logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*కరీంనగర్ కార్పొరేషన్ లో కో ఆప్షన్ ఎన్నికల్లో చక్రం తిప్పిన బండి సంజయ్* *ఐదింటికి 5 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ* *నిలువునా చీలిన బీఆర్ఎస్* *4రు BRS కార్పొరేటర్లు బీజేపీ అభ్యర్థులకు జై కొట్టిన వైనం* *మొత్తం 38 మంది బీజేపీ అభ్యర్థులకు మద్దతు* *బీజేపీ కో అప్షన్ సభ్యల గెలుపు పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ హర్షం* *కాషాయ జెండా మోసిన కార్యకర్తలకే పదవుల పట్టం* *ఆచితూచి ఎంపిక చేయాలనే బండి ఆదేశాలను పక్కాగా అమలు చేసిన అభ్యర్థులు ఎంపిక కమిటీ సభ్యులు* *అభ్యర్థుల ఎంపిక పై సంతోషం వ్యక్తం చేసిన బీజేపి కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు* *పోటీకి కాంగ్రెస్ దూరం* ఓటింగ్ లో డీలపడ్డ బీఆర్ఎస్ చెమట ఒడ్చిన కార్యకర్తలకే పట్టం కట్టడంపై బీజెపీ లో సంబురాలు* *అభ్యర్థుల ఎంపికపై ఆశ్చర్యాన్ని గురైన ఇతర పార్టీలు* *మైనార్టీ విభాగంలో.. పార్టీని నమ్ముకుని పని చేసిన ముజీబ్ తల్లికి ప్రధాన్యం* *గత రెండు దశాబ్దాలుగా సామాన్య కార్యకర్తగా బిజెపిలో ఉన్న ముజీబ్..* ముజీబ్లాంటి కార్యకర్తకు కో ఆప్షన్ ఇవ్వడం గొప్ప నిర్ణయం అంటున్న బిజెపి శ్రేణులు మైనార్టీ విభాగంలో మరో సీటులో బల్బీర్ సింగ్ కి అవకాశం. పట్టణంలో సిక్కుల ప్రాధాన్యత దృష్ట్యా.. సామాన్య కార్యకర్తకు కోఆప్షన్ సభ్యుడిగా అవకాశం. కీలక పదవి తనకు ఇవ్వడం పై అవాక్కైనా బల్వీర్ సింగ్. పార్టీని నమ్ముకుని ప్రజల్లో తిరుగుతున్న బల్వీర్ సింగ్ కి పదవి ఇవ్వడం పట్ల సంతోషంలో ఉన్న సిక్కులు. అత్యంత సామాన్య కార్యకర్త నిరుపేద అయిన నందన్ కుమార్ కు మరో కో ఆప్షన్ పదవి. బొమ్మకల్ ప్రాంతానికి చెందిన నందన్ కుమార్ అత్యంత సామాన్య కార్యకర్త కనీసం ఉండడానికి సరైన ఇల్లు లేదు. నందకుమార్ ఎంపికపై నిర్గాంత పోయిన ఇతర పార్టీలు ప్రజలు.. ఈ ఎంపికతో బిజెపి కార్యకర్తలకు ఎంతటి ప్రాదాన్యతని ఇస్తుందని అర్థమవుతుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న ప్రజలు. పార్టీ జెండా మోస్తూ.. బిజెపి నీ ప్రాణంగా భావిస్తున్న నంద కుమార్ కు కీలక పదవి ఇవ్వడంపై శ్రేణుల్లోనూ సంబరాలు. ఎస్సీ మహిళా విభాగంలో చిగురు రవి తల్లి చిగురు వెంకటమ్మకు అవకాశం ఇచ్చిన బిజెపిమాజీ కార్పొరేటర్ గా ప్రజలకు మంచి పని చేసిన సామన్యురాలికి మరోసారి కార్పొరేషన్ లో అడుగుపెట్టే అవకాశం ఇచ్చిన బిజెపి.వైశ్య కులానికి చెందిన కన్నె కృష్ణకు అవకాశం ఇచ్చిన బిజెపి. పట్టణంలో మంచిపట్టున్న కన్నె కృష్ణకు పదవి రావడం పట్ల ఆర్యవైశ్యుల్లో ఆనందం. పదవిలో పంపిణీలో సామాజిక సమీకరణాలు పాటించిన బండి సంజయ్ఓటింగ్ కు హాజరై భంగపడ్డ BRSఎలాగూ గెలవమని ఓటింగ్ కు హాజరు కాకుండా పరువు నిలబెట్టుకున్న కాంగ్రెస్ సామాన్యులకు అవకాశం ఇవ్వడం పట్ల లోలోపల ప్రశంసలు

5 hrs ago
user_OM NAMSHIVAYA
OM NAMSHIVAYA
Karimnagar, Telangana•
5 hrs ago

*కరీంనగర్ కార్పొరేషన్ లో కో ఆప్షన్ ఎన్నికల్లో చక్రం తిప్పిన బండి సంజయ్* *ఐదింటికి 5 స్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ* *నిలువునా చీలిన బీఆర్ఎస్* *4రు BRS కార్పొరేటర్లు బీజేపీ అభ్యర్థులకు జై కొట్టిన వైనం* *మొత్తం 38 మంది బీజేపీ అభ్యర్థులకు మద్దతు* *బీజేపీ కో అప్షన్ సభ్యల గెలుపు పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ హర్షం* *కాషాయ జెండా మోసిన కార్యకర్తలకే పదవుల పట్టం* *ఆచితూచి ఎంపిక చేయాలనే బండి ఆదేశాలను పక్కాగా అమలు చేసిన అభ్యర్థులు ఎంపిక కమిటీ సభ్యులు* *అభ్యర్థుల ఎంపిక పై సంతోషం వ్యక్తం చేసిన బీజేపి కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు* *పోటీకి కాంగ్రెస్ దూరం* ఓటింగ్ లో డీలపడ్డ బీఆర్ఎస్ చెమట ఒడ్చిన కార్యకర్తలకే పట్టం కట్టడంపై బీజెపీ లో సంబురాలు* *అభ్యర్థుల ఎంపికపై ఆశ్చర్యాన్ని గురైన ఇతర పార్టీలు* *మైనార్టీ విభాగంలో.. పార్టీని నమ్ముకుని పని

చేసిన ముజీబ్ తల్లికి ప్రధాన్యం* *గత రెండు దశాబ్దాలుగా సామాన్య కార్యకర్తగా బిజెపిలో ఉన్న ముజీబ్..* ముజీబ్లాంటి కార్యకర్తకు కో ఆప్షన్ ఇవ్వడం గొప్ప నిర్ణయం అంటున్న బిజెపి శ్రేణులు మైనార్టీ విభాగంలో మరో సీటులో బల్బీర్ సింగ్ కి అవకాశం. పట్టణంలో సిక్కుల ప్రాధాన్యత దృష్ట్యా.. సామాన్య కార్యకర్తకు కోఆప్షన్ సభ్యుడిగా అవకాశం. కీలక పదవి తనకు ఇవ్వడం పై అవాక్కైనా బల్వీర్ సింగ్. పార్టీని నమ్ముకుని ప్రజల్లో తిరుగుతున్న బల్వీర్ సింగ్ కి పదవి ఇవ్వడం పట్ల సంతోషంలో ఉన్న సిక్కులు. అత్యంత సామాన్య కార్యకర్త నిరుపేద అయిన నందన్ కుమార్ కు మరో కో ఆప్షన్ పదవి. బొమ్మకల్ ప్రాంతానికి చెందిన నందన్ కుమార్ అత్యంత సామాన్య కార్యకర్త కనీసం ఉండడానికి సరైన ఇల్లు లేదు. నందకుమార్ ఎంపికపై నిర్గాంత పోయిన ఇతర పార్టీలు ప్రజలు.. ఈ ఎంపికతో బిజెపి

కార్యకర్తలకు ఎంతటి ప్రాదాన్యతని ఇస్తుందని అర్థమవుతుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న ప్రజలు. పార్టీ జెండా మోస్తూ.. బిజెపి నీ ప్రాణంగా భావిస్తున్న నంద కుమార్ కు కీలక పదవి ఇవ్వడంపై శ్రేణుల్లోనూ సంబరాలు. ఎస్సీ మహిళా విభాగంలో చిగురు రవి తల్లి చిగురు వెంకటమ్మకు అవకాశం ఇచ్చిన బిజెపిమాజీ కార్పొరేటర్ గా ప్రజలకు మంచి పని చేసిన సామన్యురాలికి మరోసారి కార్పొరేషన్ లో అడుగుపెట్టే అవకాశం ఇచ్చిన బిజెపి.వైశ్య కులానికి చెందిన కన్నె కృష్ణకు అవకాశం ఇచ్చిన బిజెపి. పట్టణంలో మంచిపట్టున్న కన్నె కృష్ణకు పదవి రావడం పట్ల ఆర్యవైశ్యుల్లో ఆనందం. పదవిలో పంపిణీలో సామాజిక సమీకరణాలు పాటించిన బండి సంజయ్ఓటింగ్ కు హాజరై భంగపడ్డ BRSఎలాగూ గెలవమని ఓటింగ్ కు హాజరు కాకుండా పరువు నిలబెట్టుకున్న కాంగ్రెస్ సామాన్యులకు అవకాశం ఇవ్వడం పట్ల లోలోపల ప్రశంసలు

More news from తెలంగాణ and nearby areas
  • కరీంనగర్ లో త్రీ టౌన్ ఎస్ఐ వీరంగం సృష్టించాడు. సెల్యూట్ షాప్ నిర్వాకుడుని దూషిస్తూ దాడి చేశాడు.‌ ఖాన్ పురాలోని సేవింగ్ చేయించుకోవడానికి త్రీటౌన్ ఎస్‌ఐ చందర్ వెళ్ళారు. రాము, సేవింగ్ చేయాలని ఎస్ఐ కోరగా ‘అన్నా’ కూర్చొ అని షాప్ నిర్వాకుడు రాము అన్నాడు. అన్నా ఏందిరా బే అంటూ ఎస్ఐ బూతులు తిడుతూ దాడి చేశాడు. విచక్షణారహితంగా సెల్యూన్ షాప్ నిర్వాకుడు రాముపై చేయి చేసుకున్నాడు. ఎస్ఐ ని అన్నా అన్నందుకే దాడి చేయడం సర్వతా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ అమానుష దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సిసి పటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షాపు నిర్వాకుడు పై విచక్షణ రహితంగా ప్రవర్తించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐ పై శాఖ పరమైన చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.
    2
    కరీంనగర్ లో త్రీ టౌన్ ఎస్ఐ వీరంగం సృష్టించాడు. సెల్యూట్ షాప్ నిర్వాకుడుని దూషిస్తూ దాడి చేశాడు.‌ ఖాన్ పురాలోని సేవింగ్ చేయించుకోవడానికి త్రీటౌన్ ఎస్‌ఐ చందర్ వెళ్ళారు. రాము, సేవింగ్ చేయాలని ఎస్ఐ కోరగా ‘అన్నా’ కూర్చొ అని షాప్ నిర్వాకుడు రాము అన్నాడు. అన్నా ఏందిరా బే అంటూ ఎస్ఐ బూతులు తిడుతూ దాడి చేశాడు.  విచక్షణారహితంగా సెల్యూన్ షాప్ నిర్వాకుడు రాముపై చేయి చేసుకున్నాడు. ఎస్ఐ ని అన్నా అన్నందుకే దాడి చేయడం సర్వతా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ అమానుష దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సిసి పటేజ్  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షాపు నిర్వాకుడు పై విచక్షణ రహితంగా ప్రవర్తించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  ఎస్ఐ పై శాఖ పరమైన చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామంలో శ్రీ వరలక్ష్మి రైస్ మిల్‌లో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించింది. మిల్లులో అగ్నికీలలు ఎగిసిపడటం తో రైస్ మిల్లులో నిల్వ ఉంచిన వడ్ల బారదాన్ (గోనె సంచులు) కొంత మేర కాలి బూడిదైపోయాయి. సమాచారం అందుకున్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఫైరింజన్ సహాయం తో మంటలను అదుపులోకి తీసువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని బాధితులు మరియు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎంత మేర నష్టం వాటిల్లిందన్న సమాచారం తెలియాల్సి ఉంది.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామంలో శ్రీ వరలక్ష్మి రైస్ మిల్‌లో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించింది. మిల్లులో అగ్నికీలలు ఎగిసిపడటం తో  రైస్ మిల్లులో నిల్వ ఉంచిన వడ్ల బారదాన్ (గోనె సంచులు) కొంత మేర కాలి బూడిదైపోయాయి. 
సమాచారం అందుకున్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఫైరింజన్ సహాయం తో మంటలను అదుపులోకి తీసువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని బాధితులు మరియు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎంత మేర నష్టం వాటిల్లిందన్న సమాచారం తెలియాల్సి ఉంది.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    14 hrs ago
  • కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన ( TRS) , మొత్తాన్ని TRS పేరు, తెలంగాణ పేరు ఎటూ పోకుండా చూసుకున్నారు. పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత.. 1. విద్య: ప్రైవేట్‌ స్కూళ్లలో కూడా ఫ్రీగా విద్య అందిస్తాం.. 2. వైద్యం: ఏ రోగమైనా రానీ, ఏ ఆస్పత్రైనా సరే ఉచితంగా అందిస్తాం.. 3. వ్యవసాయం: రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తాం.. 4. ఉపాధి: రూ.2 లక్షల-రూ.20 కోట్ల వరకు యువతకు రుణాలు.. మొదటి ఏడాదిలోనే సింగిల్‌ నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు.. ఉద్యమకారులకు లక్ష సూపర్‌ న్యూమరీ ఉద్యోగాలు ఇస్తాం.. 5. సామాజిక న్యాయం ..
    1
    కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన ( TRS) , మొత్తాన్ని TRS పేరు, తెలంగాణ పేరు ఎటూ పోకుండా చూసుకున్నారు. 
పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత.. 
1. విద్య: ప్రైవేట్‌ స్కూళ్లలో కూడా ఫ్రీగా విద్య అందిస్తాం..
2. వైద్యం: ఏ రోగమైనా రానీ, ఏ ఆస్పత్రైనా సరే ఉచితంగా అందిస్తాం.. 
3. వ్యవసాయం: రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తాం..
4. ఉపాధి: రూ.2 లక్షల-రూ.20 కోట్ల వరకు యువతకు రుణాలు.. 
మొదటి ఏడాదిలోనే సింగిల్‌ నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు.. ఉద్యమకారులకు లక్ష సూపర్‌ న్యూమరీ ఉద్యోగాలు ఇస్తాం.. 
5. సామాజిక న్యాయం ..
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    8 hrs ago
  • తెలంగాణ గడ్డపై అస్తిత్వ పోరాటం మళ్ళీ మొదలైంది. ప్రభుత్వ లెక్కల్లో తమ ఉనికిని తుడిచేసే ప్రయత్నంపై నేతకాని బిడ్డలు అగ్నిపర్వతమై లేస్తున్నారు. కులగణనలో తమ సామాజిక వర్గానికి జరిగిన ఘోర అవమానానికి నిరసనగా, సాయిని ప్రసాద్ నేత ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల వేదికగా నేడు (ఆదివారం) 'నేతకానిల రౌండ్ టేబుల్ సమావేశం' నిర్వహించనున్నారు. ​అస్తిత్వం కోల్పోతే భవిష్యత్తు శూన్యం: సాయిని ప్రసాద్ నేత ​శనివారం ఉస్మానియా గడ్డపై పోరాట గోడపత్రికను ఆవిష్కరించిన నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్ నేత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉత్తర తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న నేతకానిలను అట్టడుగుకు నెట్టేయడమే కాకుండా, కనీసం కులం పేరు కూడా జనాభా లెక్కల్లో లేకుండా చేయడం కుట్రపూరిత చర్యని ఆయన ధ్వజమెత్తారు. ​సమావేశం ప్రధాన ఉద్దేశాలు: ​అన్యాయంపై గళం: గణనలో జరిగిన లోపాలను ఎండగట్టడం. ​ఐక్యత చాటడం: రాజకీయాలు, సంఘాలకు అతీతంగా జాతి కోసం ఏకం కావడం. ​పోరాట పంథా: పల్లె నుండి పట్టణం దాకా నిరసన జ్వాలలు వ్యాపింపజేసే కార్యచరణ. ​"ఇది కేవలం ఒక సమావేశం కాదు.. నేతకాని ఆత్మగౌరవ యుద్ధం. మనల్ని విస్మరించిన పాలకులకు మన తడాఖా చూపించాలి. ప్రతి ఇల్లు కదలాలి.. ప్రతి నేతకాని బిడ్డ ఈ గొంతులో గొంతు కలపాలి." > — సాయిని ప్రసాద్ నేత ​కదం తొక్కిన విద్యార్థి లోకం ​ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు వినోద్ కుమార్, సాయికుమార్, జస్వంత్, దుర్గాప్రసాద్, మోహన్, వెంకటేష్ తదితరులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ఈ మహా ఉద్యమంలో నేతకాని ప్రజలందరూ భాగస్వాములు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. నేటి సమావేశం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సాగబోయే ఉద్యమ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
    3
    తెలంగాణ గడ్డపై అస్తిత్వ పోరాటం మళ్ళీ మొదలైంది. ప్రభుత్వ లెక్కల్లో తమ ఉనికిని తుడిచేసే ప్రయత్నంపై నేతకాని బిడ్డలు అగ్నిపర్వతమై లేస్తున్నారు. కులగణనలో తమ సామాజిక వర్గానికి జరిగిన ఘోర అవమానానికి నిరసనగా, సాయిని ప్రసాద్ నేత ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాల వేదికగా నేడు (ఆదివారం) 'నేతకానిల రౌండ్ టేబుల్ సమావేశం' నిర్వహించనున్నారు.
​అస్తిత్వం కోల్పోతే భవిష్యత్తు శూన్యం: సాయిని ప్రసాద్ నేత
​శనివారం ఉస్మానియా గడ్డపై పోరాట గోడపత్రికను ఆవిష్కరించిన నేతకాని విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్ నేత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉత్తర తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న నేతకానిలను అట్టడుగుకు నెట్టేయడమే కాకుండా, కనీసం కులం పేరు కూడా జనాభా లెక్కల్లో లేకుండా చేయడం కుట్రపూరిత చర్యని ఆయన ధ్వజమెత్తారు.
​సమావేశం ప్రధాన ఉద్దేశాలు:
​అన్యాయంపై గళం: గణనలో జరిగిన లోపాలను ఎండగట్టడం.
​ఐక్యత చాటడం: రాజకీయాలు, సంఘాలకు అతీతంగా జాతి కోసం ఏకం కావడం.
​పోరాట పంథా: పల్లె నుండి పట్టణం దాకా నిరసన జ్వాలలు వ్యాపింపజేసే కార్యచరణ.
​"ఇది కేవలం ఒక సమావేశం కాదు.. నేతకాని ఆత్మగౌరవ యుద్ధం. మనల్ని విస్మరించిన పాలకులకు మన తడాఖా చూపించాలి. ప్రతి ఇల్లు కదలాలి.. ప్రతి నేతకాని బిడ్డ ఈ గొంతులో గొంతు కలపాలి." > — సాయిని ప్రసాద్ నేత
​కదం తొక్కిన విద్యార్థి లోకం
​ఈ కార్యక్రమంలో విద్యార్థి నేతలు వినోద్ కుమార్, సాయికుమార్, జస్వంత్, దుర్గాప్రసాద్, మోహన్, వెంకటేష్ తదితరులు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ఈ మహా ఉద్యమంలో నేతకాని ప్రజలందరూ భాగస్వాములు కావాలని వారు విజ్ఞప్తి చేశారు. నేటి సమావేశం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సాగబోయే ఉద్యమ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    22 hrs ago
  • కామారెడ్డి జిల్లా : *సకాలంలో గర్భిణీ కి ఏ నెగిటివ్ రక్తం అందజేత* *ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా పర్ష వెంకటరమణ* *మూడు రోజుల నుండి రక్తం దొరకక ఇబ్బందులు పడ్డ గర్భిణీ మహిళ* *ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు* కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీ మహిళ రాజ్యలక్ష్మి (28) కి ఏ నెగిటివ్ రక్తం అవసరమని డాక్టర్లు తెలియజేయడంతో మూడు రోజులుగా కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ వారికి కావాల్సిన ఏ నెగటివ్ రక్తం దొరకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని సంప్రదించడంతో వారికి కావలసిన రక్తాన్ని గండిమాసానిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పర్ష వెంకటరమణ 28 వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ నేటి సమాజంలో తోటి వారికి సహాయం చేయాలనే మంచి ఆలోచన కొంత మందికి మాత్రమే ఉంటుందని,ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేయడమే కాకుండా ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్న రక్తదాత వెంకటరమణను అభినందించడం జరిగింది,నిస్వార్ధంగా సేవ చేస్తూ ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా నిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ అహ్మద్,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
    1
    కామారెడ్డి జిల్లా : *సకాలంలో గర్భిణీ కి ఏ నెగిటివ్ రక్తం అందజేత*
*ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా పర్ష వెంకటరమణ*
*మూడు రోజుల నుండి రక్తం దొరకక ఇబ్బందులు పడ్డ గర్భిణీ మహిళ*
*ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు*
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీ మహిళ రాజ్యలక్ష్మి (28) కి ఏ నెగిటివ్ రక్తం అవసరమని డాక్టర్లు తెలియజేయడంతో మూడు రోజులుగా కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ వారికి కావాల్సిన ఏ నెగటివ్ రక్తం దొరకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని సంప్రదించడంతో వారికి కావలసిన రక్తాన్ని గండిమాసానిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పర్ష వెంకటరమణ 28 వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. 
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ నేటి సమాజంలో తోటి వారికి సహాయం చేయాలనే మంచి ఆలోచన కొంత మందికి మాత్రమే ఉంటుందని,ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేయడమే కాకుండా ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్న రక్తదాత వెంకటరమణను అభినందించడం జరిగింది,నిస్వార్ధంగా సేవ చేస్తూ ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా నిలవడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ అహ్మద్,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • వరంగల్‌లో జరుగుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజున అమ్మవారిని సుగంధ గంధాలతో అలంకరించి ప్రత్యేక శోభను కలిగించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అమ్మవారి గంధాలంకరణను దర్శించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు మరింత వైభవంగా కొనసాగుతున్నాయని, భక్తులు నియమాలను పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని అధికారులు సూచించారు.
    1
    వరంగల్‌లో జరుగుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజున అమ్మవారిని సుగంధ గంధాలతో అలంకరించి ప్రత్యేక శోభను కలిగించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
అమ్మవారి గంధాలంకరణను దర్శించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు మరింత వైభవంగా కొనసాగుతున్నాయని, భక్తులు నియమాలను పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని అధికారులు సూచించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    3 hrs ago
  • అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 10000 పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను విడుదల చేయాలని కలెక్టరేట్ మెయిన్ గేట్ ముందు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ పేద,బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతవిద్యను ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో తీసుకొచ్చిన "ఫీజు రీయింబర్స్మెంట్" పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని,దీనిని ABVP తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ABVP జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు గౌరవ హైకోర్టును ఆశ్రఉంచినప్పుడు,ప్రభుత్వం ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని గౌరవ హైకోర్టు పదే పదే కోరినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయని కారణంగానే "విద్యార్థుల దగ్గరనుండే ఫీజులు వసూలు చేసుకోవచ్చని గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని,ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టిందని, ఇది రీయింబర్స్ మెంట్ పథకాన్ని బొంద పెట్టడంలో భాగమే అని అన్నారు.ఈ స్కీమ్ ద్వారా లక్షల మంది పేద వర్గాల పిల్లలు ఇంజనీరింగ్,మెడిసిన్,ఫార్మసీ, లా లాంటి కోర్సులు పూర్తిచేసి దేశ విదేశాల్లో స్థిరపడి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇస్తున్నారన్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అయ్యే పరిస్థితి దాపురించిందన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడి యేటా 14 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని,కోర్సుల్లో ప్రవేశం పొందేటప్పుడే ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందన్న హామీ మేరకే విద్యార్థులు అడ్మిషన్ పొందుతారని,హామీ మేరకు ప్రవేశం పొందాక ఫీజు చెల్లించకుండా, 10000 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థులను నయవంచనకు గురిచేస్తుందన్నారు.విద్య పై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి రాష్ట్ర,దేశ అభివృద్ధికి ఉపయోగపడే మానవవనరుల సృష్టి కోసమేనని, ఇది ఏ మాత్రం ఉచిత పథకం కాదని,ఈ విషయాన్ని ప్రభుత్వం,సమాజం అర్థం చేసుకోవాలన్నారు.ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పేద విద్యార్థులకు విద్యాప్రదాయినిగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని BRS ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని,ఈ పథకాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని,మేము అధికారంలోకి వస్తే బకాయిలు చెల్లించడమే కాకుండా ఇంకా గొప్పగా అమలుచేస్తామని హామీ ఇచ్చారని,తీర అధికారం లోకి వచ్చాక స్వయంగా తానే విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేతకు కుట్రలు చేస్తున్నారన్నారు.నా దగ్గర పంచడానికి భూములు లేవు,కానీ జీవితాన్ని నిలబెట్టే విద్యను మాత్రం అందిస్తానని పదే పదే వల్లే వేసే రేవంత్ రెడ్డి గారు ఎందుకు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు.తల్లిదండ్రులు, విద్యార్థులు,సమాజం అంతా కూడా ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై స్పందించాలని,ABVP ఆధ్వర్యంలో ఈ విద్యావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వంపై చేయబోయే ఉద్యమంలో మాతో పాటు కలిసి రావాలని పిలునిచ్చారు.విద్యార్థులతో గెలుక్కున్న ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలువలేదని,నీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయని,నీ ప్రభుత్వ మెడలు వంచైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తుందో దానికి వ్యతిరేకంగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ SFD CO -CONVER గోస్కుల అజయ్. స్టేట్ హాస్టల్స్ CO - CONVER భామండ్ల నందు. నగర కార్యదర్శి యోగేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మురళి జిల్లా SFD CONVER శ్రీపతి వంశీ,జిల్లా SFS CONVER నాగరాజు , జిల్లా హాస్టల్ కన్వీనర్ విగ్నేష్ , జిల్లా కేల్ కన్వీనర్ విష్ణు, నితీష్, శ్రీ వర్ధన్, ఆకాష్, శివ, మనోజ్ ,అనూష తదితరులు పాల్గొన్నారు
    3
    అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా  శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 10000 పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను విడుదల చేయాలని కలెక్టరేట్  మెయిన్ గేట్ ముందు నిరాహార దీక్ష చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ పేద,బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతవిద్యను ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో తీసుకొచ్చిన "ఫీజు రీయింబర్స్మెంట్" పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని,దీనిని ABVP తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ABVP జిల్లా  కన్వీనర్ పూసాల విష్ణు   అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు గౌరవ హైకోర్టును ఆశ్రఉంచినప్పుడు,ప్రభుత్వం ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని గౌరవ హైకోర్టు పదే పదే కోరినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయని కారణంగానే "విద్యార్థుల దగ్గరనుండే ఫీజులు వసూలు చేసుకోవచ్చని గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని,ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టిందని, ఇది రీయింబర్స్ మెంట్ పథకాన్ని బొంద పెట్టడంలో భాగమే అని అన్నారు.ఈ స్కీమ్ ద్వారా లక్షల మంది పేద వర్గాల పిల్లలు ఇంజనీరింగ్,మెడిసిన్,ఫార్మసీ, లా లాంటి కోర్సులు పూర్తిచేసి దేశ విదేశాల్లో స్థిరపడి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇస్తున్నారన్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అయ్యే పరిస్థితి దాపురించిందన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడి యేటా 14 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని,కోర్సుల్లో ప్రవేశం పొందేటప్పుడే ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందన్న హామీ మేరకే విద్యార్థులు అడ్మిషన్ పొందుతారని,హామీ మేరకు ప్రవేశం పొందాక ఫీజు చెల్లించకుండా, 10000 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థులను నయవంచనకు గురిచేస్తుందన్నారు.విద్య పై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి రాష్ట్ర,దేశ అభివృద్ధికి ఉపయోగపడే మానవవనరుల సృష్టి కోసమేనని, ఇది ఏ మాత్రం ఉచిత పథకం కాదని,ఈ విషయాన్ని ప్రభుత్వం,సమాజం అర్థం చేసుకోవాలన్నారు.ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పేద విద్యార్థులకు విద్యాప్రదాయినిగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని BRS ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని,ఈ పథకాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని,మేము అధికారంలోకి వస్తే బకాయిలు చెల్లించడమే కాకుండా ఇంకా గొప్పగా అమలుచేస్తామని హామీ ఇచ్చారని,తీర అధికారం లోకి వచ్చాక స్వయంగా తానే విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేతకు కుట్రలు చేస్తున్నారన్నారు.నా దగ్గర పంచడానికి భూములు లేవు,కానీ జీవితాన్ని నిలబెట్టే విద్యను మాత్రం అందిస్తానని పదే పదే వల్లే వేసే రేవంత్ రెడ్డి గారు ఎందుకు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు.తల్లిదండ్రులు, విద్యార్థులు,సమాజం అంతా కూడా ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై స్పందించాలని,ABVP ఆధ్వర్యంలో ఈ విద్యావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వంపై చేయబోయే ఉద్యమంలో మాతో పాటు కలిసి రావాలని పిలునిచ్చారు.విద్యార్థులతో గెలుక్కున్న ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలువలేదని,నీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయని,నీ ప్రభుత్వ మెడలు వంచైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకుంటామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తుందో దానికి వ్యతిరేకంగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో స్టేట్ SFD CO -CONVER గోస్కుల అజయ్. స్టేట్ హాస్టల్స్  CO - CONVER భామండ్ల నందు. నగర కార్యదర్శి యోగేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మురళి జిల్లా SFD CONVER శ్రీపతి వంశీ,జిల్లా SFS CONVER నాగరాజు , జిల్లా హాస్టల్ కన్వీనర్ విగ్నేష్ , జిల్లా కేల్ కన్వీనర్ విష్ణు, నితీష్, శ్రీ వర్ధన్, ఆకాష్, శివ, మనోజ్ ,అనూష తదితరులు పాల్గొన్నారు
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    3 hrs ago
  • కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బిజెపి మరో విజయాన్ని కైవసం చేసుకుంది. ఐదు కోఆప్షన్ పదవులను ఏకపక్షంగా బిజేపి దక్కించుకుంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో 66 డివిజన్లు ఉండగా ఐదు కోఆప్షన్ పదవులకు శనివారం ఎన్నిక నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో బిజెపికి చెందిన ఐదుగురిని కో ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేశారు.‌ బండి సంజయ్ సూచించిన కన్న కృష్ణ, నందకుమార్, బల్బీర్ సింగ్, ఆఫీసాబేగం, వెంకటమ్మను ఏకగ్రీవంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఎన్నుకున్నారు. కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన ఐదుగురిని కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు బిజెపికి చెందిన ఐదుగురు సభ్యుల పేర్లను ప్రతిపాదించారు. పోటీకి కాంగ్రెస్ దూరంగా ఉండగా బిఆర్ఎస్ రెండుగా చీలిపోయింది. సమావేశానికి హాజరై బిఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు పోటీలో పాల్గొనకుండా సైలెంట్ ఉండిపోయారు. ‌5 కోఆప్షన్ సభ్యుల పదవులకు 46 మంది దరఖాస్తు చేసుకోగా మెజార్టీ ఉన్న బిజెపి ఐదుగురిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపిక చేసి ఏకగ్రీవంగా అయ్యేలా చూడడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. మేయర్ డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్లు మున్సిపల్ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచి డప్పు నృత్యాలు చేశారు.
    3
    కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బిజెపి మరో విజయాన్ని కైవసం చేసుకుంది. ఐదు కోఆప్షన్ పదవులను ఏకపక్షంగా బిజేపి దక్కించుకుంది. కరీంనగర్ నగరపాలక సంస్థలో 66 డివిజన్లు ఉండగా ఐదు కోఆప్షన్ పదవులకు శనివారం ఎన్నిక నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేతృత్వంలో బిజెపికి చెందిన ఐదుగురిని కో ఆప్షన్  సభ్యులుగా ఎంపిక చేశారు.‌ బండి సంజయ్ సూచించిన కన్న కృష్ణ, నందకుమార్, బల్బీర్ సింగ్, ఆఫీసాబేగం, వెంకటమ్మను ఏకగ్రీవంగా మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సభ్యులు ఎన్నుకున్నారు. కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన ఐదుగురిని కేంద్రమంత్రి బండి సంజయ్ అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ మేయర్ సునీల్ రావు బిజెపికి చెందిన ఐదుగురు సభ్యుల పేర్లను ప్రతిపాదించారు. పోటీకి కాంగ్రెస్ దూరంగా ఉండగా బిఆర్ఎస్ రెండుగా చీలిపోయింది. సమావేశానికి హాజరై బిఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు పోటీలో పాల్గొనకుండా సైలెంట్ ఉండిపోయారు. ‌5 కోఆప్షన్ సభ్యుల పదవులకు 46 మంది దరఖాస్తు చేసుకోగా మెజార్టీ ఉన్న బిజెపి ఐదుగురిని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపిక చేసి ఏకగ్రీవంగా అయ్యేలా చూడడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. మేయర్ డిప్యూటీ మేయర్ తో పాటు కార్పొరేటర్లు మున్సిపల్ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. టపాసులు కాల్చి స్వీట్లు పంచి డప్పు నృత్యాలు చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    5 hrs ago
  • కామారెడ్డి ఆర్టీసీ డిపోలో కార్మికులు శనివారం సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం కార్మిక సమస్యలు పరిష్కరించినందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతున్నందుకు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూసిన కల నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రమేశ్, మూర్తి, ఖదీర్, సీతారాములు, రాజేందర్ పాల్గొన్నారు.
    1
    కామారెడ్డి ఆర్టీసీ డిపోలో కార్మికులు శనివారం సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం కార్మిక సమస్యలు పరిష్కరించినందుకు ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతున్నందుకు మధ్యాహ్నం భోజన విరామ సమయంలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఎదురుచూసిన కల నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రమేశ్, మూర్తి, ఖదీర్, సీతారాములు, రాజేందర్ పాల్గొన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.