కడప జిల్లా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదుల స్వీకరణ *వై.ఎస్.ఆర్. *➡️ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదుల స్వీకరణ – నిర్ణీత గడువు లోగా పరిష్కారానికి జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్.గారి ఆదేశాలు* 🚩 వై.ఎస్.ఆర్. కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక – PGRS” కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ గారు ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకుని ఫిర్యాదులను స్వీకరించారు. 📌 జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు వివిధ సమస్యలపై మొత్తం 147 ఫిర్యాదులను సమర్పించారు. 🔹 ప్రతి ఫిర్యాదును స్వయంగా పరిశీలించిన ఎస్పీ గారు, సంబంధిత పోలీస్ అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. 🔹 ఫిర్యాదులపై చట్టపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా నిష్పక్షపాతంగా విచారణ పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 🔹 ప్రజలు తమ సమస్యలను పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని, చట్ట పరిధిలో పరిష్కరించగల ప్రతి ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు భరోసా కల్పించారు. 👮♂️ ఎస్పీ గారి ముఖ్య ఆదేశాలు ✅ ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో స్వీకరించాలి. ✅ నిర్ణీత గడువులోగా చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలి. ✅ బాధితుల సమస్యలను సానుభూతితో విని, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. ✅ ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా వేగంగా పరిష్కరించాలి. ✅ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తూ ప్రజల్లో పోలీస్ శాఖపై నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలి. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్పీ శ్రీ ఎన్. సుధాకర్ గారు, డి.టి.సి డి.ఎస్పీ శ్రీ అబ్దుల్ కరీం గారు, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం, కడప

- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం1
- కీసీ కెనాల్ రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామబాట....... కడప జిల్లా కీసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు సేవాసమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 26వ తేదీ వరకు గ్రామబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. కీసీ కెనాల్‌కు ఈ ఖరీఫ్ సీజన్‌లో తగినంత నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కీసీ కెనాల్‌పై ఆధారపడే వేలాది మంది రైతులకు నీటి సమస్య లేకుండా ఉండేందుకు రాజోలి 2.95 టీఎంసీల ప్రాజెక్టును పూర్తి చేయాలని, జొలదరాసి ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టులోని ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2, బ్రహ్మసాగర్ పరిధిలో నీరు ఉన్నప్పటికీ పంట, పిల్ల కాలువల సమస్యల కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదని తెలిపారు. ఈ ఏడాది కీసీ కెనాల్ రైతులకు పంటలు సాగు చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మూడు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రజాసంఘాలతో కలిసి గ్రామబాట నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 27న రాయలసీమ రైతు నాయకులతో కలిసి ప్రత్యేక సదస్సు నిర్వహించి కడప జిల్లా రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రైతు సేవాసమితి వెల్లడించింది. రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామబాట, సదస్సును విజయవంతం చేయాలని సమితి విజ్ఞప్తి చేసింది.1
- బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు పులివెందుల మెయిన్ బజార్ లోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అర్చకులు స్వామివారికి కలశారాధన, ఉత్త హోమం, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.1
- బద్వేలు పట్టణంలో ప్రయాణ బస్సుల ఇష్టారాజ్యం...వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. బద్వేలు, ఆగస్టు 25: బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో ప్రయాణ సంస్థల బస్సులను రోడ్లకు అడ్డంగా నిలుపుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో బస్సులు ఆపడంతో తరచూ వాహనాలు నిలిచిపోతున్నాయని, స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో నియమాలు పాటించకుండా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాల భయం నెలకొందన్నారు. రోడ్లకు అడ్డంగా బస్సులు నిలిపే వారిపై చర్యలు తీసుకొని, వాహనాల రద్దీ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.1
- ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను1
- పట్టణ అభివృద్ధికై స్లమ్ ఏరియాల్లో సర్వే - సెప్టెంబర్ 28 చలో ఆర్డీఓ - సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్. బద్వేలు,ఆగస్టు 25: బద్వేలు స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌లో మంగళవారం సీపీఎం పట్టణ కమిటీ సమావేశం పి.చాంద్ భాషా అధ్యక్షతన జరిగింది. జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. బద్వేలు జనాభా లక్షా 50 వేలు దాటిందని, వలసలు, ప్లైవుడ్ పరిశ్రమతో స్లమ్ ఏరియాల్లో పేదలు పెరుగుతున్నా మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 28 వరకు మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై సర్వే చేసి, సెప్టెంబర్ 28న "చలో ఆర్డీఓ ఆఫీస్" కార్యక్రమం చేపడతామన్నారు. వామపక్షాల పోరాటంతో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, ప్రజల సామాజిక, ఆర్థిక హక్కులను హరిస్తున్నాయని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కె.శ్రీను, సుబ్బరాయుడు, రాయప్ప తదితరులు పాల్గొన్నారు.1
- *బస్సు-కంటైనర్ - "ఢీ"* *6గురు మృతి* *20 మందికి తీవ్ర గాయాలు* *దొరకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం* రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు మృతి *ఏలూరు వెళ్తున్న* బస్సుకు ఘోర ప్రమాదం..దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.2