నీటి చౌర్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి – నీటి డైవర్షన్ ఆపేందుకు స్పెషల్ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలి – మంత్రి సత్యకుమార్ యాదవ్ శ్రీ సత్యసాయి,అనంతపురం జిల్లా, ధర్మవరం ఫిబ్రవరి 17:– నీటి చౌర్యాన్ని అడ్డుకోవాలని ఉమ్మడి అనంతపురం జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. అవసరమైతే పోలీసు బందోబస్తును ఏర్పాటుచేసి, ధర్మవరం నియోజకవర్గంలోని చెరువులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. జిల్లాల కలెక్టర్లతో మంత్రి సత్యకుమార్ మంగళవారం ఫోన్ ద్వారా మాట్లాడారు. ధర్మవరం నియోజకవర్గంలోని పీఏబీఆర్ (పెన్నా అహోబిలం బ్యాలెన్స్ రిజర్వాయర్) రైట్ కెనాల్ ద్వారా చెరువులను నింపే విషయమై వారితో చర్చించారు. సోర్స్ వద్ద 600 కూసెక్కులు విడుదల అవుతుండగా, మన్నీల వద్ద కు వచ్చే సరికి కేవలం 65 కుసెక్కేలే వస్తుందని, సంబంధిత అధికారులు ఏమి చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు కలెక్టర్లు దీనిపై సంయుక్త సమావేశం నిర్వహించుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇప్పటికైనా వారబంది నిర్వహించి కింద ఉన్న గ్రామాలకు న్యాయం చేయాలన్నారు. పైన వాటర్ డైవర్షన్ జరుగుతున్నందున స్పెషల్ పోలీస్ లను బందోబస్త్ ఏర్పాటు చేసిన నీటి చౌర్యం ఆపాలని జిల్లా ఎస్పీకి చెప్పారు. సంబందిత శాఖల అధికారులు ధర్మవరం నియోజకవర్గంలో చెరువులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

- అనంతపురం నగరంలో ఈరోజు “సేవ్ ఆర్‌డీటీ” ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తూ భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్‌డీటీకి సంబంధించిన అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరసనకారులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు నష్టం జరుగుతోందని వారు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. జేఏసీ ప్రతినిధులు తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రం అందజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం హనుమరెడ్డిపల్లి గ్రామ శివారులో కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన టీచర్ పాతిరెడ్డి కారు అదుపుతప్పి పంట పొలంలోకి దూసుకుని వెళ్లిన కారు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- మదనపల్లెలో బాలిక హత్య పై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పందన. మదనపల్లెలో బాలిక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో డీఐజీ మీడియాతో మాట్లాడారు. 'సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యమైన వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ మహమ్మద్ రఫీ స్పందించి సిబ్బందితో గాలించారు. నేను ఇప్పుడే మదనపల్లెకు వచ్చాను. త్వరలో అన్నీ వివరాలు వెల్లడిస్తా' అని డీఐజీ చెప్పారు.1
- మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా శిక్షించాలి, అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న కారణంగా బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించలేకపోయాను, కానీ వారిని ఫోన్లో పరామర్శించానని, అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు, ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు..1
- బద్వేలు:నేషనల్ హైవే రహదారుల్లో ఫ్రీ లెఫ్ట్ లో వాహనాలు వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లను సిఐ రామకృష్ణ పరిశీలించారు . అనంతరం పట్టణం లోని నాలుగు రోడ్ సర్కిల్లో ట్రాఫిక్ ను అర్బన్ సీఐ రామకృష్ణ పరిశీలించి పట్టణంలో వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోనున్న పోలీస్ సిబ్బంది సిఐ రామకృష్ణ పాలు రకాల సూచనలను తెలియజేశారు.1
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు,బంధువులు రోడ్డుపై ఆందోళన.... ఆందోళన కారులకు మద్దతు తెలిపిన మదనపల్లె వైసిపి ఇన్ ఛార్జ్ నిస్సార్ అహ్మద్.... ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు.... పోలీసుల అదుపులో నిందితుడు1
- అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ1
- చింతల ఘాట్ రోడ్డులో అదుపుతప్పి గుంతలోకి ఒరిగిన ఆర్టీసీ బస్సు.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు.. ప్రయాణికులను బస్సు నుంచి క్షేమంగా దించిన వాహనదారులు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1