పల్నాడు జిల్లా..సత్తెనపల్లి *సత్తెనపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు దరువూరి నాగేశ్వరరావు తెలిపారు.* సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చొరవతో సాగర్ కెనాల్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడంతో పట్టణానికి సుమారు 100 రోజులకు సరిపడా మంచినీటిని నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దరువూరి నాగేశ్వరరావు సత్తెనపల్లిలోని మంచినీటి చెరువును సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు. పట్టణ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించి, తగిన చర్యలకు చొరవ చూపారని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సమర్థవంతంగా వినియోగిస్తూ పట్టణంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ డి ఈ మధుసూదన్ రావు, కుటమి నాయకులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా..సత్తెనపల్లి *సత్తెనపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు దరువూరి నాగేశ్వరరావు తెలిపారు.* సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చొరవతో సాగర్ కెనాల్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడంతో పట్టణానికి సుమారు 100 రోజులకు సరిపడా మంచినీటిని నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దరువూరి నాగేశ్వరరావు సత్తెనపల్లిలోని మంచినీటి చెరువును సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు. పట్టణ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించి, తగిన చర్యలకు చొరవ చూపారని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సమర్థవంతంగా వినియోగిస్తూ పట్టణంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ డి ఈ మధుసూదన్ రావు, కుటమి నాయకులు పాల్గొన్నారు.
- పల్నాడు జిల్లా..సత్తెనపల్లి *సత్తెనపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు దరువూరి నాగేశ్వరరావు తెలిపారు.* సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చొరవతో సాగర్ కెనాల్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడంతో పట్టణానికి సుమారు 100 రోజులకు సరిపడా మంచినీటిని నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దరువూరి నాగేశ్వరరావు సత్తెనపల్లిలోని మంచినీటి చెరువును సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు. పట్టణ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించి, తగిన చర్యలకు చొరవ చూపారని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సమర్థవంతంగా వినియోగిస్తూ పట్టణంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ డి ఈ మధుసూదన్ రావు, కుటమి నాయకులు పాల్గొన్నారు.1
- నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థ పై చర్యలు తీసుకోండి. సెలవు రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి భద్రత లేకుండా ప్రిన్సిపల్ ఇంటిలో క్లాసులు నిర్వహించిన నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని రేపల్లె ఎంఈఓ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించి ఎంఈఓ కె.సురేష్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రేపల్లె కార్యదర్శి ఎం.సూర్య ప్రకాష్,సహాయ కార్యదర్శి వై.నవీన్ మాట్లాడుతూ రేపల్లె పట్టణంలో సెలవు రోజులలో విద్యాసంస్థలు నిర్వహించవద్దని సంబంధిత విద్యాశాఖ అధికారులు ముందు రోజే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈనెల 12వ తేదీ రెండో శనివారం,స్కూల్ నడపడానికి ప్రయత్నించిన నారాయణ విద్యాసంస్థ యాజమాన్యంతో ఎస్ఎఫ్ఐ నాయకులు డీఈఓ ద్వారా ఫోన్లో మాట్లాడించిన, మేము స్కూలు నడపాల్సిందే,మాకు ర్యాంకులే ముఖ్యం అంటు కొంతమంది తల్లిదండ్రులను ఎస్ఎఫ్ఐ నాయకులతో మరియు ఫోన్ లో విద్యాశాఖ అధికారులతో గొడవలకు ప్రేరేపించి నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తూ స్కూల్ నడపడంపై చర్యలు తీసుకోవాలన్నారు.విద్యాసంస్థ నడపటానికి ముందస్తు అనుమతులు తీసుకోకుండా గాలి,వెలుతురు, మంచినీళ్లు, టాయిలెట్స్ లాంటి భద్రతా సౌకర్యాలు లేకుండా స్కూలుకి కిలో మీటర్ దూరంలో గురువు రోడ్డులో ఉన్న ప్రిన్సిపల్ ఇంటిలో మరియు మరో రెండు చోట్ల స్కూల్ సిబ్బంది ఇళ్ళ వద్ద క్లాసులు నిర్వహించారు, నిబంధనలకు విరుద్దగా స్కూల్ ప్రారంభంలో కూడా పుస్తకాలు, యూనిఫామ్ బహిరంగంగా అమ్ముకుని విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేశారు,నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నాగార్జున, ప్రశాంత్,వెంకటేశ్వరరావు,శ్రీకాంత్ బెన్నీ తదితరులు పాల్గొన్నారు...2
- గణేష్ ఉత్సవాల్లో భాగంగా పుల్లలచెరువులో ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహణ. మంచి నడవడిక, సత్ ప్రవర్తన ఎంతో గొప్పవని వాటిని ఆచరిస్తే ఉత్తమ జీవనాన్ని పొందవచ్చని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మాచిరాజు. హనుమంతరావు అన్నారు. ఆధ్యాత్మిక భావనలను అవలంభిస్తేనే యువత ఉన్నతమైన స్థానంలో ఉంటారని వివరించారు.గణేష్ వేడుకల్లో భాగంగా పుల్లలచెరువులో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రవచనం వినిపించారు. ఆ సంఘం నాయకులు ఉప్పల. హనుమంతరావు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా ఆర్య వైశ్య సంఘం ప్రముఖులు జీవి గురునాధం,ప్రముఖ సిద్ధాంతి వడ్లమాని. గోవర్ధనా చార్యులు,గ్రామస్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1
- మైదుకూరు ఆదరణ సేవా సంస్థకు నేషనల్ సేవా రత్నా పురస్కార్ 2026ప్రధానం కడప జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన ఆదరణ సేవా సంస్థ వారి సేవలను గుర్తించి కర్ణాటక రాష్ట్రంలోనీ బెంగళూరు పట్టణానికి చెందిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి 15వ వార్షికోత్సవం సందర్భంగా ఆదరణ సేవా సంస్థ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ నేషనల్ సేవా రత్నా పురస్కార్ 2026 అవార్డు ప్రముకుల చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగినది.ఈ సందర్భంగా ఆదరణ సేవా సంస్థ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సమాజములో స్వచ్ఛందంగా నిస్వార్ధంలో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అభినందిస్తూ వారికి అవార్డు ప్రధానం చేయడం చాలా సంతోషం అని తెలిపారు.అలాగే తమ తల్లి తల్లిదండ్రులకు ,విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు,తన మిత్రులకు , శ్రేయోభిలాషులకు ,దాతలకు ,సంస్థలోని సభ్యులకు ఆదరణ సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.1
- మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వినాయక చవితి సంబరాలు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో వినాయక చవితి వేడుకలు అంబరాన్నంటాయి. రామ్ చరణ్, ఉపాసన, కుటుంబ సభ్యులంతా కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్, అందరికీ ఆనందం, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న #RC17 వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.1
- ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు వద్ద ఆకేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు వద్ద ఆకేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో ఇప్పటివరకు ఆకేరులో వరద రాలేదు. కాగా ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఆకేరు జలకళను సంతరించుకుంది. దీంతో ఎగువ నుంచి వరద ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద ప్రవాహం వస్తుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు మండలంలోని మున్నేరు సైతం భారీగా ప్రవహిస్తుంది.1
- 69 మంది లబ్ధిదారులకు 72.89 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన మంత్రి సత్యప్రసాద్. రాష్ట్రంలో పేద మధ్య తరగతి ప్రజలు వైద్య ఖర్చు నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం సకాలంలో CMRF చెక్కులను పంపిణీ చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. టిడిపి కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న 69 మంది లబ్ధిదారులకు 72,89,587 రూపాయల CMRF చెక్కులను పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా అడుగులు వేస్తుందన్నారు.1
- జైనూర్‌లో భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,245 గంజాయి మొక్కలు విలువ: రూ.1.54 కోట్లు 11 గ్రాముల ఎండు గంజాయి కూడా స్వాధీనం ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వివరాలను ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు.1