Shuru
Apke Nagar Ki App…
అల్లూరి జిల్లా కలెక్టరేట్ వద్ద వీఆర్ఏల ఆందోళన వీ.ఆర్.ఏలకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద బుధవారం ఉదయం ఆందోళన చేశారు. నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, ప్రభుత్వ మొండివైఖరి నశించాలని నినాదాలు చేశారు. వీఆర్‌ఏలుగా ఎక్కువ సంఖ్యలో వెనకబడిన తరగతుల వారు విధులు నిర్వహిస్తున్నారని, ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, కేవలం రూ.10,500 జీతంతో కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలని ప్రశ్నించారు.
Nava surya
అల్లూరి జిల్లా కలెక్టరేట్ వద్ద వీఆర్ఏల ఆందోళన వీ.ఆర్.ఏలకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద బుధవారం ఉదయం ఆందోళన చేశారు. నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, ప్రభుత్వ మొండివైఖరి నశించాలని నినాదాలు చేశారు. వీఆర్‌ఏలుగా ఎక్కువ సంఖ్యలో వెనకబడిన తరగతుల వారు విధులు నిర్వహిస్తున్నారని, ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, కేవలం రూ.10,500 జీతంతో కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలని ప్రశ్నించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- వీ.ఆర్.ఏలకు సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద బుధవారం ఉదయం ఆందోళన చేశారు. నైట్ డ్యూటీలు రద్దు చేయాలని, ప్రభుత్వ మొండివైఖరి నశించాలని నినాదాలు చేశారు. వీఆర్‌ఏలుగా ఎక్కువ సంఖ్యలో వెనకబడిన తరగతుల వారు విధులు నిర్వహిస్తున్నారని, ధరలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, కేవలం రూ.10,500 జీతంతో కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలని ప్రశ్నించారు.1
- హుకుంపేట: కొట్నాపల్లి-మారెల వెళ్లే దారిలోని ప్రయాణికుల విశ్రాంతి భవనం మందుబాబులకు అడ్డాగా మారింది. భవనం నిండా మందు సీసాలు, గ్లాసులు దర్శనమిస్తుండటంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల కోసం నిర్మించిన భవనం అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.1
- ప్రేమ, పెళ్ళి పేరుతో బాలికను తీసుకొనిపోయి మోసం చేసిన నిందితుడికి 20సం.ల కఠిన కారాగార శిక్ష, జరిమాన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ 🎯 *బాలికను మోసం చేసిన నిందితుడికి శిక్ష విధింపబడే విధంగా చర్యలు చేపట్టామన్న జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ * 🎯 *నిందితుడికి 20 సం.లు కఠిన కారాగార శిక్ష, రూ.5వేలు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం మంజూరు చేసారన్న జిల్లా ఎస్పీ* 🎯 *బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరోసారి తీవ్రంగా హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ విజయనగరం జిల్లా భోగాపురం పోలీసు స్టేషనులో 2024 సం. మే నెలలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) అనే వ్యక్తికి విజయనగరం పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే.నాగమణి గారు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.5,000/-లు జరిమానా విధించడంతోపాటు, బాధితురాలికి పరిహారంగా రూ. 5 లక్షలను మంజూరు చేయాలని ఫిబ్రవరి 18న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. వివరాల్లోకి వెళ్ళితే.. భోగాపురం మండలం, ముంజేరు గ్రామంలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి తన కుమార్తె (మైనరు బాలిక) కనపడటం లేదని తేది.22.05.2024న భోగాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, భోగాపురం ఎస్ఐ పి.సూర్యకుమారి గర్ల్ మిస్సింగ్ క్రింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఆ బాలికను కనిపెట్టి తన నుండి స్టేట్మెంట్ నమోదుచేసిన భోగాపురం పోలీసులు. భోగాపురం మండలం ముంజేరు గ్రామానికి చెందిన రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి విశాఖపట్నం మరియు హైదరాబాదు తిప్పి శారీరకంగా అనుభవించాడని తెలిపింది. ఆ బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తే.25.07.2024దిన పోక్సో సెక్షన్స్ క్రింద కేసును ఆల్టర్ చేశారన్నారు. అనంతరం విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు కేసు దర్యాప్తు చేపట్టి, ముద్దాయిని అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించి, నిందితుడిపై న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. నిందితుడు రాయపురెడ్డి సురేష్ (26 సం. లు) పై నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు శ్రీమతి కె.నాగమణి నిందితుడికి 20 సంవత్సరాలు కఠిన కారాగారం మరియు రూ.5,000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షల మంజూరు చేస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసుల తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటరు జి.సత్యం వాదనలు వినిపించారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసి, నిందితుడిని శిక్షించబడే విధంగా సమర్ధవంతంగా పని చేసిన విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, భోగాపురం సిఐ దుర్గా ప్రసాద్, ఎస్ఐ పి.సూర్యకుమారి, సి.ఎం.ఎస్. హెచ్సి సిహెచ్.రామకృష్ణ, కోర్టు కానిస్టేబులు వి.సత్యనారాయణ, ఎపిపి జి.సత్యంలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. గడిచిన 6నెలల కాలంలో 17 పోక్సో కేసులలో నిందితులకు కఠిన కారాగార శిక్ష పడిందని, జిల్లా ఎస్పీ తెలిపారు. మైనర్ బాలికలు మరియు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మరోసారి తీవ్రంగా హెచ్చరించిన జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్,1
- Post by APPARAO KONCHADA1
- పలాస: పలాసలోని రామకృష్ణాపురంలో బుధవారం, జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఒక మహిళ మెడలో చైన్ స్నాచింగ్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. మహిళ కేకలు వేయడంతో అప్రమత్తమైన స్థానికులు నిందితుడిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టుబడిన వ్యక్తి MPకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నారు.1
- చక్ర తీర్థ స్నానానికి పోటెత్తిన భక్తులు' ఎల్.ఎన్.పేట మండలం మిరియాపల్లి గ్రామం వద్ద వంశధార నదిలో నేడు జరిగిన శ్రీ ముఖలింగేశ్వర స్వామి చక్ర తీర్థ స్నానాలకు భక్తులు పోటెత్తారు. దీంతో వంశధార నది తీరం జనసంద్రంగా మారింది. స్వామివారు ఆలయం నుంచి ఊరేగింపుగా మధ్యాహ్నం 12:15 నిమిషాలకు వంశధార నది తీరానికి చేరుకున్నారు. వేద పండితులను మంత్రోచ్ఛారణ నడుమ చక్ర తీర్థ స్నానాలను ఆచరించారు. సుమారు రెండు లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు సమాచారం.1
- దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం పిఠాపురం శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయం పాదగయ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో పండితులు శాస్త్రోక్తంగా నాకాబలి, దండాడింపు,,దొంగల దూపు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ విశేష క్రతువును వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకిపై అధిష్టింపజేసి ఆలయం నుండి స్థానిక మాధవ స్వామి కోనేరు వరకు శోభయాత్రను కన్నుల పండువగా నిర్వహించారు. అక్కడ నుండి స్వామిఅమ్మవార్లను రథంపై ఆశీనులను చేసి ఉప్పాడ బస్టాండ్ వరకు మహా రథోత్సవం కొనసాగింది. రథంపై ఉన్న ఆది దంపతులను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. రథోత్సవం పొడవునా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళారూపాలు, డప్పు వాయిద్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకాశంలో రంగురంగుల వెలుగులు విరజిమ్ముతుంటే భక్తుల శివనామస్మరణతో పిఠాపురం పురవీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. *నేడు త్రిశూల స్నానం* మహాశివరాత్రి మహోత్సవంలో భాగంగా మంగళవారం ఉదయం 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు త్రిశూల స్నాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా పాదగయ క్షేత్రం ఆధ్యాత్మిక వైభవంతో మరింత శోభాయమానంగా విరాజిల్లుతుంది. అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారు లు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.4
- అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాలకు చెందిన వారిలో అధిక శాతం చింతపండు సేకరించి సంతల్లో విక్రయిస్తూ జీవనం సాగిస్తు న్నారు. జీసీసీ అధికారులు కేజీకి రూ.36 మాత్రమే ఇస్తుండటంతో నష్టపోతున్నామని వారంతా ఆందోళనకు దిగారు. కేజీ పండు రూ.50 చొప్పున కొనుగోలు చేయా లని డిమాండు చేశారు. మార్కెట్లో కేజీకి రూ. 60 పలుకుతుందని, జీసీసీ తక్కువ ధరకు కొను గోలు చేయడం సరికాదని వార్డు సభ్యుడు అప్ప లరాజు పేర్కొన్నారు. అధికారులు స్పందించి మద్దతు ధర ఇవ్వాలని కోరారు. పోలమ్మ, పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు.1