logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పదవీ విరమణ పొందిన సూపర్ టెండెంట్ ఇంజనీర్ (S.E.) శ్రీ జి నాగ మోహన్ గారికి ఘనంగా ఆత్మీయ సన్మాన మహోత్సవం. శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం:- పట్టణానికి చెందిన శ్రీ నాగ మోహన్ గారు 34 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలందించి పదవి విరమణ చేయడం జరిగింది నాగ మోహన్ గారి పదవీ విరమణ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారము రోజున ధర్మవరం పట్టణంలోని కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఘనంగా పదవీ విరమణ ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమం జరిగింది* *ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా దేవీ నర్సింగ్ హోమ్ డైరెక్టర్ శ్రీమతి పద్మాగారు, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి ,బుక్కపట్నం మండలం సింగల్ విండో అధ్యక్షులు చిన్ని కృష్ణ , కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ డైరెక్టర్ శెట్టిపి సూర్య ప్రకాష్ రెడ్డి రిటైర్డ్ మున్సిపల్ ఇంజనీర్లు ప్రసాద్, రమేష్, హిందూపూర్ ఇంజనీర్ హరనాథ్ హాజరై ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నాగ మోహన్ గారు 1992 సంవత్సరంలో అసిస్టెంట్ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ( A.E) హిందూపురం నందు ఉద్యోగ ప్రవేశం చేసి అంచలంచలుగా ఎదిగి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా(D.E ) ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా(,E.E) సూపర్ టెండెంట్ ఇంజనీర్గా (S. E ) గా ఏలూరు నగర పాలక సంస్థ నందు పదవీ విరమణ చేశారు* *శ్రీ నాగ మోహన్ గారు కొత్తచెరువు నందు జన్మించి మున్సిపల్ ఇంజనీర్గా వివిధ హోదాల్లో పనిచేసే తన వంతుగా ఉద్యోగ నిర్వహణలో నిబద్ధతగా పనిచేసి అందరి మన్ననలు పొంది అనంతపురం నగరం నందు సూపర్డెంట్ ఇంజనీర్గా (SE ) పనిచేసినప్పుడు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంస అవార్డులను అందుకోవడం జరిగింది* *పదవీ విరమణ ఆత్మీయ సన్మాన మహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు,బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున నాగమోహన్ గారి దంపతులను ఘనంగా సన్మానించడం జరిగింది*

1 hr ago
user_Saddala Adi
Saddala Adi
ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
eb8c659e-c493-4c58-aaa0-5387faf687c2

పదవీ విరమణ పొందిన సూపర్ టెండెంట్ ఇంజనీర్ (S.E.) శ్రీ జి నాగ మోహన్ గారికి ఘనంగా ఆత్మీయ సన్మాన మహోత్సవం. శ్రీ సత్యసాయి జిల్లా,ధర్మవరం:- పట్టణానికి చెందిన శ్రీ నాగ మోహన్ గారు 34 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలందించి పదవి విరమణ చేయడం జరిగింది నాగ మోహన్ గారి పదవీ విరమణ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారము రోజున ధర్మవరం పట్టణంలోని కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఘనంగా పదవీ విరమణ ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమం జరిగింది* *ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా దేవీ నర్సింగ్ హోమ్ డైరెక్టర్ శ్రీమతి పద్మాగారు, యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి ,బుక్కపట్నం మండలం సింగల్ విండో అధ్యక్షులు చిన్ని కృష్ణ , కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ డైరెక్టర్ శెట్టిపి సూర్య ప్రకాష్ రెడ్డి రిటైర్డ్ మున్సిపల్ ఇంజనీర్లు ప్రసాద్, రమేష్, హిందూపూర్ ఇంజనీర్ హరనాథ్ హాజరై ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నాగ మోహన్ గారు 1992 సంవత్సరంలో అసిస్టెంట్ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ( A.E) హిందూపురం నందు ఉద్యోగ ప్రవేశం చేసి అంచలంచలుగా ఎదిగి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా(D.E ) ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా(,E.E) సూపర్ టెండెంట్ ఇంజనీర్గా (S. E ) గా ఏలూరు నగర పాలక సంస్థ నందు పదవీ విరమణ చేశారు* *శ్రీ నాగ మోహన్ గారు కొత్తచెరువు నందు జన్మించి మున్సిపల్ ఇంజనీర్గా వివిధ హోదాల్లో పనిచేసే తన వంతుగా ఉద్యోగ నిర్వహణలో నిబద్ధతగా పనిచేసి అందరి మన్ననలు పొంది అనంతపురం నగరం నందు సూపర్డెంట్ ఇంజనీర్గా (SE ) పనిచేసినప్పుడు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రశంస అవార్డులను అందుకోవడం జరిగింది* *పదవీ విరమణ ఆత్మీయ సన్మాన మహోత్సవంలో పాల్గొన్న మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు,బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున నాగమోహన్ గారి దంపతులను ఘనంగా సన్మానించడం జరిగింది*

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి ఈ రోజు భారతదేశపు 3వ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా బాధ్యతలు స్వీకరించారు, ఇది సైనిక నాయకత్వం మరియు పరివర్తనలో ఒక కొత్త దశకు నాంది పలికింది. దేశ వీరులకు గౌరవ సూచకంగా, ఆయన మొదట జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత, న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ లాన్స్‌లో ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. దేశంలో అత్యున్నత సైనిక పదవిని చేపట్టిన సీడీఎస్, ప్రధానమంత్రి జై (JAI) దార్శనికతకు తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. జై అంటే జాయింట్‌నెస్, ఆత్మనిర్భరత, మరియు ఇన్నోవేషన్ (సమైక్యత, ఆత్మనిర్భరత, మరియు ఆవిష్కరణ). స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ, లోతైన ఏకీకరణ, సేవల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, మరియు కీలకమైన సంస్థాగత సంస్కరణల ద్వారా సాయుధ దళాల పరివర్తనను ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
    1
    జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి ఈ రోజు భారతదేశపు 3వ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా బాధ్యతలు స్వీకరించారు, ఇది సైనిక నాయకత్వం మరియు పరివర్తనలో ఒక కొత్త దశకు నాంది పలికింది. దేశ వీరులకు గౌరవ సూచకంగా, ఆయన మొదట జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆ తర్వాత, న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్ లాన్స్‌లో ఆయనకు గౌరవ వందనం సమర్పించారు.

దేశంలో అత్యున్నత సైనిక పదవిని చేపట్టిన సీడీఎస్, ప్రధానమంత్రి జై (JAI) దార్శనికతకు తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. జై అంటే జాయింట్‌నెస్, ఆత్మనిర్భరత, మరియు ఇన్నోవేషన్ (సమైక్యత, ఆత్మనిర్భరత, మరియు ఆవిష్కరణ). స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తూ, లోతైన ఏకీకరణ, సేవల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, మరియు కీలకమైన సంస్థాగత సంస్కరణల ద్వారా సాయుధ దళాల పరివర్తనను ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • గంగవరంలో మే 31న జరిగిన బహుజన ఆత్మీయ సమ్మేళనంలో, హైకోర్టు న్యాయవాది, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి, బహుజన సమాజాన్ని నిర్మించడం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల బాధ్యత అని ఉద్ఘాటించారు. బహుజన నాయకులు డి.వి. మునిరత్నం అధ్యక్షతన గంగవరం మండలం బ్రిడ్జ్ వద్ద గల ఎస్. ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వందలాది మంది బహుజన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి సుమారు 76 సంవత్సరాలు గడిచినా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం బహుజనులకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం లభించలేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దేశాన్ని ఆధిపత్య కులాలు పరిపాలిస్తున్నాయని, బహుజనులు రాజ్యాధికారం చేపట్టలేదని వారు పేర్కొన్నారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల సమయంలో ఆధిపత్య కులాలు మాయమాటలు చెప్పి బహుజనులను నిలువునా ముంచుతూ, వారి హక్కులను హరిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా బహుజనులు మేలుకోవాలని, ఆధిపత్య కులాల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న తాము బహుజన రాజ్యాధికారం వైపు ప్రయాణించి పాలకులవ్వాలని చింతమాకుల పుణ్యమూర్తి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామానికి అంబేద్కర్ సిద్ధాంతం, రాజ్యాంగం, చట్టాలు, హక్కుల గురించి అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఇకమీదట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యమత్యమై ప్రజలకు నాణ్యమైన ప్రజాస్వామ్యాన్ని అందించాలని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం బహుజనుల వనభోజన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు, ఇందులో జిల్లాస్థాయి, పలమనేర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, ప్రజలు వందలాదిగా హాజరయ్యారు.
    1
    గంగవరంలో మే 31న జరిగిన బహుజన ఆత్మీయ సమ్మేళనంలో, హైకోర్టు న్యాయవాది, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి, బహుజన సమాజాన్ని నిర్మించడం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల బాధ్యత అని ఉద్ఘాటించారు. బహుజన నాయకులు డి.వి. మునిరత్నం అధ్యక్షతన గంగవరం మండలం బ్రిడ్జ్ వద్ద గల ఎస్. ఫంక్షన్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వందలాది మంది బహుజన నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి సుమారు 76 సంవత్సరాలు గడిచినా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం బహుజనులకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం లభించలేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దేశాన్ని ఆధిపత్య కులాలు పరిపాలిస్తున్నాయని, బహుజనులు రాజ్యాధికారం చేపట్టలేదని వారు పేర్కొన్నారు. ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల సమయంలో ఆధిపత్య కులాలు మాయమాటలు చెప్పి బహుజనులను నిలువునా ముంచుతూ, వారి హక్కులను హరిస్తున్నారని ఆరోపించారు.

ఇకనైనా బహుజనులు మేలుకోవాలని, ఆధిపత్య కులాల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న తాము బహుజన రాజ్యాధికారం వైపు ప్రయాణించి పాలకులవ్వాలని చింతమాకుల పుణ్యమూర్తి పిలుపునిచ్చారు. ప్రతి గ్రామానికి అంబేద్కర్ సిద్ధాంతం, రాజ్యాంగం, చట్టాలు, హక్కుల గురించి అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఇకమీదట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యమత్యమై ప్రజలకు నాణ్యమైన ప్రజాస్వామ్యాన్ని అందించాలని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం బహుజనుల వనభోజన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు, ఇందులో జిల్లాస్థాయి, పలమనేర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, ప్రజలు వందలాదిగా హాజరయ్యారు.
    user_Doddagalla Munirathinam
    Doddagalla Munirathinam
    Gangavaram, Chittoor•
    54 min ago
  • చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలంలో సాయి కిషోర్ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలమనేరు శాసన సభ్యులు శ్రీ ఎన్. అమరనాథ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై కళాశాలను లాంఛనంగా ప్రారంభించారు. కళాశాల యాజమాన్యం ఆయనకు సాదరంగా స్వాగతం పలికి, జ్ఞాపికలతో సన్మానించి గౌరవించింది. ఈ సందర్భంగా శ్రీ అమరనాథ రెడ్డి గారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు గల విద్యా సంస్థల ఏర్పాటుతో విలువలతో కూడిన విద్య అందుతుందని తెలిపారు. ఈ కోవకు చెందిన సాయి కిషోర్ జూనియర్ కళాశాలను ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలమనేరు పట్టణ మరియు గంగవరం మండల టీడీపీ నాయకులు కూడా శ్రీ అమరనాథ రెడ్డి గారితో పాటు పాల్గొన్నారు.
    1
    చిత్తూరు జిల్లాలోని గంగవరం మండలంలో సాయి కిషోర్ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలమనేరు శాసన సభ్యులు శ్రీ ఎన్. అమరనాథ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై కళాశాలను లాంఛనంగా ప్రారంభించారు. కళాశాల యాజమాన్యం ఆయనకు సాదరంగా స్వాగతం పలికి, జ్ఞాపికలతో సన్మానించి గౌరవించింది.

ఈ సందర్భంగా శ్రీ అమరనాథ రెడ్డి గారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు గల విద్యా సంస్థల ఏర్పాటుతో విలువలతో కూడిన విద్య అందుతుందని తెలిపారు. ఈ కోవకు చెందిన సాయి కిషోర్ జూనియర్ కళాశాలను ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలమనేరు పట్టణ మరియు గంగవరం మండల టీడీపీ నాయకులు కూడా శ్రీ అమరనాథ రెడ్డి గారితో పాటు పాల్గొన్నారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, కూటమి ప్రభుత్వం పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ప్రతి పూట ఒక పనికిమాలిన నిర్ణయం తీసుకుంటుందని, రోజూ రౌడీయిజం చేస్తుందని, వారానికి వేలకోట్ల అప్పులు చేస్తుందని, మరియు నెల తిరిగితే ఒక కొండను మింగేస్తుందని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వ తీరు ఇలాగే ఉందని కొండా రాజీవ్ గాంధీ స్పష్టం చేశారు.
    1
    వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, కూటమి ప్రభుత్వం పనితీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కూటమి ప్రభుత్వం ప్రతి పూట ఒక పనికిమాలిన నిర్ణయం తీసుకుంటుందని, రోజూ రౌడీయిజం చేస్తుందని, వారానికి వేలకోట్ల అప్పులు చేస్తుందని, మరియు నెల తిరిగితే ఒక కొండను మింగేస్తుందని ఆయన ఆరోపించారు. కూటమి ప్రభుత్వ తీరు ఇలాగే ఉందని కొండా రాజీవ్ గాంధీ స్పష్టం చేశారు.
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • శ్రీ సత్యసాయి బాబా గిరి ప్రదక్షిణను పుట్టపర్తిలో భక్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి ప్రశాంతి నిలయం గణేశ్ గేటు వద్ద సత్యసాయి రథాన్ని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తిపాటలు పాడుతూ భక్తులు రథాన్ని లాగారు. ఈ గిరి ప్రదక్షిణ గోకులం, ఎనుములపల్లి, గణేశ్ సర్కిల్‌, పెట్రోలు బంకు, చింత తోపు, గోవిందపేట, శివాలయం వీధి, గోపురం వీధి రోడ్డు మీదుగా సాగింది. మంగళ హారతితో గిరి ప్రదక్షిణను ముగించిన అనంతరం, భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.
    1
    శ్రీ సత్యసాయి బాబా గిరి ప్రదక్షిణను పుట్టపర్తిలో భక్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి ప్రశాంతి నిలయం గణేశ్ గేటు వద్ద సత్యసాయి రథాన్ని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తిపాటలు పాడుతూ భక్తులు రథాన్ని లాగారు.

ఈ గిరి ప్రదక్షిణ గోకులం, ఎనుములపల్లి, గణేశ్ సర్కిల్‌, పెట్రోలు బంకు, చింత తోపు, గోవిందపేట, శివాలయం వీధి, గోపురం వీధి రోడ్డు మీదుగా సాగింది. మంగళ హారతితో గిరి ప్రదక్షిణను ముగించిన అనంతరం, భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.
    user_Saddala Adi
    Saddala Adi
    ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్‌లో ఉన్న వైయస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణం బైటిపేటకు చెందిన చాకలి నాగయ్య అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాథమిక విచారణలో నిందితుడు గత ఐదు సంవత్సరాలుగా మానసిక రోగి అని, వైయస్సార్‌సీపీ పార్టీకి చెందిన వ్యక్తి అని వెల్లడైంది. ఈ ఘటన వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని సీఐ సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం అనేక కోణాల్లో పూర్తి దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి మానసిక రోగేనని నంద్యాల సీఐ సుధాకర్ రెడ్డి పునరుద్ఘాటించారు.
    1
    నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్‌లో ఉన్న వైయస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణం బైటిపేటకు చెందిన చాకలి నాగయ్య అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రాథమిక విచారణలో నిందితుడు గత ఐదు సంవత్సరాలుగా మానసిక రోగి అని, వైయస్సార్‌సీపీ పార్టీకి చెందిన వ్యక్తి అని వెల్లడైంది. ఈ ఘటన వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని సీఐ సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం అనేక కోణాల్లో పూర్తి దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి మానసిక రోగేనని నంద్యాల సీఐ సుధాకర్ రెడ్డి పునరుద్ఘాటించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • నరసరావుపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ చలివేంద్రం సేవలను రూరల్ ఎస్సై కిషోర్ అభినందించారు.
    1
    నరసరావుపేటలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ చలివేంద్రం సేవలను రూరల్ ఎస్సై కిషోర్ అభినందించారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం శిబావి సమీపంలో శనివారం ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మామిడి పండ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై మామిడి కాయలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
    1
    అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం శిబావి సమీపంలో శనివారం ఒక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మామిడి పండ్ల లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి స్వల్ప గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదం కారణంగా రోడ్డుపై మామిడి కాయలన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.