Shuru
Apke Nagar Ki App…
మహబూబాబాద్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలంటూ మహబూబాబాద్ డిపో కార్మికులకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ.... హక్కుల కోసం ఉద్యమిస్తే.. ఉక్కుపాదంతో అణిచివేస్తరా..? అధికారంలోకి రాకముందు చెప్పిందేమిటి..? ఇప్పుడు చేస్తున్నదేమిటి..?* ఆర్టీసి కార్మికులు సమ్మె చేస్తున్నా, కనీసం సోయి లేని సర్కారు అంతులేని నిర్లక్ష్యం వల్లే ఇవాళ ఉద్యమం నాటి దృశ్యాలు, ఆత్మబలిదానాలు చేసుకునే పరిస్థితులు చూస్తున్నాం* ఆర్టీసి కార్మిక సోదరుల్లారా.. దయచేసి మనోధైర్యాన్ని కోల్పోకండి. మీ పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుంది అన్నారు మాజీ మంత్రి, శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు
Mogulagani Mahendar Mogulagani Mahendar
మహబూబాబాద్ లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలంటూ మహబూబాబాద్ డిపో కార్మికులకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ.... హక్కుల కోసం ఉద్యమిస్తే.. ఉక్కుపాదంతో అణిచివేస్తరా..? అధికారంలోకి రాకముందు చెప్పిందేమిటి..? ఇప్పుడు చేస్తున్నదేమిటి..?* ఆర్టీసి కార్మికులు సమ్మె చేస్తున్నా, కనీసం సోయి లేని సర్కారు అంతులేని నిర్లక్ష్యం వల్లే ఇవాళ ఉద్యమం నాటి దృశ్యాలు, ఆత్మబలిదానాలు చేసుకునే పరిస్థితులు చూస్తున్నాం* ఆర్టీసి కార్మిక సోదరుల్లారా.. దయచేసి మనోధైర్యాన్ని కోల్పోకండి. మీ పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుంది అన్నారు మాజీ మంత్రి, శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు
More news from తెలంగాణ and nearby areas
- అనుమానాస్పద స్థితిలో యువతి మృతి కేసును ఛేదించిన మరిపెడ పోలీసులు. నిశ్చితార్థం జరిగిన యువతిని బావిలో తోసి చంపిన కిరాతకుడు. అనుమానమే హత్యకు కారణం, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన నిందితుడు అరెస్ట్. మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న యువతి మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అనుమానాస్పద మృతిగా నమోదైన ఈ కేసును పోలీసులు హత్యగా తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ ఘాతుకానికి గల కారణాలను మరిపెడ సిఐ పవన్ కుమార్ వెల్లడించారు. మరిపెడ మండల పరిధిలోని ఇటికలగడ్డ తండాకు చెందిన 19 ఏళ్ల బుక్య సంగీత, ఈ నెల 22న గ్రామశివారులోని ఒక బావిలో శవమై కనిపించింది. ఈ నెల 29న ఆమెకు కొత్త తండాకు చెందిన అజ్మీరా అరవింద్‌తో వివాహం జరగాల్సి ఉంది. వీరిద్దరికీ ఇప్పటికే నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే, పెళ్లికి కొన్ని రోజుల ముందే సంగీత విగతజీవిగా పడి ఉండటంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కేసును సవాలుగా తీసుకున్న మరిపెడ CI పవన్ కుమార్, యస్సైలు,వీరభద్రం, కోటేశ్వరరావు లు సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలను సేకరించారు. పోలీసుల విచారణలో నిందితుడు అరవింద్ తన నేరాన్ని అంగీకరించాడు. సంగీతపై పెంచుకున్న అనవసరమైన అనుమానమే ఈ హత్యకు దారితీసిందని పోలీసులు తెలిపారు. సంగీత వేరే వారితో చనువుగా ఉండటంతో అరవింద్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. పథకం ప్రకారం ఈ నెల 21వ తేదీ సాయంత్రం, ఇంట్లో వారికి అబద్ధం చెప్పి బయటకు వచ్చిన అరవింద్, సంగీతను నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించాడు. మాటల్లో పెట్టి బావి వద్దకు తీసుకెళ్లి, ఆమెను నీళ్లలోకి నెట్టి చంపేశాడు. ఇది ఒక ఆత్మహత్యగా నమ్మించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. హత్య తర్వాత ఏమీ తెలియనట్టు సంగీత తల్లిదండ్రులతో కలిసి తిరిగాడు. చివరికి సాంకేతిక పరిజ్ఞానం మరియు సాక్షుల ఆధారంగా నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు అరవింద్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు మరిపెడ పోలీసులు వెల్లడించారు.1
- వరంగల్‌లో జరుగుతున్న శ్రీ భద్రకాళి భద్రేశ్వర కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడవ రోజున అమ్మవారిని సుగంధ గంధాలతో అలంకరించి ప్రత్యేక శోభను కలిగించారు. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. అమ్మవారి గంధాలంకరణను దర్శించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయం పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోవడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు మరింత వైభవంగా కొనసాగుతున్నాయని, భక్తులు నియమాలను పాటిస్తూ దర్శనాలు చేసుకోవాలని అధికారులు సూచించారు.1
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్దిరాల మండలం చిన్ననెమిల వద్ద టాటా ఏస్ వాహనం అదుపు తప్పింది.వేగంగా వెళ్లి చెట్టును వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.మృతుల్లో చిన్ననెమిలకు చెందిన రాధ, జలాలపురానికి చెందిన మరో వ్యక్తి ఉన్నారు.పండగ కోసం హైదరాబాద్ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగింది.ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.1
- రాయిగూడెంలో జరిగిన ప్రజా దర్బార్ లో ఓ ముస్లిం మహిళ భావోద్వేగానికి లోనైంది. “నా బిడ్డ ప్రాణం కాపాడిన దేవుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం" అని ఆమె కన్నీటి పర్యంతమైంది. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ప్రజల సమస్యలు విని పరిష్కారానికి హామీనిచ్చారు.1
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao2
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్, తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల గోస పై ఆరా తీశారు. ధాన్యం కొనుగోలు జరగక రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా పరిశీలించి ధాన్యం కొనుగోలు కాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. ధాన్యం ఎండి కుప్ప పోసి 15 రోజులవుతున్న కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరికాయ కొట్టారు, కానీ కొనుగోలు చేయడం లేదని అన్నదాతలు ఆవేదనతో తెలిపారు. మహిళా రైతు మాత్రం ప్రభుత్వం కొనకుంటే మీరు కొనండి సూచించారు. రెండేళ్లు ఓపిక పట్టండి మళ్లీ కెసిఆర్ వస్తాడు అప్పుడు మేమే కొంటామని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం గొప్పలు చెబుతుంది తప్ప రైతుల గౌసను అర్థం చేసుకోవడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే కొనుగోళ్ళు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రైతులు కష్టపడి పండించిన పంట దళారుల పాలు కాకుండా మద్దతు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరారు. రైస్ మిల్ అలాట్మెంట్ చేసి సోమవారం లోగా ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతుల పక్షాన బిఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతు సోదరులు ధైర్యంగా ఉండండి... రెండేళ్లయితే కేసీఆర్ మళ్ళీ వస్తాడని కేటీఆర్ తెలిపారు.4
- వరంగల్ జిల్లా:ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో స్థానిక పీహెచ్సీ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మలేరియా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ్ చంద్ర, యాదయ్య, రాజు, స్వర్ణ కుమారి, మచ్చస్ రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.1