logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కమలాపూర్‌లో హనుమాన్ మాలాధారుల భారీ నగర సంకీర్తన ర్యాలీ – జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన వీధులు హన్మకొండ జిల్లా: కమలాపూర్‌ మండల కేంద్రాలో తీగల బావి హనుమాన్ మాలాధారులు ఆదివారం ఉదయం నగర సంకీర్తన ర్యాలీ నిర్వహించారు. పనగట్ల నుంచి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు సుమారు 50 ద్విచక్ర వాహనాలపై సుమారు వంద మంది భక్తులు “జై శ్రీరామ్”, “జై హనుమాన్” నినాదాలతో ర్యాలీగా సాగారు. హిందూ, సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు మాలాధారులు తెలిపారు.

5 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
5 hrs ago

కమలాపూర్‌లో హనుమాన్ మాలాధారుల భారీ నగర సంకీర్తన ర్యాలీ – జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన వీధులు హన్మకొండ జిల్లా: కమలాపూర్‌ మండల కేంద్రాలో తీగల బావి హనుమాన్ మాలాధారులు ఆదివారం ఉదయం నగర సంకీర్తన ర్యాలీ నిర్వహించారు. పనగట్ల నుంచి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు సుమారు 50 ద్విచక్ర వాహనాలపై సుమారు వంద మంది భక్తులు “జై శ్రీరామ్”, “జై హనుమాన్” నినాదాలతో ర్యాలీగా సాగారు. హిందూ, సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు మాలాధారులు తెలిపారు.

More news from తెలంగాణ and nearby areas
  • హన్మకొండ జిల్లా: శ్రీ రేణుక ఎల్లమ్మ ఉత్సవాల్లో భాగంగా కమలాపూర్ మండల కేంద్రంలో గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుని కుటుంబాలను చల్లగా చూడాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు రాంబాబుగౌడ్, డైరెక్టర్లు, సర్పంచ్ సతీశ్, కులస్థులు పాల్గొన్నారు.
    1
    హన్మకొండ జిల్లా: శ్రీ రేణుక ఎల్లమ్మ ఉత్సవాల్లో భాగంగా కమలాపూర్ మండల కేంద్రంలో గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుని కుటుంబాలను చల్లగా చూడాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు రాంబాబుగౌడ్, డైరెక్టర్లు, సర్పంచ్ సతీశ్, కులస్థులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • భారత జనగణన 2027 స్వీయ గణనపై అవగాహన కార్యక్రమం భారత జనగణన 2027 స్వీయ గణన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో స్వీయ గణన (Self Enumeration) కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ టీపీటీ (TPT) ద్వారా స్వీయ గణన విధానంపై వివరంగా తెలియజేశారు. ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునే విధానం సులభతరం చేయబడిందని, దీనివల్ల ఖచ్చితమైన సమాచారం సేకరణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
    3
    భారత జనగణన 2027 స్వీయ గణనపై అవగాహన కార్యక్రమం
భారత జనగణన 2027 స్వీయ గణన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనగణన ప్రక్రియలో స్వీయ గణన (Self Enumeration) కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ టీపీటీ (TPT) ద్వారా స్వీయ గణన విధానంపై వివరంగా తెలియజేశారు. ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను నమోదు చేసుకునే విధానం సులభతరం చేయబడిందని, దీనివల్ల ఖచ్చితమైన సమాచారం సేకరణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    1 hr ago
  • రంగారెడ్డి గచ్చిబౌలి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పరిస్థితిని గమనించిన కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వెంటనే దిగిపోయి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన సాయంత్రం సమయంలో చోటుచేసుకోవడంతో, ఇంటికి వెళ్లే వాహనదారులతో రహదారి ఇప్పటికే రద్దీగా ఉండగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టడంతో పాటు, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
    3
    రంగారెడ్డి 
గచ్చిబౌలి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. 
పరిస్థితిని గమనించిన కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వెంటనే దిగిపోయి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
ఈ ఘటన సాయంత్రం సమయంలో చోటుచేసుకోవడంతో, ఇంటికి వెళ్లే వాహనదారులతో రహదారి ఇప్పటికే రద్దీగా ఉండగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టడంతో పాటు, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    22 hrs ago
  • కాకి చొక్కా ఒంటిపై ఉందన్నా అహంకారంతో ఒక సామాన్య సెలూన్ కార్మికుడి పై ప్రతాపం చూపించాడు ఓ పోలీస్ అధికారి, కరీంనగర్ నగరంలోని ఖాన్ పురా, ఏరియాలో ఈరోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది, కరీంనగర్ జిల్లాలో పోలీస్ అధికారి చేసిన పని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఖాన్ పురా ఏరియాలో ఉన్న సెలూన్‌కు కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై షేవింగ్ చేయించు కోవడానికి వెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న రాము అనే వర్కర్, ఎస్సైని ఉద్దేశించి గౌరవంగా కూర్చో అన్నా అని పలికారు. అయితే, ఆ పిలుపు విని సదరు అధికారి ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. నన్నే అన్నా అంటావా?” అంటూ మండిపడ్డ ఎస్సై, తన హోదాను అడ్డం పెట్టుకుని రాముపై బూతులు తిడుతూ.. విచక్షణార హితంగా దాడి చేశారు. ఒక సామాన్యుడు తనను ‘అన్నా’ అని సంబోధించ డం ఆ అధికారి అహం కారాన్ని దెబ్బతీసినట్లుగా ఆయన ప్రవర్తన ఉంది. సెలూన్‌లో అందరూ చూ స్తుండగానే బాధితుడిపై చేయి చేసుకుని అసభ్య పదజాలంతో దూషించారు. ఈ దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలన్నీ సెలూన్‌ లోని సిసిటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఎస్సై వర్కర్‌ను కొట్టడం, దురుసుగా ప్రవర్తించడం వంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీ సింగ్?” అంటూ పోలీస్ శాఖపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సామాన్యులపై ఇలాంటి దాడులు పోలీస్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యు డైన త్రీటౌన్ ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు,స్థానికులు కోరుతున్నారు.
    1
    కాకి చొక్కా ఒంటిపై ఉందన్నా అహంకారంతో ఒక సామాన్య సెలూన్ కార్మికుడి పై ప్రతాపం చూపించాడు ఓ పోలీస్ అధికారి, కరీంనగర్ నగరంలోని ఖాన్ పురా, ఏరియాలో ఈరోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది, కరీంనగర్ జిల్లాలో పోలీస్ అధికారి చేసిన పని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఖాన్ పురా ఏరియాలో ఉన్న  సెలూన్‌కు కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై షేవింగ్ చేయించు కోవడానికి వెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న రాము అనే వర్కర్, ఎస్సైని ఉద్దేశించి గౌరవంగా కూర్చో అన్నా అని పలికారు. 
అయితే, ఆ పిలుపు విని సదరు అధికారి ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. నన్నే అన్నా అంటావా?” అంటూ మండిపడ్డ ఎస్సై, తన హోదాను అడ్డం పెట్టుకుని రాముపై బూతులు తిడుతూ.. విచక్షణార హితంగా దాడి చేశారు. ఒక సామాన్యుడు తనను ‘అన్నా’ అని సంబోధించ డం ఆ అధికారి అహం కారాన్ని దెబ్బతీసినట్లుగా ఆయన ప్రవర్తన ఉంది. సెలూన్‌లో అందరూ చూ స్తుండగానే బాధితుడిపై చేయి చేసుకుని అసభ్య పదజాలంతో దూషించారు. 
ఈ దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలన్నీ సెలూన్‌ లోని సిసిటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఎస్సై వర్కర్‌ను కొట్టడం, దురుసుగా ప్రవర్తించడం వంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీ సింగ్?” అంటూ పోలీస్ శాఖపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. 
సామాన్యులపై ఇలాంటి దాడులు పోలీస్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యు డైన త్రీటౌన్ ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు,స్థానికులు కోరుతున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    23 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 15 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతులు కొమురయ్య (3 ఎకరాలు), సురేష్ (2 ఎకరాలు), ఐలయ్య (3 ఎకరాలు), జక్కుల కట్టమల్లు (3 ఎకరాలు), పుణ్యపుర్తి ఐలయ్య (4 ఎకరాలు)లకు చెందిన పంటలు మంటల్లో కాలిపోయాయి. ఒక్కసారిగా పొలాల్లో మంటలు వ్యాపించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు తెలియజేయగా, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బాధిత రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఘటన పై విచారణ ప్రారంభించారు.
    1
    మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 15 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతులు కొమురయ్య (3 ఎకరాలు), సురేష్ (2 ఎకరాలు), ఐలయ్య (3 ఎకరాలు), జక్కుల కట్టమల్లు (3 ఎకరాలు), పుణ్యపుర్తి ఐలయ్య (4 ఎకరాలు)లకు చెందిన పంటలు మంటల్లో కాలిపోయాయి. ఒక్కసారిగా పొలాల్లో మంటలు వ్యాపించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు తెలియజేయగా, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బాధిత రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఘటన పై విచారణ ప్రారంభించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    37 min ago
  • కరీంనగర్ లో రోహన్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవ కానుకగా నిన్నటి నుంచి ఏడాది వరకు హాస్పిటల్లో అయ్యే డెలివరీల్లో ఆడ శిశువు జన్మిస్తే ఫ్రీ వైద్యం అందిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ శ్రీదేవి నరేష్ ప్రకటించారు. దీంతో ఈరోజు అఖిల సాయికృష్ణారెడ్డి దంపతులకు ఆడ శిశువు జన్మించింది. తొలి దేవి పుత్రికగా భావిస్తూ హాస్పిటలైజేషన్ ఉచితంగా అందిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాకులు తెలిపారు. దేవిపుత్రికను హాస్పిటల్ నిర్వాహకులతో పాటు బంధుమిత్రులు ఆశీర్వదిస్తూ అభినందించారు. తల్లి శిశువు క్షేమంగా ఉన్నారని, దేవి పుత్రిక స్కీమ్ కింద డెలివరీకి అయ్యే ఖర్చు మొత్తం హాస్పిటల్ భరిస్తుందని స్పష్టం చేశారు. ఆడపిల్లలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతగా హాస్పిటల్ 25 ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా దేవి పుత్రిక కానుక ఇస్తున్నట్లు ప్రకటించారు.
    1
    కరీంనగర్ లో రోహన్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవ కానుకగా నిన్నటి నుంచి ఏడాది వరకు హాస్పిటల్లో అయ్యే డెలివరీల్లో ఆడ శిశువు జన్మిస్తే ఫ్రీ వైద్యం అందిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ శ్రీదేవి నరేష్ ప్రకటించారు. దీంతో ఈరోజు అఖిల సాయికృష్ణారెడ్డి దంపతులకు ఆడ శిశువు జన్మించింది. తొలి దేవి పుత్రికగా భావిస్తూ హాస్పిటలైజేషన్ ఉచితంగా అందిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాకులు తెలిపారు. దేవిపుత్రికను హాస్పిటల్ నిర్వాహకులతో పాటు బంధుమిత్రులు ఆశీర్వదిస్తూ అభినందించారు. తల్లి శిశువు క్షేమంగా ఉన్నారని, దేవి పుత్రిక స్కీమ్ కింద డెలివరీకి అయ్యే ఖర్చు మొత్తం హాస్పిటల్ భరిస్తుందని స్పష్టం చేశారు. ఆడపిల్లలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతగా హాస్పిటల్ 25 ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా దేవి పుత్రిక కానుక ఇస్తున్నట్లు ప్రకటించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • * నకిరేకల్ నియోజకవర్గం కేతపల్లి 25 : ​ఐకేపీ కేంద్రాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సినవి, కానీ వాస్తవానికి ఇవి ఇప్పుడు అధికార పార్టీ నాయకులు మరియు వారి అనుచరుల కనుసన్నల్లో నడిచే ప్రైవేటు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. అసలు విషయం ఏమిటంటే, ఈ కేంద్రాల నిర్వహణ పూర్తిగా అధికార పార్టీ నాయకులు మరియు కార్యకర్తల చేతుల్లోనే ఉంది; అధికారులు కేవలం నామమాత్రంగా ఉంటూ, వీరి అక్రమాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. పద్ధతి ప్రకారం మాచర్ వచ్చిన రైతుల సీరియల్ నంబర్ల వారీగా వడ్లను సేకరించాల్సింది పోయి, ఇక్కడ మాత్రం అధికార పార్టీ నాయకులు తమ సొంత నిర్ణయాలతో గ్రామాలలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఉదాహరణకి కేతేపల్లి గ్రామంలో 20 రోజుల క్రితం మాచర్ వచ్చి సీరియల్ వచ్చిన వారి కాకుండా అధికార పార్టీ వారివి లేదా వారికి అనుకూలంగా ఉన్న వారివి మాత్రమే కాటాలు వేస్తున్నారు ఈ విధంగా జరుగుతుందని కేతేపల్లి మండల తాసిల్దార్ గారికి తెలియజేసిన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ధాన్యం కొనుగోలు సెంటర్ల మండల మానిటరింగ్ ఆఫీసర్ వంశీ గారికి ఫిర్యాదు చేసిన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే వంశీ అధికారి గారు సీరియల్ ప్రకారంగా వచ్చిన రైతులకి బస్తాలు ఇప్పిస్తే ఆ అధికారికి నియోజకవర్గ స్థాయి నాయకునితో ఫోన్ చేపించి మళ్లీ ఆ రైతుల వద్ద నుండి బస్తాలు తిరిగి తెప్పించుకోవడం జరిగింది అంటే దాన్యం కొనుగోలు ఒక్క అధికార పార్టీకి సంబంధించిన రైతులకు మాత్రమే చేస్తారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మొదటి రోజే సీరియల్ వచ్చిన రైతులని కాదని వారికి అనుకూలంగా ఉన్న వారివి మాత్రమే కాటా పెడతారా *ఇదేనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన ప్రజాపాలన భాగమేనా ఈ కొనుగోలు* కేంద్రాలు చేసే నిర్వహణ మీకు సాక్ష్యంగా ఈ క్రింది వీడియోలు చూస్తే తెలిసిపోతుంది ఇచ్చిన బస్తాలు రైతుల వద్ద నుంచి అధికారులను బెదిరించి తెప్పించుకుంటున్నారు
    1
    * నకిరేకల్ నియోజకవర్గం కేతపల్లి 25 :
​ఐకేపీ కేంద్రాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సినవి, కానీ వాస్తవానికి ఇవి ఇప్పుడు అధికార పార్టీ నాయకులు మరియు వారి అనుచరుల కనుసన్నల్లో నడిచే ప్రైవేటు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. అసలు విషయం ఏమిటంటే, ఈ కేంద్రాల నిర్వహణ పూర్తిగా అధికార పార్టీ నాయకులు మరియు కార్యకర్తల చేతుల్లోనే ఉంది; అధికారులు కేవలం నామమాత్రంగా ఉంటూ, వీరి అక్రమాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. పద్ధతి ప్రకారం మాచర్ వచ్చిన రైతుల సీరియల్ నంబర్ల వారీగా వడ్లను సేకరించాల్సింది పోయి, ఇక్కడ మాత్రం అధికార పార్టీ నాయకులు తమ సొంత నిర్ణయాలతో గ్రామాలలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఉదాహరణకి కేతేపల్లి గ్రామంలో 20 రోజుల క్రితం మాచర్ వచ్చి సీరియల్ వచ్చిన వారి కాకుండా అధికార పార్టీ వారివి లేదా వారికి అనుకూలంగా ఉన్న వారివి మాత్రమే కాటాలు వేస్తున్నారు ఈ విధంగా జరుగుతుందని కేతేపల్లి మండల తాసిల్దార్ గారికి తెలియజేసిన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది  ధాన్యం కొనుగోలు సెంటర్ల మండల మానిటరింగ్ ఆఫీసర్ వంశీ గారికి ఫిర్యాదు చేసిన ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే వంశీ  అధికారి గారు సీరియల్ ప్రకారంగా వచ్చిన రైతులకి  బస్తాలు ఇప్పిస్తే ఆ అధికారికి నియోజకవర్గ స్థాయి నాయకునితో ఫోన్ చేపించి మళ్లీ ఆ రైతుల వద్ద నుండి బస్తాలు తిరిగి తెప్పించుకోవడం జరిగింది అంటే దాన్యం కొనుగోలు ఒక్క అధికార పార్టీకి సంబంధించిన రైతులకు మాత్రమే చేస్తారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన మొదటి రోజే సీరియల్ వచ్చిన రైతులని కాదని వారికి అనుకూలంగా ఉన్న వారివి మాత్రమే కాటా పెడతారా *ఇదేనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన ప్రజాపాలన భాగమేనా ఈ కొనుగోలు* కేంద్రాలు చేసే నిర్వహణ మీకు సాక్ష్యంగా ఈ క్రింది వీడియోలు చూస్తే తెలిసిపోతుంది ఇచ్చిన బస్తాలు రైతుల వద్ద నుంచి అధికారులను బెదిరించి తెప్పించుకుంటున్నారు
    user_PRK
    PRK
    Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
    23 hrs ago
  • హన్మకొండ జిల్లా: కమలాపూర్‌ మండల కేంద్రాలో తీగల బావి హనుమాన్ మాలాధారులు ఆదివారం ఉదయం నగర సంకీర్తన ర్యాలీ నిర్వహించారు. పనగట్ల నుంచి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు సుమారు 50 ద్విచక్ర వాహనాలపై సుమారు వంద మంది భక్తులు “జై శ్రీరామ్”, “జై హనుమాన్” నినాదాలతో ర్యాలీగా సాగారు. హిందూ, సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు మాలాధారులు తెలిపారు.
    1
    హన్మకొండ జిల్లా: కమలాపూర్‌ మండల కేంద్రాలో తీగల బావి హనుమాన్ మాలాధారులు ఆదివారం ఉదయం నగర సంకీర్తన ర్యాలీ నిర్వహించారు. పనగట్ల నుంచి విద్యుత్ సబ్‌స్టేషన్ వరకు సుమారు 50 ద్విచక్ర వాహనాలపై సుమారు వంద మంది భక్తులు “జై శ్రీరామ్”, “జై హనుమాన్” నినాదాలతో ర్యాలీగా సాగారు. హిందూ, సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు మాలాధారులు తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.