మహబూబాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. 15 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 15 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతులు కొమురయ్య (3 ఎకరాలు), సురేష్ (2 ఎకరాలు), ఐలయ్య (3 ఎకరాలు), జక్కుల కట్టమల్లు (3 ఎకరాలు), పుణ్యపుర్తి ఐలయ్య (4 ఎకరాలు)లకు చెందిన పంటలు మంటల్లో కాలిపోయాయి. ఒక్కసారిగా పొలాల్లో మంటలు వ్యాపించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు తెలియజేయగా, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బాధిత రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఘటన పై విచారణ ప్రారంభించారు.
మహబూబాబాద్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం. 15 ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం మహబూబాబాద్ జిల్లా, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో సుమారు 15 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. గ్రామానికి చెందిన రైతులు కొమురయ్య (3 ఎకరాలు), సురేష్ (2 ఎకరాలు), ఐలయ్య (3 ఎకరాలు), జక్కుల కట్టమల్లు (3 ఎకరాలు), పుణ్యపుర్తి ఐలయ్య (4 ఎకరాలు)లకు చెందిన పంటలు మంటల్లో కాలిపోయాయి. ఒక్కసారిగా పొలాల్లో మంటలు వ్యాపించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు తెలియజేయగా, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగిపోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బాధిత రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు ఘటన పై విచారణ ప్రారంభించారు.
- వల్బాపూర్ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం కారు నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ క్రాస్ రోడ్ వద్ద రాత్రి 11 గంటల సమయంలో లారీ కారు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో భూపాలపల్లి. ప్రాంతానికి చెందిన మహేష్. రమా. స్వప్న. అందరికీ స్వల్ప గాయాలు కాగా 108 సహకారంతో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది2
- కరీంనగర్ లో రోహన్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవ కానుకగా నిన్నటి నుంచి ఏడాది వరకు హాస్పిటల్లో అయ్యే డెలివరీల్లో ఆడ శిశువు జన్మిస్తే ఫ్రీ వైద్యం అందిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ శ్రీదేవి నరేష్ ప్రకటించారు. దీంతో ఈరోజు అఖిల సాయికృష్ణారెడ్డి దంపతులకు ఆడ శిశువు జన్మించింది. తొలి దేవి పుత్రికగా భావిస్తూ హాస్పిటలైజేషన్ ఉచితంగా అందిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాకులు తెలిపారు. దేవిపుత్రికను హాస్పిటల్ నిర్వాహకులతో పాటు బంధుమిత్రులు ఆశీర్వదిస్తూ అభినందించారు. తల్లి శిశువు క్షేమంగా ఉన్నారని, దేవి పుత్రిక స్కీమ్ కింద డెలివరీకి అయ్యే ఖర్చు మొత్తం హాస్పిటల్ భరిస్తుందని స్పష్టం చేశారు. ఆడపిల్లలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతగా హాస్పిటల్ 25 ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా దేవి పుత్రిక కానుక ఇస్తున్నట్లు ప్రకటించారు.1
- అమరావతి .. ఆర్యవైశ్య కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం అమ్మవారికి పుట్టినరోజు సందర్భంగా తెల్లవారు జామున నాలుగు గంటలకు గణపతి కి అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాభిషేకాలు చేపట్టారు.అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు ఈచర్ల బాలాజీ అమ్మవారిని అలంకరించారు. విచ్చేసిన భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కలిగించారు. ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆర్యవైశ్య మహిళా మండలి వారు అమ్మవారు లలితా సహస్రనామం పూజలు నిర్వహించారు. అమ్మవారికి లక్ష మల్లెల అర్చన అత్యంత వైభవంగా ఆర్యవైశ్య మహిళలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షుడు చేగు రాము సెక్రెటరీ పసుమర్తి సుబ్బారావు గౌరవ అధ్యక్షులు పారేపల్లి రాధాకృష్ణ ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాసరావు పులిపాటి పవన్ కుమార్ కొప్పురావూరి గణేష్ తదితరులు పాల్గొన్నారు.2
- హైదరాబాద్‌లో రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు నిన్న ఆర్టీసీ డ్రైవర్లు.. ఇవాళ ఆటో డ్రైవర్లు ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఆటో డ్రైవర్ల నిరసన డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్ ఆటో మీటర్‌పై ఛార్జీలు పెంచడంతోపాటు.. జిల్లా ఆటోలను హైదరాబాద్‌లోకి పర్మిషన్ ఇవ్వొద్దంటూ నిరసన సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు గంట నుండి కొనసాగుతున్న ధర్నా.. భారీగా నిలిచిపోయిన వాహనాలు1
- వేసవి సెలవులు లో విద్యార్థులు తమ సమయ పాలనలో తల్లిదండ్రులు తో గడపాలని కోరుకుంటున్నాము.1
- గన్నేరువరం మండలం మైలారం–కాసింపేట చౌరస్తా వద్ద ఆదివారం బైక్‌పై గొర్రెను తరలిస్తున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం ఖాసింపేట గ్రామానికి చెందిన సందవేని నాగరాజు గొర్రెలను మేపుకుంటూ వెళ్తుండగా, వెనకాల ఉన్న ఒక గొర్రెను గన్నేరువరం మండలానికి ఒక ఫంక్షన్‌కు వచ్చిన ముగ్గురు వ్యక్తులు అపహరించినట్లు తెలిసింది. వీరు బెజ్జంకి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అనంతరం వారు TS26D9283 నంబర్ గల రెడ్ కలర్ గ్లామర్ బైక్‌పై గొర్రెను తీసుకెళ్తుండగా, గన్నేరువరం వద్ద గొర్ల కాపర్లు వెంబడించి పట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురిలో ఒకరు పరారీలోకి వెళ్లినట్లు సమాచారం. మిగతా ఇద్దరిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- జనగామ జిల్లాలో ప్రజా పాలన-ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా “హ్యాపీ సండే” నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమీషనర్ మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ కుంట వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో యోగాసనాలు, నవ్వుల కార్యక్రమం నిర్వహించారు. తడి-పొడి చెత్త వేరు చేసే విధానంపై ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణ ప్రజలు పాల్గొన్నారు.1
- పాము కాటుకు మూడేళ్ల బాలుడు మృతి ఎల్కతుర్తి మండలంలోని దామర గ్రామానికి చెందిన వంగ మనవిత్ యాదవ్ (3) అనే బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పాము కాటు వేసింది. వెంటనే బాలుడు తల్లికి చెప్పడంతో హుటాహుటిన భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో నాటు వైద్యం చేయించగా, అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. స్పందించిన 108 సిబ్బంది బాలుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. పాము కాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో నాటు వైద్యం చేయించడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.2
- మాజీమంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడి వివాహం హైదరాబాద్ హైటెక్స్ లో వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రజిత దంపతుల ఏకైక కుమారుడు హరిహరన్ సాయి వివాహం దీక్ష తో కన్నుల పండువలా జరిగింది. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే కుమారుడి వివాహానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి ఎమ్మెల్యేను అభినందించారు. హైదరాబాదులో జరిగిన వివాహానికి ప్రముఖులు రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.4