Shuru
Apke Nagar Ki App…
పర్వతగిరిలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశం వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం అడిషనల్ కలెక్టర్ సంధ్యా రాణి పరిశీలించారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యంలో తేమ శాతం సరిగా ఉంటే వెంటనే కాంటాలు వేసి తరలించాలని ఆమె అధికారులను ఆదేశించారు. వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు, తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంకటస్వామి, ఏపీఎం రాజీరు, ఏవో ప్రశాంత్ పాల్గొన్నారు.
M D Azizuddin
పర్వతగిరిలో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశం వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం అడిషనల్ కలెక్టర్ సంధ్యా రాణి పరిశీలించారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యంలో తేమ శాతం సరిగా ఉంటే వెంటనే కాంటాలు వేసి తరలించాలని ఆమె అధికారులను ఆదేశించారు. వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున కొనుగోలు, తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ వెంకటస్వామి, ఏపీఎం రాజీరు, ఏవో ప్రశాంత్ పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేయాలని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ను అన్ని స్థానంలో గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండేటి మల్లయ్య పాల్గొన్నారు.1
- కరీంనగర్ లో త్రీ టౌన్ ఎస్ఐ వీరంగం సృష్టించాడు. సెల్యూట్ షాప్ నిర్వాకుడుని దూషిస్తూ దాడి చేశాడు. ఖాన్ పురాలోని సేవింగ్ చేయించుకోవడానికి త్రీటౌన్ ఎస్‌ఐ చందర్ వెళ్ళారు. రాము, సేవింగ్ చేయాలని ఎస్ఐ కోరగా ‘అన్నా’ కూర్చొ అని షాప్ నిర్వాకుడు రాము అన్నాడు. అన్నా ఏందిరా బే అంటూ ఎస్ఐ బూతులు తిడుతూ దాడి చేశాడు. విచక్షణారహితంగా సెల్యూన్ షాప్ నిర్వాకుడు రాముపై చేయి చేసుకున్నాడు. ఎస్ఐ ని అన్నా అన్నందుకే దాడి చేయడం సర్వతా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ అమానుష దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సిసి పటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షాపు నిర్వాకుడు పై విచక్షణ రహితంగా ప్రవర్తించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐ పై శాఖ పరమైన చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.2
- *ఐదింటికి 5 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ* *నిలువునా చీలిన బీఆర్ఎస్* *4రు BRS కార్పొరేటర్లు బీజేపీ అభ్యర్థులకు జై కొట్టిన వైనం* *మొత్తం 38 మంది బీజేపీ అభ్యర్థులకు మద్దతు* *బీజేపీ కో అప్షన్ సభ్యల గెలుపు పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ హర్షం* *కాషాయ జెండా మోసిన కార్యకర్తలకే పదవుల పట్టం* *ఆచితూచి ఎంపిక చేయాలనే బండి ఆదేశాలను పక్కాగా అమలు చేసిన అభ్యర్థులు ఎంపిక కమిటీ సభ్యులు* *అభ్యర్థుల ఎంపిక పై సంతోషం వ్యక్తం చేసిన బీజేపి కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు* *పోటీకి కాంగ్రెస్ దూరం* ఓటింగ్ లో డీలపడ్డ బీఆర్ఎస్ చెమట ఒడ్చిన కార్యకర్తలకే పట్టం కట్టడంపై బీజెపీ లో సంబురాలు* *అభ్యర్థుల ఎంపికపై ఆశ్చర్యాన్ని గురైన ఇతర పార్టీలు* *మైనార్టీ విభాగంలో.. పార్టీని నమ్ముకుని పని చేసిన ముజీబ్ తల్లికి ప్రధాన్యం* *గత రెండు దశాబ్దాలుగా సామాన్య కార్యకర్తగా బిజెపిలో ఉన్న ముజీబ్..* ముజీబ్లాంటి కార్యకర్తకు కో ఆప్షన్ ఇవ్వడం గొప్ప నిర్ణయం అంటున్న బిజెపి శ్రేణులు మైనార్టీ విభాగంలో మరో సీటులో బల్బీర్ సింగ్ కి అవకాశం. పట్టణంలో సిక్కుల ప్రాధాన్యత దృష్ట్యా.. సామాన్య కార్యకర్తకు కోఆప్షన్ సభ్యుడిగా అవకాశం. కీలక పదవి తనకు ఇవ్వడం పై అవాక్కైనా బల్వీర్ సింగ్. పార్టీని నమ్ముకుని ప్రజల్లో తిరుగుతున్న బల్వీర్ సింగ్ కి పదవి ఇవ్వడం పట్ల సంతోషంలో ఉన్న సిక్కులు. అత్యంత సామాన్య కార్యకర్త నిరుపేద అయిన నందన్ కుమార్ కు మరో కో ఆప్షన్ పదవి. బొమ్మకల్ ప్రాంతానికి చెందిన నందన్ కుమార్ అత్యంత సామాన్య కార్యకర్త కనీసం ఉండడానికి సరైన ఇల్లు లేదు. నందకుమార్ ఎంపికపై నిర్గాంత పోయిన ఇతర పార్టీలు ప్రజలు.. ఈ ఎంపికతో బిజెపి కార్యకర్తలకు ఎంతటి ప్రాదాన్యతని ఇస్తుందని అర్థమవుతుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న ప్రజలు. పార్టీ జెండా మోస్తూ.. బిజెపి నీ ప్రాణంగా భావిస్తున్న నంద కుమార్ కు కీలక పదవి ఇవ్వడంపై శ్రేణుల్లోనూ సంబరాలు. ఎస్సీ మహిళా విభాగంలో చిగురు రవి తల్లి చిగురు వెంకటమ్మకు అవకాశం ఇచ్చిన బిజెపిమాజీ కార్పొరేటర్ గా ప్రజలకు మంచి పని చేసిన సామన్యురాలికి మరోసారి కార్పొరేషన్ లో అడుగుపెట్టే అవకాశం ఇచ్చిన బిజెపి.వైశ్య కులానికి చెందిన కన్నె కృష్ణకు అవకాశం ఇచ్చిన బిజెపి. పట్టణంలో మంచిపట్టున్న కన్నె కృష్ణకు పదవి రావడం పట్ల ఆర్యవైశ్యుల్లో ఆనందం. పదవిలో పంపిణీలో సామాజిక సమీకరణాలు పాటించిన బండి సంజయ్ఓటింగ్ కు హాజరై భంగపడ్డ BRSఎలాగూ గెలవమని ఓటింగ్ కు హాజరు కాకుండా పరువు నిలబెట్టుకున్న కాంగ్రెస్ సామాన్యులకు అవకాశం ఇవ్వడం పట్ల లోలోపల ప్రశంసలు3
- రాయిగూడెంలో జరిగిన ప్రజా దర్బార్ లో ఓ ముస్లిం మహిళ భావోద్వేగానికి లోనైంది. “నా బిడ్డ ప్రాణం కాపాడిన దేవుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం" అని ఆమె కన్నీటి పర్యంతమైంది. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ప్రజల సమస్యలు విని పరిష్కారానికి హామీనిచ్చారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామంలో శ్రీ వరలక్ష్మి రైస్ మిల్‌లో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించింది. మిల్లులో అగ్నికీలలు ఎగిసిపడటం తో రైస్ మిల్లులో నిల్వ ఉంచిన వడ్ల బారదాన్ (గోనె సంచులు) కొంత మేర కాలి బూడిదైపోయాయి. సమాచారం అందుకున్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఫైరింజన్ సహాయం తో మంటలను అదుపులోకి తీసువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని బాధితులు మరియు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎంత మేర నష్టం వాటిల్లిందన్న సమాచారం తెలియాల్సి ఉంది.1
- నర్సాపూర్ పట్టణంలోని పురపాలికలోగల 15 వార్డులలో అభివృద్ధికై మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ ప్రతిమా సింగ్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సుహాసిని, పుర ఛైర్ పర్సన్ లక్ష్మీరాజు యాదవ్తో కలిసి రూ.15 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. పురపాలిక అభివృద్ధిని కాంక్షిస్తూ నిధులు మంజూరు చేయడం పట్ల కౌన్సిలర్లు, నాయకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు1
- జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలోని ముర్సుగడ్డ తండా రోడ్డుపై ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో కాసోజు సంగీత్ (15) అనే మైనర్ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ బానెట్‌పై కూర్చున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రాక్టర్ బోల్తా పడినట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.1
- కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బిజెపి మరో విజయాన్ని కైవసం చేసుకుంది. ఐదు కోఆప్షన్ పదవులను ఏకపక్షంగా బిజేపి దక్కించుకుంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో 66 డివిజన్లు ఉండగా ఐదు కోఆప్షన్ పదవులకు శనివారం ఎన్నిక నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో బిజెపికి చెందిన ఐదుగురిని కో ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేశారు. బండి సంజయ్ సూచించిన కన్న కృష్ణ, నందకుమార్, బల్బీర్ సింగ్, ఆఫీసాబేగం, వెంకటమ్మను ఏకగ్రీవంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఎన్నుకున్నారు. కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన ఐదుగురిని కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు బిజెపికి చెందిన ఐదుగురు సభ్యుల పేర్లను ప్రతిపాదించారు. పోటీకి కాంగ్రెస్ దూరంగా ఉండగా బిఆర్ఎస్ రెండుగా చీలిపోయింది. సమావేశానికి హాజరై బిఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు పోటీలో పాల్గొనకుండా సైలెంట్ ఉండిపోయారు. 5 కోఆప్షన్ సభ్యుల పదవులకు 46 మంది దరఖాస్తు చేసుకోగా మెజార్టీ ఉన్న బిజెపి ఐదుగురిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపిక చేసి ఏకగ్రీవంగా అయ్యేలా చూడడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. మేయర్ డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్లు మున్సిపల్ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచి డప్పు నృత్యాలు చేశారు.3
- ది కరీంనగర్ జిల్లా సహాకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో.. కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని 17 వ డివిజన్ రాణిపురం లో స్థానిక నాయకులతో కలసి వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.1