logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఉయ్యూరులో భారీ గంజాయి నెట్ వర్క్ పట్టివేత -10 మంది అరెస్ట్ 4 కేజీల గంజాయి సీజ్ ఉయ్యూరులో గంజాయి ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఒక బైక్ చోరీ కేసు ఒక పెద్ద గంజాయి నెట్ వర్క్ ను బయటపెట్టింది.సమాజానికి, ముఖ్యంగా యువత భవిష్యత్తుకు పెనుముప్పుగా మారుతున్న గంజాయి సరఫరాను సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో కృష్ణాజిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర పర్యవేక్షణలో ఉయ్యూరు టౌన్ సీఐ టివివి రామారావు, ఎస్ఐలు ప్రతాప్ రెడ్డి, మల్లికాసులు మరియు సిబ్బంది ఈ ఆపరేషన్ చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గురజాడ రోడ్డులో గంజాయి సరఫరా, విక్రయం, వినియోగంతో సంబంధం ఉన్న 10 మంది యువకులను అరెస్ట్ చేశారు. వారి నుండి 4 కేజీల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారి వివరాలు: షేక్ ఖలీఫా @ కాశి, రాయపూడి దీపక్ @ బన్ను, అబ్దుల్ బషీద్, బుర్ర విజయ్, రత్నం సాయి సందీప్, షేక్ సుభాని,మహమ్మద్ ఇబ్రహీం,మహమ్మద్ రెహమాన్, కొలంటి జాన్ సందేష్ పాల్, మురారి పవన్ కుమార్ ఈ కేసులో అసలు ట్విస్ట్ ఏంటంటే ఒక మోటార్ సైకిల్ చోరీ కేసులో అనుమానితుడైన షేక్ ఖలీఫా @ కాశిని అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి సమాచారం బయటపడింది. ఆ సమాచారాన్ని లోతుగా విచారించగా... తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తుల సహకారంతో ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి, స్థానికంగా ఉన్న మరికొందరితో కలిసి ఉయ్యూరు మరియు పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నట్లు* ప్రాథమిక విచారణలో వెల్లడైంది.ఈ నెట్ వర్క్ కు సంబంధించి తెలంగాణకు చెందిన ప్రధాన నిందితులతో పాటు స్థానికంగా మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి పూర్తి వివరాలు సేకరించి త్వరలోనే పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.గంజాయి ఎక్కడి నుండి వస్తోంది, ఎవరు సరఫరా చేస్తున్నారు, స్థానికంగా ఎవరెవరికి చేరుతోంది అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.గంజాయి రహిత ఉయ్యూరు మా లక్ష్యం అని సీఐ రామారావు స్పష్టం చేశారు.

4 hrs ago
user_దాసరి నటరాజు
దాసరి నటరాజు
ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago
328c32ce-176f-48ed-8c0b-7d6fa26b4765

ఉయ్యూరులో భారీ గంజాయి నెట్ వర్క్ పట్టివేత -10 మంది అరెస్ట్ 4 కేజీల గంజాయి సీజ్ ఉయ్యూరులో గంజాయి ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఒక బైక్ చోరీ కేసు ఒక పెద్ద గంజాయి నెట్ వర్క్ ను బయటపెట్టింది.సమాజానికి, ముఖ్యంగా యువత భవిష్యత్తుకు పెనుముప్పుగా మారుతున్న గంజాయి సరఫరాను సమూలంగా నిర్మూలించాలనే లక్ష్యంతో కృష్ణాజిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర పర్యవేక్షణలో ఉయ్యూరు టౌన్ సీఐ టివివి రామారావు, ఎస్ఐలు ప్రతాప్ రెడ్డి, మల్లికాసులు మరియు సిబ్బంది ఈ ఆపరేషన్ చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గురజాడ రోడ్డులో గంజాయి సరఫరా, విక్రయం, వినియోగంతో సంబంధం ఉన్న 10 మంది యువకులను అరెస్ట్ చేశారు. వారి నుండి 4 కేజీల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారి వివరాలు: షేక్ ఖలీఫా @ కాశి, రాయపూడి దీపక్ @ బన్ను, అబ్దుల్ బషీద్, బుర్ర విజయ్, రత్నం సాయి సందీప్, షేక్ సుభాని,మహమ్మద్ ఇబ్రహీం,మహమ్మద్ రెహమాన్, కొలంటి జాన్ సందేష్ పాల్, మురారి పవన్ కుమార్ ఈ కేసులో అసలు ట్విస్ట్ ఏంటంటే ఒక మోటార్ సైకిల్ చోరీ కేసులో అనుమానితుడైన షేక్ ఖలీఫా @ కాశిని అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి సమాచారం బయటపడింది. ఆ సమాచారాన్ని లోతుగా విచారించగా... తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తుల సహకారంతో ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి, స్థానికంగా ఉన్న మరికొందరితో కలిసి ఉయ్యూరు మరియు పరిసర ప్రాంతాల్లో సరఫరా చేస్తున్నట్లు* ప్రాథమిక విచారణలో వెల్లడైంది.ఈ నెట్ వర్క్ కు సంబంధించి తెలంగాణకు చెందిన ప్రధాన నిందితులతో పాటు స్థానికంగా మరికొందరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి పూర్తి వివరాలు సేకరించి త్వరలోనే పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.గంజాయి ఎక్కడి నుండి వస్తోంది, ఎవరు సరఫరా చేస్తున్నారు, స్థానికంగా ఎవరెవరికి చేరుతోంది అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.గంజాయి రహిత ఉయ్యూరు మా లక్ష్యం అని సీఐ రామారావు స్పష్టం చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • మందు బాబుల కోసం దేవుడైన కాసుకోవాల్సిందే మనం ఏ జనరేషన్ లో ఉన్నామో అర్ధమౌతుంది..
    1
    మందు బాబుల కోసం దేవుడైన కాసుకోవాల్సిందే
మనం ఏ జనరేషన్ లో ఉన్నామో అర్ధమౌతుంది..
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • 69 మంది లబ్ధిదారులకు 72.89 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన మంత్రి సత్యప్రసాద్. రాష్ట్రంలో పేద మధ్య తరగతి ప్రజలు వైద్య ఖర్చు నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం సకాలంలో CMRF చెక్కులను పంపిణీ చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. టిడిపి కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న 69 మంది లబ్ధిదారులకు 72,89,587 రూపాయల CMRF చెక్కులను పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా అడుగులు వేస్తుందన్నారు.
    1
    69 మంది లబ్ధిదారులకు 72.89 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన మంత్రి సత్యప్రసాద్.
రాష్ట్రంలో పేద మధ్య తరగతి ప్రజలు వైద్య ఖర్చు నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం సకాలంలో CMRF చెక్కులను పంపిణీ చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. టిడిపి కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న 69 మంది లబ్ధిదారులకు 72,89,587 రూపాయల CMRF చెక్కులను పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా అడుగులు వేస్తుందన్నారు.
    user_M.Vijay Kishore
    M.Vijay Kishore
    Cherukupalle H/O Arumbaka, Bapatla•
    10 hrs ago
  • ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తాడేపల్లిగూడెం, మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ,రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు, 20 మంది రక్తదానం చేశారు. ఇంజనీర్స్ డే. వేడుకలు భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడుశ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఆధునిక మైసూర్. కర్ణాటక రూప కల్పనే కాక భారత దేశంలో అనేక ప్రాంతాలలో సేవలు అందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165 వ జయంతి సందర్బంగా ఇంజనీర్ వ్యవస్థ ని వారి సేవలు ను గుర్తు చేసుకుంటూ ఇంజినీర్స్ ని గౌరవించు కోవడం స్ఫూర్తి దాయకం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. పంచాయితీ రాజ్ విభాగం లో మున్సిపల్ విభాగం లో విశేష సేవలు అందిస్తున్న పలువురు ఇంజినీర్స్ ని ఇంజనీర్స్ డే. వేడుకలలో జి .త్రినాథ్ బాబు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మాట్లాడుతూ భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని అన్నారు . ఈ కార్యక్రమంలో విశ్వనాథరెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏలూరు జి త్రినాథ్ బాబు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సిహెచ్ వర్మ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ అధ్యక్షులు, శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి, కే.ధణానంద్ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ పశ్చిమగోదావరి అధ్యక్షులు, శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి, రెడ్ క్రాస్ సొసైటీ పీఆర్వో కెవి రమణ, పెద్ద ఎత్తున ఇంజనీర్స్ పాల్గొన్నారు.
    1
    ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన  మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 
తాడేపల్లిగూడెం, మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ,రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు, 20 మంది రక్తదానం చేశారు. ఇంజనీర్స్ డే. వేడుకలు  భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన  మహనీయుడుశ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని  ఆధునిక మైసూర్. కర్ణాటక రూప కల్పనే కాక భారత దేశంలో అనేక ప్రాంతాలలో సేవలు అందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165 వ జయంతి సందర్బంగా ఇంజనీర్ వ్యవస్థ ని వారి సేవలు ను గుర్తు చేసుకుంటూ  ఇంజినీర్స్ ని గౌరవించు కోవడం స్ఫూర్తి దాయకం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. పంచాయితీ రాజ్ విభాగం  లో మున్సిపల్ విభాగం లో విశేష సేవలు అందిస్తున్న పలువురు ఇంజినీర్స్ ని  ఇంజనీర్స్ డే. వేడుకలలో  జి .త్రినాథ్ బాబు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మాట్లాడుతూ  భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన  మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని అన్నారు . ఈ కార్యక్రమంలో విశ్వనాథరెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏలూరు జి త్రినాథ్ బాబు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సిహెచ్ వర్మ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ అధ్యక్షులు, శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి, కే.ధణానంద్ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ పశ్చిమగోదావరి అధ్యక్షులు, శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి, రెడ్ క్రాస్ సొసైటీ పీఆర్వో కెవి రమణ, పెద్ద ఎత్తున ఇంజనీర్స్ పాల్గొన్నారు.
    user_అయితం ప్రసాద్
    అయితం ప్రసాద్
    తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • పల్నాడు జిల్లా..సత్తెనపల్లి *సత్తెనపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు దరువూరి నాగేశ్వరరావు తెలిపారు.* సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చొరవతో సాగర్ కెనాల్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడంతో పట్టణానికి సుమారు 100 రోజులకు సరిపడా మంచినీటిని నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దరువూరి నాగేశ్వరరావు సత్తెనపల్లిలోని మంచినీటి చెరువును సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు. పట్టణ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించి, తగిన చర్యలకు చొరవ చూపారని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సమర్థవంతంగా వినియోగిస్తూ పట్టణంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ డి ఈ మధుసూదన్ రావు, కుటమి నాయకులు పాల్గొన్నారు.
    1
    పల్నాడు జిల్లా..సత్తెనపల్లి 
*సత్తెనపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు దరువూరి నాగేశ్వరరావు తెలిపారు.*
సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చొరవతో సాగర్ కెనాల్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడంతో పట్టణానికి సుమారు 100 రోజులకు సరిపడా మంచినీటిని నిల్వ చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా దరువూరి నాగేశ్వరరావు సత్తెనపల్లిలోని మంచినీటి చెరువును సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు. 
పట్టణ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించి, తగిన చర్యలకు చొరవ చూపారని తెలిపారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సమర్థవంతంగా వినియోగిస్తూ పట్టణంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. 
నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. 
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ డి ఈ  మధుసూదన్ రావు, కుటమి నాయకులు పాల్గొన్నారు.
    user_User3320
    User3320
    నరసరావుపేట, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • యలమంచిలి ఊటాడ గ్రామాల్లో రూ.104.58 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు యలమంచిలి, ఊటాడ గ్రామాల్లో రూ 104.58 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం పశ్చిమగోదావరి జిల్లా, యలమంచిలి మండలం, ఊటాడ, యలమంచిలి, గ్రామాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు సారధ్యంలో రూ 104.58 లక్షల ప్రభుత్వ వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను కూటమి నాయకులు ప్రారంభించారు. యలమంచిలి మండల టిడిపి అధ్యక్షుడు మామిడిశెట్టి పెద్దిరాజు దగ్గరుండి కార్యక్రమానికి పర్యవేక్షించారు
    1
    యలమంచిలి ఊటాడ గ్రామాల్లో రూ.104.58 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
యలమంచిలి, ఊటాడ గ్రామాల్లో 
రూ 104.58 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం 
పశ్చిమగోదావరి జిల్లా, యలమంచిలి మండలం, ఊటాడ, యలమంచిలి,  గ్రామాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు సారధ్యంలో రూ 104.58 లక్షల ప్రభుత్వ వ్యయంతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను కూటమి నాయకులు ప్రారంభించారు.
యలమంచిలి మండల టిడిపి అధ్యక్షుడు మామిడిశెట్టి పెద్దిరాజు దగ్గరుండి కార్యక్రమానికి పర్యవేక్షించారు
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • పూజలు లేకుండానే గంగమ్మ ఒడికి గణేశుడు.................. రంగారెడ్డి జిల్లా, జిల్లేడు చౌదరిగుడ మండలం, పీర్జాపూర్ గ్రామంలో ఘటన ఆంజనేయ స్వామి ఆలయంలో గణేశుడి విగ్రహం ప్రతిష్టించే విషయమై.. రెండు వర్గాల మధ్య వివాదం అదే ఆలయంలో తాము ఏర్పాటు చేసిన గణనాథుడు ఉండాలని ఓ వర్గం పట్టుబట్టడంతో ఘర్షణ పోలీసులు జోక్యం చేసుకొని.. విగ్రహాన్ని పెట్టొద్దని, వేరే చోట ఏర్పాటు చేయాలని సూచనలు దీంతో మనస్తాపానికి గురై.. పూజలు చేయకుండానే చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు
    1
    పూజలు లేకుండానే గంగమ్మ ఒడికి గణేశుడు..................

రంగారెడ్డి జిల్లా, జిల్లేడు చౌదరిగుడ మండలం, పీర్జాపూర్ గ్రామంలో ఘటన
ఆంజనేయ స్వామి ఆలయంలో గణేశుడి విగ్రహం ప్రతిష్టించే విషయమై.. రెండు వర్గాల మధ్య వివాదం
అదే ఆలయంలో తాము ఏర్పాటు చేసిన గణనాథుడు ఉండాలని ఓ వర్గం పట్టుబట్టడంతో ఘర్షణ
పోలీసులు జోక్యం చేసుకొని.. విగ్రహాన్ని పెట్టొద్దని, వేరే చోట ఏర్పాటు చేయాలని సూచనలు
దీంతో మనస్తాపానికి గురై.. పూజలు చేయకుండానే చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • రూ.2కోట్ల 74 లక్షలతో సీసీ రోడ్డుకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన రూ.2కోట్ల 74 లక్షలతో నిర్మించబోయే సీసీ రోడ్డుకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు పాలకొల్లు మండలం, పాలకొల్లు రూరల్ పంచాయతీ పరిధిలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్స్ వద్ద రూ.2కోట్ల 74 లక్షలతో నిర్మించబోయే సీసీ రోడ్డుకు మంత్రి నిమ్మల రామానాయుడు నిధులు మంజూరు చేశారు. శంకుస్థాపన అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ..
    1
    రూ.2కోట్ల 74 లక్షలతో సీసీ రోడ్డుకు 
మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన
రూ.2కోట్ల 74 లక్షలతో నిర్మించబోయే సీసీ రోడ్డుకు 
మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు 
పాలకొల్లు మండలం, పాలకొల్లు రూరల్ పంచాయతీ పరిధిలోని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్స్ వద్ద రూ.2కోట్ల 74 లక్షలతో నిర్మించబోయే సీసీ రోడ్డుకు మంత్రి నిమ్మల రామానాయుడు నిధులు మంజూరు చేశారు. శంకుస్థాపన అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ..
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతి వార్తతో ఏలూరు జిల్లాలో విషాద ఛాయలు ఆళ్ల నాని మృతి వార్తతో ఏలూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2004, 2009లో ఏలూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన ఆళ్ల నాని అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి విజయం సాధించి వైఎస్ జగన్ మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఆళ్ల నాని మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు, అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
    1
    మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతి వార్తతో ఏలూరు జిల్లాలో విషాద ఛాయలు
ఆళ్ల నాని మృతి వార్తతో ఏలూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
2004, 2009లో ఏలూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన ఆళ్ల నాని అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి విజయం సాధించి వైఎస్ జగన్ మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు.
రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఆళ్ల నాని మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు, అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • నాగోల్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హత్యకు సంబంధించి మరో వీడియో హైదరాబాద్‌ - నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌ నగర్‌ చౌరస్తా సమీపంలో ఖమ్మం ఇల్లెందుకి చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్య ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా వీరిద్దరి మధ్య ముఠా కక్షలే హత్యకు కారణంగా గుర్తింపు నిందితులు మహేష్ అండ్ టీం కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్న నాగోల్ పోలీసులు
    1
    నాగోల్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హత్యకు సంబంధించి మరో వీడియో 
హైదరాబాద్‌ - నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌ నగర్‌ చౌరస్తా సమీపంలో ఖమ్మం ఇల్లెందుకి చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్య
ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు
సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా వీరిద్దరి మధ్య ముఠా కక్షలే హత్యకు కారణంగా గుర్తింపు
నిందితులు మహేష్ అండ్ టీం కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్న నాగోల్ పోలీసులు
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.