మైదుకూరు ఆదరణ సేవా సంస్థకు నేషనల్ సేవా రత్నా పురస్కార్ 2026ప్రధానం కడప జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన ఆదరణ సేవా సంస్థ వారి సేవలను గుర్తించి కర్ణాటక రాష్ట్రంలోనీ బెంగళూరు పట్టణానికి చెందిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి 15వ వార్షికోత్సవం సందర్భంగా ఆదరణ సేవా సంస్థ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ నేషనల్ సేవా రత్నా పురస్కార్ 2026 అవార్డు ప్రముకుల చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగినది.ఈ సందర్భంగా ఆదరణ సేవా సంస్థ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సమాజములో స్వచ్ఛందంగా నిస్వార్ధంలో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అభినందిస్తూ వారికి అవార్డు ప్రధానం చేయడం చాలా సంతోషం అని తెలిపారు.అలాగే తమ తల్లి తల్లిదండ్రులకు ,విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు,తన మిత్రులకు , శ్రేయోభిలాషులకు ,దాతలకు ,సంస్థలోని సభ్యులకు ఆదరణ సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
మైదుకూరు ఆదరణ సేవా సంస్థకు నేషనల్ సేవా రత్నా పురస్కార్ 2026ప్రధానం కడప జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన ఆదరణ సేవా సంస్థ వారి సేవలను గుర్తించి కర్ణాటక రాష్ట్రంలోనీ బెంగళూరు పట్టణానికి చెందిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి 15వ వార్షికోత్సవం సందర్భంగా ఆదరణ సేవా సంస్థ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ నేషనల్ సేవా రత్నా పురస్కార్ 2026 అవార్డు ప్రముకుల చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగినది.ఈ సందర్భంగా ఆదరణ సేవా సంస్థ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సమాజములో స్వచ్ఛందంగా నిస్వార్ధంలో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అభినందిస్తూ వారికి అవార్డు ప్రధానం చేయడం చాలా సంతోషం అని తెలిపారు.అలాగే తమ తల్లి తల్లిదండ్రులకు ,విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు,తన మిత్రులకు , శ్రేయోభిలాషులకు ,దాతలకు ,సంస్థలోని సభ్యులకు ఆదరణ సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
- మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో వినాయక చవితి సంబరాలు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో వినాయక చవితి వేడుకలు అంబరాన్నంటాయి. రామ్ చరణ్, ఉపాసన, కుటుంబ సభ్యులంతా కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. అభిమానులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రామ్ చరణ్, అందరికీ ఆనందం, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. చరణ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న #RC17 వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉన్నారు.1
- మందు బాబుల కోసం దేవుడైన కాసుకోవాల్సిందే మనం ఏ జనరేషన్ లో ఉన్నామో అర్ధమౌతుంది..1
- 69 మంది లబ్ధిదారులకు 72.89 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన మంత్రి సత్యప్రసాద్. రాష్ట్రంలో పేద మధ్య తరగతి ప్రజలు వైద్య ఖర్చు నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం సకాలంలో CMRF చెక్కులను పంపిణీ చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. టిడిపి కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న 69 మంది లబ్ధిదారులకు 72,89,587 రూపాయల CMRF చెక్కులను పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా అడుగులు వేస్తుందన్నారు.1
- పల్లె ప్రజల చెంతకే గౌతమీ హాస్పిటల్ .. వెస్ట్ విప్పర్రలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు పెంటపాడు మండలంలోని వెస్ట్ విప్పర్ర గ్రామంలో వల్లి దేవసేన సంతాన నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, గౌతమి మల్టీస్పెషల్టీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గైనకాలజీ, పీడియాట్రిక్, ఆర్థోకేర్ అండ్ ట్రామా కేర్, జనరల్ మెడిసిన్ విభాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పసల కనకసుందరం మాట్లాడుతూ గౌతమి మల్టీస్పెషల్టీ హాస్పిటల్ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. మరిన్ని గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా హాస్పిటల్ మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యానికి గౌతమి మల్టీస్పెషల్టీ హాస్పిటల్ పెద్దపీట వేస్తోందన్నారు. తాడేపల్లిగూడెంలో తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందించేందుకు హాస్పిటల్ కృషి చేస్తోందని తెలిపారు. మారుమూల గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ వైద్యం పొందలేని ప్రజలకు వారి వద్దకే వెళ్లి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పసల చంటి, పసల సత్తి కొండలు, పసల గంగన్న, నైనాల సూర్యచంద్రరావు, గౌతమి హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తాడేపల్లిగూడెం, మండల పరిషత్ కార్యాలయంలో ఇంజనీర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ,రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు, 20 మంది రక్తదానం చేశారు. ఇంజనీర్స్ డే. వేడుకలు భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడుశ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఆధునిక మైసూర్. కర్ణాటక రూప కల్పనే కాక భారత దేశంలో అనేక ప్రాంతాలలో సేవలు అందించిన భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165 వ జయంతి సందర్బంగా ఇంజనీర్ వ్యవస్థ ని వారి సేవలు ను గుర్తు చేసుకుంటూ ఇంజినీర్స్ ని గౌరవించు కోవడం స్ఫూర్తి దాయకం అని పలువురు వక్తలు పేర్కొన్నారు. పంచాయితీ రాజ్ విభాగం లో మున్సిపల్ విభాగం లో విశేష సేవలు అందిస్తున్న పలువురు ఇంజినీర్స్ ని ఇంజనీర్స్ డే. వేడుకలలో జి .త్రినాథ్ బాబు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మాట్లాడుతూ భారత దేశానికి ఇంజనీరింగ్ రంగంలో మహోన్నత సేవలు అందించిన మహనీయుడు శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని అన్నారు . ఈ కార్యక్రమంలో విశ్వనాథరెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏలూరు జి త్రినాథ్ బాబు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సిహెచ్ వర్మ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ అధ్యక్షులు, శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి, కే.ధణానంద్ ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఈఏ పశ్చిమగోదావరి అధ్యక్షులు, శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి, రెడ్ క్రాస్ సొసైటీ పీఆర్వో కెవి రమణ, పెద్ద ఎత్తున ఇంజనీర్స్ పాల్గొన్నారు.1
- పల్నాడు జిల్లా..సత్తెనపల్లి *సత్తెనపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు దరువూరి నాగేశ్వరరావు తెలిపారు.* సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చొరవతో సాగర్ కెనాల్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడంతో పట్టణానికి సుమారు 100 రోజులకు సరిపడా మంచినీటిని నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దరువూరి నాగేశ్వరరావు సత్తెనపల్లిలోని మంచినీటి చెరువును సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు. పట్టణ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించి, తగిన చర్యలకు చొరవ చూపారని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సమర్థవంతంగా వినియోగిస్తూ పట్టణంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ డి ఈ మధుసూదన్ రావు, కుటమి నాయకులు పాల్గొన్నారు.1
- సత్తుపల్లిలో ఘనంగా గణపతి నవరాత్రులు ఘనంగా ప్రారంభించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి సరస్వతి దేవి ఆలయం పక్కన ఉన్న శ్రీ ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, సత్తుపల్లి గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహణలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గత 24 ఏళ్లుగా ఇక్కడ మట్టి వినాయకుడితోనే ఉత్సవాలు నిర్వహించడం విశేషం. అలాగే జూపల్లి కంటి ఆస్పత్రి రోడ్డు, హనుమాన్ నగర్, రామాలయం ప్రాంతాల్లోనూ వినాయక మండపాలను ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్ది పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. నవరాత్రుల అనంతరం వివిధ ఆకృతుల్లో తయారు చేసే గణపతి లడ్డూలకు ఘనంగా వేలం పాటలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు అన్నదానం ఉత్సవ కమిటీలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.1
- మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని మృతి వార్తతో ఏలూరు జిల్లాలో విషాద ఛాయలు ఆళ్ల నాని మృతి వార్తతో ఏలూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 2004, 2009లో ఏలూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన ఆళ్ల నాని అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.2019 ఎన్నికల్లో ఏలూరు నుంచి విజయం సాధించి వైఎస్ జగన్ మంత్రివర్గంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన ఆళ్ల నాని మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు, అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.1
- నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు సంబంధించి మరో వీడియో హైదరాబాద్ - నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్ నగర్ చౌరస్తా సమీపంలో ఖమ్మం ఇల్లెందుకి చెందిన రౌడీషీటర్ మహమ్మద్ నహీమ్ దారుణ హత్య ఇల్లందు పట్టణానికి చెందిన రౌడీషీటర్లు ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్, మహమ్మద్ నహీమ్ చిన్ననాటి నుండి కలిసి చదువుకున్న ఆప్తమిత్రులు సెటిల్మెంట్లు చేసిన డబ్బుల విషయంలో గత మూడు నెలలుగా వీరిద్దరి మధ్య ముఠా కక్షలే హత్యకు కారణంగా గుర్తింపు నిందితులు మహేష్ అండ్ టీం కోసం ప్రత్యేక బృందంతో గాలిస్తున్న నాగోల్ పోలీసులు1