Shuru
Apke Nagar Ki App…
కులవృత్తి ప్రతిబింబించెల ప్రత్యెక గణనాథుడు బాన్స్ వాడ సెప్టెంబర్ 17 వినాయక చవితి సందర్భంగా బాన్సువాడ మండల కేంద్రంలోని కుమ్మరి గల్లీలో ”Team Bagheera”ఆధ్వర్యంలో శ్రీ చక్రధారి గణేష్ మండలి సభ్యులు వినూత్న రీతిలో గణనాథుడిని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. కుమ్మరి కులవృత్తిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. కుమ్మరి చక్రం మధ్యలో గణనాథుడు కొలువుదీరినట్లు మండపాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. బాన్సువాడ మండలంలో ఎక్కడా లేని విధంగా కొత్త ఆలోచనతో మండపాన్ని రూపొందించడంతో భక్తులు ప్రత్యేకంగా సందర్శించి గణనాథుడిని దర్శించుకుంటున్నారు. కుమ్మరి వృత్తి గొప్పతనాన్ని చాటిచెప్పేలా మండపాన్ని ఏర్పాటు చేసిన సభ్యులను స్థానికులు అభినందిస్తున్నారు.
Silamkoti mahesh
కులవృత్తి ప్రతిబింబించెల ప్రత్యెక గణనాథుడు బాన్స్ వాడ సెప్టెంబర్ 17 వినాయక చవితి సందర్భంగా బాన్సువాడ మండల కేంద్రంలోని కుమ్మరి గల్లీలో ”Team Bagheera”ఆధ్వర్యంలో శ్రీ చక్రధారి గణేష్ మండలి సభ్యులు వినూత్న రీతిలో గణనాథుడిని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. కుమ్మరి కులవృత్తిని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. కుమ్మరి చక్రం మధ్యలో గణనాథుడు కొలువుదీరినట్లు మండపాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. బాన్సువాడ మండలంలో ఎక్కడా లేని విధంగా కొత్త ఆలోచనతో మండపాన్ని రూపొందించడంతో భక్తులు ప్రత్యేకంగా సందర్శించి గణనాథుడిని దర్శించుకుంటున్నారు. కుమ్మరి వృత్తి గొప్పతనాన్ని చాటిచెప్పేలా మండపాన్ని ఏర్పాటు చేసిన సభ్యులను స్థానికులు అభినందిస్తున్నారు.
More news from Kamareddy and nearby areas
- ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండపం ఘనంగా… నిత్య అన్నదానాలతో భక్తిమయం ఆదర్శ కాలనీలో బాల గణేష్ మండపం ఘనంగా… నిత్య అన్నదానాలతో భక్తిమయం బాన్సువాడ, గురువారం: కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఆదర్శ కాలనీలో ఏర్పాటు చేసిన బాల గణేష్ మండపం వద్ద వినాయక నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ యజ్ఞాలు, హోమాలు, వినాయకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ భక్తులను ఆకర్షిస్తున్నాయి. మండపం పరిసరాలు భక్తుల రాకపోకలతో కిటకిటలాడుతూ, గణేశుని నామస్మరణతో మారుమోగుతున్నాయి. నిత్య అన్నదాన కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తూ భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నారు. గురువారం నాడు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నాగులగామ వందన గోపీనాథ్ గుప్త, రాహుల్ ఆటోమొబైల్, మోటమర్రి సంధ్యరాణి, నాగరాజు గుప్త, త్రిమూర్తి ఎంటర్ ప్రైజెస్ వారి చేతుల మీదుగా నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాల గణేష్ మండలి సభ్యులు మాట్లాడుతూ, ప్రతిరోజూ భక్తి భావంతో నిత్య అన్నదానాలు నిర్వహిస్తూ వినాయకుని కృపాకటాక్షాలు అందరికీ కలగాలని ఆకాంక్షించారు. గణేశుని ఆటపాటలు, భజనలతో కాలనీ అంతా పండుగ వాతావరణంలో మునిగిపోయిందని తెలిపారు.4
- చిన్నారుల నృత్యాలతో అలరిస్తున్న టీచర్స్ కాలనీ గణేష్ మండలి ఎల్లారెడ్డి: పట్టణంలోని కొత్తబాది టీచర్స్ కాలనీలో గణేష్ మండలి ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేదమంత్రాలతో సంప్రదాయ పద్ధతిలో పూజలు చేస్తున్నారు. చిన్నారులు నిర్వహిస్తున్న నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను, కాలనీ వాసులను అలరిస్తున్నాయి.1
- సిరికొండలో తెలంగాణ విమోచన దినోత్సవం జాతీయ జెండా ఆవిష్కరణ సిరికొండలో తెలంగాణ విమోచన దినోత్సవం జాతీయ జెండా ఆవిష్కరణ.. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 17 సిరికొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ విమోచన కోసం పోరాడిన అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలను నాయకులు గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే సాయంత్రం ప్రతి ఇంటిలో ‘ఆశీర్వాద దీపం’ వెలిగించి ప్రధానికి ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమంలో పాల్గొనాలని సిరికొండ మండల ప్రజలకు నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుర్రం సంజీవరెడ్డి, నక్క రాజేశ్వర్, చింతకుంట రామస్వామి, తలకట్ల గంగారెడ్డి, ధర్పల్లి బాబురావు, చౌటుపల్లి ప్రభాకర్, లింబ గౌడ్, బందేల ధర్మపురి, రంజిత్ రెడ్డి, బచ్చు మారుతి, జంగం గంగాధర్, రాకేష్, దాసు, గ్యామా గంగాదాస్, దాసరి లింబాద్రి, సాయ గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- నిజామాబాద్‌లో అర్ధరాత్రి బుల్లెట్ బైక్ హల్‌చల్.. శబ్ద కాలుష్యానికి కారణమైన బైక్ సీజ్! నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి వేళ అధిక శబ్దంతో బుల్లెట్ బైక్ నడుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వ్యక్తిపై బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన బుల్లెట్ బైక్‌కు అధిక శబ్దం చేసే సైలెన్సర్‌ను అమర్చుకొని, అర్ధరాత్రి సమయంలో వీధుల్లో తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని, పబ్లిక్ న్యూసెన్స్ మరియు శబ్ద కాలుష్యానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అనంతరం బుల్లెట్ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. ఈ ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ స్పందిస్తూ, అధిక శబ్దం చేసే లేదా నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేసిన సైలెన్సర్లను వాహనాలకు అమర్చుకోవడానికి ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అధిక శబ్దంతో వాహనాలు నడుపుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు అమర్చుకున్న వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించడం, ముఖ్యంగా రాత్రి వేళల్లో శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని కమిషనర్ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా వాహనాలు నడపాలని పోలీస్ శాఖ సూచించింది. శబ్ద కాలుష్యానికి చెక్ పెట్టేందుకు నిజామాబాద్ పోలీసులు చేపట్టిన ఈ చర్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.1
- లింబూర్ గ్రామ ప్రజల కోసం ప్రత్యేక చొరవ చూపుతున్న జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు. కామారెడ్డి జిల్లాలోని దొంగలి మండల కేంద్రంలోని లింబూర్ గ్రామ ప్రజల కోసం ప్రత్యేక చొరవ చూపుతున్న జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు.1
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బాలాజీ మందిరంలో ఆశీర్వాద దీపాలు వెలిగించిన బిజెపి నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలో బాలాజీ ఆలయంలో నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్లు జీవించి దేశ ప్రధానిగా ఉండి వికసిత్ భారత లక్ష్యం చేరుకొని విశ్వ గురువుగా మారాలని ఆయన ఆయురారోగ్యాలు బాగుండాలని ఆశీర్వాద దీపం కార్యక్రమం పేరుమీద దీపాలు వెలిగించి దేవుని కోరుకోనిప్రత్యేకపూజలోపాల్గోన్నబిజేపి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మెదక్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పట్లోల్ల మల్లిక ధార్మిక సెల్ కన్వీనర్ రాజేశ్వరి, బిజేపి ధార్మిక సెల్ జయంతి కన్వీనర్ కృష్ణ, 21 వార్డ్ కౌన్సిలర్ పబ్బా రాజమణి లక్ష్మణ్ 28 వార్డ్ కౌన్సిలర్ అఖిలభారత్, సౌజన్య ప్రభాకర్ అంకం శ్రీను మైనార్టీ మోర్చా అధ్యక్షుడు గ్యాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు1
- బాసర మండల కేంద్రంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండాను ఎగురవేసిన నాయకులు..అధికారులు... నిర్మల్ జిల్లా // బాసర 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం అయి, నిజాం నిరంకుశ పాలన నుండి ప్రజలకు విముక్తి లభించిన రోజు : *తహసీల్దార్ పవన్ చంద్ర ఝకాటే...* 13 నెలల సాయుధ పోరాటం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా విముక్తి చేసిన రోజు : *ఎంపిడిఓ దేవేందర్* *ఈ రోజును ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సమానత్వం అమల్లోకి వచ్చిన రోజు.. ప్రజా పాలన స్ఫూర్తితో అందరం కలిసి పని చేద్దాం. రాజ్యాంగ విలువలను కాపాడుదాం. తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుదాం. : *సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్* బాసర లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం వేడుకలు.. ఆయా ప్రభుత్వ ప్రయివేట్ కార్యాలయాలు పాఠశాల ల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అధికారులు.. నాయకులు...1
- నిజాంసాగర్‌లో 11.383 టీఎంసీల నీటి నిల్వ... ప్రధాన కాల్వ నీటి విడుదల నిలిపివేత నిజాంసాగర్ : నిజాంసాగర్ ప్రాజెక్టులో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నమోదుల ప్రకారం నీటిమట్టం 1400.02 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం (FRL) 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 11.383 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ శూన్యంగా నమోదయ్యాయి. స్పిల్‌వే గేట్లు, ప్రధాన కాలువ నుండి విడుదల నిలిపివేయగా, జెన్కొ విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయింది.1