Shuru
Apke Nagar Ki App…
నేలకొండపల్లి: ‘నా బిడ్డ ప్రాణం కాపాడిన దేవుడు శీనన్న'. రాయిగూడెంలో జరిగిన ప్రజా దర్బార్ లో ఓ ముస్లిం మహిళ భావోద్వేగానికి లోనైంది. “నా బిడ్డ ప్రాణం కాపాడిన దేవుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం" అని ఆమె కన్నీటి పర్యంతమైంది. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ప్రజల సమస్యలు విని పరిష్కారానికి హామీనిచ్చారు.
Venkatesh
నేలకొండపల్లి: ‘నా బిడ్డ ప్రాణం కాపాడిన దేవుడు శీనన్న'. రాయిగూడెంలో జరిగిన ప్రజా దర్బార్ లో ఓ ముస్లిం మహిళ భావోద్వేగానికి లోనైంది. “నా బిడ్డ ప్రాణం కాపాడిన దేవుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం" అని ఆమె కన్నీటి పర్యంతమైంది. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ప్రజల సమస్యలు విని పరిష్కారానికి హామీనిచ్చారు.
More news from తెలంగాణ and nearby areas
- రాయిగూడెంలో జరిగిన ప్రజా దర్బార్ లో ఓ ముస్లిం మహిళ భావోద్వేగానికి లోనైంది. “నా బిడ్డ ప్రాణం కాపాడిన దేవుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం" అని ఆమె కన్నీటి పర్యంతమైంది. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ప్రజల సమస్యలు విని పరిష్కారానికి హామీనిచ్చారు.1
- Post by Ramprasad islavath1
- అనుమానాస్పద స్థితిలో యువతి మృతి కేసును ఛేదించిన మరిపెడ పోలీసులు. నిశ్చితార్థం జరిగిన యువతిని బావిలో తోసి చంపిన కిరాతకుడు. అనుమానమే హత్యకు కారణం, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నిందితుడు అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న యువతి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును పోలీసులు హత్యగా తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి గల కారణాలను మరిపెడ సిఐ పవన్ కుమార్ వెల్లడించారు. మరిపెడ మండల పరిధిలోని ఇటికలగడ్డ తండాకు చెందిన 19 ఏళ్ల బుక్య సంగీత, ఈ నెల 22న గ్రామశివారులోని ఒక బావిలో శవమై కనిపించింది. ఈ నెల 29న ఆమెకు కొత్త తండాకు చెందిన అజ్మీరా అరవింద్‌తో వివాహం జరగాల్సి ఉంది. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే, పెళ్లికి కొన్ని రోజుల ముందే సంగీత విగతజీవిగా పడి ఉండటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కేసును సవాలుగా తీసుకున్న మరిపెడ CI పవన్ కుమార్, యస్సైలు,వీరభద్రం, కోటేశ్వరరావు లు సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను సేకరించారు. పోలీసుల విచారణలో నిందితుడు అరవింద్ తన నేరాన్ని అంగీకరించాడు. సంగీతపై పెంచుకున్న అనవసరమైన అనుమానమే ఈ హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. సంగీత వేరే వారితో చనువుగా ఉండటంతో అరవింద్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 21వ తేదీ సాయంత్రం, ఇంట్లో వారికి అబద్ధం చెప్పి బయటకు వచ్చిన అరవింద్, సంగీతను నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు. మాటల్లో పెట్టి బావి వద్దకు తీసుకెళ్లి, ఆమెను నీళ్లలోకి నెట్టి చంపేశాడు. ఇది ఒక ఆత్మహత్యగా నమ్మించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. హత్య తర్వాత ఏమీ తెలియనట్టు సంగీత తల్లిదండ్రులతో కలిసి తిరిగాడు. చివరికి సాంకేతిక పరిజ్ఞానం మరియు సాక్షుల ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు అరవింద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మరిపెడ పోలీసులు వెల్లడించారు.1
- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేయాలని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ను అన్ని స్థానంలో గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య పాల్గొన్నారు.1
- అమరావతి: అంబేద్కర్ విగ్రహ సెంటర్లో అమరావతి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఎస్సై శ్రీనివాసరావు శుక్రవారం కారులపై ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కారు నడిపే సమయంలో సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని హెచ్చరించారు. అతివేగంగా ప్రయాణం చేయరాదని అన్నారు. మద్యం సేవించి కార్లు నడపరాదని తెలిపారు. నిబంధనలను పాటించకుండా కారులు నడిపే వారిపై కేసుల నమోదు చేస్తామన్నారు.1
- Post by V Ramarao2
- జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలోని ముర్సుగడ్డ తండా రోడ్డుపై ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో కాసోజు సంగీత్ (15) అనే మైనర్ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ బానెట్‌పై కూర్చున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రాక్టర్ బోల్తా పడినట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.1
- రాష్ట్రంలో ఎండలు మండిపోతుంటే మొక్కజొన్నల్లో తేమ ఉందంటూ క్వింటాలుకు 5 కిలోల చొప్పున తరుగు తీస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కల్లాలతో పాటు రోడ్లు కూడా నిండిపోయాయి. రేవంత్ రెడ్డి పాలనలో సాగు నీరందక, కరెంట్ కోతల కారణంగా పంటలు ఎండిపోయాయి. యూరియా యాప్ పెట్టడంతో యూరియా కోసం తిరిగి తిరిగి రైతన్నల కాళ్లకు వాపులొచ్చాయి. రైతు పండించిన ప్రతి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలి.- ఎంపీ వద్దిరాజు రవిచంద్ర1