*బడుగువానిలంకలో అయ్యప్ప స్వామి "ఆరాట్టు" వేడుకలకు సర్వసిద్ధం* *కేరళ తరహలో భారీ ఏర్పాట్లు* అయ్యప్ప స్వామికి కేరళలో నిర్వహించే ఆరాట్టు కార్యక్రమం మాదిరిగానే గోదావరి జిల్లాల్లో తొలిసారిగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం బడుగువానిలంక గోదావరి చెంతన నిర్వహించనున్నారు.ఆరాట్టు అంటే స్వామి వారి విగ్రహాన్ని నదిలో శుద్ది చేసే మహిమానిత్వ కార్యక్రమం. అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి పంబలో ఈ ఆరాట్టు కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహిస్తాయి. అదే తరహాలో బడుగువానిలంక చెంత నున్న గౌతమి నదిలో ఈ ఆరాట్టు నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి కడియం కు చెందిన తాడాల వీర వెంకటరావు గురుస్వామి ఆధ్వర్యంలో విస్సు మాల ధరించిన అయ్యప్ప స్వామి భక్త బృందం ఈ ఆరాట్టు నిర్వహిస్తారు.108 కళాశాలతో గ్రామం నుండి ఊరేగింపుగా గోదావరి చెంతకు చేరుకుని ఈ కార్యక్రమాన్ని చేపడతారు. ఇప్పటివరకు రాష్ట్రంలో అయ్యప్ప స్వామి మండల దీక్షలు, జ్యోతి దర్శన దీక్షలు వంటివి మాత్రమే ఎక్కువగా అయ్యప్ప స్వాములు చేపడతారు. కాని ఈ ఆరాట్టు నిర్వహించడానికి విస్సు మాలాధారణ 30 మంది భక్తులు చేపట్టారు. బడుగువానిలంక గ్రామానికి చెందిన పడాల వెంకటేశ్వరరావు గురుస్వామి పర్యవేక్షణలో లంక గ్రామాల చెందిన భక్తులు ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.భక్తులు విరాళంగా ఇచ్చిన లక్షలాది రూపాయల వ్యయంతో భారీ ఏర్పాట్లు చేశారు.ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం వేలాది మందికి అన్న సమారాధన నిర్వహిస్తారు. అలాగే బుధవారం రాత్రి అయ్యప్ప స్వామి ఉత్తరా నక్షత్ర జన్మదిన వేడుకలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అయిదు సంవత్సరం నుంచి ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. పాతూరు రామాలయం వద్ద అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, అనేక రకాల పండ్ల రసాలతో అభిషేకాలు జరుపుతారు. ఎంతో కన్నుల పండువగా జరిగే ఈ వేడుకలు తిలకించడానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు.

- మండపేట టౌన్ న్యూస్... అడిగినంత లంచం ఇవ్వలేదన్న అక్కసుతో మండపేట మున్సిపల్ అధికారులు తన ఇంటి నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేశారని పట్టణానికి చెందిన ప్రముఖ ఆర్థో సర్జన్ రాము అన్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తాను ఏమీ చేయలేనన్న అహంకారంతో వ్యవహరించారన్నారు. మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారుల కక్ష పూరిత చర్యలతో తాను తీవ్రంగా నష్ట పోయాయని అన్నారు. ఈ మేరకు తనకు న్యాయం చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీ జీ ఆర్ ఎస్ లో కలెక్టర్ కీర్తి చేకూరికి వినతి పత్రం అందజేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాము మీడియాతో మాట్లాడుతూ తాను సూర్య మహల్ వెనుక శ్రీ సాయి ఆర్థో అండ్ ట్రామా కేర్ పేరుతో ఆసుపత్రి నిర్వహిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఆసుపత్రి భవనం పై అదనపు అంతస్తు నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. ఇందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో మున్సిపల్ అనుమతుల కోసం అధికారులను సంప్రదించగా, వారు లక్షా యాభై వేల రూపాయలు లంచంగా తీసుకున్నారన్నారు. సెట్ బ్యాక్ చూపలేదని కోర్టులో కేసు ఉన్నందున అనుమతుల కోసం మరో ఐదు లక్షలు ఇవ్వాలని కమిషనర్ అడుగుతున్నట్టు మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి చెప్పారన్నారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన తాను మరిన్ని ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలిపారు. దీంతో అధికారులు తన పై కక్ష పెంచుకుని ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా, బీపీఎస్ నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రి పైభాగంలో చేసున్న నిర్మాణాన్ని అన్యాయంగా కూల్చి వేసినట్టు చెప్పారు. అయితే అదే సమయంలో పట్టణంలో ఉన్న ఇతర అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని అన్నారు. మండపేటలో 119 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని అధికారులు స్వయంగా చెప్పినా, కేవలం 60 నిర్మాణాలపై మాత్రమే కేసులు నమోదు చేశారని తెలిపారు. ఈ ఘటనపై తాను ఇప్పటికే కోర్టును ఆశ్రయించగా, టౌన్ ప్లానింగ్ అధికారులు, కమిషనర్ సహా 12 మందిపై కేసు నడుస్తోందని చెప్పారు. అయినప్పటికీ కేసు పురోగతి కనిపించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక భవనం కూల్చివేత సమయంలో కమిషనర్ తనను కులం పేరుతో దూషించారని, తాను ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తినని అవమానించారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని డాక్టర్ రాము కోరారు. కాగా డాక్టర్ రాము చేసిన ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి1
- Post by SS NEWS1
- Post by V Ramarao2
- Post by Ramprasad islavath1
- Post by Syyed taher1
- Post by Shyam1
- Post by Adimlamrambabu Adimlamrambabu1