జనగణనలో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభం...తొలిసారి స్వీయ గణన సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని కరీంనగర్ కలెక్టర్ వెల్లడి నేటి నుంచి మే 10 వరకు జన గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభించామని స్వీయ గణన దేశంలోనే తొలిసారి అమలు చేయడం జరుగుతుందని కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా తెలిపారు. కరీంనగర్లో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆర్ డి ఓ మహేశ్వర్ తో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను స్లైడ్స్ ద్వారా వివరించారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల జాబితా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. తొలిసారి స్వీయ గణన సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారని, ప్రతి కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలను స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆన్ లైన్ ప్రక్రియ నేటి నుంచి మే 10 వరకు కొనసాగుతుందన్నారు. 34 రకాల ప్రశ్నలకు సమాధానాలు పొందుపరచాలని కలెక్టర్ తెలిపారు. అందుకు సంబంధించిన వివరాల డాటాను అత్యంత భద్రంగా రహస్యంగా ఉంచబడుతుందని చెప్పారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వారికి హెచ్ తో ప్రారంభమయ్యే పదకొండు అంకెల ఐడి వస్తుందని, ఐడిని భద్రపరచుకొని ఇండ్ల గణన సమయంలో వచ్చే ఎన్యూమరేటర్ కు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ జన గణనలలో పాల్గొని అధికారులకు సహకరించాలి కలెక్టర్ చిత్రామిశ్రా కోరారు.

- కరీంనగర్ లో రోహన్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవ కానుకగా నిన్నటి నుంచి ఏడాది వరకు హాస్పిటల్లో అయ్యే డెలివరీల్లో ఆడ శిశువు జన్మిస్తే ఫ్రీ వైద్యం అందిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ శ్రీదేవి నరేష్ ప్రకటించారు. దీంతో ఈరోజు అఖిల సాయికృష్ణారెడ్డి దంపతులకు ఆడ శిశువు జన్మించింది. తొలి దేవి పుత్రికగా భావిస్తూ హాస్పిటలైజేషన్ ఉచితంగా అందిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాకులు తెలిపారు. దేవిపుత్రికను హాస్పిటల్ నిర్వాహకులతో పాటు బంధుమిత్రులు ఆశీర్వదిస్తూ అభినందించారు. తల్లి శిశువు క్షేమంగా ఉన్నారని, దేవి పుత్రిక స్కీమ్ కింద డెలివరీకి అయ్యే ఖర్చు మొత్తం హాస్పిటల్ భరిస్తుందని స్పష్టం చేశారు. ఆడపిల్లలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతగా హాస్పిటల్ 25 ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా దేవి పుత్రిక కానుక ఇస్తున్నట్లు ప్రకటించారు.1
- మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి వివాహము నేడు హైదరాబాదులో జరగగా ఈ వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.1
- గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో మాల సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు1
- జనగణన 2027లో భాగంగా స్వీయ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కో సాగుతుందని అందుకు సంబంధించిన వివరాలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు.జనగణన–2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైందని ఈ కార్యక్రమంలో తాను పాల్గొని స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రజలందరూ జనగణనలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం ఎంతో కీలకమని తెలిపారు. సరైన గణాంకాలు అందుబాటులోకి వస్తేనే ప్రభుత్వ పథకాలు సమర్థ వంతంగా అమలు అవుతాయని పేర్కొన్నారు. జనగణన విజయవంతం కావాలంటే ప్రజల సహకారం తప్పనిసరిగా అవసరమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.2
- వల్బాపూర్ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం కారు నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ క్రాస్ రోడ్ వద్ద రాత్రి 11 గంటల సమయంలో లారీ కారు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో భూపాలపల్లి. ప్రాంతానికి చెందిన మహేష్. రమా. స్వప్న. అందరికీ స్వల్ప గాయాలు కాగా 108 సహకారంతో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది2
- రంగారెడ్డి గచ్చిబౌలి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పరిస్థితిని గమనించిన కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వెంటనే దిగిపోయి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన సాయంత్రం సమయంలో చోటుచేసుకోవడంతో, ఇంటికి వెళ్లే వాహనదారులతో రహదారి ఇప్పటికే రద్దీగా ఉండగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టడంతో పాటు, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.3
- హన్మకొండ జిల్లా: శ్రీ రేణుక ఎల్లమ్మ ఉత్సవాల్లో భాగంగా కమలాపూర్ మండల కేంద్రంలో గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుని కుటుంబాలను చల్లగా చూడాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు రాంబాబుగౌడ్, డైరెక్టర్లు, సర్పంచ్ సతీశ్, కులస్థులు పాల్గొన్నారు.1
- మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడి వివాహం హైదరాబాద్ హైటెక్స్ లో వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రజిత దంపతుల ఏకైక కుమారుడు హరిహరన్ సాయి వివాహం దీక్ష తో కన్నుల పండువలా జరిగింది. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి ఎమ్మెల్యేను అభినందించారు. హైదరాబాదులో జరిగిన వివాహానికి ప్రముఖులు రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.4