*జిల్లాలో ఘనంగా బాబా సాహెబ్ డా.బిఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు* భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్.అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి పత్రిక ప్రకటన ఏప్రిల్ 14, 2026_ఆదిలాబాదు: చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో బాబా సాహెబ్ డా.బిఆర్.అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి, జెండాను ఆవిష్కరించి ఘనంగా నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలు ఆహ్వానితులను అలరించారు. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించి, వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రం, బహుమతులను కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, గ్రంథాలయ చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్ లు అందజేశారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆరైవ్-అలైవ్ రోడ్డు భద్రత పోస్టర్ లను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రాణాదత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, స్టాంపులతో రూపొందిస్తున్న అంబేద్కర్ చిత్రపటంపై కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు జైభీమ్ స్టాంప్ ను వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న వాక్ స్వాతంత్ర్యం, సమానత్వం కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమయ్యాయని కొనియాడారు. దేశంలో ఎన్ని కులాలు, మతాలు ఉన్నప్పటికీ అందరూ శాంతియుతంగా కలిసి ఉండడానికి రాజ్యాంగమే దిక్సూచి అని సూచించారు. ముఖ్యంగా విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, "బోధించు, సమీకరించు, పోరాడు" అనే అంబేద్కర్ పిలుపును గుర్తుచేశారు. జిల్లాలో విద్యా ఫలితాలను పరిశీలిస్తే బాలికలు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారని, బాలురు సైతం చదువుపై మరింత దృష్టి సారించి సామాజిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. యువతకు కేవలం ఇంజనీరింగ్, డాక్టర్ వృత్తులే కాకుండా డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక రంగాలలో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇందులో భాగంగా 10 పాఠశాలల్లో 'లెర్న్ స్మార్ట్ విత్ AI' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సంక్షేమ రంగంలో భాగంగా ఎస్సీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, ఆరో వాటర్ ప్లాంట్లు, గీజర్ల ఏర్పాటు వంటి పనులు పూర్తి చేశామని వివరించారు. అలాగే జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం మూడు 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' నిర్మిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించడంలో ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నిజాయితీతో కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజంలో సమానత్వం, సమన్యాయం సాధించడమే మన లక్ష్యం కావాలని అన్నారు. ప్రపంచ దేశాలు భారత్ విచ్ఛిన్నం అవుతుందని భావించినా, అంబేద్కర్ అందించిన అద్భుతమైన రాజ్యాంగమే నేడు మనల్ని ప్రపంచ నాయకుడిగా నిలబెట్టిందని కొనియాడారు. రాజ్యాంగంలోని సామాజిక సూత్రాలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో అమలు చేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అంబేద్కర్ సూచనల మేరకు శాంతిభద్రతలను కాపాడటంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 60 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూరుస్తున్నామని వివరించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించడమే తమ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ,అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్పూర్తి వల్లే నేడు భారతదేశం ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకుందని కొనియాడారు. కేవలం హక్కులకే పరిమితం కాకుండా పౌరుల బాధ్యతలను కూడా గుర్తెరగాలని సూచించారు. దళిత వర్గాలు కేవలం రిజర్వేషన్లపైనే ఆధారపడకుండా, జనరల్ కోటాలో కూడా అవకాశాలు సాధించి అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. విద్యే అసలైన ఆయుధమని, అంబేద్కర్ కష్టపడి చదివి సాధించిన ప్రగతి అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులతో పాటు సాధారణ బ్యాంకింగ్ పథకాలను సైతం సద్వినియోగం చేసుకోవాలని, దళిత జాతి అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి ఫలాలు లభిస్తున్నాయని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొంది గ్రూప్ 2 ఉద్యోగం సాధించిన జైనథ్ మండలం ఆడ గ్రామానికి చెందిన అవినాష్ ను శాలువాతో కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీలు సన్మానించి, వనిత డైరెక్టర్ గా అంబేద్కర్ జీవిత చరిత్ర పై రూపొందించిన వీడియో సిడిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఎస్సీ సంక్షేమ అధికారి సునీత కుమారి, బిసి సంక్షేమ అధికారి సోనియా, ఆర్డీఓ స్రవంతి, ఈడి మనోహర్, రవాణా శాఖ అధికారులు రవీందర్, శ్రీనివాస్, హరింద్ర, వార్డుల కౌన్సిలర్లు, కుల సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
*జిల్లాలో ఘనంగా బాబా సాహెబ్ డా.బిఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు* భారత రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్.అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి పత్రిక ప్రకటన ఏప్రిల్ 14, 2026_ఆదిలాబాదు: చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో బాబా సాహెబ్ డా.బిఆర్.అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి, జెండాను ఆవిష్కరించి ఘనంగా నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలు ఆహ్వానితులను అలరించారు. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించి, వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రం, బహుమతులను కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, గ్రంథాలయ చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్ లు అందజేశారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆరైవ్-అలైవ్ రోడ్డు భద్రత పోస్టర్ లను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రాణాదత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, స్టాంపులతో రూపొందిస్తున్న అంబేద్కర్ చిత్రపటంపై కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు జైభీమ్ స్టాంప్ ను వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,
జిల్లా ప్రజలకు అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న వాక్ స్వాతంత్ర్యం, సమానత్వం కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమయ్యాయని కొనియాడారు. దేశంలో ఎన్ని కులాలు, మతాలు ఉన్నప్పటికీ అందరూ శాంతియుతంగా కలిసి ఉండడానికి రాజ్యాంగమే దిక్సూచి అని సూచించారు. ముఖ్యంగా విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, "బోధించు, సమీకరించు, పోరాడు" అనే అంబేద్కర్ పిలుపును గుర్తుచేశారు. జిల్లాలో విద్యా ఫలితాలను పరిశీలిస్తే బాలికలు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారని, బాలురు సైతం చదువుపై మరింత దృష్టి సారించి సామాజిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. యువతకు కేవలం ఇంజనీరింగ్, డాక్టర్ వృత్తులే కాకుండా డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక రంగాలలో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇందులో భాగంగా 10 పాఠశాలల్లో 'లెర్న్ స్మార్ట్ విత్ AI' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సంక్షేమ రంగంలో భాగంగా ఎస్సీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, ఆరో వాటర్ ప్లాంట్లు, గీజర్ల ఏర్పాటు వంటి పనులు పూర్తి చేశామని వివరించారు. అలాగే జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం మూడు 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' నిర్మిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం
ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించడంలో ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నిజాయితీతో కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజంలో సమానత్వం, సమన్యాయం సాధించడమే మన లక్ష్యం కావాలని అన్నారు. ప్రపంచ దేశాలు భారత్ విచ్ఛిన్నం అవుతుందని భావించినా, అంబేద్కర్ అందించిన అద్భుతమైన రాజ్యాంగమే నేడు మనల్ని ప్రపంచ నాయకుడిగా నిలబెట్టిందని కొనియాడారు. రాజ్యాంగంలోని సామాజిక సూత్రాలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో అమలు చేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అంబేద్కర్ సూచనల మేరకు శాంతిభద్రతలను కాపాడటంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 60 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూరుస్తున్నామని వివరించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించడమే తమ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ,అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్పూర్తి వల్లే నేడు భారతదేశం ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకుందని కొనియాడారు. కేవలం హక్కులకే పరిమితం కాకుండా పౌరుల బాధ్యతలను కూడా గుర్తెరగాలని సూచించారు. దళిత వర్గాలు కేవలం రిజర్వేషన్లపైనే ఆధారపడకుండా, జనరల్
కోటాలో కూడా అవకాశాలు సాధించి అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. విద్యే అసలైన ఆయుధమని, అంబేద్కర్ కష్టపడి చదివి సాధించిన ప్రగతి అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులతో పాటు సాధారణ బ్యాంకింగ్ పథకాలను సైతం సద్వినియోగం చేసుకోవాలని, దళిత జాతి అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి ఫలాలు లభిస్తున్నాయని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొంది గ్రూప్ 2 ఉద్యోగం సాధించిన జైనథ్ మండలం ఆడ గ్రామానికి చెందిన అవినాష్ ను శాలువాతో కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీలు సన్మానించి, వనిత డైరెక్టర్ గా అంబేద్కర్ జీవిత చరిత్ర పై రూపొందించిన వీడియో సిడిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఎస్సీ సంక్షేమ అధికారి సునీత కుమారి, బిసి సంక్షేమ అధికారి సోనియా, ఆర్డీఓ స్రవంతి, ఈడి మనోహర్, రవాణా శాఖ అధికారులు రవీందర్, శ్రీనివాస్, హరింద్ర, వార్డుల కౌన్సిలర్లు, కుల సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
- *పత్రిక ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా, ఏప్రిల్ 14 :- *పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర రాజకీయ ప్రముఖులు అధికారులు.* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ చౌరస్తా నందు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ జయంతి వేడుకలలో ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడం చేశారు. అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా 99 రోజుల ప్రజా పాలన ప్రగతి పరణాళికలో భాగంగా "అరైవ్ ఆలైవ్" లో భాగంగా వారం రోజులపాటు జరిగే కార్యక్రమాలలో మంగళవారం అంబేద్కర్ విగ్రహాల వద్ద రోడ్డు భద్రతా నియమాలపై భద్రతా ప్రతిజ్ఞను జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని జయంతి ఉత్సవాలలో సంబంధిత పోలీసు అధికారులు ప్రజలతో కలిసి పాల్గొని భద్రత ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమనిబంధనలు పాటించి రోడ్డుపై ప్రమాదాలను నివారించే దిశగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరిస్తామని మరియు రాంగ్ సైడ్ ప్రయాణం, రాంగ్ రూటు ప్రయాణం రాష్ డ్రైవింగ్ లాంటివి చేయమని ప్రతిజ్ఞ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. నేను భారతదేశ పౌరుడిగా, మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరులకు తెలియజేస్తానని, తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదములు జరుగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించినపుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘన గాని, ప్రేరేపించడం గాని లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని ప్రజలు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా గల అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ఈరోజు జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పోలీసు సిబ్బంది ప్రజలచే భద్రతా ప్రతిజ్ఞను చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రవీంద్ర కుమార్, అదనపు కలెక్టర్, ప్రజా ప్రతినిధులు, అదిలాబాద్ డిఎస్పిఎల్ జీవన్ రెడ్డి, డిటిఓ శ్రీనివాస్, పట్టణ సీఐలు, ఎంవిఐలు, ఏఎంవిఐ లు,3
- ఆదిలాబాద్ జిల్లా : దేశ వ్యాప్తంగా పెరుగుతున్న మనువాద భావజాలనికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడి లౌకిక భారత రాజ్యాంగాన్ని రక్షిస్తేనే బాబా సాహెబ్ గారికి ఘనమైన నివాళి అని సీపీఎం ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు.మంగళవారం డా.బిఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్బంగా జిల్లా కేంద్రం లోని అంబేద్కర్ చౌక్ లో పార్టీ శ్రేణులతో కలిసి విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ...బాబాసాహెబ్ ఆలోచనలకూ విరుద్దంగా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేలా దాని స్థానంలో మనువాద రాజ్యాంగం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు.అందులో భాగంగానే రాజ్యాంగ వ్యవస్థలను,దాని పునాదులను మార్చే ప్రయత్నం చేస్తుందని దేశాన్ని మత ఆధారంగా విభజిస్తుందని అన్నారు. బీజేపీ అధికారం లోకి వచ్చాక షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపై దాడులు పెరిగాయాని ప్రభుత్వ NCRT నివేదికలు చుస్తే అర్థం అవుతుందని అన్నారు. రిజర్వేషన్ ను తొలిగించేందుకు దానిని బలహీన పర్చేలా ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేట్ కరణ, సంక్షేమ రంగం నుండి తప్పుకునేలా వ్యవహారిస్తుందని తెలిపారు. ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్ అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగాన్ని రక్షించడం, మతోన్మాద భావజాలనికి వ్యతిరేకంగా పోరాడటం, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటం ప్రజల తక్షణ కర్తవ్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని, ఆయన ఆశించన సమానత్వ సమమాజాన్ని సాధించేందుకు పార్టీ ఎప్పుడు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పూసం సచిన్,జిల్లా కమిటీ సభ్యులు ఆర్ మంజుల జిల్లా నాయకులు అరిఫా,నర్మదా,ఆశన్న,పోచన్న తదితరులు పాల్గొన్నారు1
- 18 సంవత్సరాల లోపు మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవద్దని మంచిర్యాల జిల్లా ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ కోరారు. మంచిర్యాల జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేటలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నలిమెల రాజు, ఆర్టిఏ అధికారులు ఉన్నారు.1
- గత కొంతకాలంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యాపారవేత్తలను చంపుతానని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విత్తనాల నాగరాజు అను రౌడీ షీటర్ ని , జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు, మెట్టుపల్లి డి.ఎస్.పి ఏ రాములు గారి ఆధ్వర్యంలో, ఈరోజు కోరుట్ల పట్టణంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది గతంలో కూడా విత్తనాలు నాగరాజు పై రెండు మర్డర్ కేసులు మరియు ఎక్స్ట్రాక్షన్ కేసులు నమోదు కాబడినవి అలాగే ఇతనిపై గతంలో PD Act కూడా నమోదు చేసి జైలుకు పంపించనైనది. అలాగే ఈరోజు అరెస్టు చేసిన కేసులో విత్తనాల నాగరాజు తో పాటు మరొక నిందితుడు కూడా ఉన్నట్లు ఆ దర్యాప్తులో తెలిసినది ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు తొందర్లోనే అతని పట్టుకుని అరెస్టు చేస్తాం వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే కూడా వారిని కూడా రిమాండ్ చేస్తాం ఈ కేసుని చాలా మైనేట్గా దర్యాప్తు చేస్తున్నాం, అదేవిధంగా విత్తనాల నాగరాజు అనే రౌడీషీటర్ తో కానీ ఇతని సహచరులతో కానీ ఎవరైనా సంబంధాలు కలిగి ఉండి వారితో తిరిగిన ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిగా పెట్టి వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోబడును, అలాగే ఎవరైనా ఎవరినైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడి బలవంతపు వసూలు చేస్తే వారిపై చట్టపరంగా చాలా కఠిన చర్యలు తీసుకోబడును. ముఖ్యంగా కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ పోలీస్ తరఫున విన్నపం ఏమనగా ఎవరు కూడా ఇలాంటి భయాలకు ఆందోళనలకు గురికావాల్సిన పనిలేదు మిమ్మల్ని ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసిన బెదిరించిన నిర్భయంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వవచ్చు అదేవిధంగా మీ వివరాలు చాలా రహస్యంగా ఉంచబడతాయి.1
- జగిత్యాల : జగిత్యాల నుండే కెసిఆర్ జైత్ర యాత్ర మొదలుకానుంది, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీఆర్ఎస్ అధికారంలోకి రావడమొక్కటే మార్గం : మాజీ మంత్రి జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి పోవాలి.. కెసిఆర్ రావాలి.. కెసిఆర్ పాలనే బాగుండే అనే భావన ప్రజల్లోనుండి వచ్చిందనీ, కేసీఆర్ తో ప్రయాణం కొత్త అనుభూతి అన్నారు. జగిత్యాల పట్టణంలోని జెడ్పీ మాజీ వైస్ ఛైర్మన్ హరిచరన్ రావు స్వగృహం విద్యానగర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి...మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ దావా వసంత, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ శ్రీమతి విజయలక్ష్మి, రాయికల్ మున్సిపల్ చైర్మన్ కే. రవీందర్, స్థానిక నాయకులు వి. పురుషోతం రావు, వెంకట రావు, ధర్మాజిపేట్ వెంకటేశ్వర్ రావు, పట్టణ బి ఆర్ ఎస్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రావు తదితర బీ ఆర్ ఎస్ నాయకులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీ ఆర్ ఎస్ పార్టీ లోకి రావడం అదృష్టమనీ, మనస్పూర్తిగా పార్టీలోకి స్వాగతిస్తున్నామన్నారు. నిస్వార్ధంగా సేవ చేసే నాయకులు, నిబద్ధతగల నాయకులు జీవన్ రెడ్డి కి అందరం సహకరిస్తాంమనీ,..పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆయనకు తోడుంటామన్నారు.. జీవన్ రెడ్డి రాకతో బీ ఆర్ ఎస్ కు కొండంత అండగా దొరికింది. ప్రజల పక్షాన నిలబడే నాయకుడు జీవన్ రెడ్డి అని అన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..కేసీఆర్ తో ప్రయాణం రాజకీయంగా నూతన అధ్యాయం అనీ..అభిమానులు, నాయకులు, కార్యకర్తలందరి సహకారంతో ముందుకు సాగుదాం అన్నారు. కేసీఆర్ తో అనుబంధం ఈనాటిది కాదు.. తెలంగాణ ఉద్యమ సారధిగా పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం కెసిఆర్ దశాబ్దకాలం కృషిచేశారు. రైతు బిడ్డగా రైతు సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టారు. గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసుకోవాలని దిగువన మేడిగడ్డ వద్ద 300 టీ ఎం సి ల నీటి లభ్యత ఉంటుందని బ్యారేజీల నిర్మాణం చేపట్టారు.నీటి వనరులతో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల్లో పంజాబ్, హర్యానాతో పోటీ పడుతున్నాం. ఎస్ ఎల్ బి సి నిర్మాణ దశలో కుంగి పోయి కార్మికులు మృతి చెందినా, వారిశవాలుసైతం వెలికి తీయకుండా నిర్మాణ పనులు చేపడుతున్నారు....కానీ, మేడిగడ్డ పునర్నిర్మాణం చేపట్టకుండా కేసీఆర్ ను దోషిగా చూపే ప్రయత్నంలో భాగంగా బ్యారేజ్ ల మరమతులు చేపట్ట లేదని విమర్శించారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరవడం సంతోషం.. కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలనేది ప్రజల్లో వచ్చిన ఆలోచన.. కెసిఆర్ ఆడబిడ్డల కోసం కళ్యాణ లక్ష్మీ 50 వేల నుండి లక్షకు పెంచారు. కేసీఆర్ 10 వేలు పెట్టుబడి సాయం ఇచ్చారు. కాంగ్రెస్ 15 వేలు అని చెప్పి అసలుకే మోసం వచ్చింది. కరువు వస్తె రేవంత్ రెడ్డి బాధ్యులు అవుతారు. బోర్నపల్లి వంతెన కు కేసీఆర్ 70 కోట్లు మంజూరు చేశారు.కేసీఆర్ కు రుణపడి ఉంటా..2
- గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లి గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, నాయకులు దొనకొండ తిరుపతి, దొనకొండ మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బిజెపి జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి పైన గోపి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను సమర్పించి నివాళులను అర్పించారు.1
- పత్రిక ప్రకటన ఏప్రిల్ 14, 2026_ఆదిలాబాదు: చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ కూడలిలో బాబా సాహెబ్ డా.బిఆర్.అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూషలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి, జెండాను ఆవిష్కరించి ఘనంగా నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలు ఆహ్వానితులను అలరించారు. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించి, వివిధ పాఠశాలల్లో నిర్వహించిన వ్యాసరచన, ఉపన్యాస పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రం, బహుమతులను కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, గ్రంథాలయ చైర్మన్, మున్సిపల్ చైర్ పర్సన్ లు అందజేశారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆరైవ్-అలైవ్ రోడ్డు భద్రత పోస్టర్ లను ఆవిష్కరించి, ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రాణాదత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, స్టాంపులతో రూపొందిస్తున్న అంబేద్కర్ చిత్రపటంపై కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు జైభీమ్ స్టాంప్ ను వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ప్రజలకు అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం మనం అనుభవిస్తున్న వాక్ స్వాతంత్ర్యం, సమానత్వం కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమయ్యాయని కొనియాడారు. దేశంలో ఎన్ని కులాలు, మతాలు ఉన్నప్పటికీ అందరూ శాంతియుతంగా కలిసి ఉండడానికి రాజ్యాంగమే దిక్సూచి అని సూచించారు. ముఖ్యంగా విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, "బోధించు, సమీకరించు, పోరాడు" అనే అంబేద్కర్ పిలుపును గుర్తుచేశారు. జిల్లాలో విద్యా ఫలితాలను పరిశీలిస్తే బాలికలు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారని, బాలురు సైతం చదువుపై మరింత దృష్టి సారించి సామాజిక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. యువతకు కేవలం ఇంజనీరింగ్, డాక్టర్ వృత్తులే కాకుండా డిజిటల్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక రంగాలలో శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇందులో భాగంగా 10 పాఠశాలల్లో 'లెర్న్ స్మార్ట్ విత్ AI' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సంక్షేమ రంగంలో భాగంగా ఎస్సీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, ఆరో వాటర్ ప్లాంట్లు, గీజర్ల ఏర్పాటు వంటి పనులు పూర్తి చేశామని వివరించారు. అలాగే జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం మూడు 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్' నిర్మిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించడంలో ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నిజాయితీతో కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజంలో సమానత్వం, సమన్యాయం సాధించడమే మన లక్ష్యం కావాలని అన్నారు. ప్రపంచ దేశాలు భారత్ విచ్ఛిన్నం అవుతుందని భావించినా, అంబేద్కర్ అందించిన అద్భుతమైన రాజ్యాంగమే నేడు మనల్ని ప్రపంచ నాయకుడిగా నిలబెట్టిందని కొనియాడారు. రాజ్యాంగంలోని సామాజిక సూత్రాలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో అమలు చేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అంబేద్కర్ సూచనల మేరకు శాంతిభద్రతలను కాపాడటంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 60 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం చేకూరుస్తున్నామని వివరించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, బాధితులకు న్యాయం జరుగుతుందనే భరోసా కల్పించడమే తమ ప్రాధాన్యత అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ,అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్పూర్తి వల్లే నేడు భారతదేశం ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకుందని కొనియాడారు. కేవలం హక్కులకే పరిమితం కాకుండా పౌరుల బాధ్యతలను కూడా గుర్తెరగాలని సూచించారు. దళిత వర్గాలు కేవలం రిజర్వేషన్లపైనే ఆధారపడకుండా, జనరల్ కోటాలో కూడా అవకాశాలు సాధించి అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. విద్యే అసలైన ఆయుధమని, అంబేద్కర్ కష్టపడి చదివి సాధించిన ప్రగతి అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులతో పాటు సాధారణ బ్యాంకింగ్ పథకాలను సైతం సద్వినియోగం చేసుకోవాలని, దళిత జాతి అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ, అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి ఫలాలు లభిస్తున్నాయని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొంది గ్రూప్ 2 ఉద్యోగం సాధించిన జైనథ్ మండలం ఆడ గ్రామానికి చెందిన అవినాష్ ను శాలువాతో కలెక్టర్, ఎమ్మెల్యే, ఎస్పీలు సన్మానించి, వనిత డైరెక్టర్ గా అంబేద్కర్ జీవిత చరిత్ర పై రూపొందించిన వీడియో సిడిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఎస్సీ సంక్షేమ అధికారి సునీత కుమారి, బిసి సంక్షేమ అధికారి సోనియా, ఆర్డీఓ స్రవంతి, ఈడి మనోహర్, రవాణా శాఖ అధికారులు రవీందర్, శ్రీనివాస్, హరింద్ర, వార్డుల కౌన్సిలర్లు, కుల సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.4