logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడి వివాహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి...నూతన దంపతులను ఆశీర్వదించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడి వివాహం హైదరాబాద్ హైటెక్స్ లో వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రజిత దంపతుల ఏకైక కుమారుడు హరిహరన్ సాయి వివాహం దీక్ష తో కన్నుల పండువలా జరిగింది. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి ఎమ్మెల్యేను అభినందించారు. హైదరాబాదులో జరిగిన వివాహానికి ప్రముఖులు రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

3 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
3 hrs ago
e284e193-f1d2-4ea7-80b6-b67eb7944381
bc218a9a-8520-4ddf-a8e2-f3af915fa5a5

ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడి వివాహానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి...నూతన దంపతులను ఆశీర్వదించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడి వివాహం హైదరాబాద్ హైటెక్స్ లో వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రజిత దంపతుల ఏకైక కుమారుడు హరిహరన్ సాయి వివాహం దీక్ష తో కన్నుల పండువలా జరిగింది. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి ఎమ్మెల్యేను అభినందించారు. హైదరాబాదులో జరిగిన వివాహానికి ప్రముఖులు రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

More news from తెలంగాణ and nearby areas
  • గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో మాల సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు
    1
    గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామంలో
మాల సంఘం  ఆధ్వర్యంలో   గ్రామ దేవత పోచమ్మకు  బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని  మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు.  అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు.  యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా  కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • *కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఖానాపుర ఏరియాలో సెలున్ షాపులో పని చేసుకునే పగడాల రాము అనే నాయీబ్రాహ్మణుడి మీద త్రీటౌన్ ఎస్ఐ చైతన్య చందర్ కేవలం తనను అన్నా అని పిలిచినందుకు పగడాల రాము మీద దాడి వేయడంమే కాకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టిన ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులుపు కోకుండా అతడిపై రాము ఇచ్చిన పిర్యాదు అధారంగా కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.*
    1
    *కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఖానాపుర ఏరియాలో సెలున్ షాపులో పని చేసుకునే పగడాల రాము అనే నాయీబ్రాహ్మణుడి మీద త్రీటౌన్ ఎస్ఐ చైతన్య చందర్ కేవలం తనను అన్నా అని పిలిచినందుకు పగడాల రాము మీద  దాడి వేయడంమే కాకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టిన ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులుపు కోకుండా అతడిపై రాము ఇచ్చిన పిర్యాదు అధారంగా కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.*
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    4 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో సేవలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే అమెరికాలోని న్యూ జెర్సీలో శివ విష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడుకూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు. ఆలయ వాతావరణం భక్తిరసంతో నిండిపోయి ఆధ్యాత్మికంగా మారింది
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో సేవలు సమర్పించారు.
ఈ సందర్భంగా ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే అమెరికాలోని న్యూ జెర్సీలో శివ విష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడుకూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు. ఆలయ వాతావరణం భక్తిరసంతో నిండిపోయి ఆధ్యాత్మికంగా మారింది
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    3 hrs ago
  • పాము కాటుకు మూడేళ్ల బాలుడు మృతి ఎల్కతుర్తి మండలంలోని దామర గ్రామానికి చెందిన వంగ మనవిత్ యాదవ్ (3) అనే బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పాము కాటు వేసింది. వెంటనే బాలుడు తల్లికి చెప్పడంతో హుటాహుటిన భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో నాటు వైద్యం చేయించగా, అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. స్పందించిన 108 సిబ్బంది బాలుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. పాము కాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో నాటు వైద్యం చేయించడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
    2
    పాము కాటుకు మూడేళ్ల బాలుడు మృతి
ఎల్కతుర్తి మండలంలోని దామర గ్రామానికి చెందిన వంగ మనవిత్ యాదవ్ (3) అనే బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పాము కాటు వేసింది. వెంటనే బాలుడు తల్లికి చెప్పడంతో హుటాహుటిన భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో నాటు వైద్యం చేయించగా, అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. స్పందించిన 108 సిబ్బంది బాలుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. పాము కాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో నాటు వైద్యం చేయించడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    9 hrs ago
  • హన్మకొండ జిల్లా: కమలాపూర్‌ మండల కేంద్రాలో తీగల బావి హనుమాన్ మాలాధారులు ఆదివారం ఉదయం నగర సంకీర్తన ర్యాలీ నిర్వహించారు. పనగట్ల నుంచి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు సుమారు 50 ద్విచక్ర వాహనాలపై సుమారు వంద మంది భక్తులు “జై శ్రీరామ్”, “జై హనుమాన్” నినాదాలతో ర్యాలీగా సాగారు. హిందూ, సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు మాలాధారులు తెలిపారు.
    1
    హన్మకొండ జిల్లా: కమలాపూర్‌ మండల కేంద్రాలో తీగల బావి హనుమాన్ మాలాధారులు ఆదివారం ఉదయం నగర సంకీర్తన ర్యాలీ నిర్వహించారు. పనగట్ల నుంచి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు సుమారు 50 ద్విచక్ర వాహనాలపై సుమారు వంద మంది భక్తులు “జై శ్రీరామ్”, “జై హనుమాన్” నినాదాలతో ర్యాలీగా సాగారు. హిందూ, సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు మాలాధారులు తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • హైద‌రాబాద్‌లో రోడ్డెక్కిన ఆటో డ్రైవ‌ర్లు నిన్న ఆర్టీసీ డ్రైవర్లు.. ఇవాళ ఆటో డ్రైవర్లు ఎంజే మార్కెట్ చౌర‌స్తాలో ఆటో డ్రైవర్ల నిరసన డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్ ఆటో మీటర్‌పై ఛార్జీలు పెంచడంతోపాటు.. జిల్లా ఆటోలను హైదరాబాద్‌లోకి ప‌ర్మిష‌న్ ఇవ్వొద్దంటూ నిర‌స‌న‌ సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు గంట నుండి కొనసాగుతున్న ధర్నా.. భారీగా నిలిచిపోయిన వాహనాలు
    1
    హైద‌రాబాద్‌లో రోడ్డెక్కిన ఆటో డ్రైవ‌ర్లు
నిన్న ఆర్టీసీ డ్రైవర్లు.. ఇవాళ ఆటో డ్రైవర్లు 
ఎంజే మార్కెట్ చౌర‌స్తాలో ఆటో డ్రైవర్ల నిరసన 
డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్
ఆటో మీటర్‌పై ఛార్జీలు పెంచడంతోపాటు.. జిల్లా ఆటోలను హైదరాబాద్‌లోకి ప‌ర్మిష‌న్ ఇవ్వొద్దంటూ నిర‌స‌న‌
సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు
గంట నుండి కొనసాగుతున్న ధర్నా.. భారీగా నిలిచిపోయిన వాహనాలు
    user_KHADEER REPORTER
    KHADEER REPORTER
    Journalist జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
  • నేటి నుంచి మే 10 వరకు జన గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభించామని స్వీయ గణన దేశంలోనే తొలిసారి అమలు చేయడం జరుగుతుందని కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా తెలిపారు. కరీంనగర్లో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆర్ డి ఓ మహేశ్వర్ తో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను స్లైడ్స్ ద్వారా వివరించారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల జాబితా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. తొలిసారి స్వీయ గణన సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారని, ప్రతి కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలను స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆన్ లైన్ ప్రక్రియ నేటి నుంచి మే 10 వరకు కొనసాగుతుందన్నారు. 34 రకాల ప్రశ్నలకు సమాధానాలు పొందుపరచాలని కలెక్టర్ తెలిపారు. అందుకు సంబంధించిన వివరాల డాటాను అత్యంత భద్రంగా రహస్యంగా ఉంచబడుతుందని చెప్పారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వారికి హెచ్ తో ప్రారంభమయ్యే పదకొండు అంకెల ఐడి వస్తుందని, ఐడిని భద్రపరచుకొని ఇండ్ల గణన సమయంలో వచ్చే ఎన్యూమరేటర్ కు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ జన గణనలలో పాల్గొని అధికారులకు సహకరించాలి కలెక్టర్ చిత్రామిశ్రా కోరారు.
    1
    నేటి నుంచి మే 10 వరకు జన గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభించామని స్వీయ గణన దేశంలోనే తొలిసారి అమలు చేయడం జరుగుతుందని కరీంనగర్ కలెక్టర్ చిత్రమిశ్రా తెలిపారు. కరీంనగర్లో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆర్ డి ఓ మహేశ్వర్ తో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను స్లైడ్స్ ద్వారా వివరించారు. మొదటి దశలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల జాబితా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. తొలిసారి స్వీయ గణన సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చారని,
ప్రతి కుటుంబం తమ గృహానికి సంబంధించిన వివరాలను స్వయంగా ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని సూచించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆన్ లైన్ ప్రక్రియ నేటి నుంచి మే 10 వరకు కొనసాగుతుందన్నారు. 34 రకాల ప్రశ్నలకు సమాధానాలు పొందుపరచాలని కలెక్టర్ తెలిపారు. అందుకు సంబంధించిన వివరాల డాటాను అత్యంత భద్రంగా రహస్యంగా ఉంచబడుతుందని చెప్పారు.
సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్న వారికి హెచ్ తో ప్రారంభమయ్యే పదకొండు అంకెల ఐడి వస్తుందని, ఐడిని భద్రపరచుకొని ఇండ్ల గణన సమయంలో వచ్చే ఎన్యూమరేటర్ కు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ జన గణనలలో పాల్గొని అధికారులకు సహకరించాలి కలెక్టర్ చిత్రామిశ్రా కోరారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    3 hrs ago
  • *తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధి కల్పించి, వారి ఉత్పాదకతను పెంచి, టైలరింగ్ వ్యాపార అవకాశాలను విస్తరించుకునేందుకు మరియు స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ* *నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు వంద శాతం సబ్సిడీ తో కుట్టు మిషన్లు మంజూరు చేసేలా ఉత్తర్వులు* *పథకం అమలు పై బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు,ఇతర అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం* *మంత్రి పొన్నం ప్రభాకర్* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల పక్షాన మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి 1000 మంది మహిళలకు కుట్టు మిషన్లు 100 శాతం సబ్సిడీ తో మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.... త్వరలోనే వాటికి అప్లికేషన్ తీసుకొని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి ,ముఖ్యమంత్రి గారికి సూచన మేరకు బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.. నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు చొప్పున స్వయం ఉపాధి పెంచుకొని ఆర్థికంగా ఆసరా గా ఎదగడానికి ఉపయోగపడుతుంది బలహీన వర్గాల శాఖ పక్షాన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు, స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు చేయడానికి శాఖ ప్రణాళికలు చేస్తుంది..
    2
    *తెలంగాణ రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన బీసీ మహిళలకు టైలరింగ్ ఆధారిత స్వయం ఉపాధి కల్పించి, వారి ఉత్పాదకతను పెంచి, టైలరింగ్ వ్యాపార అవకాశాలను విస్తరించుకునేందుకు మరియు స్వయం సమృద్ధిగల పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆటోమేటిక్ కుట్టు యంత్రాలను సరఫరా చేయాలని ఉత్తర్వులు జారీ*
*నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు వంద శాతం సబ్సిడీ తో కుట్టు మిషన్లు మంజూరు చేసేలా ఉత్తర్వులు*
*పథకం అమలు పై బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ బాలమయాదేవి, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్య బట్టు,ఇతర అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం*
*మంత్రి పొన్నం ప్రభాకర్*
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల పక్షాన  మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి ప్రతి నియోజకవర్గానికి 1000 మంది మహిళలకు కుట్టు మిషన్లు 100 శాతం సబ్సిడీ తో  మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది....
త్వరలోనే వాటికి అప్లికేషన్ తీసుకొని జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
ముఖ్యమంత్రి గారి ,ముఖ్యమంత్రి గారికి సూచన మేరకు బలహీన వర్గాల మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది..
నియోజకవర్గానికి వెయ్యి మంది మహిళలకు చొప్పున స్వయం ఉపాధి పెంచుకొని ఆర్థికంగా ఆసరా గా ఎదగడానికి ఉపయోగపడుతుంది
బలహీన వర్గాల శాఖ పక్షాన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెంచడంతోపాటు, స్కిల్ డెవలప్మెంట్ లాంటి కార్యక్రమాలు చేయడానికి శాఖ ప్రణాళికలు చేస్తుంది..
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    7 hrs ago
  • ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి రాత్రి సమయంలో లింగన్నపేట ఎల్లమ్మ ఆలయ తాళాలు పగలగొట్టాడు. అనంతరం లోపలికి ప్రవేశించి ఆలయంలోని హుండీని దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను గమనించిన గౌడ కులస్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆలయం వద్దకు చేరుకుని దొంగతనం చేస్తున్న అట్టి వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
    1
    ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం చేసేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి రాత్రి సమయంలో లింగన్నపేట ఎల్లమ్మ ఆలయ తాళాలు పగలగొట్టాడు. అనంతరం లోపలికి ప్రవేశించి ఆలయంలోని హుండీని దోచుకునేందుకు ప్రయత్నించాడు. ఆలయ పరిసరాల్లోని సీసీ కెమెరా దృశ్యాలను గమనించిన గౌడ కులస్తులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆలయం వద్దకు చేరుకుని దొంగతనం చేస్తున్న అట్టి వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.