కరీంనగర్ రోహన్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవ కానుకగా దేవి పుత్రిక స్కీమ్ ప్రారంభం...నేటి నుంచి ఏడాది వరకు హాస్పిటల్ లో డెలవరీ అయిన మహిళకు ఆడబిడ్డ పుడితే ఫ్రీ వైద్యం కరీంనగర్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ వినూత్న స్కీంకు శ్రీకారం చుట్టింది. ఆడ బిడ్డలకు బాసటగా నిలిచే కార్యక్రమాన్ని చేపట్టింది. కరీంనగర్ రోహన్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవ కానుకగా దేవి పుత్రిక స్కీమ్ ను ప్రారంభించింది. స్కీమ్ ను జిల్లా అడిషనల్ జడ్జి ఏ.నీరజ, డాక్టర్ బి.ఎన్.రావు ఆవిష్కరించారు. ఈరోజు నుంచి సంవత్సరం వరకు రోహన్ హాస్పిటల్ లో పుట్టిన ఆడబిడ్డకు ఉచిత వైద్యం, డెలివరీకి అయ్యే ఖర్చు ఆసుపత్రి భరిస్తుందని తెలిపారు. ఆడబిడ్డలను కాపాడుకుందామని దేవిపుత్రిక స్కీమ్ ప్రారంభించామని రోహన్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ శ్రీదేవి, నరేష్ తెలిపారు. హాస్పిటల్ బిజినెస్ పెంచుకోవడానికి రాయితీలు ఇస్తారు, కానీ రోహన్ హాస్పిటల్ నిర్వాహకులు సామాజిక బాధ్యతగా ఆడబిడ్డ పుడితే డెలివరీ ఖర్చు భరించేందుకు రోహన్ హాస్పిటల్ ముందుకు రావడం అభినందనీయమన్నారు జడ్జీ నీరజ. ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డాక్టర్ ఎనమల శ్రీదేవి నరేష్ సూచించారు.
కరీంనగర్ రోహన్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవ కానుకగా దేవి పుత్రిక స్కీమ్ ప్రారంభం...నేటి నుంచి ఏడాది వరకు హాస్పిటల్ లో డెలవరీ అయిన మహిళకు ఆడబిడ్డ పుడితే ఫ్రీ వైద్యం కరీంనగర్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ వినూత్న స్కీంకు శ్రీకారం చుట్టింది. ఆడ బిడ్డలకు బాసటగా నిలిచే కార్యక్రమాన్ని చేపట్టింది. కరీంనగర్ రోహన్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవ కానుకగా దేవి పుత్రిక స్కీమ్ ను ప్రారంభించింది. స్కీమ్ ను జిల్లా అడిషనల్ జడ్జి ఏ.నీరజ, డాక్టర్ బి.ఎన్.రావు ఆవిష్కరించారు. ఈరోజు నుంచి సంవత్సరం
వరకు రోహన్ హాస్పిటల్ లో పుట్టిన ఆడబిడ్డకు ఉచిత వైద్యం, డెలివరీకి అయ్యే ఖర్చు ఆసుపత్రి భరిస్తుందని తెలిపారు. ఆడబిడ్డలను కాపాడుకుందామని దేవిపుత్రిక స్కీమ్ ప్రారంభించామని రోహన్ హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ శ్రీదేవి, నరేష్ తెలిపారు. హాస్పిటల్ బిజినెస్ పెంచుకోవడానికి రాయితీలు ఇస్తారు, కానీ రోహన్ హాస్పిటల్ నిర్వాహకులు సామాజిక బాధ్యతగా ఆడబిడ్డ పుడితే డెలివరీ ఖర్చు భరించేందుకు రోహన్ హాస్పిటల్ ముందుకు రావడం అభినందనీయమన్నారు జడ్జీ నీరజ. ఆడపిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని డాక్టర్ ఎనమల శ్రీదేవి నరేష్ సూచించారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్, తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల గోస పై ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు జరగక రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి ధాన్యం కొనుగోలు కాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ధాన్యం ఎండి కుప్ప పోసి 15 రోజులవుతున్న కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరికాయ కొట్టారు, కానీ కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదనతో తెలిపారు. మహిళా రైతు మాత్రం ప్రభుత్వం కొనకుంటే మీరు కొనండి సూచించారు. రెండేళ్లు ఓపిక పట్టండి మళ్లీ కెసిఆర్ వస్తాడు అప్పుడు మేమే కొంటామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గొప్పలు చెబుతుంది తప్ప రైతుల గౌసను అర్థం చేసుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొనుగోళ్ళు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించిన పంట దళారుల పాలు కాకుండా మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. రైస్ మిల్ అలాట్మెంట్ చేసి సోమవారం లోగా ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతుల పక్షాన బిఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతు సోదరులు ధైర్యంగా ఉండండి... రెండేళ్లయితే కేసీఆర్ మళ్ళీ వస్తాడని కేటీఆర్ తెలిపారు.4
- అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 10000 పైగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ను విడుదల చేయాలని కలెక్టరేట్ మెయిన్ గేట్ ముందు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు మాట్లాడుతూ పేద,బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నతవిద్యను ఉచితంగా అందించాలనే సదుద్దేశంతో తీసుకొచ్చిన "ఫీజు రీయింబర్స్మెంట్" పథకాన్ని ఎత్తివేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని,దీనిని ABVP తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ABVP జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు అన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు గౌరవ హైకోర్టును ఆశ్రఉంచినప్పుడు,ప్రభుత్వం ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని గౌరవ హైకోర్టు పదే పదే కోరినప్పటికీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయని కారణంగానే "విద్యార్థుల దగ్గరనుండే ఫీజులు వసూలు చేసుకోవచ్చని గౌరవ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని,ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం ఈ చర్యకు ఒడిగట్టిందని, ఇది రీయింబర్స్ మెంట్ పథకాన్ని బొంద పెట్టడంలో భాగమే అని అన్నారు.ఈ స్కీమ్ ద్వారా లక్షల మంది పేద వర్గాల పిల్లలు ఇంజనీరింగ్,మెడిసిన్,ఫార్మసీ, లా లాంటి కోర్సులు పూర్తిచేసి దేశ విదేశాల్లో స్థిరపడి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను ఇస్తున్నారన్నారు.ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం అయ్యే పరిస్థితి దాపురించిందన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ఆధారపడి యేటా 14 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని,కోర్సుల్లో ప్రవేశం పొందేటప్పుడే ఫీజు ప్రభుత్వమే చెల్లిస్తుందన్న హామీ మేరకే విద్యార్థులు అడ్మిషన్ పొందుతారని,హామీ మేరకు ప్రవేశం పొందాక ఫీజు చెల్లించకుండా, 10000 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థులను నయవంచనకు గురిచేస్తుందన్నారు.విద్య పై ప్రభుత్వం పెట్టే పెట్టుబడి రాష్ట్ర,దేశ అభివృద్ధికి ఉపయోగపడే మానవవనరుల సృష్టి కోసమేనని, ఇది ఏ మాత్రం ఉచిత పథకం కాదని,ఈ విషయాన్ని ప్రభుత్వం,సమాజం అర్థం చేసుకోవాలన్నారు.ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పేద విద్యార్థులకు విద్యాప్రదాయినిగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని BRS ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని,ఈ పథకాన్ని మా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని,మేము అధికారంలోకి వస్తే బకాయిలు చెల్లించడమే కాకుండా ఇంకా గొప్పగా అమలుచేస్తామని హామీ ఇచ్చారని,తీర అధికారం లోకి వచ్చాక స్వయంగా తానే విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఎత్తివేతకు కుట్రలు చేస్తున్నారన్నారు.నా దగ్గర పంచడానికి భూములు లేవు,కానీ జీవితాన్ని నిలబెట్టే విద్యను మాత్రం అందిస్తానని పదే పదే వల్లే వేసే రేవంత్ రెడ్డి గారు ఎందుకు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు.తల్లిదండ్రులు, విద్యార్థులు,సమాజం అంతా కూడా ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై స్పందించాలని,ABVP ఆధ్వర్యంలో ఈ విద్యావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వంపై చేయబోయే ఉద్యమంలో మాతో పాటు కలిసి రావాలని పిలునిచ్చారు.విద్యార్థులతో గెలుక్కున్న ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలువలేదని,నీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయని,నీ ప్రభుత్వ మెడలు వంచైనా సరే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాపాడుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని కుట్ర చేస్తుందో దానికి వ్యతిరేకంగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ SFD CO -CONVER గోస్కుల అజయ్. స్టేట్ హాస్టల్స్ CO - CONVER భామండ్ల నందు. నగర కార్యదర్శి యోగేష్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మురళి జిల్లా SFD CONVER శ్రీపతి వంశీ,జిల్లా SFS CONVER నాగరాజు , జిల్లా హాస్టల్ కన్వీనర్ విగ్నేష్ , జిల్లా కేల్ కన్వీనర్ విష్ణు, నితీష్, శ్రీ వర్ధన్, ఆకాష్, శివ, మనోజ్ ,అనూష తదితరులు పాల్గొన్నారు3
- గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామంలోభారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న 'జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం' జరుపుకుంటారు. 1993 ఏప్రిల్ 24న రాజ్యాంగంలోని 73వ సవరణ చట్టం అమలులోకి వచ్చిన జ్ఞాపకార్థం, గ్రామీణ స్థానిక స్వపరిపాలనను బలోపేతం చేయడానికి మరియు ప్రజాస్వామ్య వికేంద్రీకరణను ప్రోత్సహించడానికి ఈ రోజును జరుపుకుంటారు. 2010లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు, అధికారాలను కల్పించడం ద్వారా గ్రామీణ అభివృద్ధే లక్ష్యంగా ఈ దినోత్సవం నిర్వహించబడుతుంది, అని ఆయన తెలిపారు. 73వ సవరణ ఈ చట్టం గ్రామం, బ్లాక్ మరియు జిల్లా స్థాయిలో మూడు అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను తీసుకువచ్చింది. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించడం మరియు స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకోవడం. గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్య వికేంద్రీకరణ సాధ్యమవుతుందని ఈ దినోత్సవం గుర్తుచేస్తుంది. అని సర్పంచ్ తెలిపారు... ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కళ్లెం అనిత, వార్డు సభ్యులు భూపెల్లి రమేష్, సంపతి మల్లీశ్వరి, కత్తి శ్రీనివాస్ మాడుగుల కరుణాకర్ రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు..1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్‌పేట గ్రామంలో శ్రీ వరలక్ష్మి రైస్ మిల్‌లో ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదం సంభవించింది. మిల్లులో అగ్నికీలలు ఎగిసిపడటం తో రైస్ మిల్లులో నిల్వ ఉంచిన వడ్ల బారదాన్ (గోనె సంచులు) కొంత మేర కాలి బూడిదైపోయాయి. సమాచారం అందుకున్న స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. ఫైరింజన్ సహాయం తో మంటలను అదుపులోకి తీసువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉండవచ్చని బాధితులు మరియు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో ఎంత మేర నష్టం వాటిల్లిందన్న సమాచారం తెలియాల్సి ఉంది.1
- వరంగల్‌లో జరుగుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజున అమ్మవారిని సుగంధ గంధాలతో అలంకరించి ప్రత్యేక శోభను కలిగించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అమ్మవారి గంధాలంకరణను దర్శించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు మరింత వైభవంగా కొనసాగుతున్నాయని, భక్తులు నియమాలను పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని అధికారులు సూచించారు.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఏప్రిల్ 25 ఐ3 న్యూస్ *విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక వీడియో. బడి సెలవుల నేపథ్యంలో బయట ఆడుకునే పిల్లలు విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.*...1
- *అన్నా అన్నందుకు సెఎస్ఐ దాడిలూన్ వ్యక్తిపై * కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఖాన్ పురాలో ఎస్ఐ దాష్టీకం స్థానిక సెలూన్‌కు వెళ్లిన త్రీటౌన్ ఎస్ఐ చందర్, తనను అన్నా అని పిలిచినందుకు రాములు అనే వ్యక్తిపై దాడి ఆగ్రహంతో బూతులు తిడుతూ సదరు వ్యక్తిని చితకబాదిన ఎస్ఐ1
- కరీంనగర్ లో త్రీ టౌన్ ఎస్ఐ వీరంగం సృష్టించాడు. సెల్యూట్ షాప్ నిర్వాకుడుని దూషిస్తూ దాడి చేశాడు. ఖాన్ పురాలోని సేవింగ్ చేయించుకోవడానికి త్రీటౌన్ ఎస్ఐ చందర్ వెళ్ళారు. రాము, సేవింగ్ చేయాలని ఎస్ఐ కోరగా ‘అన్నా’ కూర్చొ అని షాప్ నిర్వాకుడు రాము అన్నాడు. అన్నా ఏందిరా బే అంటూ ఎస్ఐ బూతులు తిడుతూ దాడి చేశాడు. విచక్షణారహితంగా సెల్యూన్ షాప్ నిర్వాకుడు రాముపై చేయి చేసుకున్నాడు. ఎస్ఐ ని అన్నా అన్నందుకే దాడి చేయడం సర్వతా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ అమానుష దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సిసి పటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షాపు నిర్వాకుడు పై విచక్షణ రహితంగా ప్రవర్తించిన ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ఐ పై శాఖ పరమైన చర్యలు తీసుకునే పనిలో పోలీస్ అధికారులు నిమగ్నమయ్యారు.2