Shuru
Apke Nagar Ki App…
అనిల్ అనే వ్యక్తితో ప్రాణహాని ఉంది గుంటూరులోని పాత గుంటూరులో అనిల్ అనే వ్యక్తి అతనికి తనకు సంబంధం ఉందనే ప్రచారం చేస్తూ తన పరువు తీస్తున్నాడని గుంటూరు కి చెందిన మహిళ ఆరోపించింది. పోలీసులు అతనికే సహకరిస్తున్నారని కాబట్టి ఎస్పి తన గోడు వినాలని ఆమె తెలియజేసింది
SHOT NEWS
అనిల్ అనే వ్యక్తితో ప్రాణహాని ఉంది గుంటూరులోని పాత గుంటూరులో అనిల్ అనే వ్యక్తి అతనికి తనకు సంబంధం ఉందనే ప్రచారం చేస్తూ తన పరువు తీస్తున్నాడని గుంటూరు కి చెందిన మహిళ ఆరోపించింది. పోలీసులు అతనికే సహకరిస్తున్నారని కాబట్టి ఎస్పి తన గోడు వినాలని ఆమె తెలియజేసింది
More news from తెలంగాణ and nearby areas
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao2
- అనుమానాస్పద స్థితిలో యువతి మృతి కేసును ఛేదించిన మరిపెడ పోలీసులు. నిశ్చితార్థం జరిగిన యువతిని బావిలో తోసి చంపిన కిరాతకుడు. అనుమానమే హత్యకు కారణం, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నిందితుడు అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న యువతి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును పోలీసులు హత్యగా తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి గల కారణాలను మరిపెడ సిఐ పవన్ కుమార్ వెల్లడించారు. మరిపెడ మండల పరిధిలోని ఇటికలగడ్డ తండాకు చెందిన 19 ఏళ్ల బుక్య సంగీత, ఈ నెల 22న గ్రామశివారులోని ఒక బావిలో శవమై కనిపించింది. ఈ నెల 29న ఆమెకు కొత్త తండాకు చెందిన అజ్మీరా అరవింద్‌తో వివాహం జరగాల్సి ఉంది. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే, పెళ్లికి కొన్ని రోజుల ముందే సంగీత విగతజీవిగా పడి ఉండటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కేసును సవాలుగా తీసుకున్న మరిపెడ CI పవన్ కుమార్, యస్సైలు,వీరభద్రం, కోటేశ్వరరావు లు సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను సేకరించారు. పోలీసుల విచారణలో నిందితుడు అరవింద్ తన నేరాన్ని అంగీకరించాడు. సంగీతపై పెంచుకున్న అనవసరమైన అనుమానమే ఈ హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. సంగీత వేరే వారితో చనువుగా ఉండటంతో అరవింద్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 21వ తేదీ సాయంత్రం, ఇంట్లో వారికి అబద్ధం చెప్పి బయటకు వచ్చిన అరవింద్, సంగీతను నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు. మాటల్లో పెట్టి బావి వద్దకు తీసుకెళ్లి, ఆమెను నీళ్లలోకి నెట్టి చంపేశాడు. ఇది ఒక ఆత్మహత్యగా నమ్మించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. హత్య తర్వాత ఏమీ తెలియనట్టు సంగీత తల్లిదండ్రులతో కలిసి తిరిగాడు. చివరికి సాంకేతిక పరిజ్ఞానం మరియు సాక్షుల ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు అరవింద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మరిపెడ పోలీసులు వెల్లడించారు.1
- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేయాలని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ను అన్ని స్థానంలో గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య పాల్గొన్నారు.1
- నగలు అమ్మి భర్త ఈశ్వర్ రెడ్డిని లేపేసేందుకు ప్రియుడితో కుట్ర పన్నిన భార్య శిల్పాతో పాటు కిరాయి హంతకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. కుట్ర, హత్య కేసు ను ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వివరాలను వెల్లడించిన ASP, విభూకృష్ణ...1
- Post by Meenakshi1
- Post by Ramprasad islavath1
- వరంగల్‌లో జరుగుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజున అమ్మవారిని సుగంధ గంధాలతో అలంకరించి ప్రత్యేక శోభను కలిగించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అమ్మవారి గంధాలంకరణను దర్శించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు మరింత వైభవంగా కొనసాగుతున్నాయని, భక్తులు నియమాలను పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని అధికారులు సూచించారు.1
- కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపిస్తూకేవలం 22 నెలల పాలనలోనే అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో అమలు చేస్తున్నామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు పంచాయతీలోని 17వ మరియు 18వ వార్డుల సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వ పాలనలో కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో జాగ్రత్తగా వుండాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. గత ఐదేళ్ల విధ్వంసకర పాలనలో రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయని, ఆ పరిస్థితులను చక్కదిద్దుతూ ప్రతి గ్రామంలో తాగునీరు, సిసి రోడ్లు, డ్రైన్లు మరియు స్మశాన వాటికల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఒక్క కోవూరు పంచాయతీలోనే 2 కోట్ల33 లక్షలతో 56 అంతర్గత సిసి రోడ్లు నిర్మించామని క్లీన్ కోవూరు కార్యక్రమంలో భాగంగా బాపన కాలువ సిల్ట్ క్లియరెన్స్ చేపట్టామని వివరించారు.4