Shuru
Apke Nagar Ki App…
కవిత కొత్త పార్టీ.. *తెలంగాణ రాష్ట్ర సేన*' హైదరాబాద్: తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. *తెలంగాణ రాష్ట్ర సేన* గా నామకరణం చేశారు.ఈ మేరకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ సభలో పార్టీ పేరును కవిత ప్రకటించారు.
Ramprasad islavath
కవిత కొత్త పార్టీ.. *తెలంగాణ రాష్ట్ర సేన*' హైదరాబాద్: తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. *తెలంగాణ రాష్ట్ర సేన* గా నామకరణం చేశారు.ఈ మేరకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ సభలో పార్టీ పేరును కవిత ప్రకటించారు.
More news from తెలంగాణ and nearby areas
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao2
- Post by Gurrala vigeswara ramarao5
- రాయిగూడెంలో జరిగిన ప్రజా దర్బార్ లో ఓ ముస్లిం మహిళ భావోద్వేగానికి లోనైంది. “నా బిడ్డ ప్రాణం కాపాడిన దేవుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం" అని ఆమె కన్నీటి పర్యంతమైంది. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ప్రజల సమస్యలు విని పరిష్కారానికి హామీనిచ్చారు.1
- అనుమానాస్పద స్థితిలో యువతి మృతి కేసును ఛేదించిన మరిపెడ పోలీసులు. నిశ్చితార్థం జరిగిన యువతిని బావిలో తోసి చంపిన కిరాతకుడు. అనుమానమే హత్యకు కారణం, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నిందితుడు అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న యువతి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును పోలీసులు హత్యగా తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి గల కారణాలను మరిపెడ సిఐ పవన్ కుమార్ వెల్లడించారు. మరిపెడ మండల పరిధిలోని ఇటికలగడ్డ తండాకు చెందిన 19 ఏళ్ల బుక్య సంగీత, ఈ నెల 22న గ్రామశివారులోని ఒక బావిలో శవమై కనిపించింది. ఈ నెల 29న ఆమెకు కొత్త తండాకు చెందిన అజ్మీరా అరవింద్‌తో వివాహం జరగాల్సి ఉంది. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే, పెళ్లికి కొన్ని రోజుల ముందే సంగీత విగతజీవిగా పడి ఉండటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కేసును సవాలుగా తీసుకున్న మరిపెడ CI పవన్ కుమార్, యస్సైలు,వీరభద్రం, కోటేశ్వరరావు లు సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను సేకరించారు. పోలీసుల విచారణలో నిందితుడు అరవింద్ తన నేరాన్ని అంగీకరించాడు. సంగీతపై పెంచుకున్న అనవసరమైన అనుమానమే ఈ హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. సంగీత వేరే వారితో చనువుగా ఉండటంతో అరవింద్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 21వ తేదీ సాయంత్రం, ఇంట్లో వారికి అబద్ధం చెప్పి బయటకు వచ్చిన అరవింద్, సంగీతను నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు. మాటల్లో పెట్టి బావి వద్దకు తీసుకెళ్లి, ఆమెను నీళ్లలోకి నెట్టి చంపేశాడు. ఇది ఒక ఆత్మహత్యగా నమ్మించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. హత్య తర్వాత ఏమీ తెలియనట్టు సంగీత తల్లిదండ్రులతో కలిసి తిరిగాడు. చివరికి సాంకేతిక పరిజ్ఞానం మరియు సాక్షుల ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు అరవింద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మరిపెడ పోలీసులు వెల్లడించారు.1
- అమరావతి: అంబేద్కర్ విగ్రహ సెంటర్లో అమరావతి పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఎస్సై శ్రీనివాసరావు శుక్రవారం కారులపై ప్రత్యేక స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. కారు నడిపే సమయంలో సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని హెచ్చరించారు. అతివేగంగా ప్రయాణం చేయరాదని అన్నారు. మద్యం సేవించి కార్లు నడపరాదని తెలిపారు. నిబంధనలను పాటించకుండా కారులు నడిపే వారిపై కేసుల నమోదు చేస్తామన్నారు.1
- క్షణికావేశం.. ఎనిమిది మందిపై హత్యాయత్నం కేసు దాచేపల్లిలో గురువారం రాత్రి జరిగిన ఘర్షణకు సంబంధించి 8 మందిపై హత్యాప్రయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు CI రాజేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యువకులు క్షణికావేశంలో ఒక వ్యక్తిపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సహించేది లేదని, సమస్యలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలని హెచ్చరించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.1
- Post by Ramprasad islavath1