రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట గ్రామంలో శ్రీ వరలక్ష్మి రైస్ మిల్ లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామంలో శ్రీ వరలక్ష్మి రైస్ మిల్‌లో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించింది. మిల్లులో అగ్నికీలలు ఎగిసిపడటం తో రైస్ మిల్లులో నిల్వ ఉంచిన వడ్ల బారదాన్ (గోనె సంచులు) కొంత మేర కాలి బూడిదైపోయాయి. సమాచారం అందుకున్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఫైరింజన్ సహాయం తో మంటలను అదుపులోకి తీసువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని బాధితులు మరియు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎంత మేర నష్టం వాటిల్లిందన్న సమాచారం తెలియాల్సి ఉంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్ పేట గ్రామంలో శ్రీ వరలక్ష్మి రైస్ మిల్ లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామంలో శ్రీ వరలక్ష్మి రైస్ మిల్‌లో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించింది. మిల్లులో అగ్నికీలలు ఎగిసిపడటం తో రైస్ మిల్లులో నిల్వ ఉంచిన వడ్ల బారదాన్ (గోనె సంచులు) కొంత మేర కాలి బూడిదైపోయాయి. సమాచారం అందుకున్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఫైరింజన్ సహాయం తో మంటలను అదుపులోకి తీసువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని బాధితులు మరియు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎంత మేర నష్టం వాటిల్లిందన్న సమాచారం తెలియాల్సి ఉంది.
- కౌన్సిలర్ సభ్యులు వేముల రాములు తల్లి కీర్తిశేషులు వేముల హన్మవ్వ ఈనెల 22వ తేదీన స్వర్గస్థులు కాగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేముల రాములు ఇంటికి చేరుకుని వేముల హన్మవ్వ చిత్రపటానికి పూలతో నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.1
- కరీంనగర్:జిల్లాలో కొంతమంది వైద్యులే సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ద్వారా తప్పుడు వైద్య ప్రచారం చేస్తూ పేద ప్రజలను, అమాయక రోగులను మోసం చేస్తున్నారని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. dyfi నాయకుల సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు అనంతరం నరేష్ పటేల్ మాట్లాడుతూ ముఖ్యంగా షుగర్ (మధుమేహం), బీపీ (రక్తపోటు) వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు అవసరం లేదని, ఇంటి చిట్కాలతో పూర్తిగా నయం అవుతుంది“ఒక్క మందుతో శాశ్వతంగా పోతుంది వంటి అవాస్తవాలు ప్రచారం చేస్తూ వీడియోలు విడుదల చేయడం ప్రజల ప్రాణాలతో ఆటలాడటమేనని విమర్శించారు. వైద్యులపై ఉన్న నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి తప్పుడు వీడియోలు విడుదల చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని తెలిపారు. ప్రజలు ఈ ప్రచారాలను నమ్మి వైద్యుల సలహా లేకుండా మందులు ఆపేస్తే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వంటి ప్రాణాపాయకర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పేదలు ఈ మోసాలకు ఎక్కువగా బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హతలేని వ్యక్తులు మాత్రమే కాకుండా కొంతమంది వైద్యులే ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడటం అత్యంత ఆందోళనకరమని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారు లాభాల కోసం ఇలా వ్యవహరించడం ఖండనీయమని పేర్కొన్నారు. ఇక మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ప్రజల పరిస్థితిని దుర్వినియోగం చేస్తూ తీవ్ర దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. అవసరం లేని పరీక్షలు చేయించడం, అధిక బిల్లులు వేయడం, అప్రామాణిక చికిత్సలు సూచించడం, పారదర్శకత లేకుండా ఫీజులు వసూలు చేయడం ద్వారా పేద ప్రజలను ఆర్థికంగా నాశనం చేస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో భయాన్ని ఉపయోగించుకుని లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతోందని విమర్శించారు. వైద్య రంగం సేవా ధర్మాన్ని కోల్పోయి పూర్తిగా వ్యాపారంగా మారడం దురదృష్టకరమని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వైద్య ప్రచారం చేస్తున్న వైద్యులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఇలాంటి వైద్యుల లైసెన్సులను రద్దు చేయాలని, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఉన్న ఫేక్ మెడికల్ వీడియోలను తక్షణమే తొలగించాలని, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయాలని, అవసరం లేని టెస్టులు, అధిక బిల్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, వైద్య సేవలపై ప్రభుత్వ పర్యవేక్షణను కఠినంగా అమలు చేయాలని, ప్రజల్లో సరైన వైద్య అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (DMHO) అధికారులు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శివ కుమార్,సహాయ కార్యదర్శులు,అరవింద్ నాయకులు సిన.రాజేష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు1
- కామారెడ్డి జిల్లా : *సకాలంలో గర్భిణీ కి ఏ నెగిటివ్ రక్తం అందజేత* *ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా పర్ష వెంకటరమణ* *మూడు రోజుల నుండి రక్తం దొరకక ఇబ్బందులు పడ్డ గర్భిణీ మహిళ* *ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు* కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణీ మహిళ రాజ్యలక్ష్మి (28) కి ఏ నెగిటివ్ రక్తం అవసరమని డాక్టర్లు తెలియజేయడంతో మూడు రోజులుగా కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ వారికి కావాల్సిన ఏ నెగటివ్ రక్తం దొరకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని సంప్రదించడంతో వారికి కావలసిన రక్తాన్ని గండిమాసానిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న పర్ష వెంకటరమణ 28 వ సారి రక్తదానం చేసి ఆదర్శంగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ నేటి సమాజంలో తోటి వారికి సహాయం చేయాలనే మంచి ఆలోచన కొంత మందికి మాత్రమే ఉంటుందని,ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేయడమే కాకుండా ఆపదలో ఉన్న వారికి సకాలంలో రక్తాన్ని అందజేయడం కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ప్రాణదాతగా నిలుస్తున్న రక్తదాత వెంకటరమణను అభినందించడం జరిగింది,నిస్వార్ధంగా సేవ చేస్తూ ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా నిలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ అహ్మద్,బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.1
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్, తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల గోస పై ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు జరగక రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి ధాన్యం కొనుగోలు కాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ధాన్యం ఎండి కుప్ప పోసి 15 రోజులవుతున్న కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరికాయ కొట్టారు, కానీ కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదనతో తెలిపారు. మహిళా రైతు మాత్రం ప్రభుత్వం కొనకుంటే మీరు కొనండి సూచించారు. రెండేళ్లు ఓపిక పట్టండి మళ్లీ కెసిఆర్ వస్తాడు అప్పుడు మేమే కొంటామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గొప్పలు చెబుతుంది తప్ప రైతుల గౌసను అర్థం చేసుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొనుగోళ్ళు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించిన పంట దళారుల పాలు కాకుండా మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. రైస్ మిల్ అలాట్మెంట్ చేసి సోమవారం లోగా ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతుల పక్షాన బిఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతు సోదరులు ధైర్యంగా ఉండండి... రెండేళ్లయితే కేసీఆర్ మళ్ళీ వస్తాడని కేటీఆర్ తెలిపారు.4
- మొన్న కురిసిన వడగండ్ల వర్షం రైతు వెన్నెముకను విరిచేసిందని, ఎకరాకు 25వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు ఇటీవల కురిసిన వడగండ్ల వర్షం కారణంగా చేగుంట మండలంలోని కర్నాల్ పల్లి, మక్కరాజుపేట్, గొల్లపల్లి, రాంపూర్, కన్యారం గ్రామాలతో పాటు చేగుంట, నార్సింగి మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్వయంగా నష్టపోయిన పంట పొలాలను శనివారం పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుగాలం చెమటతో పండించిన పంట క్షణాల్లో నేలమట్టం కావడం ఎంతో బాధాకరమని, పంట మాత్రమే కాదు, రైతుల ఆశలు కూడా తుడిచిపెట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వర్షం దెబ్బకు పంటలు పూర్తిగా నాశనం కావడంతో గడ్డి కూడా మిగలని పరిస్థితి ఏర్పడిందని, అప్పులు చేసి, కౌలు తీసుకుని సాగు చేసిన రైతులు ఈ విపత్తుతో పూర్తిగా ఆగమైపోయారని, ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైతులకు ఇది మరింత భారంగా మారిందన్నారు. గత ఏడాది కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ ప్రభుత్వం సరైన సహాయం అందించలేదని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టాన్ని అంచనా వేసి ప్రతి ఎకరాకు కనీసం ₹25,000 వేల రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని గట్టిగా డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతు బతికితేనే దేశం బతుకుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.1
- Post by Edla Shankar1
- నర్సాపూర్ పట్టణంలోని పురపాలికలోగల 15 వార్డులలో అభివృద్ధికై మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ ప్రతిమా సింగ్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సుహాసిని, పుర ఛైర్ పర్సన్ లక్ష్మీరాజు యాదవ్తో కలిసి రూ.15 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. పురపాలిక అభివృద్ధిని కాంక్షిస్తూ నిధులు మంజూరు చేయడం పట్ల కౌన్సిలర్లు, నాయకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామంలో శ్రీ వరలక్ష్మి రైస్ మిల్‌లో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించింది. మిల్లులో అగ్నికీలలు ఎగిసిపడటం తో రైస్ మిల్లులో నిల్వ ఉంచిన వడ్ల బారదాన్ (గోనె సంచులు) కొంత మేర కాలి బూడిదైపోయాయి. సమాచారం అందుకున్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఫైరింజన్ సహాయం తో మంటలను అదుపులోకి తీసువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని బాధితులు మరియు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎంత మేర నష్టం వాటిల్లిందన్న సమాచారం తెలియాల్సి ఉంది.1