Shuru
Apke Nagar Ki App…
మద్దిరాల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి పండుగకు వెళుతుండగా ఘటన సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్దిరాల మండలం చిన్ననెమిల వద్ద టాటా ఏస్ వాహనం అదుపు తప్పింది.వేగంగా వెళ్లి చెట్టును వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.మృతుల్లో చిన్ననెమిలకు చెందిన రాధ, జలాలపురానికి చెందిన మరో వ్యక్తి ఉన్నారు.పండగ కోసం హైదరాబాద్ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగింది.ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వెలుగు సైదులు సూర్యాపేట జిల్లా
మద్దిరాల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి పండుగకు వెళుతుండగా ఘటన సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్దిరాల మండలం చిన్ననెమిల వద్ద టాటా ఏస్ వాహనం అదుపు తప్పింది.వేగంగా వెళ్లి చెట్టును వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.మృతుల్లో చిన్ననెమిలకు చెందిన రాధ, జలాలపురానికి చెందిన మరో వ్యక్తి ఉన్నారు.పండగ కోసం హైదరాబాద్ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగింది.ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
More news from తెలంగాణ and nearby areas
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్దిరాల మండలం చిన్ననెమిల వద్ద టాటా ఏస్ వాహనం అదుపు తప్పింది.వేగంగా వెళ్లి చెట్టును వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.మృతుల్లో చిన్ననెమిలకు చెందిన రాధ, జలాలపురానికి చెందిన మరో వ్యక్తి ఉన్నారు.పండగ కోసం హైదరాబాద్ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగింది.ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.1
- * నకిరేకల్ నియోజకవర్గం కేతపల్లి 25 : ఐకేపీ కేంద్రాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సినవి, కానీ వాస్తవానికి ఇవి ఇప్పుడు అధికార పార్టీ నాయకులు మరియు వారి అనుచరుల కనుసన్నల్లో నడిచే ప్రైవేటు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. అసలు విషయం ఏమిటంటే, ఈ కేంద్రాల నిర్వహణ పూర్తిగా అధికార పార్టీ నాయకులు మరియు కార్యకర్తల చేతుల్లోనే ఉంది; అధికారులు కేవలం నామమాత్రంగా ఉంటూ, వీరి అక్రమాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. పద్ధతి ప్రకారం మాచర్ వచ్చిన రైతుల సీరియల్ నంబర్ల వారీగా వడ్లను సేకరించాల్సింది పోయి, ఇక్కడ మాత్రం అధికార పార్టీ నాయకులు తమ సొంత నిర్ణయాలతో గ్రామాలలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఉదాహరణకి కేతేపల్లి గ్రామంలో 20 రోజుల క్రితం మాచర్ వచ్చి సీరియల్ వచ్చిన వారి కాకుండా అధికార పార్టీ వారివి లేదా వారికి అనుకూలంగా ఉన్న వారివి మాత్రమే కాటాలు వేస్తున్నారు ఈ విధంగా జరుగుతుందని కేతేపల్లి మండల తాసిల్దార్ గారికి తెలియజేసిన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ధాన్యం కొనుగోలు సెంటర్ల మండల మానిటరింగ్ ఆఫీసర్ వంశీ గారికి ఫిర్యాదు చేసిన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే వంశీ అధికారి గారు సీరియల్ ప్రకారంగా వచ్చిన రైతులకి బస్తాలు ఇప్పిస్తే ఆ అధికారికి నియోజకవర్గ స్థాయి నాయకునితో ఫోన్ చేపించి మళ్లీ ఆ రైతుల వద్ద నుండి బస్తాలు తిరిగి తెప్పించుకోవడం జరిగింది అంటే దాన్యం కొనుగోలు ఒక్క అధికార పార్టీకి సంబంధించిన రైతులకు మాత్రమే చేస్తారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మొదటి రోజే సీరియల్ వచ్చిన రైతులని కాదని వారికి అనుకూలంగా ఉన్న వారివి మాత్రమే కాటా పెడతారా *ఇదేనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన ప్రజాపాలన భాగమేనా ఈ కొనుగోలు* కేంద్రాలు చేసే నిర్వహణ మీకు సాక్ష్యంగా ఈ క్రింది వీడియోలు చూస్తే తెలిసిపోతుంది ఇచ్చిన బస్తాలు రైతుల వద్ద నుంచి అధికారులను బెదిరించి తెప్పించుకుంటున్నారు1
- వరంగల్‌లో జరుగుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజున అమ్మవారిని సుగంధ గంధాలతో అలంకరించి ప్రత్యేక శోభను కలిగించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అమ్మవారి గంధాలంకరణను దర్శించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు మరింత వైభవంగా కొనసాగుతున్నాయని, భక్తులు నియమాలను పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని అధికారులు సూచించారు.1
- అనుమానాస్పద స్థితిలో యువతి మృతి కేసును ఛేదించిన మరిపెడ పోలీసులు. నిశ్చితార్థం జరిగిన యువతిని బావిలో తోసి చంపిన కిరాతకుడు. అనుమానమే హత్యకు కారణం, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నిందితుడు అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న యువతి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును పోలీసులు హత్యగా తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి గల కారణాలను మరిపెడ సిఐ పవన్ కుమార్ వెల్లడించారు. మరిపెడ మండల పరిధిలోని ఇటికలగడ్డ తండాకు చెందిన 19 ఏళ్ల బుక్య సంగీత, ఈ నెల 22న గ్రామశివారులోని ఒక బావిలో శవమై కనిపించింది. ఈ నెల 29న ఆమెకు కొత్త తండాకు చెందిన అజ్మీరా అరవింద్‌తో వివాహం జరగాల్సి ఉంది. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే, పెళ్లికి కొన్ని రోజుల ముందే సంగీత విగతజీవిగా పడి ఉండటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కేసును సవాలుగా తీసుకున్న మరిపెడ CI పవన్ కుమార్, యస్సైలు,వీరభద్రం, కోటేశ్వరరావు లు సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను సేకరించారు. పోలీసుల విచారణలో నిందితుడు అరవింద్ తన నేరాన్ని అంగీకరించాడు. సంగీతపై పెంచుకున్న అనవసరమైన అనుమానమే ఈ హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. సంగీత వేరే వారితో చనువుగా ఉండటంతో అరవింద్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 21వ తేదీ సాయంత్రం, ఇంట్లో వారికి అబద్ధం చెప్పి బయటకు వచ్చిన అరవింద్, సంగీతను నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు. మాటల్లో పెట్టి బావి వద్దకు తీసుకెళ్లి, ఆమెను నీళ్లలోకి నెట్టి చంపేశాడు. ఇది ఒక ఆత్మహత్యగా నమ్మించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. హత్య తర్వాత ఏమీ తెలియనట్టు సంగీత తల్లిదండ్రులతో కలిసి తిరిగాడు. చివరికి సాంకేతిక పరిజ్ఞానం మరియు సాక్షుల ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు అరవింద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మరిపెడ పోలీసులు వెల్లడించారు.1
- రంగారెడ్డి గచ్చిబౌలి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పరిస్థితిని గమనించిన కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వెంటనే దిగిపోయి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన సాయంత్రం సమయంలో చోటుచేసుకోవడంతో, ఇంటికి వెళ్లే వాహనదారులతో రహదారి ఇప్పటికే రద్దీగా ఉండగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టడంతో పాటు, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.3
- కాకి చొక్కా ఒంటిపై ఉందన్నా అహంకారంతో ఒక సామాన్య సెలూన్ కార్మికుడి పై ప్రతాపం చూపించాడు ఓ పోలీస్ అధికారి, కరీంనగర్ నగరంలోని ఖాన్ పురా, ఏరియాలో ఈరోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది, కరీంనగర్ జిల్లాలో పోలీస్ అధికారి చేసిన పని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఖాన్ పురా ఏరియాలో ఉన్న సెలూన్‌కు కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై షేవింగ్ చేయించు కోవడానికి వెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న రాము అనే వర్కర్, ఎస్సైని ఉద్దేశించి గౌరవంగా కూర్చో అన్నా అని పలికారు. అయితే, ఆ పిలుపు విని సదరు అధికారి ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. నన్నే అన్నా అంటావా?” అంటూ మండిపడ్డ ఎస్సై, తన హోదాను అడ్డం పెట్టుకుని రాముపై బూతులు తిడుతూ.. విచక్షణార హితంగా దాడి చేశారు. ఒక సామాన్యుడు తనను ‘అన్నా’ అని సంబోధించ డం ఆ అధికారి అహం కారాన్ని దెబ్బతీసినట్లుగా ఆయన ప్రవర్తన ఉంది. సెలూన్‌లో అందరూ చూ స్తుండగానే బాధితుడిపై చేయి చేసుకుని అసభ్య పదజాలంతో దూషించారు. ఈ దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలన్నీ సెలూన్ లోని సిసిటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఎస్సై వర్కర్‌ను కొట్టడం, దురుసుగా ప్రవర్తించడం వంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీ సింగ్?” అంటూ పోలీస్ శాఖపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సామాన్యులపై ఇలాంటి దాడులు పోలీస్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యు డైన త్రీటౌన్ ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు,స్థానికులు కోరుతున్నారు.1
- రాయిగూడెంలో జరిగిన ప్రజా దర్బార్ లో ఓ ముస్లిం మహిళ భావోద్వేగానికి లోనైంది. “నా బిడ్డ ప్రాణం కాపాడిన దేవుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం" అని ఆమె కన్నీటి పర్యంతమైంది. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ప్రజల సమస్యలు విని పరిష్కారానికి హామీనిచ్చారు.1
- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేయాలని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ను అన్ని స్థానంలో గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య పాల్గొన్నారు.1