అనుమానాస్పద స్థితిలో యువతి మృతి కేసును చేదించిన మరిపెడ పోలీసులు చేసుకోబోయే భర్తే హంతకుడుగా తేల్చిన పోలీసులు అనుమానాస్పద స్థితిలో యువతి మృతి కేసును ఛేదించిన మరిపెడ పోలీసులు. నిశ్చితార్థం జరిగిన యువతిని బావిలో తోసి చంపిన కిరాతకుడు. అనుమానమే హత్యకు కారణం, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నిందితుడు అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న యువతి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును పోలీసులు హత్యగా తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి గల కారణాలను మరిపెడ సిఐ పవన్ కుమార్ వెల్లడించారు. మరిపెడ మండల పరిధిలోని ఇటికలగడ్డ తండాకు చెందిన 19 ఏళ్ల బుక్య సంగీత, ఈ నెల 22న గ్రామశివారులోని ఒక బావిలో శవమై కనిపించింది. ఈ నెల 29న ఆమెకు కొత్త తండాకు చెందిన అజ్మీరా అరవింద్‌తో వివాహం జరగాల్సి ఉంది. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే, పెళ్లికి కొన్ని రోజుల ముందే సంగీత విగతజీవిగా పడి ఉండటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కేసును సవాలుగా తీసుకున్న మరిపెడ CI పవన్ కుమార్, యస్సైలు,వీరభద్రం, కోటేశ్వరరావు లు సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను సేకరించారు. పోలీసుల విచారణలో నిందితుడు అరవింద్ తన నేరాన్ని అంగీకరించాడు. సంగీతపై పెంచుకున్న అనవసరమైన అనుమానమే ఈ హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. సంగీత వేరే వారితో చనువుగా ఉండటంతో అరవింద్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 21వ తేదీ సాయంత్రం, ఇంట్లో వారికి అబద్ధం చెప్పి బయటకు వచ్చిన అరవింద్, సంగీతను నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు. మాటల్లో పెట్టి బావి వద్దకు తీసుకెళ్లి, ఆమెను నీళ్లలోకి నెట్టి చంపేశాడు. ఇది ఒక ఆత్మహత్యగా నమ్మించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. హత్య తర్వాత ఏమీ తెలియనట్టు సంగీత తల్లిదండ్రులతో కలిసి తిరిగాడు. చివరికి సాంకేతిక పరిజ్ఞానం మరియు సాక్షుల ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు అరవింద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మరిపెడ పోలీసులు వెల్లడించారు.

- వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికి వచ్చినా కొనుగోలు జరగకపోవడంతో ఆందోళనకు గురైన రైతులు తమ సమస్యను బయటపెట్టారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులతో కలిసి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో పంట నిల్వలు పెరిగిపోవడంతో రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.1
- రాష్ట్రంలో ఎండలు మండిపోతుంటే మొక్కజొన్నల్లో తేమ ఉందంటూ క్వింటాలుకు 5 కిలోల చొప్పున తరుగు తీస్తోంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కల్లాలతో పాటు రోడ్లు కూడా నిండిపోయాయి. రేవంత్ రెడ్డి పాలనలో సాగు నీరందక, కరెంట్ కోతల కారణంగా పంటలు ఎండిపోయాయి. యూరియా యాప్ పెట్టడంతో యూరియా కోసం తిరిగి తిరిగి రైతన్నల కాళ్లకు వాపులొచ్చాయి. రైతు పండించిన ప్రతి గింజను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలి.- ఎంపీ వద్దిరాజు రవిచంద్ర1
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao2
- కరీంనగర్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ వినూత్న స్కీంకు శ్రీకారం చుట్టింది. ఆడ బిడ్డలకు బాసటగా నిలిచే కార్యక్రమాన్ని చేపట్టింది. కరీంనగర్ రోహన్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవ కానుకగా దేవి పుత్రిక స్కీమ్ ను ప్రారంభించింది. స్కీమ్ ను జిల్లా అడిషనల్ జడ్జి ఏ.నీరజ, డాక్టర్ బి.ఎన్.రావు ఆవిష్కరించారు. ఈరోజు నుంచి సంవత్సరం వరకు రోహన్ హాస్పిటల్ లో పుట్టిన ఆడబిడ్డకు ఉచిత వైద్యం, డెలివరీకి అయ్యే ఖర్చు ఆసుపత్రి భరిస్తుందని తెలిపారు. ఆడబిడ్డలను కాపాడుకుందామని దేవిపుత్రిక స్కీమ్ ప్రారంభించామని రోహన్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ శ్రీదేవి, నరేష్ తెలిపారు. హాస్పిటల్ బిజినెస్ పెంచుకోవడానికి రాయితీలు ఇస్తారు, కానీ రోహన్ హాస్పిటల్ నిర్వాహకులు సామాజిక బాధ్యతగా ఆడబిడ్డ పుడితే డెలివరీ ఖర్చు భరించేందుకు రోహన్ హాస్పిటల్ ముందుకు రావడం అభినందనీయమన్నారు జడ్జీ నీరజ. ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డాక్టర్ ఎనమల శ్రీదేవి నరేష్ సూచించారు.2
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 25 ఐ3 న్యూస్ *విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక వీడియో. బడి సెలవుల నేపథ్యంలో బయట ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.*...1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం అడిషనల్ కలెక్టర్ సంధ్యా రాణి పరిశీలించారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యంలో తేమ శాతం సరిగా ఉంటే వెంటనే కాంటాలు వేసి తరలించాలని ఆమె అధికారులను ఆదేశించారు. వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు, తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంకటస్వామి, ఏపీఎం రాజీరు, ఏవో ప్రశాంత్ పాల్గొన్నారు.1
- ఖమ్మంలోని వైరా రోడ్డులో ఇద్దరు సెల్ఫోన్ వ్యాపారుల మధ్య తలెత్తిన వివాదం హత్యాయత్నానికి దారితీసింది. పండితాపురానికి చెందిన భూక్యా ఆనంద్, నిజాంపేటకు చెందిన రియాజ్ మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రియాజ్ గురువారం రాత్రి వేటకొడవలితో ఆనంద్ ఇంటికి వెళ్లగా.. ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ తన వాహనంలో ఆసుపత్రికి తరలించారు.2
- Post by Ramprasad islavath1