Shuru
Apke Nagar Ki App…
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని పెట్రోల్ బంకులలో క్యూ కడుతున్న వాహనదారులు... ఒకేసారిగా ఉదయం నుండి వాహనదారులు బంకులకు పెట్రోల్ డీజిల్ కోసం రావడంతో రద్దీ పెరిగింది 20 లీటర్ల వాటర్ క్యాన్లు డీజిల్ కోసం తేవడం గమనార్హం... ఒకేసారిగా పెట్రోల్ బంకులలో ప్రతి పెరగటంతో బంకు సిబ్బంది బిజీ అయిపోయారు
V Ramarao
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని పెట్రోల్ బంకులలో క్యూ కడుతున్న వాహనదారులు... ఒకేసారిగా ఉదయం నుండి వాహనదారులు బంకులకు పెట్రోల్ డీజిల్ కోసం రావడంతో రద్దీ పెరిగింది 20 లీటర్ల వాటర్ క్యాన్లు డీజిల్ కోసం తేవడం గమనార్హం... ఒకేసారిగా పెట్రోల్ బంకులలో ప్రతి పెరగటంతో బంకు సిబ్బంది బిజీ అయిపోయారు
More news from తెలంగాణ and nearby areas
- Post by Ramprasad islavath1
- రాష్ట్రంలో ఎండలు మండిపోతుంటే మొక్కజొన్నల్లో తేమ ఉందంటూ క్వింటాలుకు 5 కిలోల చొప్పున తరుగు తీస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కల్లాలతో పాటు రోడ్లు కూడా నిండిపోయాయి. రేవంత్ రెడ్డి పాలనలో సాగు నీరందక, కరెంట్ కోతల కారణంగా పంటలు ఎండిపోయాయి. యూరియా యాప్ పెట్టడంతో యూరియా కోసం తిరిగి తిరిగి రైతన్నల కాళ్లకు వాపులొచ్చాయి. రైతు పండించిన ప్రతి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలి.- ఎంపీ వద్దిరాజు రవిచంద్ర1
- ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలంటూ మహబూబాబాద్ డిపో కార్మికులకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ.... హక్కుల కోసం ఉద్యమిస్తే.. ఉక్కుపాదంతో అణిచివేస్తరా..? అధికారంలోకి రాకముందు చెప్పిందేమిటి..? ఇప్పుడు చేస్తున్నదేమిటి..?* ఆర్టీసి కార్మికులు సమ్మె చేస్తున్నా, కనీసం సోయి లేని సర్కారు అంతులేని నిర్లక్ష్యం వల్లే ఇవాళ ఉద్యమం నాటి దృశ్యాలు, ఆత్మబలిదానాలు చేసుకునే పరిస్థితులు చూస్తున్నాం* ఆర్టీసి కార్మిక సోదరుల్లారా.. దయచేసి మనోధైర్యాన్ని కోల్పోకండి. మీ పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుంది అన్నారు మాజీ మంత్రి, శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు1
- క్షణికావేశం.. ఎనిమిది మందిపై హత్యాయత్నం కేసు దాచేపల్లిలో గురువారం రాత్రి జరిగిన ఘర్షణకు సంబంధించి 8 మందిపై హత్యాప్రయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు CI రాజేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యువకులు క్షణికావేశంలో ఒక వ్యక్తిపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సహించేది లేదని, సమస్యలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలని హెచ్చరించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.1
- అడ్డతీగలలో శనివారం సాయంత్రం వాతావరణం చల్లబడింది. ఉదయం నుంచి ఎండ వేడితో ఇబ్బంది పడ్డ జనం మేఘావృతమైన ఆకాశం, చల్లని గాలులతో సేదతీరారు. అయితే వర్షంతో పాటు ఉరుములు వచ్చే అవకాశం ఉన్నందున పిడుగులు పడే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచిస్తున్నారు. ఎండల నుంచి ఉపశమనం లభించినా, పిడుగుల పట్ల జాగ్రత్త వహించడం అవసరం అని అధికారులు హెచ్చరిస్తున్నారు.1
- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేయాలని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ను అన్ని స్థానంలో గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య పాల్గొన్నారు.1
- Post by Ramprasad islavath1
- ఖమ్మంలోని వైరా రోడ్డులో ఇద్దరు సెల్ఫోన్ వ్యాపారుల మధ్య తలెత్తిన వివాదం హత్యాయత్నానికి దారితీసింది. పండితాపురానికి చెందిన భూక్యా ఆనంద్, నిజాంపేటకు చెందిన రియాజ్ మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రియాజ్ గురువారం రాత్రి వేటకొడవలితో ఆనంద్ ఇంటికి వెళ్లగా.. ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు.2
- అనిల్ అనే వ్యక్తితో ప్రాణహాని ఉంది గుంటూరులోని పాత గుంటూరులో అనిల్ అనే వ్యక్తి అతనికి తనకు సంబంధం ఉందనే ప్రచారం చేస్తూ తన పరువు తీస్తున్నాడని గుంటూరు కి చెందిన మహిళ ఆరోపించింది. పోలీసులు అతనికే సహకరిస్తున్నారని కాబట్టి ఎస్పి తన గోడు వినాలని ఆమె తెలియజేసింది1