అక్రమ అరెస్టులు ఖండించాలి – కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయాలి: సీఐటీయూ నల్గొండ, సెప్టెంబర్ 16: హక్కుల కోసం ఆందోళన చేస్తున్న కార్మికులపై ముందస్తు అరెస్టుల పేరుతో అక్రమ నిర్బంధాలకు పాల్పడటాన్ని ఖండించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎండి సలీం పిలుపునిచ్చారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట సామూహిక నిరసన దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికులకు ఇచ్చిన కనీస వేతనం రూ.26 వేల అమలు, ఫిక్స్‌డ్ వేతనం రూ.18 వేలుగా నిర్ణయించడం, వృత్తి రక్షణ, ఉద్యోగ బీమా, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, మల్టీపర్పస్ విధానం రద్దు వంటి హామీలను ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన సంబరాలు జరుపుకుంటున్నప్పటికీ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది చేపట్టిన ఆందోళనలను అణచివేసేందుకు ముందస్తు అరెస్టులు, పోలీసు నిర్బంధాలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణచివేయలేరని, డిమాండ్లు పరిష్కరించకపోతే పోరాటాలు మరింత ఉధృతమవుతాయని హెచ్చరించారు. నిరసన దీక్షల అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ బి. శ్రీనివాస్కు సీఐటీయూ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, లకపాక రాజు, దండెంపల్లి సత్తయ్య, జిల్లా the సహాయ కార్యదర్శి అవుట రవీందర్, ఏర్పుల యాదయ్య, అంగన్‌వాడీ, ఆశా, గ్రామపంచాయతీ, మధ్యాహ్న భోజన కార్మిక సంఘాల నాయకులు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

- హైదరాబాద్ లో గోల్డెన్ గణపతి..ఈ ఏడాది ఇక్కడే స్పెషల్ తరలి వస్తున్న భక్తులు హైదరాబాద్ మహానగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. బేగం బజార్ లో ఏర్పాట్లు చేసిన బంగారు గణపతి నీ చూసేందుకు ఎగబడుతున్నారు.1
- "భూమి, భుక్తి ,వెట్టి చాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను బావి తరాలకు అందించాలి: నల్లు సుధాకర్ రెడ్డి" *నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు* భూమి,బుక్తి,వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషుల తిరుగుబాటే కమ్యూనిస్టులనాయకత్వం లో సాగిన సాయుధ పోరాటమని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు మహబూబాబాద్ జిల్లా ; మరిపెడ మండల కేంద్రం గాంధీ సెంటర్ లో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 78వ వార్షికోత్సవాల సందర్భంగా అమరవీరుల చిత్ర పటానికి పూలమాలవేసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దొరలు, భూస్వాములు, జాగిర్దారుల, రజాకార్ల దాస్టికాలకు వ్యతిరేకంగా, భూమికోసం, భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టు నాయకులైన రావి నారాయణరెడ్డి,బద్దం ఎల్లారెడ్డి,ముగ్దుo మొయినుద్దీన్ పిలుపుతో ఎర్రజెండా నాయకత్వంలో కొనసాగి 10 లక్షల ఎకరాల భూమిని పంచి, మూడువేల గ్రామాలను విముక్తి చేసి,వేలాది కామ్రేడ్స్ త్యాగాల ఫలితంగా నాటి నిజాం తోక ముడిచే సందర్భంలో, సైన్యాలు రావడంతో హైదరాబాదు రాష్ట్రం భారత్ లో విలీనమైందనేది చారిత్రాత్మక సత్యమని,దీనిని మసిపూసి మారేడు కాయలు చేసే విధంగా, సాయుధ పోరాటంతో సంబంధంలేని బిజెపి లాంటి కుహన శక్తులు ముస్లిం రాజు పై హిందువుల పోరాటంగా చిత్రికరించే ప్రయత్నాలు చేయడాన్ని ప్రగతిశీల శక్తులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు .. *నాటి సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చి, సాయుధ పోరాట స్మారక చిహ్నాన్ని ట్యాంకు బండపై ఏర్పాటు చేసి, సెప్టెంబర్ 17 విలీన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు* ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి మారగని బాలకృష్ణ,జిల్లా కౌన్సిల్తు సభ్యులు అబ్దుల్ రషీద్,తురక రమేష్,అంజి, వీరేందేర్, వెంకన్న, నర్సయ్య,కన్నె వెంకన్న, కలగుర నాగరాజు, యుగేందర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు...1
- దారి ఉన్నా.. తన స్థలంపైనే కన్నా? దారి కోసం.. దండయాత్రా? ఇంటి జాగా లాక్కునేందుకు రెండేళ్లుగా వేధింపులంటున్న శంకర్ ఇంటివెనుక సీసీ కెమెరాలు.. కుటుంబ కదలికలపై నిఘా? సీసీ కెమెరాలతో నిఘా.. అధికారుల జోక్యంతోనూ ఆగని వివాదం! అధికారుల జోక్యం.. గ్రామస్తుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచన దంతాలపల్లి మండలంలోని తూర్పుతండా గ్రామపంచాయతీ పరిధిలో ఇంటి జాగా, దారి విషయంలో రెండేళ్లుగా వివాదం కొనసాగుతోంది. తన పాలివారైన గుగులోతు మున్య, సర్జన్, వారి కుటుంబీకులు తన స్థలాన్ని దారి కోసం లాక్కునేందుకు ఒత్తిడి చేస్తూ గొడవలకు దిగుతున్నారని గుగులోతు శంకర్ ఆరోపించారు. తమ కుటుంబంపై కేసులు పెట్టి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మున్య ఇంటికి రాకపోకల కోసం సురేష్ ఇంటి వెనుక ఉన్న సుమారు రెండు అడుగుల ఖాళీ బాటను ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, తన స్థలాన్ని ఆనుకుని కార్లు, పెద్ద వాహనాలు వెళ్లేందుకు మార్గం కల్పించాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని శంకర్ పేర్కొన్నారు.వివాదంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా తహశీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, జీపీఓ, ఎస్‌ఐ తదితరులు స్పందించి ఇరువర్గాలతో మాట్లాడినట్లు శంకర్ తెలిపారు. గ్రామస్తుల సమక్షంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, ఎలాంటి గొడవలకు వెళ్లకూడదని అధికారులు సూచించినట్లు చెప్పారు.మున్య కుటుంబీకులు రూప్‌సింగ్, ధూప్‌సింగ్‌లు ఇంటి వెనుక సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తమ కుటుంబ సభ్యుల కదలికలను రికార్డు చేస్తున్నారని శంకర్ ఆరోపించారు. తమకు స్వేచ్ఛగా బయట ఉండే పరిస్థితి లేకుండా పోయిందని, ఇంట్లో స్థలం సరిపోక ఆరుబయట నిద్రించే సందర్భాల్లో కూడా కెమెరాల నిఘా ఇబ్బందికరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా, దారి వివాదంలో శంకర్ దగ్గర ఎస్‌ఐ లంచం తీసుకుని వారి కుటుంబాలకు మద్దతు ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బాధితులు ఖండించారు. ఆ ప్రచారం అసత్యమని, ఎలాంటి ఆధారాలు లేకుండా జరుగుతున్న ప్రచారంపై కూడా వాస్తవాలు వెలుగులోకి తేవాలని కోరారు. ఇంటి జాగా, దారి వివాదంతో పాటు సీసీ కెమెరాల అంశం, సోషల్ మీడియా ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని, తమకు న్యాయం చేయాలని గుగులోతు శంకర్ కుటుంబం కోరారు.4
- వరంగల్ హైవేపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని బస్‌స్టాప్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం లేదని, పెన్షన్లు పెంచలేదని, మహిళలకు నెలకు రూ. 2,500/- ఇవ్వడం లేదని నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. వంటావార్పు కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి,పార్టీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.1
- తెలంగాణ రైతాoగా పోరాట యోధుల్ని స్మరించుకుందాం :సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో సీపీఐ పార్టీ 78 వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నిజాం నిరాకుశ పాలనకు వ్యతిరేకంగా ఎందరో పోరాట యోధులు తన విప్లవ పందాను కొనసాగిస్తూ ప్రజల హక్కుల కోసం తపించారాని పేర్కొన్నారు.. అమరవీరులను స్మరిస్తూ వారి త్యాగాలను కొనియాడారు.. ఈ కార్యక్రమం లోజిల్లా కౌన్సిల్ సభ్యులు రషీద్ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు..2
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి తగ్గిన నిత్య ఆదాయం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రధాన బుకింగ్ తో రూ.65 వేలు, బ్రేక్ దర్శనాలతో రూ.80,100, VIP దర్శనాలతో రూ.1,12,350, కార్ పార్కింగ్ రూ.1,75,000, ప్రసాద విక్రయాలతో రూ.4,21,770, వ్రతాలతో రూ.55 వేలు, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.11,00,486 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు.1
- సువర్ణ శివలింగ దర్శనంతో రమణేశ్వరంలో భక్తిశోభ రమణేశ్వరం సువర్ణ శివలింగం వద్ద పెరిగిన భక్తుల రద్దీ1
- తొర్రురూ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాగు పాము హల్చల్.. మహబూబాబాద్ జిల్లా తొర్రురూ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై నాగు పాము హల్చల్ చేసింది.. ప్రధాన రహవారిపై పడగ విప్పి ఉండటాన్ని కాసేపు స్థానికులు ఆసక్తిగా తిలకించారు.. ఆ తర్వాత రోడ్ వెంబడి ఉండే డివైడర్ వైపు చెట్ల పొదల్లోకి నాగు పాము వెళ్లడం తో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు..1