logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వేములవాడలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. ఎక్సైజ్ అధికారుల ప్రత్యేక డ్రైవ్ వేములవాడ: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం సమీపంలో ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 10 లీటర్ల నాటుసారాను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై జి. రమ్య, కానిస్టేబుళ్లు వినయ్, శ్రీను దాడిలో పాల్గొన్నారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ నెల 20 వరకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని, అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

4 hrs ago
user_Praveen
Praveen
వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
4 hrs ago

వేములవాడలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. ఎక్సైజ్ అధికారుల ప్రత్యేక డ్రైవ్ వేములవాడ: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం సమీపంలో ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 10 లీటర్ల నాటుసారాను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై జి. రమ్య, కానిస్టేబుళ్లు వినయ్, శ్రీను దాడిలో పాల్గొన్నారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ నెల 20 వరకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని, అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

More news from తెలంగాణ and nearby areas
  • వేములవాడలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. ఎక్సైజ్ అధికారుల ప్రత్యేక డ్రైవ్ వేములవాడ: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం సమీపంలో ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 10 లీటర్ల నాటుసారాను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై జి. రమ్య, కానిస్టేబుళ్లు వినయ్, శ్రీను దాడిలో పాల్గొన్నారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ నెల 20 వరకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని, అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
    1
    వేములవాడలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. ఎక్సైజ్ అధికారుల ప్రత్యేక డ్రైవ్
వేములవాడ: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం సమీపంలో ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 10 లీటర్ల నాటుసారాను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై జి. రమ్య, కానిస్టేబుళ్లు వినయ్, శ్రీను దాడిలో పాల్గొన్నారు. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ నెల 20 వరకు ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని, అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
    user_Praveen
    Praveen
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • *పేదలకు మెరుగైన వైద్యం* *చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి* *వేములవాడ వంద పడకల ఆసుపత్రిలో మోకాళ్ల ఆపరేషన్లకు సీ-ఆర్మ్ మిషన్‌* *వినికిడి పరీక్షలు, థెరపీ సేవలకు ప్రత్యేక ఏర్పాట్లు* *ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్* *వేములవాడ ఏరియా ఆసుపత్రిలో 9వ పోషణ మాసం ముగింపు కార్యక్రమం* *వినియోగంలోకి బేరా యంత్రం* *సామూహిక సీమంతాలు, అన్న ప్రాసనలు* పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు చిన్నారుల్లో పోషకాహార లోపం, పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. జిల్లా సంక్షేమ శాఖ ఆద్వర్యంలో వేములవాడ ఏరియా ఆసుపత్రి ఆవరణలో 9వ పోషణ మాసం ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సామూహిక సీమంతాలు, అన్న ప్రాసనలు నిర్వహించారు. ఆసుపత్రిలో బేరా యంత్రాన్ని ప్రారంభించారు. డీ ఈ ఐ సీ కేంద్రంలో దాదాపు 18 మంది పిల్లలు ఫిజియోథెరపీ ద్వారా శారీరక ఇబ్బందులు దూరమై ఇప్పుడు నడుస్తున్నారని పలువురు తల్లితండ్రులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పోషణ మాసం సందర్భంగా వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, బెల్లం, నువ్వులు బాలామృతంతో సిద్ధం చేసిన ఆహార పదార్థాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించడంతో పాటు ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను తల్లుల మాదిరిగా అంగన్‌వాడీ టీచర్లు సంరక్షిస్తున్నారని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అంగన్‌వాడీ భవనాలు, మహిళా స్వయం సహాయక సంఘాల స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు సమకూరుస్తున్నారని వెల్లడించారు. *సమస్యలపై ప్రత్యేక దృష్టి* చిన్నారుల్లో వినికిడి లోపం, మాటలు రాకపోవడం, శారీరక ఎదుగుదలలో సమస్యలు వంటి లోపాలను చిన్న వయసులోనే గుర్తించి చికిత్స అందించడం ఎంతో ముఖ్యమని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో గుర్తించిన కొంతమంది చిన్నారులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్, సరోజినీదేవి, ఈఎన్‌టీ వంటి ఆసుపత్రులకు పంపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పేదరికం కారణంగా వైద్యం పొందలేని పరిస్థితి చిన్నారులకు ఎదురుకాకూడదని, అవసరమైన వైద్య పరీక్షలు, ఫిజియోథెరపీ, ఇతర చికిత్సలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇందులో భాగంగా వేములవాడ ఆసుపత్రిలోనే ప్రత్యేక థెరపీ సేవలు అందించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వినికిడి లోపాన్ని గుర్తించేందుకు ప్రత్యేక పరీక్షల నిర్వహణకు అవసరమైన గదిని ఏర్పాటు చేసి సేవలను ప్రారంభించినట్లు వివరించారు. *మోకాళ్ల ఆపరేషన్లకు సీ-ఆర్మ్ మిషన్* వేములవాడ వంద పడకల ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా మోకాళ్లకు సంబంధించిన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఆపరేషన్ల నిర్వహణలో సీ-ఆర్మ్ మిషన్ అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, తాజాగా మిషన్ అందుబాటులోకి వచ్చిందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన పేదలకు ఉచితంగా మోకాళ్ల శస్త్రచికిత్సలు అందిస్తున్నామని, వేములవాడ వంద పడకల ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఈ సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలకు మరిన్ని ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు. *అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్* అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు విద్యుత్ బిల్లుల భారం లేకుండా ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. చిన్నారుల్లో ఏవైనా ఆరోగ్య సమస్యలు కనిపించిన వెంటనే తల్లిదండ్రులు, అంగన్‌వాడీ సిబ్బంది సంబంధిత వైద్యులకు తెలియజేయాలని కోరారు. అవసరమైన వైద్య సహాయం అందిస్తామని పేర్కొన్నారు. *ప్రతి మంగళవారం 10 నిమిషాలు..* జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. *ప్రతి మంగళవారం 10 నిమిషాలు* కార్యక్రమాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్రాల సేవలు, వసతులు మెరుగు పరచడం, పోషకాహారం పంపిణీ, బాలల హక్కుల రక్షణ, వసతుల పెంపు తదితర అంశాలపై స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొనాలని సూచించారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి నెలా తల్లిదండ్రులు బాధ్యతగా ఆరేళ్ల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు క్రమం తప్పకుండా తీసుకెళ్లాలని వారి ఎత్తు, బరువు నమోదు చేయించాలని దానికి అనుగుణంగా పోషకాహారం అందించాలని సూచించారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఇప్పటి నుంచే సరైన పోషకాహారం అందించాలని, దీంతో వారి బంగారు భవితకు బాటలు పడతాయని స్పష్టం చేశారు. ప్రతి నెల పిల్లల ఎత్తు, బరువు నమోదు చేయడంతో వారికి అంగన్వాడి కేంద్రంలో బాలామృతంతో పాటు ఇతర పోషక ప్రాంతాలు అందిస్తారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు నిత్యం పంపించడంతో పిల్లలకు పోషకాహారం అందుతుందని, ఆట, పాటలు బొమ్మల ద్వారా విద్య బుద్దులు చెపుతారని వివరించారు. *తల్లులు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి* గర్భిణులు, బాలింతలు, మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు ఆకుకూరలు, కూరగాయలు, నువ్వులు, బెల్లం, మునగ ఆకులు, కాయలు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. *అంగన్వాడి కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలి* 5 సంవత్సరాలలోపు వయసు ఉన్న పిల్లలు ఎదుగుదల లోపిస్తే సమీప అంగన్వాడి కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఎదుగుదల లోపాలు గల పిల్లలు, చెవిటి, మూగ, మానసిక బుద్ధి మాంద్యం గల, నడవలేని వాళ్లు, పుట్టుకతో వచ్చే లోపల గల పిల్లలు, మెదడు సంబంధించిన సమస్యలు సమస్య, సరిగా మాట్లాడాలని పిల్లలు, రక్తహీనత పోషకాహారం లోపం గల పిల్లలను అంగన్వాడీ కేంద్రాల వారి సమాచారంతో వైద్యులు వివిధ పరీక్షలు చేసి పిల్లలలోని లోపాన్ని గుర్తిస్తారని తెలిపారు. ఆర్ బీ ఎస్ కే వాహనం ద్వారా వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని డీఈఐసీ కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందిస్తారని వెల్లడించారు. ఉన్నత వైద్య సేవలు హైదరాబాద్ లో అందిస్తారని వెల్లడించారు. తాను ఆకస్మిక తనిఖీకి వచ్చినప్పుడు బేరా యంత్రం వినియోగంలో లేదని గుర్తు చేశారు. దానికోసం ప్రత్యేక గది, ఇతర ఏర్పాట్లను చేయించి.. వినియోగంలోకి తీసుకు వచ్చామని తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, మున్సిపల్ కమిషనర్ లోకేష్, తహసీల్దార్ జయంత్, వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
    4
    *పేదలకు మెరుగైన వైద్యం*

*చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి*

*వేములవాడ వంద పడకల ఆసుపత్రిలో మోకాళ్ల ఆపరేషన్లకు సీ-ఆర్మ్ మిషన్‌*

*వినికిడి పరీక్షలు, థెరపీ సేవలకు ప్రత్యేక ఏర్పాట్లు*

*ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్*

*వేములవాడ ఏరియా ఆసుపత్రిలో 9వ పోషణ మాసం ముగింపు కార్యక్రమం*

*వినియోగంలోకి బేరా యంత్రం*

*సామూహిక సీమంతాలు, అన్న ప్రాసనలు*
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు చిన్నారుల్లో పోషకాహార లోపం, పుట్టుకతో వచ్చే ఆరోగ్య సమస్యలను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. 
జిల్లా సంక్షేమ శాఖ ఆద్వర్యంలో వేములవాడ ఏరియా ఆసుపత్రి ఆవరణలో 9వ పోషణ మాసం ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సామూహిక సీమంతాలు, అన్న ప్రాసనలు నిర్వహించారు. ఆసుపత్రిలో బేరా యంత్రాన్ని ప్రారంభించారు. డీ ఈ ఐ సీ కేంద్రంలో దాదాపు 18 మంది పిల్లలు ఫిజియోథెరపీ ద్వారా శారీరక ఇబ్బందులు దూరమై ఇప్పుడు నడుస్తున్నారని పలువురు తల్లితండ్రులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. 
పోషణ మాసం సందర్భంగా వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, బెల్లం, నువ్వులు బాలామృతంతో సిద్ధం చేసిన ఆహార పదార్థాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం అందించడంతో పాటు ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను తల్లుల మాదిరిగా అంగన్‌వాడీ టీచర్లు సంరక్షిస్తున్నారని, వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అంగన్‌వాడీ భవనాలు, మహిళా స్వయం సహాయక సంఘాల స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు సమకూరుస్తున్నారని వెల్లడించారు.
*సమస్యలపై ప్రత్యేక దృష్టి*
చిన్నారుల్లో వినికిడి లోపం, మాటలు రాకపోవడం, శారీరక ఎదుగుదలలో సమస్యలు వంటి లోపాలను చిన్న వయసులోనే గుర్తించి చికిత్స అందించడం ఎంతో ముఖ్యమని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గతంలో గుర్తించిన కొంతమంది చిన్నారులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్, సరోజినీదేవి, ఈఎన్‌టీ వంటి ఆసుపత్రులకు పంపించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
పేదరికం కారణంగా వైద్యం పొందలేని పరిస్థితి చిన్నారులకు ఎదురుకాకూడదని, అవసరమైన వైద్య పరీక్షలు, ఫిజియోథెరపీ, ఇతర చికిత్సలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇందులో భాగంగా వేములవాడ ఆసుపత్రిలోనే ప్రత్యేక థెరపీ సేవలు అందించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వినికిడి లోపాన్ని గుర్తించేందుకు ప్రత్యేక పరీక్షల నిర్వహణకు అవసరమైన గదిని ఏర్పాటు చేసి సేవలను ప్రారంభించినట్లు వివరించారు.
*మోకాళ్ల ఆపరేషన్లకు సీ-ఆర్మ్ మిషన్*
వేములవాడ వంద పడకల ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా మోకాళ్లకు సంబంధించిన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఆపరేషన్ల నిర్వహణలో సీ-ఆర్మ్ మిషన్ అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా, తాజాగా మిషన్ అందుబాటులోకి వచ్చిందన్నారు. 
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన పేదలకు ఉచితంగా మోకాళ్ల శస్త్రచికిత్సలు అందిస్తున్నామని, వేములవాడ వంద పడకల ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఈ సేవలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలకు మరిన్ని ఆధునిక వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు.
*అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్*
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణకు విద్యుత్ బిల్లుల భారం లేకుండా ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. చిన్నారుల్లో ఏవైనా ఆరోగ్య సమస్యలు కనిపించిన వెంటనే తల్లిదండ్రులు, అంగన్‌వాడీ సిబ్బంది సంబంధిత వైద్యులకు తెలియజేయాలని కోరారు. అవసరమైన వైద్య సహాయం అందిస్తామని పేర్కొన్నారు. 
*ప్రతి మంగళవారం 10 నిమిషాలు..*
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. *ప్రతి మంగళవారం 10 నిమిషాలు*  కార్యక్రమాన్ని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. 
కేంద్రాల సేవలు, వసతులు మెరుగు పరచడం, పోషకాహారం పంపిణీ, బాలల హక్కుల రక్షణ, వసతుల పెంపు తదితర అంశాలపై స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొనాలని సూచించారు. 
జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి నెలా తల్లిదండ్రులు బాధ్యతగా ఆరేళ్ల లోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు క్రమం తప్పకుండా తీసుకెళ్లాలని వారి ఎత్తు, బరువు నమోదు చేయించాలని దానికి అనుగుణంగా పోషకాహారం అందించాలని సూచించారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఇప్పటి నుంచే సరైన పోషకాహారం అందించాలని, దీంతో వారి బంగారు భవితకు బాటలు పడతాయని స్పష్టం చేశారు. 
ప్రతి నెల పిల్లల ఎత్తు, బరువు నమోదు చేయడంతో వారికి అంగన్వాడి కేంద్రంలో బాలామృతంతో పాటు ఇతర పోషక ప్రాంతాలు అందిస్తారని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాలకు నిత్యం పంపించడంతో పిల్లలకు  పోషకాహారం అందుతుందని, ఆట, పాటలు బొమ్మల ద్వారా విద్య బుద్దులు చెపుతారని వివరించారు. 
*తల్లులు ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి*
గర్భిణులు, బాలింతలు, మహిళలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు ఆకుకూరలు, కూరగాయలు, నువ్వులు, బెల్లం, మునగ ఆకులు, కాయలు ఆహారంలో భాగం చేసుకోవాలని సూచించారు. 
*అంగన్వాడి కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలి*
5 సంవత్సరాలలోపు వయసు ఉన్న పిల్లలు ఎదుగుదల లోపిస్తే సమీప అంగన్వాడి కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఎదుగుదల లోపాలు గల పిల్లలు, చెవిటి, మూగ, మానసిక బుద్ధి మాంద్యం గల, నడవలేని వాళ్లు, పుట్టుకతో వచ్చే లోపల గల పిల్లలు, మెదడు సంబంధించిన సమస్యలు సమస్య, సరిగా మాట్లాడాలని పిల్లలు, రక్తహీనత పోషకాహారం లోపం గల పిల్లలను అంగన్వాడీ కేంద్రాల వారి సమాచారంతో వైద్యులు వివిధ పరీక్షలు చేసి పిల్లలలోని లోపాన్ని గుర్తిస్తారని తెలిపారు. ఆర్ బీ ఎస్ కే వాహనం ద్వారా వేములవాడ ఏరియా ఆసుపత్రిలోని డీఈఐసీ కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందిస్తారని వెల్లడించారు. ఉన్నత వైద్య సేవలు హైదరాబాద్ లో అందిస్తారని వెల్లడించారు. 
తాను ఆకస్మిక తనిఖీకి వచ్చినప్పుడు బేరా యంత్రం వినియోగంలో లేదని గుర్తు చేశారు. దానికోసం ప్రత్యేక గది, ఇతర ఏర్పాట్లను చేయించి.. వినియోగంలోకి తీసుకు వచ్చామని తెలిపారు. జిల్లాలోని ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. 
మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, మున్సిపల్ కమిషనర్ లోకేష్, తహసీల్దార్ జయంత్, వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.
    user_Gampa mahesh
    Gampa mahesh
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • వేములవాడలో బతుకమ్మ, దసరా శోభ రంగురంగుల దీపకాంతుల్లో మెరిసిపోతున్న భీమేశ్వరాలయం ​ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ కాంతులతో నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. ​ప్రత్యేక ఆకర్షణగా భీమేశ్వర సదన్: మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ, దాండియా, కోలాటాలు ఆడేందుకు భీమేశ్వర సదన్‌లో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. ​నిమజ్జన ఏర్పాట్లు గ్రామీణ ప్రాంతాల నుంచి తరలివచ్చే మహిళా భక్తుల సౌకర్యార్థం బతుకమ్మ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.​పండుగ వేళ ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో పరిసరాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభతో వెల్లివిరుస్తున్నాయి.
    1
    వేములవాడలో బతుకమ్మ, దసరా శోభ రంగురంగుల దీపకాంతుల్లో మెరిసిపోతున్న భీమేశ్వరాలయం
​
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ కాంతులతో నేత్రపర్వంగా తీర్చిదిద్దారు.
​ప్రత్యేక ఆకర్షణగా భీమేశ్వర సదన్: మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ, దాండియా, కోలాటాలు ఆడేందుకు భీమేశ్వర సదన్‌లో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు.
​నిమజ్జన ఏర్పాట్లు
గ్రామీణ ప్రాంతాల నుంచి తరలివచ్చే మహిళా భక్తుల సౌకర్యార్థం బతుకమ్మ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.​పండుగ వేళ ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో పరిసరాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభతో వెల్లివిరుస్తున్నాయి.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    2 hrs ago
  • డ్రైవర్ లేక చెత్త ట్రాక్టర్ నడిపిన ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం సర్పంచ్. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామంలో చెత్త సేకరణ వాహనం నడిపే డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో సర్పంచ్ మామిండ్ల కిషన్ స్వయంగా ట్రాక్టర్ నడిపి గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో చెత్తను సేకరించారు. పారిశుధ్య కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా, ప్రజలకు అసౌకర్యం కలగనివ్వకుండా ఆయన ప్రత్యేక చొరవ చూపారు. గ్రామ సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించేందుకు ముందుకొచ్చిన సర్పంచ్‌ను గ్రామస్థులు అభినందించారు.
    1
    డ్రైవర్ లేక చెత్త ట్రాక్టర్ నడిపిన ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం సర్పంచ్.

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామంలో చెత్త సేకరణ వాహనం నడిపే డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో సర్పంచ్ మామిండ్ల కిషన్ స్వయంగా ట్రాక్టర్ నడిపి గ్రామంలోని వివిధ ప్రాంతాల్లో చెత్తను సేకరించారు. పారిశుధ్య కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా, ప్రజలకు అసౌకర్యం కలగనివ్వకుండా ఆయన ప్రత్యేక చొరవ చూపారు. గ్రామ సమస్యలను ప్రత్యక్షంగా పరిష్కరించేందుకు ముందుకొచ్చిన సర్పంచ్‌ను గ్రామస్థులు అభినందించారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    6 hrs ago
  • ట్రినిటీ కళాశాలలో వైభవంగా బతుకమ్మ సంబరాలు.! పూల బతుకమ్మలతో పండుగ శోభ.. సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించిన విద్యార్థినులు కరీంనగర్‌ వావిలాలపల్లిలోని ట్రినిటీ జూనియర్‌ కళాశాల (బాలికలు) ప్రాంగణంలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. కళాశాలలోని ప్రైమ్‌ గ్రౌండ్‌ రంగురంగుల పూల బతుకమ్మలతో కళకళలాడింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని నింపాయి. కళాశాల ఛైర్మన్‌ దాసరి ప్రశాంత్‌రెడ్డి, డైరెక్టర్‌ దాసరి మమతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. ప్రకృతి ఆరాధనకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను నేటి యువతరం తెలుసుకోవాలన్నారు. విద్యార్థినులకు విద్యతోపాటు సంప్రదాయ విలువలను అందించాలనే ఉద్దేశంతో ఏటా కళాశాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో విద్యార్థినులు, అధ్యాపకులు సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడారు. కోలాటాలు, ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలతో అలరించారు. విద్యార్థినుల ఉత్సాహంతో ప్రైమ్‌ గ్రౌండ్‌ సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంతో వేడుకలు ముగిశాయి.
    1
    ట్రినిటీ కళాశాలలో వైభవంగా బతుకమ్మ సంబరాలు.!

పూల బతుకమ్మలతో పండుగ శోభ.. 

సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించిన విద్యార్థినులు

కరీంనగర్‌ వావిలాలపల్లిలోని ట్రినిటీ జూనియర్‌ కళాశాల (బాలికలు) ప్రాంగణంలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. కళాశాలలోని ప్రైమ్‌ గ్రౌండ్‌ రంగురంగుల పూల బతుకమ్మలతో కళకళలాడింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలు పండుగ వాతావరణాన్ని నింపాయి. కళాశాల ఛైర్మన్‌ దాసరి ప్రశాంత్‌రెడ్డి, డైరెక్టర్‌ దాసరి మమతారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. ప్రకృతి ఆరాధనకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ విశిష్టతను నేటి యువతరం తెలుసుకోవాలన్నారు. విద్యార్థినులకు విద్యతోపాటు సంప్రదాయ విలువలను అందించాలనే ఉద్దేశంతో ఏటా కళాశాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో విద్యార్థినులు, అధ్యాపకులు సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడారు. కోలాటాలు, ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలతో అలరించారు. విద్యార్థినుల ఉత్సాహంతో ప్రైమ్‌ గ్రౌండ్‌ సందడిగా మారింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చివరగా బతుకమ్మ నిమజ్జన కార్యక్రమంతో వేడుకలు ముగిశాయి.
    user_Gaddam Naresh
    Gaddam Naresh
    Local News Reporter Karimnagar, Telangana•
    6 hrs ago
  • కరీంనగర్‌లో ఎంఐఎం నూతన టౌన్ కమిటీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కరీంనగర్ కార్పొరేషన్ పరిధికి నూతన టౌన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు పట్టణాధ్యక్షుడు మహమ్మద్ ఆతీఫ్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనరల్ సెక్రటరీ మోసిన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, పార్టీ నాయకులతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. భారీగా సభ్యత్వాలు నమోదు చేసి, వచ్చే నెలలో అసదుద్దీన్ ఒవైసీ నగరంలో సభ నిర్వహించనున్నట్లు వివరించారు.
    1
    కరీంనగర్‌లో ఎంఐఎం నూతన టౌన్ కమిటీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కరీంనగర్ కార్పొరేషన్ పరిధికి నూతన టౌన్ కమిటీని ఏర్పాటు
చేసినట్లు పట్టణాధ్యక్షుడు మహమ్మద్ ఆతీఫ్ తెలిపారు. 
విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనరల్ సెక్రటరీ మోసిన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, పార్టీ నాయకులతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. భారీగా సభ్యత్వాలు నమోదు చేసి, వచ్చే నెలలో అసదుద్దీన్ ఒవైసీ నగరంలో సభ నిర్వహించనున్నట్లు వివరించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    6 hrs ago
  • ఆరు ఓట్లు తో బాణం విజయం. మచ్చ శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థి దుబ్బాక డిపోలో బాణం విజయకేతనం ఆరు ఓట్ల ఆధిక్యంతో వర్కర్స్ యూనియన్ గెలుపు 32 మంది అమర కార్మికులకు విజయాన్ని అంకితం చేసిన మచ్చ శ్రీనివాస్ - డిపో అభివృద్ధికి కృషి చేస్తాం - అదనంగా పది బస్సులు.. శాశ్వత డిపో మేనేజర్‌ నియామకానికి కృషి - కార్మికుల సమస్యలకు అండగా ఉంటాం దుబ్బాక, అక్టోబరు 9: కార్మికుల ఐక్యతకు ఎన్నికల ఫలితం అద్దం పట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో బాణం గుర్తు విజయాన్ని అందుకుంది. దుబ్బాక ఆర్టీసీ డిపోలో జరిగిన యూనియన్‌ ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ఈ విజయాన్ని ఆర్టీసీ కోసం ప్రాణాలర్పించిన 32 మంది అమర కార్మికులకు అంకితం చేస్తున్నట్లు దుబ్బాక డిపో గౌరవాధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్‌ ప్రకటించారు.శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డిపోలో పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 126 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాణం గుర్తుకు 66 ఓట్లు రాగా, నిచ్చెన గుర్తుకు 60 ఓట్లు పోలయ్యాయి. దీంతో తెలంగాణ ఎంప్లాయీస్‌ యూనియన్‌పై తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ విజయం సాధించింది. అమరుల త్యాగానికి అంకితం ఈ సందర్భంగా మచ్చ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. దుబ్బాక డిపో కార్మికులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. అశ్వద్ధామ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో కార్మికులు బాణం గుర్తుకు ఓటు వేసి యూనియన్‌ను గెలిపించడం సంతోషంగా ఉందన్నారు. ఈ విజయాన్ని ఆర్టీసీ కోసం పోరాడి అమరులైన 32 మంది కార్మికులకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. డిపో అభివృద్ధికి ప్రత్యేక కృషి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో డిపో అభివృద్ధికి కృషి చేస్తామని మచ్చ శ్రీనివాస్‌ తెలిపారు. దుబ్బాక డిపోకు అదనంగా మరో పది బస్సులు తీసుకురావడంతో పాటు శాశ్వత డిపో మేనేజర్‌ను నియమించేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.కార్మికులకు ఏ సమస్య వచ్చినా అండగా నిలిచి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ డిపో అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక డిపో అధ్యక్షుడు దొడ్ల శ్రీనివాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌గౌడ్‌, కార్యదర్శి ఏ. మహేందర్‌రెడ్డి, కోశాధికారి యాదబాబు, ఆర్టీసీ కార్మికులు మంతూరి రమేష్‌, ఎండీ అజీముద్దీన్‌, బిక్షపతి, పెంటీ బాలకిషన్‌, తిరుపతి, ఆశయ్య, పెద్ద ముత్యం, రవి, శ్రీనివాస్‌, గోపాల్‌రెడ్డి, సిద్ధిరాంరెడ్డి, తిరుపతిరెడ్డి, రాజిరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.
    1
    ఆరు ఓట్లు తో బాణం విజయం. మచ్చ శ్రీనివాస్  కాంగ్రెస్ అభ్యర్థి
దుబ్బాక డిపోలో బాణం విజయకేతనం 
ఆరు ఓట్ల ఆధిక్యంతో వర్కర్స్ యూనియన్ గెలుపు
32 మంది అమర కార్మికులకు విజయాన్ని అంకితం చేసిన మచ్చ శ్రీనివాస్
- డిపో అభివృద్ధికి కృషి చేస్తాం
- అదనంగా పది బస్సులు.. శాశ్వత డిపో మేనేజర్‌ నియామకానికి కృషి
- కార్మికుల సమస్యలకు అండగా ఉంటాం
దుబ్బాక, అక్టోబరు 9:
కార్మికుల ఐక్యతకు ఎన్నికల ఫలితం అద్దం పట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో బాణం గుర్తు విజయాన్ని అందుకుంది. దుబ్బాక ఆర్టీసీ డిపోలో జరిగిన యూనియన్‌ ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ఈ విజయాన్ని ఆర్టీసీ కోసం ప్రాణాలర్పించిన 32 మంది అమర కార్మికులకు అంకితం చేస్తున్నట్లు దుబ్బాక డిపో గౌరవాధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్‌ ప్రకటించారు.శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డిపోలో పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 126 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాణం గుర్తుకు 66 ఓట్లు రాగా, నిచ్చెన గుర్తుకు 60 ఓట్లు పోలయ్యాయి. దీంతో తెలంగాణ ఎంప్లాయీస్‌ యూనియన్‌పై తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ విజయం సాధించింది.
అమరుల త్యాగానికి అంకితం
ఈ సందర్భంగా మచ్చ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. దుబ్బాక డిపో కార్మికులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. అశ్వద్ధామ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో కార్మికులు బాణం గుర్తుకు ఓటు వేసి యూనియన్‌ను గెలిపించడం సంతోషంగా ఉందన్నారు. ఈ విజయాన్ని ఆర్టీసీ కోసం పోరాడి అమరులైన 32 మంది కార్మికులకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు.
డిపో అభివృద్ధికి ప్రత్యేక కృషి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో డిపో అభివృద్ధికి కృషి చేస్తామని మచ్చ శ్రీనివాస్‌ తెలిపారు. దుబ్బాక డిపోకు అదనంగా మరో పది బస్సులు తీసుకురావడంతో పాటు శాశ్వత డిపో మేనేజర్‌ను నియమించేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.కార్మికులకు ఏ సమస్య వచ్చినా అండగా నిలిచి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ డిపో అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక డిపో అధ్యక్షుడు దొడ్ల శ్రీనివాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌గౌడ్‌, కార్యదర్శి ఏ. మహేందర్‌రెడ్డి, కోశాధికారి యాదబాబు, ఆర్టీసీ కార్మికులు మంతూరి రమేష్‌, ఎండీ అజీముద్దీన్‌, బిక్షపతి, పెంటీ బాలకిషన్‌, తిరుపతి, ఆశయ్య, పెద్ద ముత్యం, రవి, శ్రీనివాస్‌, గోపాల్‌రెడ్డి, సిద్ధిరాంరెడ్డి, తిరుపతిరెడ్డి, రాజిరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.
    user_పల్లె చిన్నికృష్ణ గౌడ్
    పల్లె చిన్నికృష్ణ గౌడ్
    దుబ్బాక, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • దాదాపు పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు సిరిసిల్ల డిపోలో పోలింగ్ సందడి కార్మికుల్లో ఉత్సాహం 208 మంది ఓటు హక్కు వినియోగం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో అధ్యక్ష, కార్యదర్శి పదవుల కోసం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్టీసీ కార్మికుల్లో ఉత్సాహం నెలకొంది. సిరిసిల్ల డిపో పరిధిలో మొత్తం 208 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఎన్నికల్లో 34,999 ఓట్లు ఉండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 డిపోల పరిధిలో 2,770 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల్లో విజయం సాధించిన వారు రెండేళ్లపాటు అధ్యక్ష, కార్యదర్శి పదవుల్లో కొనసాగనున్నారు.కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించాలని, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు కోరుతున్నారు.సిరిసిల్ల డిపోలో ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిర్వహించిన అనంతరం, 17వ తేదీన తుది ఫలితాలు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.
    3
    దాదాపు పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు సిరిసిల్ల డిపోలో పోలింగ్ సందడి
కార్మికుల్లో ఉత్సాహం 208 మంది ఓటు హక్కు వినియోగం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో అధ్యక్ష, కార్యదర్శి పదవుల కోసం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్టీసీ కార్మికుల్లో ఉత్సాహం నెలకొంది. సిరిసిల్ల డిపో పరిధిలో మొత్తం 208 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఎన్నికల్లో 34,999 ఓట్లు ఉండగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 డిపోల పరిధిలో 2,770 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల్లో విజయం సాధించిన వారు రెండేళ్లపాటు అధ్యక్ష, కార్యదర్శి పదవుల్లో కొనసాగనున్నారు.కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించాలని, కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు కోరుతున్నారు.సిరిసిల్ల డిపోలో ఉదయం 5 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిర్వహించిన అనంతరం, 17వ తేదీన తుది ఫలితాలు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.