆటో డ్రైవర్ల నిరసన, ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన ఆటో డ్రైవర్1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 25 ఐ3 న్యూస్ *విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక వీడియో. బడి సెలవుల నేపథ్యంలో బయట ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.*...1
- Post by Ramprasad islavath1
- *అటవీ భూముల్లో మట్టి మాఫియా పంజా..* *వెంకుపాలెంలో గ్రామస్థుల గర్జన!* **దిశ వినుకొండ:** అక్రమార్కుల ఆకలికి ప్రభుత్వ భూములు కరిగిపోతున్నాయి. కళ్లముందే కోట్లాది రూపాయల విలువైన సంపద దోపిడీకి గురవుతున్నా.. అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామం వద్ద అక్రమ మట్టి మాఫియా బరితెగించింది. సర్వే నంబర్ 1లోని సుమారు 89 ఎకరాల అటవీ భూముల్లో యథేచ్ఛగా సాగుతున్న తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకుని నిరసన తెలిపారు. *కోట్లలో వ్యాపారం..* *సామాన్యులకు మాత్రం ఆంక్షలు!* వెంకుపాలెం గ్రామ సమీపంలోని అటవీ భూముల్లో ఉన్న మేలిరకం ఎర్రమట్టిపై మాఫియా కన్ను పడింది. భారీ జేసీబీలతో భూమిని తవ్వేస్తూ, టిప్పర్ల ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయిస్తూ అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు. "గ్రామ అవసరాల కోసం ఒక తట్ట మట్టి తీసుకెళ్లాలన్నా స్థానికులను వేధిస్తున్నారు.. కానీ, మాఫియా పగలు రేయి తేడా లేకుండా వేల టిప్పర్ల మట్టిని తరలిస్తుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా నిలిచిన టిప్పర్లే ఇక్కడ జరుగుతున్న దోపిడీకి సజీవ సాక్ష్యాలని వారు చూపుతున్నారు. *అధికారుల 'వాటాల' పర్వం.. అడ్డుకోకుంటే ఉద్యమమే!* ఈ స్థాయిలో దోపిడీ జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాఫియా నుంచి అధికారులకు భారీగా 'వాటాలు' అందుతున్నాయని, అందుకే ఈ అక్రమ రవాణాను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని గ్రామస్థులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దోపిడీని అడ్డుకోకపోతే, గ్రామస్థులంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.3
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్, తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల గోస పై ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు జరగక రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి ధాన్యం కొనుగోలు కాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ధాన్యం ఎండి కుప్ప పోసి 15 రోజులవుతున్న కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరికాయ కొట్టారు, కానీ కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదనతో తెలిపారు. మహిళా రైతు మాత్రం ప్రభుత్వం కొనకుంటే మీరు కొనండి సూచించారు. రెండేళ్లు ఓపిక పట్టండి మళ్లీ కెసిఆర్ వస్తాడు అప్పుడు మేమే కొంటామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గొప్పలు చెబుతుంది తప్ప రైతుల గౌసను అర్థం చేసుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొనుగోళ్ళు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించిన పంట దళారుల పాలు కాకుండా మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. రైస్ మిల్ అలాట్మెంట్ చేసి సోమవారం లోగా ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతుల పక్షాన బిఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతు సోదరులు ధైర్యంగా ఉండండి... రెండేళ్లయితే కేసీఆర్ మళ్ళీ వస్తాడని కేటీఆర్ తెలిపారు.4
- కేసీఆర్ ఉన్నప్పుడు మమ్మల్ని దేవుడిలాగా ఆదుకున్నాడు.. గతంలో కేసీఆర్ నా ఆటో ఫిట్‌నెస్ డబ్బులు మాఫీ చేశాడు రూ.35000 ఆటో ఫిట్‌నెస్ డబ్బులు కడదామని నా భార్య బంగారం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుపోతే పోతే.. కేసీఆర్ మాఫీ చేస్తున్నాడని అధికారి చెప్తే నేను చాలా సంతోషించాను కానీ రేవంత్ రెడ్డి మమ్మల్ని రోడ్డు మీద పడేశాడు నిన్న ఆర్టీసీ వాళ్ళతో మంత్రులందరూ మాట్లాడారు.. మరి మాతో మాట్లాడరా, మా కన్నీళ్లు తుడవరా మీరు ఇస్తాను అన్న రూ.12 వేలు మాకొద్దు.. డిస్ట్రిక్ట్ ఆటో హైదరాబాద్ సిటీలోకి రాకుండా చేయండి చాలు రాహుల్ గాంధీ పెద్ద చోర్.. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు రేవంత్ రెడ్డిది కూడా రాను రాను మా బ్రతుకే అవుతుంది.. ఆయనని ప్రజలు రాళ్లతో కొడతారు రాగానే కంచెలు బద్దలు కొట్టాము మీరు ధర్నా చేసుకోవచ్చు అని చెప్పాడు.. ఇప్పుడు ధర్నా చేస్తుంటే పోలీసులు ఈడ్చుకెళ్తున్నారు - హైదరాబాద్ ఆటో డ్రైవర్1
- జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలోని ముర్సుగడ్డ తండా రోడ్డుపై ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో కాసోజు సంగీత్ (15) అనే మైనర్ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ బానెట్‌పై కూర్చున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రాక్టర్ బోల్తా పడినట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.1
- Post by Ramprasad islavath1
- కరీంనగర్ లో త్రీ టౌన్ ఎస్ఐ వీరంగం సృష్టించాడు. సెల్యూట్ షాప్ నిర్వాకుడుని దూషిస్తూ దాడి చేశాడు. ఖాన్ పురాలోని సేవింగ్ చేయించుకోవడానికి త్రీటౌన్ ఎస్‌ఐ చందర్ వెళ్ళారు. రాము, సేవింగ్ చేయాలని ఎస్ఐ కోరగా ‘అన్నా’ కూర్చొ అని షాప్ నిర్వాకుడు రాము అన్నాడు. అన్నా ఏందిరా బే అంటూ ఎస్ఐ బూతులు తిడుతూ దాడి చేశాడు. విచక్షణారహితంగా సెల్యూన్ షాప్ నిర్వాకుడు రాముపై చేయి చేసుకున్నాడు. ఎస్ఐ ని అన్నా అన్నందుకే దాడి చేయడం సర్వతా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ అమానుష దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సిసి పటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షాపు నిర్వాకుడు పై విచక్షణ రహితంగా ప్రవర్తించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐ పై శాఖ పరమైన చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.2