Shuru
Apke Nagar Ki App…
గునుకుల కొండాపూర్ మాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో మాల సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు
Vodnala thirupthi
గునుకుల కొండాపూర్ మాల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో మాల సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు
More news from తెలంగాణ and nearby areas
- మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడి వివాహం హైదరాబాద్ హైటెక్స్ లో వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రజిత దంపతుల ఏకైక కుమారుడు హరిహరన్ సాయి వివాహం దీక్ష తో కన్నుల పండువలా జరిగింది. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి ఎమ్మెల్యేను అభినందించారు. హైదరాబాదులో జరిగిన వివాహానికి ప్రముఖులు రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో సేవలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే అమెరికాలోని న్యూ జెర్సీలో శివ విష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడుకూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు. ఆలయ వాతావరణం భక్తిరసంతో నిండిపోయి ఆధ్యాత్మికంగా మారింది1
- జగిత్యాల: మూడు రోజుల్లోనే ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికి, పల్లెల్లో ప్రగతి రథ చక్రాలు కదిలేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్న సందర్బంగా జగిత్యాలలో శనివారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో పొన్నాల గార్డెన్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆర్టీసీ జేఏసీ నాయకులు కలిసి సన్మానం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరోమారు ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు అండగా నిలుస్తామని మంత్రికి జేఏసీ నాయకులు హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే నాటి ప్రభుత్వం కనీసం కార్మిక సంఘాలను చర్చలకు పిలవలేదని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సమ్మె చేస్తున్న కార్మికులను డిస్మిస్ చేస్తామని హెచ్చరించారని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మె సమస్యను పరిష్కరించి కార్మికులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు వివేక్ గారితో పాటు తాను ఆర్టీసీ కి చెందిన 24 కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ఆర్టీసీ కార్మికులు సుమారు 52 రోజులు సమ్మె చేస్తే కార్మిక సంఘాలను నాటి ప్రభుత్వ పెద్దలు కనీసం చర్చలకు పిలవలేదని మంత్రి అన్నారు. విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తామని స్వయంగా నాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆనాడు కార్మికులను భయభ్రాంతులకు గురి చేశారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మూడు రోజుల్లోనే ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మరణించడం చాలా బాధాకరమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.1
- వల్బాపూర్ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం కారు నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ క్రాస్ రోడ్ వద్ద రాత్రి 11 గంటల సమయంలో లారీ కారు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో భూపాలపల్లి. ప్రాంతానికి చెందిన మహేష్. రమా. స్వప్న. అందరికీ స్వల్ప గాయాలు కాగా 108 సహకారంతో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది2
- హైదరాబాద్‌లో రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు నిన్న ఆర్టీసీ డ్రైవర్లు.. ఇవాళ ఆటో డ్రైవర్లు ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఆటో డ్రైవర్ల నిరసన డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్ ఆటో మీటర్‌పై ఛార్జీలు పెంచడంతోపాటు.. జిల్లా ఆటోలను హైదరాబాద్‌లోకి పర్మిషన్ ఇవ్వొద్దంటూ నిరసన సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు గంట నుండి కొనసాగుతున్న ధర్నా.. భారీగా నిలిచిపోయిన వాహనాలు1
- *తేదీ: 25-04-2026* *పత్రికా ప్రకటన* *కామారెడ్డి నియోజక అభివృద్ధిపై ఎమ్మెల్యే మరియు కలెక్టర్ సంయుక్త సమీక్ష* కామారెడ్డి: కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ "రైతే రాజు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా తార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలి" అని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ గారికి సూచించారు. "ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం మనందరి బాధ్యత. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్య అందించాలి. ‘బడిబాట’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి" అని పిలుపునిచ్చారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. "తాగునీటి పైప్‌లైన్లు ధ్వంసమై సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలి. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరిపడా మంచినీరు అందించాలి" అని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేసి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ "ఎమ్మెల్యే సూచనల మేరకు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారుడికి చేరేలా చూడాలి" అని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కలిసి పనిచేస్తే కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి, కామారెడ్డి.1
- *తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధి కల్పించి, వారి ఉత్పాదకతను పెంచి, టైలరింగ్ వ్యాపార అవకాశాలను విస్తరించుకునేందుకు మరియు స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ* *నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు వంద శాతం సబ్సిడీ తో కుట్టు మిషన్లు మంజూరు చేసేలా ఉత్తర్వులు* *పథకం అమలు పై బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు,ఇతర అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం* *మంత్రి పొన్నం ప్రభాకర్* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల పక్షాన మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి 1000 మంది మహిళలకు కుట్టు మిషన్లు 100 శాతం సబ్సిడీ తో మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.... త్వరలోనే వాటికి అప్లికేషన్ తీసుకొని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ,ముఖ్యమంత్రి గారికి సూచన మేరకు బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.. నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు చొప్పున స్వయం ఉపాధి పెంచుకొని ఆర్థికంగా ఆసరా గా ఎదగడానికి ఉపయోగపడుతుంది బలహీన వర్గాల శాఖ పక్షాన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు, స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు చేయడానికి శాఖ ప్రణాళికలు చేస్తుంది..2
- నేటి నుంచి మే 10 వరకు జన గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభించామని స్వీయ గణన దేశంలోనే తొలిసారి అమలు చేయడం జరుగుతుందని కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా తెలిపారు. కరీంనగర్లో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆర్ డి ఓ మహేశ్వర్ తో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను స్లైడ్స్ ద్వారా వివరించారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల జాబితా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. తొలిసారి స్వీయ గణన సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారని, ప్రతి కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలను స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆన్ లైన్ ప్రక్రియ నేటి నుంచి మే 10 వరకు కొనసాగుతుందన్నారు. 34 రకాల ప్రశ్నలకు సమాధానాలు పొందుపరచాలని కలెక్టర్ తెలిపారు. అందుకు సంబంధించిన వివరాల డాటాను అత్యంత భద్రంగా రహస్యంగా ఉంచబడుతుందని చెప్పారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వారికి హెచ్ తో ప్రారంభమయ్యే పదకొండు అంకెల ఐడి వస్తుందని, ఐడిని భద్రపరచుకొని ఇండ్ల గణన సమయంలో వచ్చే ఎన్యూమరేటర్ కు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ జన గణనలలో పాల్గొని అధికారులకు సహకరించాలి కలెక్టర్ చిత్రామిశ్రా కోరారు.1
- ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి రాత్రి సమయంలో లింగన్నపేట ఎల్లమ్మ ఆలయ తాళాలు పగలగొట్టాడు. అనంతరం లోపలికి ప్రవేశించి ఆలయంలోని హుండీని దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను గమనించిన గౌడ కులస్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆలయం వద్దకు చేరుకుని దొంగతనం చేస్తున్న అట్టి వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.1