logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

“రహదారి భద్రత అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటు" రహదారి భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని డుంబ్రిగూడ పోలీసులు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చాపరాయి, జైపూర్ జంక్షన్‌తో పాటు ప్రధాన రహదారుల వద్ద హెచ్చరిక సూచిక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాహనదారులు, పాదచారులకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించి, హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ వినియోగించడం, అతివేగం నివారించడం వంటి జాగ్రత్తలను సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

6 hrs ago
user_Nava surya
Nava surya
జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
6 hrs ago
c7722327-8908-4a49-ae24-e96d82fe131a

“రహదారి భద్రత అవగాహన ఫ్లెక్సీలు ఏర్పాటు" రహదారి భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని డుంబ్రిగూడ పోలీసులు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చాపరాయి, జైపూర్ జంక్షన్‌తో పాటు ప్రధాన రహదారుల వద్ద హెచ్చరిక సూచిక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాహనదారులు, పాదచారులకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించి, హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ వినియోగించడం, అతివేగం నివారించడం వంటి జాగ్రత్తలను సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వీ.ఆర్.ఏలకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద బుధవారం ఉదయం ఆందోళన చేశారు. నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, ప్రభుత్వ మొండివైఖరి నశించాలని నినాదాలు చేశారు. వీ‌ఆర్‌ఏలుగా ఎక్కువ సంఖ్యలో వెనకబడిన తరగతుల వారు విధులు నిర్వహిస్తున్నారని, ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, కేవలం రూ.10,500 జీతంతో కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలని ప్రశ్నించారు.
    1
    వీ.ఆర్.ఏలకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద బుధవారం ఉదయం ఆందోళన చేశారు.   నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, ప్రభుత్వ మొండివైఖరి నశించాలని నినాదాలు చేశారు. వీ‌ఆర్‌ఏలుగా ఎక్కువ సంఖ్యలో వెనకబడిన తరగతుల వారు విధులు నిర్వహిస్తున్నారని, ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, కేవలం రూ.10,500 జీతంతో కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలని ప్రశ్నించారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • హుకుంపేట: కొట్నాపల్లి-మారెల వెళ్లే దారిలోని ప్రయాణికుల విశ్రాంతి భవనం మందుబాబులకు అడ్డాగా మారింది. భవనం నిండా మందు సీసాలు, గ్లాసులు దర్శనమిస్తుండటంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కోసం నిర్మించిన భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
    1
    హుకుంపేట: కొట్నాపల్లి-మారెల వెళ్లే దారిలోని ప్రయాణికుల విశ్రాంతి భవనం మందుబాబులకు అడ్డాగా మారింది. భవనం నిండా మందు సీసాలు, గ్లాసులు దర్శనమిస్తుండటంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కోసం నిర్మించిన భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు, ఆసుప‌త్రుల‌న్నీ బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత ఆసుపత్రులపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ మండలి మరియు ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి ఆసుప‌త్రి వ్య‌ర్ధాల నిర్వ‌హ‌ణా క‌మిటీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రి వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలకమైన ప్రక్రియ అని, ప్రజారోగ్యానికి భంగం కలగకుండా వీటిని శాస్త్రీయ పద్ధతిలో నిర్ణీత సమయంలోగా తరలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి ఆసుపత్రిలో రెడ్, ఎల్లో, బ్లూ, వైట్ రంగుల కోడింగ్ బ్యాగులను ఉపయోగించి ఇంజక్షన్ సూదులు, పత్తి, గ్లౌవ్స్, శరీర వ్యర్థాలను తప్పనిసరిగా వేరు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న సుమారు 496 ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పశుసంవర్ధక ఆసుపత్రుల నుంచి కూడా క్రమం తప్పకుండా చెత్త సేకరణ జరగాలని ఆదేశించారు. సేకరించిన వ్యర్థాలను 48 గంటల గడువులోగా తరలించాలని, ఎక్కడా బయట కనిపించకూడదని స్పష్టం చేశారు. అంతేకాక, ప్రతి ఆసుపత్రి, క్లినిక్, ల్యాబ్ తమ వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్థాల వివరాలను 'బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యాప్‌'లో ప్రతిరోజూ తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డేటా ఎంట్రీ చేయని సంస్థలపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వాటిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వెంట‌నే నోటీసులు జారీ చేయాల‌ని కాలుష్య నియంత్రణ మండలి అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌తీ ఇంటి నుంచీ బ‌యో మెడిక‌ల్ వ్య‌ర్ధాల‌ను సైతం సేక‌రించి, స‌రైన ప‌ద్ద‌తిలో వాటిని త‌ర‌లించాల‌ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌కు సూచించారు. అలాగే వ్య‌ర్ధాల‌ను బ‌య‌ట ప‌డేసే ఆసుప‌త్రుల‌పై నిఘా పెట్టాల‌ని కోరారు.
    1
    విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సంస్థలు, ఆసుప‌త్రుల‌న్నీ బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సంబంధిత ఆసుపత్రులపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ మండలి మరియు ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన జిల్లా స్థాయి ఆసుప‌త్రి వ్య‌ర్ధాల నిర్వ‌హ‌ణా క‌మిటీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రి వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలకమైన ప్రక్రియ అని, ప్రజారోగ్యానికి భంగం కలగకుండా వీటిని శాస్త్రీయ పద్ధతిలో నిర్ణీత సమయంలోగా తరలించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రతి ఆసుపత్రిలో రెడ్, ఎల్లో, బ్లూ, వైట్ రంగుల కోడింగ్ బ్యాగులను ఉపయోగించి ఇంజక్షన్ సూదులు, పత్తి, గ్లౌవ్స్, శరీర వ్యర్థాలను తప్పనిసరిగా వేరు చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఉన్న సుమారు 496  ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు పశుసంవర్ధక ఆసుపత్రుల నుంచి కూడా క్రమం తప్పకుండా చెత్త సేకరణ జరగాలని ఆదేశించారు. సేకరించిన వ్యర్థాలను 48 గంటల గడువులోగా తరలించాలని, ఎక్కడా బయట కనిపించకూడదని స్పష్టం చేశారు. 
అంతేకాక, ప్రతి ఆసుపత్రి, క్లినిక్, ల్యాబ్ తమ వద్ద ఉత్పత్తి అయ్యే వ్యర్థాల వివరాలను 'బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ యాప్‌'లో ప్రతిరోజూ తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డేటా ఎంట్రీ చేయని సంస్థలపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వాటిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వెంట‌నే నోటీసులు జారీ చేయాల‌ని కాలుష్య నియంత్రణ మండలి అధికారుల‌ను ఆదేశించారు.  ప్ర‌తీ ఇంటి నుంచీ బ‌యో మెడిక‌ల్ వ్య‌ర్ధాల‌ను సైతం సేక‌రించి, స‌రైన ప‌ద్ద‌తిలో వాటిని త‌ర‌లించాల‌ని మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల‌కు సూచించారు. అలాగే వ్య‌ర్ధాల‌ను బ‌య‌ట ప‌డేసే ఆసుప‌త్రుల‌పై నిఘా పెట్టాల‌ని కోరారు.
    user_Kumar
    Kumar
    Reporter Vizianagaram, Andhra Pradesh•
    3 hrs ago
  • ప్రేమ, పెళ్ళి పేరుతో బాలికను తీసుకొనిపోయి మోసం చేసిన నిందితుడికి 20సం.ల కఠిన కారాగార శిక్ష, జరిమాన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ 🎯 *బాలికను మోసం చేసిన నిందితుడికి శిక్ష విధింపబడే విధంగా చర్యలు చేపట్టామన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ * 🎯 *నిందితుడికి 20 సం.లు కఠిన కారాగార శిక్ష, రూ.5వేలు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం మంజూరు చేసారన్న జిల్లా ఎస్పీ* 🎯 *బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరోసారి తీవ్రంగా హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ విజయనగరం జిల్లా భోగాపురం పోలీసు స్టేషనులో 2024 సం. మే నెలలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) అనే వ్యక్తికి విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే.నాగమణి గారు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5,000/-లు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ. 5 లక్షలను మంజూరు చేయాలని ఫిబ్రవరి 18న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే.. భోగాపురం మండలం, ముంజేరు గ్రామంలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి తన కుమార్తె (మైనరు బాలిక) కనపడటం లేదని తేది.22.05.2024న భోగాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, భోగాపురం ఎస్ఐ పి.సూర్యకుమారి గర్ల్ మిస్సింగ్ క్రింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఆ బాలికను కనిపెట్టి తన నుండి స్టేట్మెంట్ నమోదుచేసిన భోగాపురం పోలీసులు. భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) అనే వ్యక్తి  తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి విశాఖపట్నం మరియు హైదరాబాదు తిప్పి శారీరకంగా అనుభవించాడని తెలిపింది. ఆ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తే.25.07.2024దిన పోక్సో సెక్షన్స్ క్రింద కేసును ఆల్టర్ చేశారన్నారు. అనంతరం విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు కేసు దర్యాప్తు చేపట్టి, ముద్దాయిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించి, నిందితుడిపై న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. నిందితుడు రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు శ్రీమతి కె.నాగమణి నిందితుడికి 20 సంవత్సరాలు కఠిన కారాగారం మరియు రూ.5,000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షల మంజూరు చేస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసుల తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటరు జి.సత్యం వాదనలు వినిపించారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసి, నిందితుడిని శిక్షించబడే విధంగా సమర్ధవంతంగా పని చేసిన విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, భోగాపురం సిఐ దుర్గా ప్రసాద్, ఎస్ఐ పి.సూర్యకుమారి, సి.ఎం.ఎస్. హెచ్సి సిహెచ్.రామకృష్ణ, కోర్టు కానిస్టేబులు వి.సత్యనారాయణ, ఎపిపి జి.సత్యంలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. గడిచిన 6నెలల కాలంలో 17 పోక్సో కేసులలో నిందితులకు కఠిన కారాగార శిక్ష పడిందని, జిల్లా ఎస్పీ తెలిపారు. మైనర్ బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరోసారి తీవ్రంగా హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,
    1
    ప్రేమ, పెళ్ళి పేరుతో బాలికను తీసుకొనిపోయి మోసం చేసిన నిందితుడికి 20సం.ల కఠిన కారాగార శిక్ష, జరిమాన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్
🎯 *బాలికను మోసం చేసిన నిందితుడికి శిక్ష విధింపబడే విధంగా చర్యలు చేపట్టామన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ *
🎯 *నిందితుడికి 20 సం.లు కఠిన కారాగార శిక్ష, రూ.5వేలు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం మంజూరు చేసారన్న జిల్లా ఎస్పీ*
🎯 *బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరోసారి తీవ్రంగా హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్
విజయనగరం జిల్లా భోగాపురం పోలీసు స్టేషనులో 2024 సం. మే నెలలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) అనే వ్యక్తికి విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే.నాగమణి గారు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5,000/-లు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ. 5 లక్షలను మంజూరు చేయాలని ఫిబ్రవరి 18న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.
వివరాల్లోకి వెళ్ళితే.. భోగాపురం మండలం, ముంజేరు గ్రామంలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి తన కుమార్తె (మైనరు బాలిక) కనపడటం లేదని తేది.22.05.2024న భోగాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, భోగాపురం ఎస్ఐ పి.సూర్యకుమారి గర్ల్ మిస్సింగ్ క్రింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఆ బాలికను కనిపెట్టి తన నుండి స్టేట్మెంట్ నమోదుచేసిన భోగాపురం పోలీసులు. భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) అనే వ్యక్తి  తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి విశాఖపట్నం మరియు హైదరాబాదు తిప్పి శారీరకంగా అనుభవించాడని తెలిపింది. ఆ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తే.25.07.2024దిన పోక్సో సెక్షన్స్ క్రింద కేసును ఆల్టర్ చేశారన్నారు. అనంతరం విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు కేసు దర్యాప్తు చేపట్టి, ముద్దాయిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించి, నిందితుడిపై న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు.
నిందితుడు రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు శ్రీమతి కె.నాగమణి  నిందితుడికి 20 సంవత్సరాలు కఠిన కారాగారం మరియు రూ.5,000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షల మంజూరు చేస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసుల తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటరు జి.సత్యం వాదనలు వినిపించారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసి, నిందితుడిని శిక్షించబడే విధంగా సమర్ధవంతంగా పని చేసిన విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, భోగాపురం సిఐ దుర్గా ప్రసాద్, ఎస్ఐ పి.సూర్యకుమారి, సి.ఎం.ఎస్. హెచ్సి సిహెచ్.రామకృష్ణ, కోర్టు కానిస్టేబులు వి.సత్యనారాయణ, ఎపిపి జి.సత్యంలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు.
గడిచిన 6నెలల కాలంలో 17 పోక్సో కేసులలో నిందితులకు కఠిన కారాగార శిక్ష పడిందని, జిల్లా ఎస్పీ తెలిపారు. మైనర్ బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరోసారి తీవ్రంగా హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,
    user_Giridhar singh
    Giridhar singh
    రిపోర్టర్ విజయనగరం విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా పోలీసు పత్రికా ప్రకటన. ** శ్రీకాకుళం (జలుమూరు), ఫిబ్రవరి 18: జలుమూరు మండలం పరిధిలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన త్రిశూల్ చక్రతీర్థ స్నానాలు బుధవారం వంశధార నదిలో పటిష్ట భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా పూర్తయ్యాయి. భక్తుల భారీ రద్దీ ఉంటుందని ముందస్తు అంచనాల మేరకు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సుమారు 1000 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులు,రోప్ పార్టీలు, రిజర్వ్ పార్టీలు, హోంగార్డు,ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విధుల్లో పాల్గొన్నాయి. పార్వతీ పరమేశ్వర స్వామివారి నంది వాహనం ఆలయం నుండి వంశధార నది మిర్యాపల్లి రేవుకు వెళ్లే సుమారు రెండు కిలోమీటర్ల మార్గంలో పటిష్టమైన రోప్ పార్టీల సహకారంతో, భక్తులు రద్దీ నియంత్రణ చేపట్టారు. నదిలో భక్తుల రద్దీని అరికట్టే దిశగా స్వామి వారు పుణ్యస్నానాల కోసం నాలుగు వరుసల బారికేడ్లు ఏర్పాటు చేసి,ప్రత్యేక విభజన ఏర్పాట్లు చేసి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల సహాయంతో భక్తుల రాకపోకలు, ట్రాఫిక్, ఉత్సవ విగ్రహాల మార్గం తదితర అంశాలను జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక మార్గదర్శకాలు అమలు చేసి, భక్తులు సురక్షితంగా తిరిగి వెళ్లేలా చర్యలు చేపట్టారు. భక్తుల రద్దీ నియంత్రణ, ఆకతాయిలపై కట్టడి, గ్రామ ప్రవేశ-నిష్క్రమణ మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల్లో పోలీసులు సమన్వయం, సమయస్ఫూర్తితో విధులు నిర్వహించారు. స్వామివారి పుణ్యస్నానాలు పూర్తయ్యి తిరిగి ఆలయానికి సురక్షితంగా చేరుకునే వరకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు. చక్రతీర్థ స్నానాలు విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించడంలో భాగస్వామ్యులైన అదనపు ఎస్పీలు కె.వి. రమణ, పి. శ్రీనివాసరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది అందరి కృషి అభినందనీయం అని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. భక్తులు,ప్రజలు అందించిన సహకారానికి జిల్లా పోలీసు శాఖ తరపున జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.
    2
    శ్రీకాకుళం జిల్లా పోలీసు
పత్రికా ప్రకటన.
**
శ్రీకాకుళం (జలుమూరు), ఫిబ్రవరి 18: జలుమూరు మండలం పరిధిలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీముఖలింగేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన త్రిశూల్ చక్రతీర్థ స్నానాలు బుధవారం వంశధార నదిలో పటిష్ట భద్రతా ఏర్పాట్ల నడుమ ప్రశాంతంగా పూర్తయ్యాయి.
భక్తుల భారీ రద్దీ ఉంటుందని ముందస్తు అంచనాల మేరకు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సుమారు 1000 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులు,రోప్ పార్టీలు, రిజర్వ్ పార్టీలు, హోంగార్డు,ఎస్డీఆర్ఎఫ్ బృందాలు విధుల్లో పాల్గొన్నాయి.
పార్వతీ పరమేశ్వర స్వామివారి నంది వాహనం ఆలయం నుండి వంశధార నది మిర్యాపల్లి రేవుకు వెళ్లే సుమారు రెండు కిలోమీటర్ల మార్గంలో పటిష్టమైన రోప్ పార్టీల సహకారంతో, భక్తులు రద్దీ నియంత్రణ చేపట్టారు. నదిలో భక్తుల రద్దీని అరికట్టే దిశగా స్వామి వారు పుణ్యస్నానాల కోసం నాలుగు వరుసల బారికేడ్లు ఏర్పాటు చేసి,ప్రత్యేక విభజన ఏర్పాట్లు చేసి, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
ఆలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల సహాయంతో భక్తుల రాకపోకలు, ట్రాఫిక్, ఉత్సవ విగ్రహాల మార్గం తదితర అంశాలను జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. 
ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక మార్గదర్శకాలు అమలు చేసి, భక్తులు సురక్షితంగా తిరిగి వెళ్లేలా చర్యలు చేపట్టారు.
భక్తుల రద్దీ నియంత్రణ, ఆకతాయిలపై కట్టడి, గ్రామ ప్రవేశ-నిష్క్రమణ మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాల్లో పోలీసులు సమన్వయం, సమయస్ఫూర్తితో విధులు నిర్వహించారు. స్వామివారి పుణ్యస్నానాలు పూర్తయ్యి తిరిగి ఆలయానికి సురక్షితంగా చేరుకునే వరకు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించారు.
చక్రతీర్థ స్నానాలు విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించడంలో భాగస్వామ్యులైన అదనపు ఎస్పీలు కె.వి. రమణ, పి. శ్రీనివాసరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది అందరి కృషి అభినందనీయం అని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.
భక్తులు,ప్రజలు అందించిన సహకారానికి జిల్లా పోలీసు శాఖ తరపున జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు.
    user_Dr.Gangu Manmadharao
    Dr.Gangu Manmadharao
    జర్నలిస్ట్ శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • చక్ర తీర్థ స్నానానికి పోటెత్తిన భక్తులు' ఎల్.ఎన్.పేట మండలం మిరియాపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో నేడు జరిగిన శ్రీ ముఖలింగేశ్వర స్వామి చక్ర తీర్థ స్నానాలకు భక్తులు పోటెత్తారు. దీంతో వంశధార నది తీరం జనసంద్రంగా మారింది. స్వామివారు ఆలయం నుంచి ఊరేగింపుగా మధ్యాహ్నం 12:15 నిమిషాలకు వంశధార నది తీరానికి చేరుకున్నారు. వేద పండితులను మంత్రోచ్ఛారణ నడుమ చక్ర తీర్థ స్నానాలను ఆచరించారు. సుమారు రెండు లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు సమాచారం.
    1
    చక్ర తీర్థ స్నానానికి పోటెత్తిన భక్తులు'
ఎల్.ఎన్.పేట మండలం మిరియాపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో నేడు జరిగిన శ్రీ ముఖలింగేశ్వర స్వామి చక్ర తీర్థ స్నానాలకు భక్తులు పోటెత్తారు. దీంతో వంశధార నది తీరం జనసంద్రంగా మారింది. స్వామివారు ఆలయం నుంచి ఊరేగింపుగా మధ్యాహ్నం 12:15 నిమిషాలకు వంశధార నది తీరానికి చేరుకున్నారు. వేద పండితులను మంత్రోచ్ఛారణ నడుమ చక్ర తీర్థ స్నానాలను ఆచరించారు. సుమారు రెండు లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు సమాచారం.
    user_ANR
    ANR
    పాతపట్నం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం పాదగయ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పండితులు శాస్త్రోక్తంగా నాకాబలి, దండాడింపు,,దొంగల దూపు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ విశేష క్రతువును వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకిపై అధిష్టింపజేసి ఆలయం నుండి స్థానిక మాధవ స్వామి కోనేరు వరకు శోభయాత్రను కన్నుల పండువగా నిర్వహించారు. అక్కడ నుండి స్వామిఅమ్మవార్లను రథంపై ఆశీనులను చేసి ఉప్పాడ బస్టాండ్ వరకు మహా రథోత్సవం కొనసాగింది. రథంపై ఉన్న ఆది దంపతులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రథోత్సవం పొడవునా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళారూపాలు, డప్పు వాయిద్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకాశంలో రంగురంగుల వెలుగులు విరజిమ్ముతుంటే భక్తుల శివనామస్మరణతో పిఠాపురం పురవీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. *నేడు త్రిశూల స్నానం* మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు త్రిశూల స్నాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా పాదగయ క్షేత్రం ఆధ్యాత్మిక వైభవంతో మరింత శోభాయమానంగా విరాజిల్లుతుంది. అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారు లు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.
    4
    దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర  స్వామి వారి ఆలయం పాదగయ క్షేత్రంలో   మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.   ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పండితులు శాస్త్రోక్తంగా నాకాబలి, దండాడింపు,,దొంగల దూపు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ విశేష క్రతువును వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకిపై అధిష్టింపజేసి ఆలయం నుండి స్థానిక మాధవ స్వామి కోనేరు వరకు శోభయాత్రను కన్నుల పండువగా నిర్వహించారు. అక్కడ నుండి స్వామిఅమ్మవార్లను రథంపై ఆశీనులను చేసి ఉప్పాడ బస్టాండ్ వరకు మహా రథోత్సవం కొనసాగింది. రథంపై ఉన్న ఆది దంపతులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రథోత్సవం పొడవునా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళారూపాలు, డప్పు వాయిద్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకాశంలో రంగురంగుల వెలుగులు విరజిమ్ముతుంటే భక్తుల శివనామస్మరణతో పిఠాపురం పురవీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. 
*నేడు త్రిశూల స్నానం*
మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు త్రిశూల స్నాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా  పాదగయ క్షేత్రం ఆధ్యాత్మిక వైభవంతో మరింత శోభాయమానంగా విరాజిల్లుతుంది. అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారు లు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.
    user_MANIKANTA SUVARNAM
    MANIKANTA SUVARNAM
    Local News Reporter పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాలకు చెందిన వారిలో అధిక శాతం చింతపండు సేకరించి సంతల్లో విక్రయిస్తూ జీవనం సాగిస్తు న్నారు. జీసీసీ అధికారులు కేజీకి రూ.36 మాత్రమే ఇస్తుండటంతో నష్టపోతున్నామని వారంతా ఆందోళనకు దిగారు. కేజీ పండు రూ.50 చొప్పున కొనుగోలు చేయా లని డిమాండు చేశారు. మార్కెట్లో కేజీకి రూ. 60 పలుకుతుందని, జీసీసీ తక్కువ ధరకు కొను గోలు చేయడం సరికాదని వార్డు సభ్యుడు అప్ప లరాజు పేర్కొన్నారు. అధికారులు స్పందించి మద్దతు ధర ఇవ్వాలని కోరారు. పోలమ్మ, పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు.
    1
    అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాలకు చెందిన వారిలో అధిక శాతం చింతపండు సేకరించి సంతల్లో విక్రయిస్తూ జీవనం సాగిస్తు న్నారు. జీసీసీ అధికారులు కేజీకి రూ.36 మాత్రమే ఇస్తుండటంతో నష్టపోతున్నామని వారంతా  ఆందోళనకు దిగారు. కేజీ పండు రూ.50 చొప్పున కొనుగోలు చేయా లని డిమాండు చేశారు. మార్కెట్లో కేజీకి రూ. 60 పలుకుతుందని, జీసీసీ తక్కువ ధరకు కొను గోలు చేయడం సరికాదని వార్డు సభ్యుడు అప్ప లరాజు పేర్కొన్నారు. అధికారులు స్పందించి మద్దతు ధర ఇవ్వాలని కోరారు. పోలమ్మ, పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.