నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని పుల్లలచెరువు పోలీసులు కాపాడి, సురక్షితంగా బయటకు తీశారు. పుల్లలచెరువు మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షాలకు పుల్లలచెరువు–తెల్లగట్ల మధ్య ఉన్న సప్టా వద్ద వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించింది. ఈ క్రమంలో వాగును దాటేందుకు ప్రయత్నించిన ద్విచక్ర వాహనం నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా, వాహనదారుడు కూడా ప్రవాహంలో చిక్కుకున్నాడు. సమాచారం అందుకున్న పుల్లలచెరువు ఎస్‌ఐ బి. సాంబశివరావు వెంటనే సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించిన ఆయన రెండు జేసీబీల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలో చిక్కుకున్న సునీల్ కుమార్ దేబెహర్ (36), తండ్రి లక్ష్మి దేబెహర్,ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సునీల్ కుమార్ ఒడిశా రాష్ట్రం నయాగఢ్ జిల్లా గుడిపోడా గ్రామానికి చెందినవాడని, ధాబాలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ సాంబశివరావు తక్షణమే స్పందించి సహాయక చర్యలను పర్యవేక్షించడంతో ప్రమాదం తప్పింది. వ్యక్తిని సురక్షితంగా రక్షించడంపై స్థానికులు పోలీసులను అభినందించారు. వాగులు, వంకల్లో వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణాలను పణంగా పెట్టి నీటి ప్రవాహాలను దాటేందుకు ప్రయత్నించవద్దని పోలీసులు సూచించారు.
నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని పుల్లలచెరువు పోలీసులు కాపాడి, సురక్షితంగా బయటకు తీశారు. పుల్లలచెరువు మండలంలో సోమవారం కురిసిన భారీ వర్షాలకు పుల్లలచెరువు–తెల్లగట్ల మధ్య ఉన్న సప్టా వద్ద వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించింది. ఈ క్రమంలో వాగును దాటేందుకు ప్రయత్నించిన ద్విచక్ర వాహనం నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా, వాహనదారుడు కూడా ప్రవాహంలో చిక్కుకున్నాడు. సమాచారం అందుకున్న పుల్లలచెరువు ఎస్‌ఐ బి. సాంబశివరావు వెంటనే సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించిన ఆయన రెండు జేసీబీల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఉధృతంగా ప్రవహిస్తున్న
నీటిలో చిక్కుకున్న సునీల్ కుమార్ దేబెహర్ (36), తండ్రి లక్ష్మి దేబెహర్,ను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. సునీల్ కుమార్ ఒడిశా రాష్ట్రం నయాగఢ్ జిల్లా గుడిపోడా గ్రామానికి చెందినవాడని, ధాబాలో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ సాంబశివరావు తక్షణమే స్పందించి సహాయక చర్యలను పర్యవేక్షించడంతో ప్రమాదం తప్పింది. వ్యక్తిని సురక్షితంగా రక్షించడంపై స్థానికులు పోలీసులను అభినందించారు. వాగులు, వంకల్లో వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణాలను పణంగా పెట్టి నీటి ప్రవాహాలను దాటేందుకు ప్రయత్నించవద్దని పోలీసులు సూచించారు.
- దర్శిలో వినాయకుని శిరస్సు పై భాగమున పంచ తలలు కలిగిన నాగ శేషు దర్శిలో సోమవారం రాత్రి దర్శి-పొదిలి రోడ్డు నందు చక్కటి అలంకరణతో, విద్యుత్ దీపాల నడుమ వినాయకుని భారీ విగ్రహం ఉన్నది. చిన్న కాలువ సెంటర్ వద్ద ఏర్పాటు గావించిన ఈ విగ్రహం ఇరువురు నందీశ్వరుల నడుమ వినాయకునికి వెనుక భాగమున ఈశ్వరుడు, ఆ పై భాగమున పంచ తలలు కలిగిన నాగ శేషు కలిగి ఉండడంతో ఈ వినాయకుని విగ్రహం ఎంతో విశేషంగా ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది.1
- పల్నాడు జిల్లా..సత్తెనపల్లి *సత్తెనపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టినట్లు పల్నాడు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు దరువూరి నాగేశ్వరరావు తెలిపారు.* సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ చొరవతో సాగర్ కెనాల్ నుంచి తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయడంతో పట్టణానికి సుమారు 100 రోజులకు సరిపడా మంచినీటిని నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దరువూరి నాగేశ్వరరావు సత్తెనపల్లిలోని మంచినీటి చెరువును సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు. పట్టణ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించి, తగిన చర్యలకు చొరవ చూపారని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలను సమర్థవంతంగా వినియోగిస్తూ పట్టణంలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ డి ఈ మధుసూదన్ రావు, కుటమి నాయకులు పాల్గొన్నారు.1
- జిల్లాలో ప్రశాంతంగా గణేష్ వేడుకలు జరుపుకోవాలి.. నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ _గణేష్ ఉత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కీలక సూచనలు.!_ ఇప్పటివరకు జిల్లాలో సుమారు 2,500 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు పూర్తి.. మరో వెయ్యి వరకు రిజిస్ట్రేషన్లు పూర్తయ్యే అవకాశం.. ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి... రాత్రి వేళల్లో మండపం వద్ద ఒక నిర్వాహకుడు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.. భక్తులను రెచ్చగొట్టే విధంగా పాటలు పెట్టకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి.. ప్రతి గణేష్ మండపానికి ఒక కానిస్టేబుల్‌ను అందుబాటులో.. దొంగతనాల నివారణకు సీసీఎస్ బృందాలు ప్రత్యేకంగా ఫీల్డ్‌లో పర్యటిస్తాయి.. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ కూడా నిరంతరం పర్యవేక్షిస్తాయి... ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో నిమజ్జనం తేదీ వివరాలను కూడా నమోదు చేయాలి.. నిమజ్జనం రోజున ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తాం.. ల్యాండ్ అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవు.. గత వారం రోజులుగా పలువురికి కౌన్సెలింగ్, బైండోవర్ చర్యలు చేపట్టాం.. ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని విజ్ఞప్తి.. *జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్*1
- వినాయక నిమజ్జన ఘాట్‌లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం.. వినాయక నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ముందస్తు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని వెలుగోడు, ఆత్మకూరు, పాములపాడు జూపాడుబంగ్లా మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న వినాయక నిమజ్జన ఘాట్‌లను, మరియు ఊరేగింపు జరిగే ప్రధాన ప్రాంతాలను స్వయంగా ఎస్పీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నిమజ్జన ఘాట్‌ల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా చర్యలు, ప్రజల రాకపోకలు, వాహనాల నియంత్రణ, పోలీస్ బందోబస్తు తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఘాట్‌ల వద్ద నిరంతరం పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉండాలని, రద్దీని క్రమబద్ధీకరించడంతో పాటు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు పోలీసులకు సహకరించి, పోలీస్ శాఖ సూచించిన భద్రతా నిబంధనలను పాటించాలని జిల్లా ఎస్పీ గారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు ఆత్మకూరు డిఎస్పి రామంజి నాయక్ గారు ,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అశోక్, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.2
- నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న విద్యాసంస్థ పై చర్యలు తీసుకోండి. సెలవు రోజుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి భద్రత లేకుండా ప్రిన్సిపల్ ఇంటిలో క్లాసులు నిర్వహించిన నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని రేపల్లె ఎంఈఓ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించి ఎంఈఓ కె.సురేష్ కి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రేపల్లె కార్యదర్శి ఎం.సూర్య ప్రకాష్,సహాయ కార్యదర్శి వై.నవీన్ మాట్లాడుతూ రేపల్లె పట్టణంలో సెలవు రోజులలో విద్యాసంస్థలు నిర్వహించవద్దని సంబంధిత విద్యాశాఖ అధికారులు ముందు రోజే ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఈనెల 12వ తేదీ రెండో శనివారం,స్కూల్ నడపడానికి ప్రయత్నించిన నారాయణ విద్యాసంస్థ యాజమాన్యంతో ఎస్ఎఫ్ఐ నాయకులు డీఈఓ ద్వారా ఫోన్లో మాట్లాడించిన, మేము స్కూలు నడపాల్సిందే,మాకు ర్యాంకులే ముఖ్యం అంటు కొంతమంది తల్లిదండ్రులను ఎస్ఎఫ్ఐ నాయకులతో మరియు ఫోన్ లో విద్యాశాఖ అధికారులతో గొడవలకు ప్రేరేపించి నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తూ స్కూల్ నడపడంపై చర్యలు తీసుకోవాలన్నారు.విద్యాసంస్థ నడపటానికి ముందస్తు అనుమతులు తీసుకోకుండా గాలి,వెలుతురు, మంచినీళ్లు, టాయిలెట్స్ లాంటి భద్రతా సౌకర్యాలు లేకుండా స్కూలుకి కిలో మీటర్ దూరంలో గురువు రోడ్డులో ఉన్న ప్రిన్సిపల్ ఇంటిలో మరియు మరో రెండు చోట్ల స్కూల్ సిబ్బంది ఇళ్ళ వద్ద క్లాసులు నిర్వహించారు, నిబంధనలకు విరుద్దగా స్కూల్ ప్రారంభంలో కూడా పుస్తకాలు, యూనిఫామ్ బహిరంగంగా అమ్ముకుని విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేశారు,నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఎంఈఓ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నాగార్జున, ప్రశాంత్,వెంకటేశ్వరరావు,శ్రీకాంత్ బెన్నీ తదితరులు పాల్గొన్నారు...2
- కుక్కల బెడద.. ప్రయాణికులకు ఇబ్బందులు.................... నడిగూడెం మండలంలోని గ్రామాల్లోనే కాకుండా గ్రామ శివారులోనూ వీధి కుక్కల బెడద పెరిగింది. గుంపులుగా సంచరిస్తూ మాటు వేసి నడిగూడెం మండల కేంద్రానికి వచ్చే ప్రయాణికులను వెంటాడుతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.1
- ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు వద్ద ఆకేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు వద్ద ఆకేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో ఇప్పటివరకు ఆకేరులో వరద రాలేదు. కాగా ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఆకేరు జలకళను సంతరించుకుంది. దీంతో ఎగువ నుంచి వరద ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద ప్రవాహం వస్తుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు మండలంలోని మున్నేరు సైతం భారీగా ప్రవహిస్తుంది.1
- 69 మంది లబ్ధిదారులకు 72.89 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన మంత్రి సత్యప్రసాద్. రాష్ట్రంలో పేద మధ్య తరగతి ప్రజలు వైద్య ఖర్చు నిమిత్తం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం సకాలంలో CMRF చెక్కులను పంపిణీ చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. టిడిపి కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్న 69 మంది లబ్ధిదారులకు 72,89,587 రూపాయల CMRF చెక్కులను పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వం లోని కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా అడుగులు వేస్తుందన్నారు.1