logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాయపర్తిలో మక్క కొనుగోలు ఆలస్యం – ఎర్రబెల్లి ఆధ్వర్యంలో రాస్తారోకో, రైతుల ఆవేదన వెల్లువ వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికి వచ్చినా కొనుగోలు జరగకపోవడంతో ఆందోళనకు గురైన రైతులు తమ సమస్యను బయటపెట్టారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులతో కలిసి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో పంట నిల్వలు పెరిగిపోవడంతో రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.

2 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
2 hrs ago

రాయపర్తిలో మక్క కొనుగోలు ఆలస్యం – ఎర్రబెల్లి ఆధ్వర్యంలో రాస్తారోకో, రైతుల ఆవేదన వెల్లువ వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికి వచ్చినా కొనుగోలు జరగకపోవడంతో ఆందోళనకు గురైన రైతులు తమ సమస్యను బయటపెట్టారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులతో కలిసి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో పంట నిల్వలు పెరిగిపోవడంతో రైతులు నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్‌లో జరుగుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజున అమ్మవారిని సుగంధ గంధాలతో అలంకరించి ప్రత్యేక శోభను కలిగించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అమ్మవారి గంధాలంకరణను దర్శించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు మరింత వైభవంగా కొనసాగుతున్నాయని, భక్తులు నియమాలను పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని అధికారులు సూచించారు.
    1
    వరంగల్‌లో జరుగుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజున అమ్మవారిని సుగంధ గంధాలతో అలంకరించి ప్రత్యేక శోభను కలిగించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
అమ్మవారి గంధాలంకరణను దర్శించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు మరింత వైభవంగా కొనసాగుతున్నాయని, భక్తులు నియమాలను పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని అధికారులు సూచించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్దిరాల మండలం చిన్ననెమిల వద్ద టాటా ఏస్ వాహనం అదుపు తప్పింది.వేగంగా వెళ్లి చెట్టును వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.మృతుల్లో చిన్ననెమిలకు చెందిన రాధ, జలాలపురానికి చెందిన మరో వ్యక్తి ఉన్నారు.పండగ కోసం హైదరాబాద్ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగింది.ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
    1
    సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
మద్దిరాల మండలం చిన్ననెమిల వద్ద టాటా ఏస్ వాహనం అదుపు తప్పింది.వేగంగా వెళ్లి చెట్టును వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.మృతుల్లో చిన్ననెమిలకు చెందిన రాధ, జలాలపురానికి చెందిన మరో వ్యక్తి ఉన్నారు.పండగ కోసం హైదరాబాద్ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగింది.ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
    user_వెలుగు సైదులు సూర్యాపేట జిల్లా
    వెలుగు సైదులు సూర్యాపేట జిల్లా
    Local News Reporter తుంగతుర్తి, సూర్యాపేట, తెలంగాణ•
    1 hr ago
  • అనుమానాస్పద స్థితిలో యువతి మృతి కేసును ఛేదించిన మరిపెడ పోలీసులు. నిశ్చితార్థం జరిగిన యువతిని బావిలో తోసి చంపిన కిరాతకుడు. ​అనుమానమే హత్యకు కారణం, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నిందితుడు అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న యువతి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును పోలీసులు హత్యగా తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి గల కారణాలను మరిపెడ‌ సిఐ పవన్ కుమార్ వెల్లడించారు. మరిపెడ మండల పరిధిలోని ఇటికలగడ్డ తండాకు చెందిన 19 ఏళ్ల బుక్య సంగీత, ఈ నెల 22న గ్రామశివారులోని ఒక బావిలో శవమై కనిపించింది. ఈ నెల 29న ఆమెకు కొత్త తండాకు చెందిన అజ్మీరా అరవింద్‌తో వివాహం జరగాల్సి ఉంది. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే, పెళ్లికి కొన్ని రోజుల ముందే సంగీత విగతజీవిగా పడి ఉండటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కేసును సవాలుగా తీసుకున్న మరిపెడ CI పవన్ కుమార్, యస్సైలు,వీరభద్రం, కోటేశ్వరరావు లు సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను సేకరించారు. పోలీసుల విచారణలో నిందితుడు అరవింద్ తన నేరాన్ని అంగీకరించాడు. సంగీతపై పెంచుకున్న అనవసరమైన అనుమానమే ఈ హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. సంగీత వేరే వారితో చనువుగా ఉండటంతో అరవింద్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ​పథకం ప్రకారం ఈ నెల 21వ తేదీ సాయంత్రం, ఇంట్లో వారికి అబద్ధం చెప్పి బయటకు వచ్చిన అరవింద్, సంగీతను నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు. మాటల్లో పెట్టి బావి వద్దకు తీసుకెళ్లి, ఆమెను నీళ్లలోకి నెట్టి చంపేశాడు. ​ ఇది ఒక ఆత్మహత్యగా నమ్మించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. హత్య తర్వాత ఏమీ తెలియనట్టు సంగీత తల్లిదండ్రులతో కలిసి తిరిగాడు. ​ చివరికి సాంకేతిక పరిజ్ఞానం మరియు సాక్షుల ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు అరవింద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మరిపెడ పోలీసులు వెల్లడించారు.
    1
    అనుమానాస్పద స్థితిలో యువతి మృతి కేసును ఛేదించిన మరిపెడ పోలీసులు. నిశ్చితార్థం జరిగిన యువతిని బావిలో తోసి చంపిన కిరాతకుడు.
​అనుమానమే హత్యకు కారణం, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నిందితుడు అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న యువతి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును పోలీసులు హత్యగా తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి గల కారణాలను మరిపెడ‌ సిఐ పవన్ కుమార్ వెల్లడించారు. 
మరిపెడ మండల పరిధిలోని ఇటికలగడ్డ తండాకు చెందిన 19 ఏళ్ల బుక్య సంగీత, ఈ నెల 22న గ్రామశివారులోని ఒక బావిలో శవమై కనిపించింది. ఈ నెల 29న ఆమెకు కొత్త తండాకు చెందిన అజ్మీరా అరవింద్‌తో వివాహం జరగాల్సి ఉంది. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే, పెళ్లికి కొన్ని రోజుల ముందే సంగీత విగతజీవిగా పడి ఉండటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
కేసును సవాలుగా తీసుకున్న మరిపెడ CI పవన్ కుమార్, యస్సైలు,వీరభద్రం, కోటేశ్వరరావు లు సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను సేకరించారు. పోలీసుల విచారణలో నిందితుడు అరవింద్ తన నేరాన్ని అంగీకరించాడు. సంగీతపై పెంచుకున్న అనవసరమైన అనుమానమే ఈ హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు.
సంగీత వేరే వారితో చనువుగా ఉండటంతో అరవింద్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు.
​పథకం ప్రకారం ఈ నెల 21వ తేదీ సాయంత్రం, ఇంట్లో వారికి అబద్ధం చెప్పి బయటకు వచ్చిన అరవింద్, సంగీతను నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు.
మాటల్లో పెట్టి బావి వద్దకు తీసుకెళ్లి, ఆమెను నీళ్లలోకి నెట్టి చంపేశాడు.
​ ఇది ఒక ఆత్మహత్యగా నమ్మించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. హత్య తర్వాత ఏమీ తెలియనట్టు సంగీత తల్లిదండ్రులతో కలిసి తిరిగాడు.
​
చివరికి సాంకేతిక పరిజ్ఞానం మరియు సాక్షుల ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు అరవింద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మరిపెడ పోలీసులు వెల్లడించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్, తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల గోస పై ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు జరగక రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి ధాన్యం కొనుగోలు కాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ధాన్యం ఎండి కుప్ప పోసి 15 రోజులవుతున్న కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరికాయ కొట్టారు, కానీ కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదనతో తెలిపారు. మహిళా రైతు మాత్రం ప్రభుత్వం కొనకుంటే మీరు కొనండి సూచించారు. రెండేళ్లు ఓపిక పట్టండి మళ్లీ కెసిఆర్ వస్తాడు అప్పుడు మేమే కొంటామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గొప్పలు చెబుతుంది తప్ప రైతుల గౌసను అర్థం చేసుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొనుగోళ్ళు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించిన పంట దళారుల పాలు కాకుండా మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. రైస్ మిల్ అలాట్మెంట్ చేసి సోమవారం లోగా ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతుల పక్షాన బిఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతు సోదరులు ధైర్యంగా ఉండండి... రెండేళ్లయితే కేసీఆర్ మళ్ళీ వస్తాడని కేటీఆర్ తెలిపారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్, 
తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల గోస పై ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు జరగక రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి ధాన్యం కొనుగోలు కాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ధాన్యం ఎండి కుప్ప పోసి 15 రోజులవుతున్న కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరికాయ కొట్టారు, కానీ కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదనతో తెలిపారు. మహిళా రైతు మాత్రం ప్రభుత్వం కొనకుంటే మీరు కొనండి సూచించారు. రెండేళ్లు ఓపిక పట్టండి మళ్లీ కెసిఆర్ వస్తాడు అప్పుడు మేమే కొంటామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గొప్పలు చెబుతుంది తప్ప రైతుల గౌసను అర్థం చేసుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొనుగోళ్ళు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించిన పంట దళారుల పాలు కాకుండా మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. రైస్ మిల్ అలాట్మెంట్ చేసి సోమవారం లోగా ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతుల పక్షాన బిఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతు సోదరులు ధైర్యంగా ఉండండి... రెండేళ్లయితే కేసీఆర్ మళ్ళీ వస్తాడని  కేటీఆర్ తెలిపారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 10000 పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను విడుదల చేయాలని కలెక్టరేట్ మెయిన్ గేట్ ముందు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ పేద,బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతవిద్యను ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో తీసుకొచ్చిన "ఫీజు రీయింబర్స్మెంట్" పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని,దీనిని ABVP తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ABVP జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు గౌరవ హైకోర్టును ఆశ్రఉంచినప్పుడు,ప్రభుత్వం ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని గౌరవ హైకోర్టు పదే పదే కోరినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయని కారణంగానే "విద్యార్థుల దగ్గరనుండే ఫీజులు వసూలు చేసుకోవచ్చని గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని,ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టిందని, ఇది రీయింబర్స్ మెంట్ పథకాన్ని బొంద పెట్టడంలో భాగమే అని అన్నారు.ఈ స్కీమ్ ద్వారా లక్షల మంది పేద వర్గాల పిల్లలు ఇంజనీరింగ్,మెడిసిన్,ఫార్మసీ, లా లాంటి కోర్సులు పూర్తిచేసి దేశ విదేశాల్లో స్థిరపడి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇస్తున్నారన్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అయ్యే పరిస్థితి దాపురించిందన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడి యేటా 14 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని,కోర్సుల్లో ప్రవేశం పొందేటప్పుడే ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందన్న హామీ మేరకే విద్యార్థులు అడ్మిషన్ పొందుతారని,హామీ మేరకు ప్రవేశం పొందాక ఫీజు చెల్లించకుండా, 10000 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థులను నయవంచనకు గురిచేస్తుందన్నారు.విద్య పై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి రాష్ట్ర,దేశ అభివృద్ధికి ఉపయోగపడే మానవవనరుల సృష్టి కోసమేనని, ఇది ఏ మాత్రం ఉచిత పథకం కాదని,ఈ విషయాన్ని ప్రభుత్వం,సమాజం అర్థం చేసుకోవాలన్నారు.ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పేద విద్యార్థులకు విద్యాప్రదాయినిగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని BRS ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని,ఈ పథకాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని,మేము అధికారంలోకి వస్తే బకాయిలు చెల్లించడమే కాకుండా ఇంకా గొప్పగా అమలుచేస్తామని హామీ ఇచ్చారని,తీర అధికారం లోకి వచ్చాక స్వయంగా తానే విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేతకు కుట్రలు చేస్తున్నారన్నారు.నా దగ్గర పంచడానికి భూములు లేవు,కానీ జీవితాన్ని నిలబెట్టే విద్యను మాత్రం అందిస్తానని పదే పదే వల్లే వేసే రేవంత్ రెడ్డి గారు ఎందుకు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు.తల్లిదండ్రులు, విద్యార్థులు,సమాజం అంతా కూడా ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై స్పందించాలని,ABVP ఆధ్వర్యంలో ఈ విద్యావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వంపై చేయబోయే ఉద్యమంలో మాతో పాటు కలిసి రావాలని పిలునిచ్చారు.విద్యార్థులతో గెలుక్కున్న ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలువలేదని,నీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయని,నీ ప్రభుత్వ మెడలు వంచైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తుందో దానికి వ్యతిరేకంగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ SFD CO -CONVER గోస్కుల అజయ్. స్టేట్ హాస్టల్స్ CO - CONVER భామండ్ల నందు. నగర కార్యదర్శి యోగేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మురళి జిల్లా SFD CONVER శ్రీపతి వంశీ,జిల్లా SFS CONVER నాగరాజు , జిల్లా హాస్టల్ కన్వీనర్ విగ్నేష్ , జిల్లా కేల్ కన్వీనర్ విష్ణు, నితీష్, శ్రీ వర్ధన్, ఆకాష్, శివ, మనోజ్ ,అనూష తదితరులు పాల్గొన్నారు
    3
    అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా  శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 10000 పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను విడుదల చేయాలని కలెక్టరేట్  మెయిన్ గేట్ ముందు నిరాహార దీక్ష చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ పేద,బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతవిద్యను ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో తీసుకొచ్చిన "ఫీజు రీయింబర్స్మెంట్" పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని,దీనిని ABVP తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ABVP జిల్లా  కన్వీనర్ పూసాల విష్ణు   అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు గౌరవ హైకోర్టును ఆశ్రఉంచినప్పుడు,ప్రభుత్వం ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని గౌరవ హైకోర్టు పదే పదే కోరినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయని కారణంగానే "విద్యార్థుల దగ్గరనుండే ఫీజులు వసూలు చేసుకోవచ్చని గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని,ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టిందని, ఇది రీయింబర్స్ మెంట్ పథకాన్ని బొంద పెట్టడంలో భాగమే అని అన్నారు.ఈ స్కీమ్ ద్వారా లక్షల మంది పేద వర్గాల పిల్లలు ఇంజనీరింగ్,మెడిసిన్,ఫార్మసీ, లా లాంటి కోర్సులు పూర్తిచేసి దేశ విదేశాల్లో స్థిరపడి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇస్తున్నారన్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అయ్యే పరిస్థితి దాపురించిందన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడి యేటా 14 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని,కోర్సుల్లో ప్రవేశం పొందేటప్పుడే ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందన్న హామీ మేరకే విద్యార్థులు అడ్మిషన్ పొందుతారని,హామీ మేరకు ప్రవేశం పొందాక ఫీజు చెల్లించకుండా, 10000 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థులను నయవంచనకు గురిచేస్తుందన్నారు.విద్య పై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి రాష్ట్ర,దేశ అభివృద్ధికి ఉపయోగపడే మానవవనరుల సృష్టి కోసమేనని, ఇది ఏ మాత్రం ఉచిత పథకం కాదని,ఈ విషయాన్ని ప్రభుత్వం,సమాజం అర్థం చేసుకోవాలన్నారు.ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పేద విద్యార్థులకు విద్యాప్రదాయినిగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని BRS ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని,ఈ పథకాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని,మేము అధికారంలోకి వస్తే బకాయిలు చెల్లించడమే కాకుండా ఇంకా గొప్పగా అమలుచేస్తామని హామీ ఇచ్చారని,తీర అధికారం లోకి వచ్చాక స్వయంగా తానే విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేతకు కుట్రలు చేస్తున్నారన్నారు.నా దగ్గర పంచడానికి భూములు లేవు,కానీ జీవితాన్ని నిలబెట్టే విద్యను మాత్రం అందిస్తానని పదే పదే వల్లే వేసే రేవంత్ రెడ్డి గారు ఎందుకు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు.తల్లిదండ్రులు, విద్యార్థులు,సమాజం అంతా కూడా ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై స్పందించాలని,ABVP ఆధ్వర్యంలో ఈ విద్యావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వంపై చేయబోయే ఉద్యమంలో మాతో పాటు కలిసి రావాలని పిలునిచ్చారు.విద్యార్థులతో గెలుక్కున్న ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలువలేదని,నీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయని,నీ ప్రభుత్వ మెడలు వంచైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకుంటామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తుందో దానికి వ్యతిరేకంగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో స్టేట్ SFD CO -CONVER గోస్కుల అజయ్. స్టేట్ హాస్టల్స్  CO - CONVER భామండ్ల నందు. నగర కార్యదర్శి యోగేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మురళి జిల్లా SFD CONVER శ్రీపతి వంశీ,జిల్లా SFS CONVER నాగరాజు , జిల్లా హాస్టల్ కన్వీనర్ విగ్నేష్ , జిల్లా కేల్ కన్వీనర్ విష్ణు, నితీష్, శ్రీ వర్ధన్, ఆకాష్, శివ, మనోజ్ ,అనూష తదితరులు పాల్గొన్నారు
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    2 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 25 ఐ3 న్యూస్ *విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక వీడియో. బడి సెలవుల నేపథ్యంలో బయట ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.*...
    1
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 25 ఐ3 న్యూస్ 
*విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక వీడియో. బడి సెలవుల నేపథ్యంలో బయట ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.*...
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    9 hrs ago
  • గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలోభారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న 'జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం' జరుపుకుంటారు. 1993 ఏప్రిల్ 24న రాజ్యాంగంలోని 73వ సవరణ చట్టం అమలులోకి వచ్చిన జ్ఞాపకార్థం, గ్రామీణ స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేయడానికి మరియు ప్రజాస్వామ్య వికేంద్రీకరణను ప్రోత్సహించడానికి ఈ రోజును జరుపుకుంటారు. 2010లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు, అధికారాలను కల్పించడం ద్వారా గ్రామీణ అభివృద్ధే లక్ష్యంగా ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది, అని ఆయన తెలిపారు. 73వ సవరణ ఈ చట్టం గ్రామం, బ్లాక్ మరియు జిల్లా స్థాయిలో మూడు అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను తీసుకువచ్చింది. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించడం మరియు స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకోవడం. గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్య వికేంద్రీకరణ సాధ్యమవుతుందని ఈ దినోత్సవం గుర్తుచేస్తుంది. అని సర్పంచ్ తెలిపారు... ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కళ్లెం అనిత, వార్డు సభ్యులు భూపెల్లి రమేష్, సంపతి మల్లీశ్వరి, కత్తి శ్రీనివాస్ మాడుగుల కరుణాకర్ రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు..
    1
    గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలోభారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న 'జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం' జరుపుకుంటారు. 1993 ఏప్రిల్ 24న రాజ్యాంగంలోని 73వ సవరణ చట్టం అమలులోకి వచ్చిన జ్ఞాపకార్థం, గ్రామీణ స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేయడానికి మరియు ప్రజాస్వామ్య వికేంద్రీకరణను ప్రోత్సహించడానికి ఈ రోజును జరుపుకుంటారు. 
2010లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని ప్రకటించారు.
గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు, అధికారాలను కల్పించడం ద్వారా గ్రామీణ అభివృద్ధే లక్ష్యంగా ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది, అని ఆయన తెలిపారు. 
73వ సవరణ ఈ చట్టం గ్రామం, బ్లాక్ మరియు జిల్లా స్థాయిలో మూడు అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను తీసుకువచ్చింది.
గ్రామాలు స్వయం సమృద్ధి సాధించడం మరియు స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకోవడం. 
గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్య వికేంద్రీకరణ సాధ్యమవుతుందని ఈ దినోత్సవం గుర్తుచేస్తుంది. అని సర్పంచ్ తెలిపారు...
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కళ్లెం అనిత, వార్డు సభ్యులు భూపెల్లి రమేష్, సంపతి మల్లీశ్వరి, కత్తి శ్రీనివాస్ మాడుగుల కరుణాకర్ రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు..
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    23 hrs ago
  • వరంగల్ జిల్లా:ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో స్థానిక పీహెచ్సీ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ్ చంద్ర, యాదయ్య, రాజు, స్వర్ణ కుమారి, మచ్చస్ రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
    1
    వరంగల్ జిల్లా:ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో స్థానిక పీహెచ్సీ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ్ చంద్ర, యాదయ్య, రాజు, స్వర్ణ కుమారి, మచ్చస్ రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.