Shuru
Apke Nagar Ki App…
...., ...
Ramprasad islavath
...., ...
More news from తెలంగాణ and nearby areas
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao2
- Post by Gurrala vigeswara ramarao5
- రాయిగూడెంలో జరిగిన ప్రజా దర్బార్ లో ఓ ముస్లిం మహిళ భావోద్వేగానికి లోనైంది. “నా బిడ్డ ప్రాణం కాపాడిన దేవుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం" అని ఆమె కన్నీటి పర్యంతమైంది. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ప్రజల సమస్యలు విని పరిష్కారానికి హామీనిచ్చారు.1
- అనుమానాస్పద స్థితిలో యువతి మృతి కేసును ఛేదించిన మరిపెడ పోలీసులు. నిశ్చితార్థం జరిగిన యువతిని బావిలో తోసి చంపిన కిరాతకుడు. అనుమానమే హత్యకు కారణం, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నిందితుడు అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న యువతి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును పోలీసులు హత్యగా తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి గల కారణాలను మరిపెడ సిఐ పవన్ కుమార్ వెల్లడించారు. మరిపెడ మండల పరిధిలోని ఇటికలగడ్డ తండాకు చెందిన 19 ఏళ్ల బుక్య సంగీత, ఈ నెల 22న గ్రామశివారులోని ఒక బావిలో శవమై కనిపించింది. ఈ నెల 29న ఆమెకు కొత్త తండాకు చెందిన అజ్మీరా అరవింద్‌తో వివాహం జరగాల్సి ఉంది. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే, పెళ్లికి కొన్ని రోజుల ముందే సంగీత విగతజీవిగా పడి ఉండటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కేసును సవాలుగా తీసుకున్న మరిపెడ CI పవన్ కుమార్, యస్సైలు,వీరభద్రం, కోటేశ్వరరావు లు సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను సేకరించారు. పోలీసుల విచారణలో నిందితుడు అరవింద్ తన నేరాన్ని అంగీకరించాడు. సంగీతపై పెంచుకున్న అనవసరమైన అనుమానమే ఈ హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. సంగీత వేరే వారితో చనువుగా ఉండటంతో అరవింద్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 21వ తేదీ సాయంత్రం, ఇంట్లో వారికి అబద్ధం చెప్పి బయటకు వచ్చిన అరవింద్, సంగీతను నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు. మాటల్లో పెట్టి బావి వద్దకు తీసుకెళ్లి, ఆమెను నీళ్లలోకి నెట్టి చంపేశాడు. ఇది ఒక ఆత్మహత్యగా నమ్మించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. హత్య తర్వాత ఏమీ తెలియనట్టు సంగీత తల్లిదండ్రులతో కలిసి తిరిగాడు. చివరికి సాంకేతిక పరిజ్ఞానం మరియు సాక్షుల ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు అరవింద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మరిపెడ పోలీసులు వెల్లడించారు.1
- అమరావతి: అంబేద్కర్ విగ్రహ సెంటర్లో అమరావతి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఎస్సై శ్రీనివాసరావు శుక్రవారం కారులపై ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కారు నడిపే సమయంలో సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని హెచ్చరించారు. అతివేగంగా ప్రయాణం చేయరాదని అన్నారు. మద్యం సేవించి కార్లు నడపరాదని తెలిపారు. నిబంధనలను పాటించకుండా కారులు నడిపే వారిపై కేసుల నమోదు చేస్తామన్నారు.1
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్దిరాల మండలం చిన్ననెమిల వద్ద టాటా ఏస్ వాహనం అదుపు తప్పింది.వేగంగా వెళ్లి చెట్టును వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.మృతుల్లో చిన్ననెమిలకు చెందిన రాధ, జలాలపురానికి చెందిన మరో వ్యక్తి ఉన్నారు.పండగ కోసం హైదరాబాద్ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగింది.ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.1
- Post by Ramprasad islavath1