logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కళాశాల ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి ములుగు జిల్లా కేంద్రంలో ఫారెస్ట్ కళాశాల అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై, అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి డాక్టర్ సీ సువర్ణతో కలిసి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. మంత్రి కొండా సురేఖ FCRI అడవుల పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడంలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని, ఫారెస్ట్రీలో ఉన్న విస్తృత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

5 hrs ago
user_M D Azizuddin
M D Azizuddin
జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
5 hrs ago
1e0748fa-227b-4476-8811-1291d7ce24b6
1d556af5-4155-4b07-bcea-095eea4cec89
98693dfb-6ac2-4d03-aa7d-97d67f3944c9
1c5baceb-a1e0-4465-bc0b-4e485346346f
5f504599-5cb4-414c-8dc8-81a4554579a7

కళాశాల ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి ములుగు జిల్లా కేంద్రంలో ఫారెస్ట్ కళాశాల అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ లో 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరై, అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారిణి డాక్టర్ సీ సువర్ణతో కలిసి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. మంత్రి కొండా సురేఖ FCRI అడవుల పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణలో నైపుణ్యం కలిగిన యువతను తయారు చేయడంలో ముందంజలో ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని, ఫారెస్ట్రీలో ఉన్న విస్తృత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

More news from తెలంగాణ and nearby areas
  • వరంగల్:ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ సాధించింది. అన్ని చోట్లా ఛైర్మన్ పదవులను దక్కించుకుని స్థానిక సంస్థల రాజకీయాల్లో పూర్తి ఆధిపత్యం చాటింది. ఛైర్మన్ పీఠాల కోసం ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. ఘర్షణల నేపథ్యంలో వాయిదా పడిన జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో లక్కీ డ్రా పద్ధతిలో కాంగ్రెస్‌కు ఛైర్మన్ స్థానాలు దక్కాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్ బలం మరింత బలపడిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
    1
    వరంగల్:ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ సాధించింది. అన్ని చోట్లా ఛైర్మన్ పదవులను దక్కించుకుని స్థానిక సంస్థల రాజకీయాల్లో పూర్తి ఆధిపత్యం చాటింది. ఛైర్మన్ పీఠాల కోసం ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు.
ఘర్షణల నేపథ్యంలో వాయిదా పడిన జనగామ, తొర్రూర్ మున్సిపాలిటీల్లో లక్కీ డ్రా పద్ధతిలో కాంగ్రెస్‌కు ఛైర్మన్ స్థానాలు దక్కాయి. దీంతో జిల్లాలో కాంగ్రెస్ బలం మరింత బలపడిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
  • ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు... రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర... మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.... ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.... ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని డ్రా చేసి గెలుచుకున్నారు. కడియం కావ్య గెలిచిన తరువాత GWMC ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరైనారు ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరు లో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం. ఆమె యొక్క వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా అధికారుల వరకు అడిగిన కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అధికారులు. ఓట్లను కోట్లతో కొని రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల్లో గెలిచారు. ఎన్నిక ప్రక్రియ కొన్ని చోట్ల లైవ్ పెట్టి కొన్ని చోట్ల లైవ్ పెట్టలేదు. తొర్రూరు లో లైవ్ పెట్టకపోవడానికి కారణం ఆమె దొంగ ఓటు బయటపడుతుంది అని పెట్టలేదు. కోర్టు ద్వారా కచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ది చెప్పుతాం. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ... తొర్రూరు లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నికచ్చి గా ఉండడం మన మొదటి విజయం. రేవంత్ రెడ్డి తోని మాట్లాడి ఇవ్వాళ వచ్చి దొంగ ఓటు వేసింది. రాబోయే zptc, mptc ఎన్నికల్లో కచ్చితం బుద్ధి చెప్తాము. తొర్రూరులో నిజంగా ఇవ్వాళ పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది. ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలి. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.... ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది. తొర్రూరు లో గెలవాలి అని రేవంత్ రెడ్డి కార్యాలయం నుండి కుట్రలు జరిపారు. రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు. బిఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారు అధికారులు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కు నా సెల్యూట్. దయన్న వచ్చే ఎన్నికలో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారు నేను కూడా ఎక్స్ ఆఫీసియో అప్లై చేశారు. ఒకరోజు ముందే మమ్మల్ని తీసేశారు అన్నారు.
    1
    ఈ సమావేశంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు...
రాజ్యసభ సభ్యులు వద్ది రాజు రవిచంద్ర...
మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి....
ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ....
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్యన్ని సమాధి చేసింది కాంగ్రెస్ పార్టీ.
ఎక్స్ అఫీషియో పేరుతో తొర్రూరులో ఓటు నమోదు చేసుకొని డ్రా చేసి గెలుచుకున్నారు.
కడియం కావ్య గెలిచిన తరువాత GWMC ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యురాలుగా హాజరైనారు ఆమె అక్కడ విత్ డ్రా చేసుకోకుండా తొర్రూరు లో నమోదు చేయడం నిజంగా అప్రజాస్వామికం.
ఆమె యొక్క వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా అధికారుల వరకు అడిగిన కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు అధికారులు.
ఓట్లను కోట్లతో కొని రేవంత్ రెడ్డి మున్సిపాలిటీల్లో గెలిచారు.
ఎన్నిక ప్రక్రియ కొన్ని చోట్ల లైవ్ పెట్టి కొన్ని చోట్ల లైవ్ పెట్టలేదు.
తొర్రూరు లో లైవ్ పెట్టకపోవడానికి కారణం ఆమె దొంగ ఓటు బయటపడుతుంది అని పెట్టలేదు.
కోర్టు ద్వారా కచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ది చెప్పుతాం.
మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ...
తొర్రూరు లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముడుపోకుండా నికచ్చి గా ఉండడం మన మొదటి విజయం.
రేవంత్ రెడ్డి తోని మాట్లాడి ఇవ్వాళ వచ్చి దొంగ ఓటు వేసింది.
రాబోయే zptc, mptc ఎన్నికల్లో కచ్చితం బుద్ధి చెప్తాము.
తొర్రూరులో నిజంగా ఇవ్వాళ పోలీసు కట్టడితో ఎన్నిక జరిగింది.
ప్రధాన మంత్రి వచ్చిన కూడా ఇంత బందోబస్తు రాని పోలీసులు ఇవ్వాళ ఒక ఎన్నికకు ఇంత మందిని పెట్టడం ఏంటో వారికే తెలియాలి.
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ....
ప్రజాక్షేత్రంలో జరిగిన ఎన్నికల్లో తొర్రూరులో బిఆర్ఎస్ పార్టీ గెలిచింది.
తొర్రూరు లో గెలవాలి అని రేవంత్ రెడ్డి కార్యాలయం నుండి కుట్రలు జరిపారు.
రేవంత్ రెడ్డి కుట్రలో భాగంగా కావ్య ఓటు ఇక్కడ పెట్టుకున్నారు.
బిఆర్ ఎస్ పార్టీని అడ్డుకోవడం కోసం నిన్న వాయిదా వేసి కాలక్షేపం చేశారు అధికారులు.
పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త కు నా సెల్యూట్.
దయన్న వచ్చే ఎన్నికలో పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తారు
నేను కూడా ఎక్స్ ఆఫీసియో అప్లై చేశారు. ఒకరోజు ముందే మమ్మల్ని తీసేశారు అన్నారు.
    user_Venkatgoud kallepu
    Venkatgoud kallepu
    Singer రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అమ్మపురం వద్ద అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న బిఆర్ఎస్ కౌన్సిలర్లను మాత్రమే తొర్రూర్ కు పంపించి ఆయనతోపాటు ఆయన సతీమణి ఉషను సైతం వెనక్కి పంపించారు. దీంతో కొద్దిసేపు అమ్మపురం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
    2
    తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అమ్మపురం వద్ద అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న బిఆర్ఎస్ కౌన్సిలర్లను మాత్రమే తొర్రూర్ కు పంపించి ఆయనతోపాటు ఆయన సతీమణి ఉషను సైతం వెనక్కి పంపించారు. దీంతో కొద్దిసేపు అమ్మపురం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    13 hrs ago
  • తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. BRSకు మెజార్టీ ఉన్నప్పటికీ అధికార బలంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను కాంగ్రెస్ కొల్లగొట్టిందన్నారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
    1
    తొర్రూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ దక్కించుకోవడంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ కంటతడి పెట్టుకున్నారు. BRSకు మెజార్టీ ఉన్నప్పటికీ అధికార బలంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను కాంగ్రెస్ కొల్లగొట్టిందన్నారు. తమ పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేసి ఎన్నికలు నిర్వహించారని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
    user_RUDRA BHAVANARUSHI
    RUDRA BHAVANARUSHI
    నర్సింహులపేట, మహబూబాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • ప్రజాస్వామ్య విరుద్దంగా కాంగ్రెస్ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు BRSను గెలిపిస్తే కాంగ్రెస్ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కొల్లగొట్టిందని మండిపడ్డారు. తనతో పాటు పార్టీ నాయకులను అరెస్టు చేసి అక్రమంగా ఎన్నిక నిర్వహించారన్నారు. BRS గెలుపు కోసం కార్యకర్తలు కష్ట పడ్డారని, వారికి ఏం జవాబు చెప్పుకోవాలి అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
    1
    ప్రజాస్వామ్య విరుద్దంగా కాంగ్రెస్ తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు BRSను గెలిపిస్తే కాంగ్రెస్ ఛైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కొల్లగొట్టిందని మండిపడ్డారు. తనతో పాటు పార్టీ నాయకులను అరెస్టు చేసి అక్రమంగా ఎన్నిక నిర్వహించారన్నారు. BRS గెలుపు కోసం కార్యకర్తలు కష్ట పడ్డారని, వారికి ఏం జవాబు చెప్పుకోవాలి అంటూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    Narsampet, Warangal•
    7 hrs ago
  • తొర్రూరులో ఉత్కంఠభరిత పరిస్థితులు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ 144 సెక్షన్ అమలు – భారీగా మోహరించిన పోలీసులు తొర్రూరు పట్టణంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పట్టణమంతా 144 సెక్షన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. వందల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించగా, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కు 9 మంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్) కు 7 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. అనంతరం ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓట్లతో ఇరుపార్టీల బలం 9–9కు సమానమవడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. దీంతో పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇరుపార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారులు ఈరోజుకు వాయిదా వేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పోలీసులు పూర్తిస్థాయిలో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్య కూడళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేసి, అనవసర గుంపులు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అలాగే కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అదనపు పోలీసు బలగాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ఈ ఉద్రిక్త వాతావరణం మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి మొత్తం తొర్రూరు పైనే నిలిచింది. 👉 ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా పూర్తవుతుందా? 👉 లేక మరింత రాజకీయ ఉత్కంఠకు దారి తీస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.
    2
    తొర్రూరులో ఉత్కంఠభరిత పరిస్థితులు
మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ 144 సెక్షన్ అమలు – భారీగా మోహరించిన పోలీసులు
తొర్రూరు పట్టణంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పట్టణమంతా 144 సెక్షన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. వందల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించగా, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కు 9 మంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్) కు 7 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. అనంతరం ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓట్లతో ఇరుపార్టీల బలం 9–9కు సమానమవడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. దీంతో పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఇరుపార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారులు ఈరోజుకు వాయిదా వేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పోలీసులు పూర్తిస్థాయిలో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్య కూడళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేసి, అనవసర గుంపులు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అలాగే కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అదనపు పోలీసు బలగాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
ఈ ఉద్రిక్త వాతావరణం మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి మొత్తం తొర్రూరు పైనే నిలిచింది.
👉 ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా పూర్తవుతుందా?
👉 లేక మరింత రాజకీయ ఉత్కంఠకు దారి తీస్తుందా?
అన్నది వేచి చూడాల్సిందే.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    15 hrs ago
  • ధర్మమే గెలిచిందని తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేస్తుందని ఇది దైవ నిర్ణయం అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూర్ లో గత రెండు రోజులుగా ఉద్రిక్తత ఉత్కంఠ తెరపడింది టిఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా పద్ధతిని అనుసరించారు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీని వరించడంతో ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు ధర్మం గెలిచిందని అన్నారు.
    1
    ధర్మమే గెలిచిందని తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేస్తుందని ఇది దైవ నిర్ణయం అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూర్ లో గత రెండు రోజులుగా ఉద్రిక్తత ఉత్కంఠ తెరపడింది టిఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా పద్ధతిని అనుసరించారు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీని వరించడంతో ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు ధర్మం గెలిచిందని అన్నారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగిరిందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పష్టం చేశారు. 12 వార్డులకు గాను తాము ఆరు వార్డులు గెలిచామని, కాంగ్రెస్ నాలుగు మాత్రమే గెలిచిందన్నారు. మరో ఒక వార్డును తాము గెలిచినా తారుమారు చేశారని ఆరోపించారు. నైతిక విజయం తమదేనని పేర్కొంటూ, ప్రస్తుత చైర్మన్ సారంగపాణి తమ వద్ద పని చేసిన పాత కార్యకర్తేనని చమత్కరించారు.
    1
    వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండానే ఎగిరిందని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పష్టం చేశారు. 12 వార్డులకు గాను తాము ఆరు వార్డులు గెలిచామని, కాంగ్రెస్ నాలుగు మాత్రమే గెలిచిందన్నారు. మరో ఒక వార్డును తాము గెలిచినా తారుమారు చేశారని ఆరోపించారు.
నైతిక విజయం తమదేనని పేర్కొంటూ, ప్రస్తుత చైర్మన్ సారంగపాణి తమ వద్ద పని చేసిన పాత కార్యకర్తేనని చమత్కరించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.