Shuru
Apke Nagar Ki App…
గోల్డెన్ జూబిలీ వేడుకలకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ని ఆహ్వానించిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఆదిలాబాద్ జిల్లా : మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 50 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం సందర్భంగా జరుపుకుంటున్న గోల్డెన్ జూబిలీ వేడుకలకు హాజరు కావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కి ఆహ్వాన పత్రికను అందజేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి.
AlluriMahesh
గోల్డెన్ జూబిలీ వేడుకలకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ని ఆహ్వానించిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఆదిలాబాద్ జిల్లా : మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 50 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం సందర్భంగా జరుపుకుంటున్న గోల్డెన్ జూబిలీ వేడుకలకు హాజరు కావాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కి ఆహ్వాన పత్రికను అందజేసిన మాజీ మంత్రి మల్లారెడ్డి.
More news from Telangana and nearby areas
- ఆదిలాబాద్ జిల్లా : కాంగ్రెస్ కమిటీ డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్ రాజ్యసభ సభ్యులుగా నియమితులైన వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల బొకే అందజేశారు.1
- జన్నారం మండలంలోని తాళ్లపెట్ రేంజ్ పరిధిలోని కవ్వాల్ అభయారణ్యంలో అనేక పక్షులు కనువిందు చేస్తున్నాయని వన్యప్రాణి పరిశోధకుడు, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సమన్వయకర్త డా.వెంకట్ ఎనగందుల తెలిపారు. మంగళవారం ఆయన మల్యాల బీట్ లో ఓరియంటల్ గోల్డెన్ ఒరియోల్, స్ట్రీక్ త్రోటేడ్ వుడ్ పీకర్, కామన్ కింగ్ ఫిషర్, ఎల్లో త్రోటెడ్ ప్యారో, ఆరెంజ్ హేడెడ్ త్రష్, టికెట్స్ బ్లూ ఫ్లై క్యాచర్ లాంటి పక్షులను తన కెమేరాలలో బంధించారు.1
- కొలనూరు ప్రాంతానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) మంజూరు కావడం ఆ ప్రాంత ప్రజలకు ఆనందకరమైన విషయమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తెలిపారు. కొలనూరు, ఓదేలు ప్రాంతాల్లో రైల్వే గేటు కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో రైల్వే అధికారులు కొలనూరును సందర్శించినప్పుడు స్వయంగా వారితో కలిసి ఆన్‌సైట్ పరిశీలన నిర్వహించి, ఓదేలు ప్రాంతానికి కూడా ఆర్ఓబీ అత్యవసరమని వివరించినట్లు చెప్పారు. మొదట రైల్వే శాఖ కొలనూరుకు మాత్రమే మంజూరు ఇచ్చి, ఓదేలుకు సాధ్యం కాదని తెలిపినా.. ప్రజల ప్రయోజనాల కోసం నిరంతరం ప్రయత్నాలు కొనసాగించినట్లు వివరించారు. ముఖ్య అంశాలు: నిరంతర పోరాటం: రైల్వే శాఖకు పలుమార్లు లేఖలు రాసి, రిప్రెజెంటేషన్లు ఇవ్వడం వల్ల కొలనూరు ఆర్ఓబీని రైల్వే శాఖ స్వంత ఖర్చులతో నిర్మించడానికి అంగీకరించింది. ఓదేలుపై హామీ: కొలనూరు తరహాలోనే ఓదేలు ప్రాంతానికి కూడా ఆర్ఓబీ మంజూరు అయ్యేలా కృషి చేస్తానని ఎంపీ స్పష్టం చేశారు. శాశ్వత పరిష్కారం: ఈ రెండు ప్రాంతాల్లో ప్రజల రవాణా ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. కొలనూరు గ్రామ ప్రజలకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపిన వంశీకృష్ణ, త్వరలోనే పనులు ప్రారంభమై పూర్తి అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.1
- सोमवार को दांडेपल्ली मंडल के मेदिरिपेट में एक पेट्रोल पंप से भारी लोहे का स्टैंड हटाते समय 11 kV बिजली की लाइन से टकराने के बाद ड्राइवर नागराजू और दिहाड़ी मजदूर नारायण की मौके पर ही मौत हो गई। इस दिल दहला देने वाली घटना का वीडियो फुटेज अब जारी किया गया है।1
- అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తున్న బీజేపీ – పార్లమెంట్‌లో ప్రతిపక్ష గొంతును అణిచివేస్తున్నారు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్ ప్రజల సభగా పనిచేయాలని, అక్కడ ప్రజల సమస్యలపై స్వేచ్ఛగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. భారత రాజ్యాంగ నిర్మాత బి.ర్.అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 95, 96 ప్రకారం లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ తప్పనిసరిగా ఉండాలని స్పష్టంగా ఉన్నప్పటికీ, బీజేపీ ప్రభుత్వం ఇప్పటివరకు డిప్యూటీ స్పీకర్‌ను నియమించకపోవడం రాజ్యాంగానికి అవమానమని గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. ఇది ముఖ్యంగా దళితులు మరియు బలహీన వర్గాల హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నట్టే అని ఆయన అన్నారు. దేశంలో కోట్లాది మంది ప్రజలు ప్రతిపక్ష పార్టీలను ఎన్నుకుని పార్లమెంట్‌కు పంపించినప్పటికీ, వారి గొంతును వినిపించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష సభ్యులను పలుమార్లు అడ్డుకోవడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జాతీయ భద్రత మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై మాట్లాడే సమయంలో కూడా మైక్ కట్ చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌ను ఒక పార్టీ సభలా మార్చే ప్రయత్నం చేస్తోందని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై పార్లమెంట్‌లో స్వేచ్ఛగా చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.1
- తంగళ్లపల్లి మండలం 11వ ప్యాకేజీ కింద ఎల్ ఎం -6, ఎల్ ఎం -4 కెనాల్ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ తంగళ్లపల్లి మండల రైతులు ధర్నా చేపట్టారు. సిరిసిల్ల - తంగళ్లపల్లి మానేరు వాగు బ్రిడ్జిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాకు బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, నాయకులు మద్దతు పలికి ధర్నాలో పాల్గొన్నారు. ఈ సంధర్బంగా బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి మాట్లాడారు.1
- రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో మిస్‌మేనేజ్‌మెంట్ జరుగుతోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా వినియోగం కావడం లేదని, కేవలం 70% ప్రొడక్షన్ మాత్రమే కొనసాగుతోందన్నారు. హెడ్‌ఆఫీస్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు మార్చాలని పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందన రాలేదన్నారు. యూరియా నిర్వహణలో గందరగోళంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.1
- ఆదిలాబాద్ జిల్లా : గండిపేటలోని గోల్కొండ రిసార్ట్‌లో ప్రారంభమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వర్క్ షాపులో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్.1