Shuru
Apke Nagar Ki App…
వేములవాడ రాజన్న సన్నిధిలో నాగుపాము హల్ చల్.... పాములతో భయాందోళన చెందుతున్న భక్తులు స్థానికులు కోరిన కోర్కెలు తీర్చే కోడిమొక్కుల వేములవాడ రాజన్న సన్నిధిలో పాములు కలకలం సృష్టిస్తున్నాయి. ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పాముల సంచారం రోజురోజుకు పెరుగుతుంది. రాజన్న గుడి సమీపంలో నాగుపాము ప్రత్యక్షమయింది. స్నేక్ స్నాచర్ కు ఆలయ అధికారులు సమాచారం అందించడంతో 8 అడుగుల నాగుపామును స్నేక్ స్నాచర్ పెట్టేశాడు. గతంలో రాజన్న గుడిలో, ధర్మశాలలో, ప్రసాదాల నిల్వ గోదాం లో, విక్రయాల శాలలో, ప్రత్యక్షమై భక్తులను భయాందోళనకు గురిచేసాయి. నిత్యం ఏదోచోట పాములు సంచరిస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
K.V.REDDY
వేములవాడ రాజన్న సన్నిధిలో నాగుపాము హల్ చల్.... పాములతో భయాందోళన చెందుతున్న భక్తులు స్థానికులు కోరిన కోర్కెలు తీర్చే కోడిమొక్కుల వేములవాడ రాజన్న సన్నిధిలో పాములు కలకలం సృష్టిస్తున్నాయి. ఆలయ విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పాముల సంచారం రోజురోజుకు పెరుగుతుంది. రాజన్న గుడి సమీపంలో నాగుపాము ప్రత్యక్షమయింది. స్నేక్ స్నాచర్ కు ఆలయ అధికారులు సమాచారం అందించడంతో 8 అడుగుల నాగుపామును స్నేక్ స్నాచర్ పెట్టేశాడు. గతంలో రాజన్న గుడిలో, ధర్మశాలలో, ప్రసాదాల నిల్వ గోదాం లో, విక్రయాల శాలలో, ప్రత్యక్షమై భక్తులను భయాందోళనకు గురిచేసాయి. నిత్యం ఏదోచోట పాములు సంచరిస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో పార్టీని వీడేందుకు సిద్ధమైన మాజీమంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో కాంగ్రెస్ పెద్దలు నిమగ్నమయ్యారు. మంత్రులు శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డితో భేటీ అయి కాంగ్రెస్ ను వీడొద్దని కోరారు. జగిత్యాల లో ఉన్న జీవన్ రెడ్డి ఇంటికి రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ డిసిసి అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మెడిపల్లి సత్యం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి చేరుకుని గంట పాటు జీవన్ రెడ్డి తో చర్చించారు. ఈనెల 25న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం జరుగుతున్న నేపథ్యంలో మంత్రులు జీవన్ రెడ్డితో భేటీ అయి చర్చించడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు గంట పాటు జీవన్ రెడ్డితో చర్చించారు. ఈ నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి కావాలంటే తాను ఓడిపోవాలని, పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిండు అంటే రాజీవ్ గాంధీ లేకపోతేనే కదా అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నర్మగర్భంగా తన ఆవేదనను చెప్పిన జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. మంత్రులు శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ ఏ విధమైన నిర్ణయం తీసుకోవద్దని జీవన్ రెడ్డి ని కోరామని తెలిపారు. జీవన్ రెడ్డికి పార్టీ అండగా నిలబడే ఆలోచన చేస్తుందని, ఆయనతో చర్చించిన అంశాలను పార్టీ పెద్దలు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ ప్రాంతానికి జీవన్ రెడ్డి ఒక పెద్ద దిక్కులా ఉన్నారని, జీవన్ రెడ్డి గురించి తెలంగాణలో తెలియని వారు ఎవరు ఉండరని అలాంటి వ్యక్తిని పార్టీ వదులుకోదని తెలిపారు. అభివృద్ధి కోసమే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల గొంతుక గా ఉన్న నాయకుడు జీవన్ రెడ్డి అని, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లు జీవన్ రెడ్డి తో గతం లో మాట్లాడారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల ను జీవన్ రెడ్డి తమ దృష్టికి తీసుకవచ్చారని, ఆయన చెప్పిన విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.4
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు చేరి సామూహిక ప్రార్థనలు (నమాజ్) నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కొత్త దుస్తులు ధరించి అల్లాహ్ నామస్మరణతో ప్రార్థనా స్థలాలకు చేరుకోవడంతో పండుగ వాతావరణం నెలకొంది.1
- వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాల్లో భాగంగా మూడవ రోజు పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా శ్రీ సీతారాముల స్వామివారికి పంచోపనిషత్తు విధానంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ రామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవరాత్రి సందర్భంగా ఆలయ అర్చకులు రామాయణ పారాయణం, శ్రీరామ గీత, ఆధ్యాత్మిక రామాయణ పారాయణాలను ఏకాంతంగా నిర్వహించారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు శంకరమఠంలో రామాయణ ప్రవచనం నిర్వహించినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.అలాగే రాజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంత పూజలు నిర్వహించి దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.1
- #JaiDeshParty * #JaiDeshParty4Audit To Bring People Voice on #Telangana Govt Schemes Through Note1
- దళితులకు రూ.12 లక్షలు ఇవ్వాలి దళితులకు అంబేడ్కర్ అభయహస్తం రూ.12 లక్షలు ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్పీఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ అధ్యక్షతన హనుమకొండ ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ దళితు లకు అంబేడ్కర్ అభయహస్తం పథకం ద్వారా రూ.12 లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోం దని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అభివాదం చేస్తున్న నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా వరంగల్ ముందుంటుందని చెప్పారు. మైస ఉపేందర్ మాదిగ, వెజ్ బోర్డ్ మాజీ చైర్మన్ జన్ను జకార్య, వీరేందర్, సుంకె ప్రభాకర్, చెన్నం గోపి, విష్ణు, రాంకుమార్ పాల్గొన్నారు.4
- జనగామ జిల్లా: జిల్లాలో దళిత మహిళలను ఇబ్బంది పెడుతున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వ్యవహారంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా గతంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఇద్దరు దళిత మహిళలకు ఉపాధి కల్పించగా, ప్రస్తుత కలెక్టర్ వారి జీవనాధారమైన టిక్కెట్లను తొలగించే ప్రయత్నం చేయడం సరైనది కాదని పేర్కొన్నారు. పెద్దగా చదువు లేని మహిళల వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకోవడం అనైతికమని అన్నారు. అన్ని అనుమతులతో చిన్న టిక్కెట్లు పెట్టుకుని జీవనం సాగిస్తున్న వారిని ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు సూచించారు. ఈ విషయమై కలెక్టర్‌కు వ్యక్తిగతంగా లేఖ రాస్తానని, హైకోర్టు ఉత్తర్వులను గౌరవించాలని ఆయన తెలిపారు.1
- కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు ఈ వీడియోను సమయము అనుకూలంత చేసుకుని తప్పక విని బంధుత్వాలను ఎలా బలపరుచుకోవాలో తెలుసుకుంటారని కోరుకుంటున్నాను ఇట్లు మీ రేషన్ డీలర్ జాటోత్ రమేష్ నాయక్ రాథోడ్ (అల్ ఇండియా రేషన్ డీలర్ సోషల్ మీడియా)1
- రాష్ట్రంలో మెడిసిన్స్ కొనుగోలు సామాన్య ప్రజలకు భారంగా మారిన నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ లోని ముకరంపుర డాక్టర్ స్ట్రీట్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ‘‘ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రం’’ను ప్రారంభించారు. పేద ప్రజలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో నరేంద్రమోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చారని చెప్పారు. దీంతోపాటు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో మెడిసిన్స్ కొనుగోలు చేయాలంటే అత్యంత ఖరీదైన వ్యవహారమైందన్నారు. మెడిసిన్ కొనుగోలు చేసే స్థోమత లేక ఎంతో మంది పేదలు ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల బాధలు, ఆర్ధిక కష్టాలు తెలుసు కాబట్టే నరేంద్రమోదీ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ‘‘ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు’’ తెరిచి చౌక ధరకే మెడిసిన్స్ అందిస్తున్నారని తెలిపారు. ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాలు అంటే ప్రభుత్వం తక్కువ ధరలకు నాణ్యమైన జనరిక్ మందులు అందించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక మెడికల్ స్టోర్లు అని, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనే పథకం కింద నిర్వహించబడుతున్నాయని తెలిపారు. బ్రాండెడ్ మందులపై ఖర్చు తగ్గించడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా చౌక ధరలకే మందుల అందుబాటులో ఉంచడం, ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులోకి తేవడంతోపాటు ప్రజలను జనరిక్ మెడిసిన్ వాడకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మోదీ ప్రభుత్వం ఈ జన ఔషధీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. కరీంనగర్ ప్రజలంతా పీఎం జన ఔషధి కేంద్రాల్లో దొరికే చౌక మందులను వినియోగించుకోవాలని కోరారు.1