Shuru
Apke Nagar Ki App…
పాముకాటుకు మూడేళ్ల బాలుడు మృతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఘటన పాము కాటుకు మూడేళ్ల బాలుడు మృతి ఎల్కతుర్తి మండలంలోని దామర గ్రామానికి చెందిన వంగ మనవిత్ యాదవ్ (3) అనే బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పాము కాటు వేసింది. వెంటనే బాలుడు తల్లికి చెప్పడంతో హుటాహుటిన భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో నాటు వైద్యం చేయించగా, అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. స్పందించిన 108 సిబ్బంది బాలుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. పాము కాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో నాటు వైద్యం చేయించడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
Amar valmhikhi
పాముకాటుకు మూడేళ్ల బాలుడు మృతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఘటన పాము కాటుకు మూడేళ్ల బాలుడు మృతి ఎల్కతుర్తి మండలంలోని దామర గ్రామానికి చెందిన వంగ మనవిత్ యాదవ్ (3) అనే బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పాము కాటు వేసింది. వెంటనే బాలుడు తల్లికి చెప్పడంతో హుటాహుటిన భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో నాటు వైద్యం చేయించగా, అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. స్పందించిన 108 సిబ్బంది బాలుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. పాము కాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో నాటు వైద్యం చేయించడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- వల్బాపూర్ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం కారు నడుపుతున్న వ్యక్తికి స్వల్ప గాయాలు హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ క్రాస్ రోడ్ వద్ద రాత్రి 11 గంటల సమయంలో లారీ కారు ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో భూపాలపల్లి. ప్రాంతానికి చెందిన మహేష్. రమా. స్వప్న. అందరికీ స్వల్ప గాయాలు కాగా 108 సహకారంతో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది2
- రంగారెడ్డి గచ్చిబౌలి నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పరిస్థితిని గమనించిన కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు వెంటనే దిగిపోయి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన సాయంత్రం సమయంలో చోటుచేసుకోవడంతో, ఇంటికి వెళ్లే వాహనదారులతో రహదారి ఇప్పటికే రద్దీగా ఉండగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టడంతో పాటు, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.3
- హన్మకొండ జిల్లా: శ్రీ రేణుక ఎల్లమ్మ ఉత్సవాల్లో భాగంగా కమలాపూర్ మండల కేంద్రంలో గీత పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌడ మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగింపుగా పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుని కుటుంబాలను చల్లగా చూడాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు రాంబాబుగౌడ్, డైరెక్టర్లు, సర్పంచ్ సతీశ్, కులస్థులు పాల్గొన్నారు.1
- కాకి చొక్కా ఒంటిపై ఉందన్నా అహంకారంతో ఒక సామాన్య సెలూన్ కార్మికుడి పై ప్రతాపం చూపించాడు ఓ పోలీస్ అధికారి, కరీంనగర్ నగరంలోని ఖాన్ పురా, ఏరియాలో ఈరోజు ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది, కరీంనగర్ జిల్లాలో పోలీస్ అధికారి చేసిన పని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఖాన్ పురా ఏరియాలో ఉన్న సెలూన్‌కు కరీంనగర్ త్రీటౌన్ ఎస్సై షేవింగ్ చేయించు కోవడానికి వెళ్లారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న రాము అనే వర్కర్, ఎస్సైని ఉద్దేశించి గౌరవంగా కూర్చో అన్నా అని పలికారు. అయితే, ఆ పిలుపు విని సదరు అధికారి ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. నన్నే అన్నా అంటావా?” అంటూ మండిపడ్డ ఎస్సై, తన హోదాను అడ్డం పెట్టుకుని రాముపై బూతులు తిడుతూ.. విచక్షణార హితంగా దాడి చేశారు. ఒక సామాన్యుడు తనను ‘అన్నా’ అని సంబోధించ డం ఆ అధికారి అహం కారాన్ని దెబ్బతీసినట్లుగా ఆయన ప్రవర్తన ఉంది. సెలూన్‌లో అందరూ చూ స్తుండగానే బాధితుడిపై చేయి చేసుకుని అసభ్య పదజాలంతో దూషించారు. ఈ దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలన్నీ సెలూన్ లోని సిసిటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఎస్సై వర్కర్‌ను కొట్టడం, దురుసుగా ప్రవర్తించడం వంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేనా మీ ఫ్రెండ్లీ పోలీ సింగ్?” అంటూ పోలీస్ శాఖపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సామాన్యులపై ఇలాంటి దాడులు పోలీస్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యు డైన త్రీటౌన్ ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు,స్థానికులు కోరుతున్నారు.1
- కరీంనగర్ లో రోహన్ హాస్పిటల్ 25వ వార్షికోత్సవ కానుకగా నిన్నటి నుంచి ఏడాది వరకు హాస్పిటల్లో అయ్యే డెలివరీల్లో ఆడ శిశువు జన్మిస్తే ఫ్రీ వైద్యం అందిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ శ్రీదేవి నరేష్ ప్రకటించారు. దీంతో ఈరోజు అఖిల సాయికృష్ణారెడ్డి దంపతులకు ఆడ శిశువు జన్మించింది. తొలి దేవి పుత్రికగా భావిస్తూ హాస్పిటలైజేషన్ ఉచితంగా అందిస్తున్నట్లు హాస్పిటల్ నిర్వాకులు తెలిపారు. దేవిపుత్రికను హాస్పిటల్ నిర్వాహకులతో పాటు బంధుమిత్రులు ఆశీర్వదిస్తూ అభినందించారు. తల్లి శిశువు క్షేమంగా ఉన్నారని, దేవి పుత్రిక స్కీమ్ కింద డెలివరీకి అయ్యే ఖర్చు మొత్తం హాస్పిటల్ భరిస్తుందని స్పష్టం చేశారు. ఆడపిల్లలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతగా హాస్పిటల్ 25 ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా దేవి పుత్రిక కానుక ఇస్తున్నట్లు ప్రకటించారు.1
- ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో అటెండ్ అవ్వండి 👆👆1
- మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి వివాహము నేడు హైదరాబాదులో జరగగా ఈ వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.1
- పాము కాటుకు మూడేళ్ల బాలుడు మృతి ఎల్కతుర్తి మండలంలోని దామర గ్రామానికి చెందిన వంగ మనవిత్ యాదవ్ (3) అనే బాలుడు ఇంటి వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు పాము కాటు వేసింది. వెంటనే బాలుడు తల్లికి చెప్పడంతో హుటాహుటిన భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో నాటు వైద్యం చేయించగా, అనంతరం 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. స్పందించిన 108 సిబ్బంది బాలుడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. పాము కాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో నాటు వైద్యం చేయించడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన రావడం లేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.2