logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కేంద్రం చేపట్టిన ఓటర్ జాబితా సవరణలో భాగంగా SIR కార్యక్రమం కింద ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ నేటితో ముగుస్తుంది. ఈ ప్రక్రియలో కవర్ కాని ఓటర్ల కోసం బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLOs) రేపటి నుండి ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 25 నుండి వచ్చే నెల జులై 24 వరకు BLOలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పటికే సంబంధిత రెవెన్యూ కార్యాలయాల నుండి BLOలు తమకు కావాల్సిన సామాగ్రి కిట్లను తీసుకెళ్ళారు. SIR పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయిలో తహశీల్దార్ కార్యాలయంలో SIR హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.

3 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
3 hrs ago

కేంద్రం చేపట్టిన ఓటర్ జాబితా సవరణలో భాగంగా SIR కార్యక్రమం కింద ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ నేటితో ముగుస్తుంది. ఈ ప్రక్రియలో కవర్ కాని ఓటర్ల కోసం బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLOs) రేపటి నుండి ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 25 నుండి వచ్చే నెల జులై 24 వరకు BLOలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పటికే సంబంధిత రెవెన్యూ కార్యాలయాల నుండి BLOలు తమకు కావాల్సిన సామాగ్రి కిట్లను తీసుకెళ్ళారు. SIR పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయిలో తహశీల్దార్ కార్యాలయంలో SIR హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.

More news from Telangana and nearby areas
  • కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షోరూంలో మే 3న జరిగిన సంచలన సాయుధ దోపిడీ కేసును ఛేదించి, కీలక నిందితులను అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంను ఎంఐఎం నాయకులు మంగళవారం ఆయన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి, పూల బోకేను అందించి, శాలువాతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ, ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెద్ద పెద్ద దోపిడీలు చేసి పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న కరుడుగట్టిన ముఖ్య నిందితుడితో పాటు మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను కమిషనర్ గౌష్ ఆలం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, మెరుగైన నెట్‌వర్క్‌తో చాకచక్యంగా పట్టుకున్నారని ప్రశంసించారు. నిందితుల నుంచి కీలకమైన ఆధారాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఆయన సేవలు విమర్శకుల నోళ్లు మూయించి, 'తెలంగాణ పోలీస్ బెటర్ పోలీస్' అని నిరూపించడమే కాకుండా, కరీంనగర్ పేరును దేశం గర్వించే స్థాయిలో నిలబెట్టాయని అన్నారు. నేరస్థులకు పాలిట సింహస్వప్నంలా మారి, నేర రహిత సమాజం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్న ఇలాంటి నిజాయితీగల అధికారి కరీంనగర్‌లో సేవలు అందించడం జిల్లా ప్రజల అదృష్టమని గులాం అహ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం జాయింట్ సెక్రటరీ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి, కో కార్పొరేటర్ సయ్యద్ ఇబ్రహీం, కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్, మాజీ కార్పొరేటర్లు ఆరిఫ్ అహ్మద్, అహ్మద్ మొహియుద్దీన్ బాబుజానీ, లింగంపల్లి శ్రీను, కంటేస్టీడ్ కార్పొరేటర్లు సురేశ్, వాజిద్ అలీఖాన్, అబ్దుల్ గఫ్ఫార్, అబ్దుల్లా ఆసిమ్, నాయకులు ఫసియుద్దీన్ ఖాలీద్, ఎంఏ సలీం, ఖమరొద్దీన్ షబ్బీర్, అబ్దుల్లా ఖాన్, మేరాజ్, ఇలియాజ్, అల్మాస్ హంజ, యునూస్ తదితరులు పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షోరూంలో మే 3న జరిగిన సంచలన సాయుధ దోపిడీ కేసును ఛేదించి, కీలక నిందితులను అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంను ఎంఐఎం నాయకులు మంగళవారం ఆయన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి, పూల బోకేను అందించి, శాలువాతో సన్మానం చేశారు.

ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ, ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెద్ద పెద్ద దోపిడీలు చేసి పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న కరుడుగట్టిన ముఖ్య నిందితుడితో పాటు మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను కమిషనర్ గౌష్ ఆలం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, మెరుగైన నెట్‌వర్క్‌తో చాకచక్యంగా పట్టుకున్నారని ప్రశంసించారు. నిందితుల నుంచి కీలకమైన ఆధారాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఆయన సేవలు విమర్శకుల నోళ్లు మూయించి, 'తెలంగాణ పోలీస్ బెటర్ పోలీస్' అని నిరూపించడమే కాకుండా, కరీంనగర్ పేరును దేశం గర్వించే స్థాయిలో నిలబెట్టాయని అన్నారు. నేరస్థులకు పాలిట సింహస్వప్నంలా మారి, నేర రహిత సమాజం కోసం అహర్నిశలు కృషి చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్న ఇలాంటి నిజాయితీగల అధికారి కరీంనగర్‌లో సేవలు అందించడం జిల్లా ప్రజల అదృష్టమని గులాం అహ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఐఎం జాయింట్ సెక్రటరీ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి, కో కార్పొరేటర్ సయ్యద్ ఇబ్రహీం, కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్, మాజీ కార్పొరేటర్లు ఆరిఫ్ అహ్మద్, అహ్మద్ మొహియుద్దీన్ బాబుజానీ, లింగంపల్లి శ్రీను, కంటేస్టీడ్ కార్పొరేటర్లు సురేశ్, వాజిద్ అలీఖాన్, అబ్దుల్ గఫ్ఫార్, అబ్దుల్లా ఆసిమ్, నాయకులు ఫసియుద్దీన్ ఖాలీద్, ఎంఏ సలీం, ఖమరొద్దీన్ షబ్బీర్, అబ్దుల్లా ఖాన్, మేరాజ్, ఇలియాజ్, అల్మాస్ హంజ, యునూస్ తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    18 hrs ago
  • CITU - పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూశం రమేష్ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బి.వై. నగర్‌లో గల అమృత్ లాల్ శుక్ల కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మూశం రమేష్‌తో పాటు జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ, పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలలో పనిచేస్తున్న అర్హులైన కార్మికులందరికీ చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి అని, అయితే చాలామంది కార్మికులకు ఈ కార్డులు లేకపోవడం వల్ల అర్హులై ఉన్నా కూడా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోలేక నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన కార్మికులందరికీ చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు ఇవ్వాలని సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు అనేకసార్లు విన్నవించినప్పటికీ, వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని యూనియన్ నాయకులు ఆరోపించారు. దీంతో CITU ఆధ్వర్యంలో అర్హులైన కార్మికులందరికీ చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు ఇవ్వాలని పోరాటం ప్రారంభించామని నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా, జూన్ 24 నుండి జూన్ 30 వరకు సిరిసిల్ల పట్టణంలోని బి.వై. నగర్‌లో గల CITU జిల్లా కార్యాలయంలో అర్హులైన కార్మికులందరితో దరఖాస్తులు నమోదు చేసుకుంటారని పేర్కొన్నారు. అనంతరం, జూలై 1న దరఖాస్తుదారులందరితో కలిసి చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలలో పనిచేస్తున్న, చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు లేని కార్మికులందరూ జూన్ 30 లోపు దరఖాస్తులు నమోదు చేసుకుని, జూలై 1న జరగబోయే ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని CITU పిలుపునిచ్చింది. దరఖాస్తు చేసుకునే కార్మికులు ఆధార్ కార్డు జిరాక్స్, రెండు ఫోటోలు, పనిచేస్తున్న యజమాని వివరాలతో రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో CITU జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, జిల్లా నాయకులు అన్నల్డాస్ గణేష్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, జూన్ 30 వరకు దరఖాస్తుల నమోదు కార్యక్రమం కొనసాగుతుందని, జూలై 1న చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు ధర్నా జరుగుతుందని యూనియన్ పునరుద్ఘాటించింది.
    1
    CITU - పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూశం రమేష్ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బి.వై. నగర్‌లో గల అమృత్ లాల్ శుక్ల కార్మిక భవన్ సిఐటియు జిల్లా కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మూశం రమేష్‌తో పాటు జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ, పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలలో పనిచేస్తున్న అర్హులైన కార్మికులందరికీ చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

చేనేత పెన్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి అని, అయితే చాలామంది కార్మికులకు ఈ కార్డులు లేకపోవడం వల్ల అర్హులై ఉన్నా కూడా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోలేక నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన కార్మికులందరికీ చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు ఇవ్వాలని సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు అనేకసార్లు విన్నవించినప్పటికీ, వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని యూనియన్ నాయకులు ఆరోపించారు.

దీంతో CITU ఆధ్వర్యంలో అర్హులైన కార్మికులందరికీ చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు ఇవ్వాలని పోరాటం ప్రారంభించామని నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా, జూన్ 24 నుండి జూన్ 30 వరకు సిరిసిల్ల పట్టణంలోని బి.వై. నగర్‌లో గల CITU జిల్లా కార్యాలయంలో అర్హులైన కార్మికులందరితో దరఖాస్తులు నమోదు చేసుకుంటారని పేర్కొన్నారు. అనంతరం, జూలై 1న దరఖాస్తుదారులందరితో కలిసి చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ, అనుబంధ పరిశ్రమలలో పనిచేస్తున్న, చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు లేని కార్మికులందరూ జూన్ 30 లోపు దరఖాస్తులు నమోదు చేసుకుని, జూలై 1న జరగబోయే ధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని CITU పిలుపునిచ్చింది. దరఖాస్తు చేసుకునే కార్మికులు ఆధార్ కార్డు జిరాక్స్, రెండు ఫోటోలు, పనిచేస్తున్న యజమాని వివరాలతో రావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో CITU జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, జిల్లా నాయకులు అన్నల్డాస్ గణేష్, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ చేనేత జౌళి శాఖ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, జూన్ 30 వరకు దరఖాస్తుల నమోదు కార్యక్రమం కొనసాగుతుందని, జూలై 1న చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు ధర్నా జరుగుతుందని యూనియన్ పునరుద్ఘాటించింది.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    17 hrs ago
  • అమెరికాలోని డల్లాస్‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలను ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్), తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. డల్లాస్‌లో జరిగిన ఈ భేటీలో, బాల్టిమోర్‌లో జరగనున్న ఆటా కాన్ఫరెన్స్ సభలకు హాజరై తమ విలువైన సందేశాన్ని అందించాలని ఆటా అధ్యక్షుడు సతీష్ రెడ్డి వారిని ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఆటా కాన్ఫరెన్స్ సభల ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో తానా వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ తోటకూరతో పాటు పలువురు ఐటీ సంస్థల సీఈఓలు, వ్యాపారవేత్తలు కూడా పాల్గొన్నారు.
    1
    అమెరికాలోని డల్లాస్‌లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలను ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్), తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. డల్లాస్‌లో జరిగిన ఈ భేటీలో, బాల్టిమోర్‌లో జరగనున్న ఆటా కాన్ఫరెన్స్ సభలకు హాజరై తమ విలువైన సందేశాన్ని అందించాలని ఆటా అధ్యక్షుడు సతీష్ రెడ్డి వారిని ఆహ్వానించారు.

ఈ సమావేశంలో ఆటా కాన్ఫరెన్స్ సభల ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణపై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో తానా వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ తోటకూరతో పాటు పలువురు ఐటీ సంస్థల సీఈఓలు, వ్యాపారవేత్తలు కూడా పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    59 min ago
  • గజ్వేల్, జూన్ 23న మల్లన్నసాగర్ ముంపు గ్రామాల పునరావాస కాలనీ అయిన పల్లెపహాడ్‌లో మాజీ జెడ్పీటీసీ రాములు నిర్మించుకుంటున్న ఇంటిని మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడంపై బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కూల్చివేసిన ఇంటి స్థలాన్ని సందర్శించి, బాధితుడు రాములు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ, ఇంటి నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ అధికారులను సంప్రదించగా ముందుగా స్లాబ్ పూర్తి చేసి, ఆ తర్వాత అనుమతులు తీసుకోవాలని సూచించారని ఆరోపించారు. అయితే, స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, ఆ సొమ్ము ఇవ్వకపోవడంతో రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన ఇంటిని కూల్చివేశారని రాములు తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూములు, ఇండ్లు కోల్పోయి, తిరిగి జీవనం ప్రారంభించుకునే ప్రయత్నం చేస్తున్న నిర్వాసితులకు ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే మున్సిపల్ అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీలు, ప్లాట్లు వెంటనే అందించాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలపై త్వరలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండ మధు, పల్లెపహాడ్ గ్రామస్తులు, మల్లన్నసాగర్ ముంపు గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్, జూన్ 23న మల్లన్నసాగర్ ముంపు గ్రామాల పునరావాస కాలనీ అయిన పల్లెపహాడ్‌లో మాజీ జెడ్పీటీసీ రాములు నిర్మించుకుంటున్న ఇంటిని మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడంపై బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కూల్చివేసిన ఇంటి స్థలాన్ని సందర్శించి, బాధితుడు రాములు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ, ఇంటి నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ అధికారులను సంప్రదించగా ముందుగా స్లాబ్ పూర్తి చేసి, ఆ తర్వాత అనుమతులు తీసుకోవాలని సూచించారని ఆరోపించారు. అయితే, స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, ఆ సొమ్ము ఇవ్వకపోవడంతో రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన ఇంటిని కూల్చివేశారని రాములు తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూములు, ఇండ్లు కోల్పోయి, తిరిగి జీవనం ప్రారంభించుకునే ప్రయత్నం చేస్తున్న నిర్వాసితులకు ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే మున్సిపల్ అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీలు, ప్లాట్లు వెంటనే అందించాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలపై త్వరలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండ మధు, పల్లెపహాడ్ గ్రామస్తులు, మల్లన్నసాగర్ ముంపు గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    13 hrs ago
  • జగిత్యాల జిల్లా కేంద్రంలో జూన్ 23న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మల్యాల రాకేష్, నగర కార్యదర్శి రాపక నిఖిల్ మాట్లాడుతూ, ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళలో జరుగుతున్న విచ్చలవిడి ఫీజుల దోపిడీని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన చట్టాన్ని తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
    1
    జగిత్యాల జిల్లా కేంద్రంలో జూన్ 23న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల బంద్ విజయవంతమైంది.

ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మల్యాల రాకేష్, నగర కార్యదర్శి రాపక నిఖిల్ మాట్లాడుతూ, ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళలో జరుగుతున్న విచ్చలవిడి ఫీజుల దోపిడీని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన చట్టాన్ని తీసుకురావాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
    user_Venu Gopal
    Venu Gopal
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    18 hrs ago
  • 23/06/2026న మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆఫీస్ భవన్, తెలుగు సంక్షేమ భవన్ వద్ద విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసనలో రాజ్యసభ MP టైగర్ ఆర్ కృష్ణన్న బృందంతో పాటు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ తరపున నిర్వహించారు.
    1
    23/06/2026న మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆఫీస్ భవన్, తెలుగు సంక్షేమ భవన్ వద్ద విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసనలో రాజ్యసభ MP టైగర్ ఆర్ కృష్ణన్న బృందంతో పాటు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ తరపున నిర్వహించారు.
    user_నరేష్ nakarekanti
    నరేష్ nakarekanti
    భువనగిరి, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    5 hrs ago
  • పెద్దపల్లి జిల్లా రామగుండంలోని మూతపడిన బి- పవర్ హౌస్ విద్యుత్ ప్లాంట్‌ను త్వరలో డిస్మెటల్ చేయనున్నారు. ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, జెన్కో ట్రాన్స్ కో సీఎండి హరీష్ రెడ్డి అధికారులతో కలిసి ఈ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ పర్యటనలో, వారు ప్రస్తుత విద్యుత్ ప్లాంట్ స్థితిగతులను గురించి స్థానిక అధికారులతో చర్చించారు. నూతనంగా నిర్మించబోయే విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం సంబంధించిన వనరులపైనా స్థానిక అధికారులతో ప్రస్తావించారు. త్వరలోనే డిస్మెటల్ పనులు చేపట్టడం జరుగుతుందని నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా, ప్లాంట్‌కు సంబంధించిన అధికారులు ఆయనను ఆత్మీయంగా సన్మానించారు.
    2
    పెద్దపల్లి జిల్లా రామగుండంలోని మూతపడిన బి- పవర్ హౌస్ విద్యుత్ ప్లాంట్‌ను త్వరలో డిస్మెటల్ చేయనున్నారు. ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, జెన్కో ట్రాన్స్ కో సీఎండి హరీష్ రెడ్డి అధికారులతో కలిసి ఈ ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ పర్యటనలో, వారు ప్రస్తుత విద్యుత్ ప్లాంట్ స్థితిగతులను గురించి స్థానిక అధికారులతో చర్చించారు.

నూతనంగా నిర్మించబోయే విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం సంబంధించిన వనరులపైనా స్థానిక అధికారులతో ప్రస్తావించారు. త్వరలోనే డిస్మెటల్ పనులు చేపట్టడం జరుగుతుందని నవీన్ మిట్టల్ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా, ప్లాంట్‌కు సంబంధించిన అధికారులు ఆయనను ఆత్మీయంగా సన్మానించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    15 hrs ago
  • కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ నివాసి, ఆటో డ్రైవర్ భూక్యా లాలు కుమార్తె వెన్నెల వివాహం ఈ నెల 25న జరగనున్న సందర్భంగా, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరదాసు వసంతరావు నేడు వారికి రూ. 5016 ఆర్థిక సహాయం అందించారు. గత నెలలో ఆటో యూనియన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆటో కార్మికుల ఆడపిల్లల వివాహాలకు రూ. 5000 ఆర్థిక సహాయం అందిస్తానని వసంతరావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, కోతిరాంపూర్ కు చెందిన భూక్యా సత్తమ్మ, లాలు దంపతుల కుమార్తె వివాహం నిశ్చయమైనట్లు తెలుసుకున్న వసంతరావు, వారి ఇంటికి వెళ్లి మేనమామగా ఈ మొత్తాన్ని అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. కరీంనగర్ నగరానికి చెందిన ఏ ఆటో కార్మికుల కుమార్తె వివాహం చేసినా, తనను సంప్రదించి రూ. 5016 ఆర్థిక సహాయాన్ని పొందవచ్చని వసంతరావు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నరదాసు వసంతరావు చేసిన ఈ సహాయానికి కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నరదాసు వసంతరావుతో పాటు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఆటో యూనియన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అఫ్రోజ్ ఖాన్, ఆరే రవి, ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్, ఉపాధ్యక్షులు ఇరవేని కుమార్, కుక్కట్ల సంపత్, కోశాధికారి చిట్టిమల్ల నాగభూషణం, ఈసీ మెంబర్స్ కూర్మచలం వేణుమాధవ్, బొంగోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్ నివాసి, ఆటో డ్రైవర్ భూక్యా లాలు కుమార్తె వెన్నెల వివాహం ఈ నెల 25న జరగనున్న సందర్భంగా, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరదాసు వసంతరావు నేడు వారికి రూ. 5016 ఆర్థిక సహాయం అందించారు. గత నెలలో ఆటో యూనియన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆటో కార్మికుల ఆడపిల్లల వివాహాలకు రూ. 5000 ఆర్థిక సహాయం అందిస్తానని వసంతరావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో, కోతిరాంపూర్ కు చెందిన భూక్యా సత్తమ్మ, లాలు దంపతుల కుమార్తె వివాహం నిశ్చయమైనట్లు తెలుసుకున్న వసంతరావు, వారి ఇంటికి వెళ్లి మేనమామగా ఈ మొత్తాన్ని అందించడం సంతోషంగా ఉందని తెలిపారు.

కరీంనగర్ నగరానికి చెందిన ఏ ఆటో కార్మికుల కుమార్తె వివాహం చేసినా, తనను సంప్రదించి రూ. 5016 ఆర్థిక సహాయాన్ని పొందవచ్చని వసంతరావు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నరదాసు వసంతరావు చేసిన ఈ సహాయానికి కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నరదాసు వసంతరావుతో పాటు గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఆటో యూనియన్ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అఫ్రోజ్ ఖాన్, ఆరే రవి, ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్, ఉపాధ్యక్షులు ఇరవేని కుమార్, కుక్కట్ల సంపత్, కోశాధికారి చిట్టిమల్ల నాగభూషణం, ఈసీ మెంబర్స్ కూర్మచలం వేణుమాధవ్, బొంగోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    19 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో గుర్తుతెలియని దుండగులు రైతులకు భారీ నష్టం కలిగించారు. అర్ధరాత్రి వేళ గంభీరావుపేట మండల కేంద్రంలోని సింగసముద్రం పెద్ద కాలువ ఆయకట్టు పరిధిలో ఉన్న పంట పొలాల నుండి ఏకకాలంలో 11 బోరు మోటార్ల కేబుళ్లను దొంగిలించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నారు పోసి సాగు పనులు ప్రారంభించిన కీలక సమయంలో ఈ కేబుళ్ల చోరీ జరగడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై శ్రీకాంత్, పోలీసు సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగలు కేబుల్ వైర్లను లాక్కెళ్లిన ఆనవాళ్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బాధిత రైతులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో గుర్తుతెలియని దుండగులు రైతులకు భారీ నష్టం కలిగించారు. అర్ధరాత్రి వేళ గంభీరావుపేట మండల కేంద్రంలోని సింగసముద్రం పెద్ద కాలువ ఆయకట్టు పరిధిలో ఉన్న పంట పొలాల నుండి ఏకకాలంలో 11 బోరు మోటార్ల కేబుళ్లను దొంగిలించడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నారు పోసి సాగు పనులు ప్రారంభించిన కీలక సమయంలో ఈ కేబుళ్ల చోరీ జరగడంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై శ్రీకాంత్, పోలీసు సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగలు కేబుల్ వైర్లను లాక్కెళ్లిన ఆనవాళ్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బాధిత రైతులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.