నిర్బంధాలతో కార్మిక ఉద్యమాలను అణచివేయాలని చూస్తే సహించేది లేదు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాల ద్వారా కార్మిక ఉద్యమాలను అనచాలని చూస్తే గత కెసిఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం రైతు బజార్ వద్ద సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్షను నిర్వహించడం జరిగింది. ఈ దీక్షకు ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య గారు మాట్లాడుతూ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాల అమలు కోరుతూ అంగన్వాడీలు ,ఆశాలు, గ్రామపంచాయతీ, వివిధ రంగాల కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిని ముందస్తు అరెస్టులు చేస్తూ మహిళలని చూడకుండా స్టేషన్లకు తరలిస్తూ లాఠించే అర్జీలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఎత్తివేసి , ఉద్యమాల్ని అనుచాలని చూసిన టిఆర్ఎస్ ప్రభుత్వం విధానాల బాటలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నదని దుయ్యబట్టారు. ఇప్పటికైన ప్రజాస్వామ్య విలువల కట్టుబడి ప్రభుత్వం నడవాలని సూచన చేశారు. సెప్టెంబర్ 8,9 తేదీలలో ఆశా వర్కర్ ల , అంగన్వాడీ ల సమస్యలపై చలో హైరాబాద్ సందర్భంగా CITU నాయకులను ,యూనియన్ నాయకులను ,మహిళలు అని చూడకుండా పోలీస్ లు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్య స్పూర్తికీ విరుద్ధం అని విమర్శించారు. నిరసన దీక్ష అనంతరం జిల్లా ఇంచార్జీ కలెక్టర్ భాస్కర్ రావు గారికి, జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ గారికి నిర్బంధాలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ నిరసన దీక్షలో CITU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం, జిల్లా ఆఫీస్ బేరర్స్ దాసరి పాండు, యండి పాషా, దోనురు నర్సిరెడ్డి,మాయ కృష్ణ, తుర్కపల్లి సురేందర్, గొరిగే సోములు, సిలివేరు రామకుమారి,చెక్క రమేష్,పైళ్ళ గణపతి రెడ్డి, పొట్ట యాదమ్మ, జిల్లా కమిటి సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, మంచాల మధు, తూటి వెంకటేష్, మారయ్య, మెంటే ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు
నిర్బంధాలతో కార్మిక ఉద్యమాలను అణచివేయాలని చూస్తే సహించేది లేదు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాల ద్వారా కార్మిక ఉద్యమాలను అనచాలని చూస్తే గత కెసిఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సిఐటియు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం రైతు బజార్ వద్ద సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్షను నిర్వహించడం జరిగింది. ఈ దీక్షకు ముఖ్యఅతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య గారు మాట్లాడుతూ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాల అమలు కోరుతూ అంగన్వాడీలు ,ఆశాలు, గ్రామపంచాయతీ, వివిధ రంగాల కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారిని ముందస్తు అరెస్టులు చేస్తూ మహిళలని చూడకుండా స్టేషన్లకు తరలిస్తూ లాఠించే అర్జీలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గతంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఎత్తివేసి ,
ఉద్యమాల్ని అనుచాలని చూసిన టిఆర్ఎస్ ప్రభుత్వం విధానాల బాటలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నదని దుయ్యబట్టారు. ఇప్పటికైన ప్రజాస్వామ్య విలువల కట్టుబడి ప్రభుత్వం నడవాలని సూచన చేశారు. సెప్టెంబర్ 8,9 తేదీలలో ఆశా వర్కర్ ల , అంగన్వాడీ ల సమస్యలపై చలో హైరాబాద్ సందర్భంగా CITU నాయకులను ,యూనియన్ నాయకులను ,మహిళలు అని చూడకుండా పోలీస్ లు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్య స్పూర్తికీ విరుద్ధం అని విమర్శించారు. నిరసన దీక్ష అనంతరం జిల్లా ఇంచార్జీ కలెక్టర్ భాస్కర్ రావు గారికి, జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ గారికి నిర్బంధాలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ నిరసన దీక్షలో CITU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కల్లూరి మల్లేశం, జిల్లా ఆఫీస్ బేరర్స్ దాసరి పాండు, యండి పాషా, దోనురు నర్సిరెడ్డి,మాయ కృష్ణ, తుర్కపల్లి సురేందర్, గొరిగే సోములు, సిలివేరు రామకుమారి,చెక్క రమేష్,పైళ్ళ గణపతి రెడ్డి, పొట్ట యాదమ్మ, జిల్లా కమిటి సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, మంచాల మధు, తూటి వెంకటేష్, మారయ్య, మెంటే ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు
- తెలంగాణ చరిత్ర దాచేస్తే దాగేది కాదు. త్యాగాలతో కూడుకున్న తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలన్నది మన లక్ష్యం. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర దాచేస్తే దాగేది కాదు. త్యాగాలతో కూడుకున్న తెలంగాణ చరిత్రను భావితరాలకు అందించాలన్నది మన లక్ష్యం. త్యాగం చేసిన వారి గొప్పతనం ప్రతి విద్యార్థి, యువకుని గుండెల్లో ఉండాలి. అందుకే ఆ త్యాగాల చరిత్ర ఎగ్జిబిషన్ ని ఈరోజు పెరేడ్ గ్రౌండ్లో దత్తాత్రేయ చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నామని తెలిపారు. దేశమంతా మూడు రంగుల మువ్వన్నెల జెండాను ఆగస్టు 15 సెప్టెంబర్ 1947 న ఎగరవేస్తే.. తెలంగాణలో మాత్రం ఆ జెండా కోసం అనేకమంది ప్రాణాలు త్యాగం చేసిన తర్వాత 17 సెప్టెంబర్ 1948 రోజున ఎగురవేసుకున్నాము. - ఈరోజు మనము అనుభవిస్తున్న స్వేచ్ఛ ఊరికే వచ్చింది కాదు. - అది కేవలం జెండా మాత్రమే కాదు, లక్షలాదిమంది భరతమాత ముద్దుబిడ్డలు ప్రాణ త్యాగాలు, కోట్లాదిమంది ప్రజల కష్టం. భరతమాత దాస్యశృంఖలాలు తెంచడానికి ఎంతోమంది నేలకొరిగారు. - భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో కులానికి మతానికి ప్రాంతానికి సంబంధం లేకుండా కొట్లాడారు. - - నిజాం అరాచకాలపై దాశరథి గారి లాంటి వారు పాట రాసినా..యాదిగిరి లాంటివారు పాడినా.. పత్రికలో రాసినా జైల్లో పెట్టారు, హత్య చేసినట్టు చరిత్ర చెబుతుంది.1
- బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశం గజ్వేల్ ప్రజా తెలంగాణ న్యూస్ / హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ బీసీ లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టి. రాజు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మాజీ శాసనమండలి చైర్మన్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీసీలకు సంబంధించిన పలు అంశాలపై మేధావులు, నాయకులు చర్చించారు.1
- బేగంబజార్‌లో 48 కిలోల బంగారు పూతతో ప్రత్యేక ఆకర్షణగా వినాయక విగ్రహం! హైదరాబాద్‌లోని బేగంబజార్ ఫీల్‌ఖానాలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 48 కిలోల ‘బంగారు గణేశుడు’ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. సుమారు 3.83 లక్షలకు పైగా అమెరికన్ డైమండ్స్, 24 క్యారెట్ల బంగారు పూతతో అత్యంత శోభాయమానంగా అలంకరించిన ఈ దివ్య మూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.1
- నాగసాన్‌పల్లి వద్ద తెగిపడిన 11 కేవీ వైరు తెగిపడటంతో అప్రమత్తమైన విద్యుత్ సిబ్బంది కౌడిపల్లి మండలం నాగసాన్‌పల్లి సమీపంలోని వరి పొలాల్లో 11 కేవీ విద్యుత్ వైరు ప్రమాదవశాత్తు తెగిపడింది. దీంతో పొలాల్లో పనిచేస్తున్న రైతులు, సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి, తెగిన వైర్‌కు మరమ్మతులు చేపట్టారు. సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణనష్టం, ప్రమాదం చోటుచేసుకోకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మరమ్మతులు పూర్తయిన అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అధికారుల సత్వర స్పందనపై రైతులు, స్థానిక గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.1
- వరంగల్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్‌స్టాప్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, పెన్షన్లు పెంచలేదని, మహిళలకు నెలకు రూ. 2,500/- ఇవ్వడం లేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. వంటావార్పు కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.1
- హైదరాబాద్ లో గోల్డెన్ గణపతి..ఈ ఏడాది ఇక్కడే స్పెషల్ తరలి వస్తున్న భక్తులు హైదరాబాద్ మహానగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బేగం బజార్ లో ఏర్పాట్లు చేసిన బంగారు గణపతి నీ చూసేందుకు ఎగబడుతున్నారు.1
- ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా ఉంది నా పరిస్థితి *భూములు నిషేధిత జాబితాలో తీస్తే డబ్బులు తీసుకున్నాడు అంటారు* ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా ఉంది నా పరిస్థితి *భూములు నిషేధిత జాబితాలో తీస్తే డబ్బులు తీసుకున్నాడు అంటారు* తీయకపోతే అమాయకుల భూమి నిషేధిత జాబితాలో పెట్టారు అంటారు మరి నేను ఏం చేయాలి బాయిలో దూకాలా? – రేవంత్ రెడ్డి1
- నర్సాపూర్ పట్టణంలో హమరా ప్రసాద్‌పై మాల మహానాడు యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన నర్సాపూర్ పట్టణంలో హమరా ప్రసాద్‌పై మాల మహానాడు యువజన సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేడ్కర్‌పై కల్పిత వ్యాఖ్యలతో పుస్తకం రాశారంటూ ఆ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు దాడిగా నరేశ్, నియోజకవర్గ ఇన్‌చార్జ్ కుమార్ ఆరోపించారు. ప్రసాద్‌ను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అంబేడ్కర్ ఆశయాలను, దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, రచనలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని అన్నారు. ఇలాంటి చర్యలు సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలోని ప్రధాన కూడలిలో ప్రసాద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, యువజన కార్యకర్తలు, స్థానిక దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు.1
- రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో మూడవరోజు స్వామి వారి దర్శనం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం శ్రీ సిద్ధి వినాయక స్వామివారు పీత వర్ణ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ప్రత్యేక అలంకరణను చూసేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.1