*Women & Child విభాగానికి ఏడాది పూర్తి.. హై-రిస్క్ ప్రెగ్నెన్సీ, ప్రీమేచ్యూర్ బేబీకి విజయవంతమైన చికిత్స* మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడలో Women & Child విభాగం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విభాగం ద్వారా అందిస్తున్న గైనకాలజీ, ప్రసూతి మరియు శిశు వైద్య సేవలు, హై-రిస్క్ ప్రెగ్నెన్సీలకు అందిస్తున్న ప్రత్యేక వైద్య పర్యవేక్షణ, ప్రీమేచ్యూర్ బేబీలకు అందిస్తున్న NICU సేవల గురించి వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా ఇటీవల 7.5 నెలల గర్భధారణలో ఉన్న ఒక గర్భిణి హై-రిస్క్ పరిస్థితుల్లో మెడికవర్ హాస్పిటల్స్‌కు రావడం జరిగింది. గర్భిణి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ గైనకాలజిస్ట్ డా. లక్ష్మీ ప్రవీణ బి గారి ఆధ్వర్యంలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, గర్భిణిని నిరంతరం పర్యవేక్షించారు. తల్లి మరియు శిశువు ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, సరైన సమయంలో ప్రసవానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. వైద్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విజయవంతంగా డెలివరీ నిర్వహించగా, ప్రీమేచ్యూర్ బేబీ జన్మించింది. పుట్టిన అనంతరం శిశువు పరిస్థితి క్రిటికల్‌గా ఉండటంతో వెంటనే NICUలో చేర్చి ప్రత్యేక చికిత్స అందించారు.ప్రముఖ పీడియాట్రిషియన్ డా. వి. సుబ్బారావు గారి ఆధ్వర్యంలో శిశువుకు ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ అందించారు. శిశువు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన వెంటిలేటర్ సపోర్ట్, ICD ట్యూబ్ మరియు ఇతర అత్యవసర వైద్య విధానాల సహాయంతో చికిత్స అందించారు.ప్రీమేచ్యూర్ బేబీ కావడంతో శిశువు శ్వాస, ఆక్సిజన్ స్థాయిలు, హృదయ స్పందన మరియు ఇతర ముఖ్యమైన ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ దశలవారీగా చికిత్స అందించారు. వైద్య బృందం సమన్వయంతో అందించిన నిరంతర చికిత్స మరియు ప్రత్యేక సంరక్షణకు శిశువు క్రమంగా స్పందించింది.చికిత్స అనంతరం తల్లి మరియు శిశువు ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపించడంతో 15 రోజుల తర్వాత ఇద్దరినీ ఆరోగ్యకరమైన స్థితిలో డిశ్చార్జ్ చేయడం జరిగింది. డా. లక్ష్మీ ప్రవీణ బి, ప్రముఖ గైనకాలజిస్ట్ మాట్లాడుతూ, హై-రిస్క్ ప్రెగ్నెన్సీలో ప్రతి గర్భిణి పరిస్థితి ఒకే విధంగా ఉండదు. ముఖ్యంగా ప్రీటర్మ్ డెలివరీకి అవకాశం ఉన్న సందర్భాల్లో తల్లి మరియు శిశువు ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడం చాలా ముఖ్యం. ఈ కేసులో గర్భిణి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి, అవసరమైన పరీక్షలు నిర్వహిస్తూ సరైన సమయంలో డెలివరీ చేయాలని నిర్ణయించాం. ప్రీటర్మ్ బేబీ జన్మించిన తర్వాత వెంటనే NICU సపోర్ట్ అవసరమైంది. గైనకాలజీ, పీడియాట్రిక్ మరియు NICU బృందాల సమన్వయంతో తల్లికి, శిశువుకు అవసరమైన చికిత్స అందించగలిగాం. ప్రస్తుతం తల్లి మరియు బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటం సంతోషంగా ఉంది.” డా. వి. సుబ్బారావు, ప్రముఖ పీడియాట్రిషియన్ మాట్లాడుతూ, “ప్రీమేచ్యూర్ బేబీలలో పుట్టిన వెంటనే శ్వాస సంబంధిత సమస్యలు, ఆక్సిజన్ స్థాయిలలో మార్పులు మరియు ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బిడ్డ పుట్టిన వెంటనే పరిస్థితి క్రిటికల్‌గా ఉండటంతో NICUలో ప్రత్యేక పర్యవేక్షణ ప్రారంభించాం.అవసరాన్ని బట్టి వెంటిలేటర్ సపోర్ట్, ICD ట్యూబ్ వంటి వైద్య విధానాలతో పాటు నిరంతర మానిటరింగ్ అందించాం. ప్రీమేచ్యూర్ బేబీకి చికిత్స అనేది ఒకరోజులో పూర్తయ్యేది కాదు. బిడ్డ పరిస్థితిని బట్టి దశలవారీగా చికిత్స అందిస్తూ, ప్రతి దశలో స్పందనను అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ బిడ్డ కూడా చికిత్సకు క్రమంగా స్పందించి, 15 రోజుల తర్వాత ఆరోగ్యకరమైన స్థితిలో డిశ్చార్జ్ కావడం ఆనందంగా ఉంది.” డా. కస్తూరిబాయి వెలగ, ప్రముఖ గైనకాలజిస్ట్ మాట్లాడుతూ, “Women & Child విభాగం ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం మా ఆసుపత్రికి ఎంతో ప్రత్యేకమైన సందర్భం. మహిళలకు గర్భధారణకు ముందు నుంచి ప్రసవం వరకు, అలాగే ప్రసవం అనంతరం కూడా అవసరమైన వైద్య సేవలు ఒకే చోట అందించడం మా ప్రధాన లక్ష్యం అని తెలిపారు. డా. సుజన నిమ్మకాయల, ప్రముఖ గైనకాలజిస్ట్ మాట్లాడుతూ, గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యంతో పాటు గర్భంలోని శిశువు ఎదుగుదల, ఆరోగ్య పరిస్థితిని కూడా నిరంతరం పర్యవేక్షించడం చాలా ముఖ్యం. హై-రిస్క్ ప్రెగ్నెన్సీల్లో ప్రత్యేక శ్రద్ధ, రెగ్యులర్ చెకప్స్ మరియు అవసరమైన సమయంలో సరైన వైద్య నిర్ణయం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో కీలకం. ఈ విభాగం ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం మా మొత్తం వైద్య బృందానికి ఎంతో గర్వకారణం అని అన్నారు. డా. శ్రావణి సాక్షి, ప్రముఖ గైనకాలజిస్టు మాట్లాడుతూ, “గర్భధారణ సమయంలో ప్రతి మహిళకు ప్రత్యేకమైన వైద్య పర్యవేక్షణ అవసరం. ముఖ్యంగా హై-రిస్క్ ప్రెగ్నెన్సీల్లో తల్లి ఆరోగ్యంతో పాటు గర్భంలోని శిశువు ఎదుగుదల, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడం చాలా ముఖ్యం. రెగ్యులర్ చెకప్స్, అవసరమైన వైద్య పరీక్షలు మరియు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అనేక సమస్యలను ముందుగానే గుర్తించి తల్లి, బిడ్డకు మెరుగైన వైద్య సంరక్షణ అందించవచ్చు. డా. రవి అంగర, ప్రముఖ పీడియాట్రిషియన్ మాట్లాడుతూ, “శిశువుల ఆరోగ్యంలో ముఖ్యంగా పుట్టిన వెంటనే అందించే వైద్య సంరక్షణ చాలా కీలకం. ప్రీమేచ్యూర్ మరియు హై-రిస్క్ బేబీలకు NICUలో నిరంతర పర్యవేక్షణ, అవసరమైన సమయంలో వెంటనే వైద్య సహాయం, శిశువు ఎదుగుదల మరియు ఆరోగ్య పరిస్థితిని దశలవారీగా అంచనా వేయడం ఎంతో ముఖ్యం. Women & Child విభాగంలో గైనకాలజీ, పీడియాట్రిక్స్ మరియు NICU బృందాల సమన్వయంతో చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ఈ విభాగం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరింత మంది తల్లులు, చిన్నారులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు మా బృందం మరింత బాధ్యతతో పనిచేస్తుంది” అని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్, కాకినాడ సెంటర్ హెడ్ నందికోళ్ల ఆంజనేయస్వామి ( అంజిబాబు) గారు మాట్లాడుతూ “మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడలో Women & Child విభాగం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ ఒక సంవత్సర కాలంలో మహిళలు మరియు చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మా వైద్య బృందం నిరంతరం పనిచేస్తుంది అని,ముఖ్యంగా హై-రిస్క్ ప్రెగ్నెన్సీలు, ప్రీటర్మ్ డెలివరీలు మరియు నవజాత శిశువులకు అవసరమైన ప్రత్యేక వైద్య సంరక్షణను ఒకే చోట అందించే విధంగా మా సేవలను అభివృద్ధి చేసుకున్నాం. గైనకాలజీ, పీడియాట్రిక్స్ మరియు NICU విభాగాల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మరియు ఇతర సహాయక బృందాల సమన్వయంతో ప్రతి తల్లి, ప్రతి శిశువుకు అవసరమైన సమయంలో సరైన వైద్య సేవలు అందించడమే మా ప్రధాన ఉద్దేశ్యం మరియు Women & Child విభాగం మరింత అభివృద్ధి చెందుతూ, కాకినాడ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన మహిళా మరియు శిశు వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి మెడికవర్ హాస్పిటల్స్ నిరంతరం కృషి చేస్తుంది అని తెలిపారు.
*Women & Child విభాగానికి ఏడాది పూర్తి.. హై-రిస్క్ ప్రెగ్నెన్సీ, ప్రీమేచ్యూర్ బేబీకి విజయవంతమైన చికిత్స* మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడలో Women & Child విభాగం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విభాగం ద్వారా అందిస్తున్న గైనకాలజీ, ప్రసూతి మరియు శిశు వైద్య సేవలు, హై-రిస్క్ ప్రెగ్నెన్సీలకు అందిస్తున్న ప్రత్యేక వైద్య పర్యవేక్షణ, ప్రీమేచ్యూర్ బేబీలకు అందిస్తున్న NICU సేవల గురించి వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా ఇటీవల 7.5 నెలల గర్భధారణలో ఉన్న ఒక గర్భిణి హై-రిస్క్ పరిస్థితుల్లో మెడికవర్ హాస్పిటల్స్‌కు రావడం జరిగింది. గర్భిణి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ గైనకాలజిస్ట్ డా. లక్ష్మీ ప్రవీణ బి గారి ఆధ్వర్యంలో అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, గర్భిణిని నిరంతరం పర్యవేక్షించారు. తల్లి మరియు శిశువు ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, సరైన సమయంలో ప్రసవానికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నారు. వైద్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విజయవంతంగా డెలివరీ నిర్వహించగా, ప్రీమేచ్యూర్ బేబీ జన్మించింది. పుట్టిన అనంతరం శిశువు పరిస్థితి క్రిటికల్‌గా ఉండటంతో వెంటనే NICUలో చేర్చి ప్రత్యేక చికిత్స అందించారు.ప్రముఖ పీడియాట్రిషియన్ డా. వి. సుబ్బారావు గారి ఆధ్వర్యంలో శిశువుకు ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ అందించారు. శిశువు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన వెంటిలేటర్ సపోర్ట్, ICD ట్యూబ్ మరియు ఇతర అత్యవసర వైద్య విధానాల సహాయంతో చికిత్స అందించారు.ప్రీమేచ్యూర్ బేబీ కావడంతో శిశువు శ్వాస, ఆక్సిజన్ స్థాయిలు, హృదయ స్పందన మరియు ఇతర ముఖ్యమైన ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ దశలవారీగా చికిత్స అందించారు. వైద్య బృందం సమన్వయంతో అందించిన నిరంతర చికిత్స మరియు ప్రత్యేక సంరక్షణకు శిశువు క్రమంగా స్పందించింది.చికిత్స అనంతరం తల్లి మరియు శిశువు ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపించడంతో 15 రోజుల తర్వాత ఇద్దరినీ ఆరోగ్యకరమైన స్థితిలో డిశ్చార్జ్ చేయడం జరిగింది. డా. లక్ష్మీ ప్రవీణ బి, ప్రముఖ గైనకాలజిస్ట్ మాట్లాడుతూ, హై-రిస్క్ ప్రెగ్నెన్సీలో ప్రతి గర్భిణి పరిస్థితి ఒకే విధంగా ఉండదు. ముఖ్యంగా ప్రీటర్మ్ డెలివరీకి అవకాశం ఉన్న సందర్భాల్లో తల్లి మరియు శిశువు ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించడం చాలా ముఖ్యం. ఈ కేసులో గర్భిణి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి, అవసరమైన పరీక్షలు నిర్వహిస్తూ సరైన సమయంలో డెలివరీ చేయాలని నిర్ణయించాం. ప్రీటర్మ్ బేబీ జన్మించిన తర్వాత వెంటనే NICU సపోర్ట్ అవసరమైంది. గైనకాలజీ, పీడియాట్రిక్ మరియు NICU బృందాల సమన్వయంతో తల్లికి, శిశువుకు అవసరమైన చికిత్స అందించగలిగాం. ప్రస్తుతం తల్లి మరియు బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండటం సంతోషంగా ఉంది.” డా. వి. సుబ్బారావు, ప్రముఖ పీడియాట్రిషియన్ మాట్లాడుతూ, “ప్రీమేచ్యూర్ బేబీలలో పుట్టిన వెంటనే శ్వాస సంబంధిత సమస్యలు, ఆక్సిజన్ స్థాయిలలో మార్పులు మరియు ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బిడ్డ పుట్టిన వెంటనే పరిస్థితి క్రిటికల్‌గా ఉండటంతో NICUలో ప్రత్యేక పర్యవేక్షణ ప్రారంభించాం.అవసరాన్ని బట్టి వెంటిలేటర్ సపోర్ట్, ICD ట్యూబ్ వంటి వైద్య విధానాలతో పాటు నిరంతర మానిటరింగ్ అందించాం. ప్రీమేచ్యూర్ బేబీకి చికిత్స అనేది ఒకరోజులో పూర్తయ్యేది కాదు. బిడ్డ పరిస్థితిని బట్టి దశలవారీగా చికిత్స అందిస్తూ, ప్రతి దశలో స్పందనను అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ బిడ్డ కూడా చికిత్సకు క్రమంగా స్పందించి, 15 రోజుల తర్వాత ఆరోగ్యకరమైన స్థితిలో డిశ్చార్జ్
కావడం ఆనందంగా ఉంది.” డా. కస్తూరిబాయి వెలగ, ప్రముఖ గైనకాలజిస్ట్ మాట్లాడుతూ, “Women & Child విభాగం ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం మా ఆసుపత్రికి ఎంతో ప్రత్యేకమైన సందర్భం. మహిళలకు గర్భధారణకు ముందు నుంచి ప్రసవం వరకు, అలాగే ప్రసవం అనంతరం కూడా అవసరమైన వైద్య సేవలు ఒకే చోట అందించడం మా ప్రధాన లక్ష్యం అని తెలిపారు. డా. సుజన నిమ్మకాయల, ప్రముఖ గైనకాలజిస్ట్ మాట్లాడుతూ, గర్భధారణ సమయంలో తల్లి ఆరోగ్యంతో పాటు గర్భంలోని శిశువు ఎదుగుదల, ఆరోగ్య పరిస్థితిని కూడా నిరంతరం పర్యవేక్షించడం చాలా ముఖ్యం. హై-రిస్క్ ప్రెగ్నెన్సీల్లో ప్రత్యేక శ్రద్ధ, రెగ్యులర్ చెకప్స్ మరియు అవసరమైన సమయంలో సరైన వైద్య నిర్ణయం తల్లి, బిడ్డ ఆరోగ్యానికి ఎంతో కీలకం. ఈ విభాగం ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం మా మొత్తం వైద్య బృందానికి ఎంతో గర్వకారణం అని అన్నారు. డా. శ్రావణి సాక్షి, ప్రముఖ గైనకాలజిస్టు మాట్లాడుతూ, “గర్భధారణ సమయంలో ప్రతి మహిళకు ప్రత్యేకమైన వైద్య పర్యవేక్షణ అవసరం. ముఖ్యంగా హై-రిస్క్ ప్రెగ్నెన్సీల్లో తల్లి ఆరోగ్యంతో పాటు గర్భంలోని శిశువు ఎదుగుదల, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడం చాలా ముఖ్యం. రెగ్యులర్ చెకప్స్, అవసరమైన వైద్య పరీక్షలు మరియు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అనేక సమస్యలను ముందుగానే గుర్తించి తల్లి, బిడ్డకు మెరుగైన వైద్య సంరక్షణ అందించవచ్చు. డా. రవి అంగర, ప్రముఖ పీడియాట్రిషియన్ మాట్లాడుతూ, “శిశువుల ఆరోగ్యంలో ముఖ్యంగా పుట్టిన వెంటనే అందించే వైద్య సంరక్షణ చాలా కీలకం. ప్రీమేచ్యూర్ మరియు హై-రిస్క్ బేబీలకు NICUలో నిరంతర పర్యవేక్షణ, అవసరమైన సమయంలో వెంటనే వైద్య సహాయం, శిశువు ఎదుగుదల మరియు ఆరోగ్య పరిస్థితిని దశలవారీగా అంచనా వేయడం ఎంతో ముఖ్యం. Women & Child విభాగంలో గైనకాలజీ, పీడియాట్రిక్స్ మరియు NICU బృందాల సమన్వయంతో చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం. ఈ విభాగం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరింత మంది తల్లులు, చిన్నారులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు మా బృందం మరింత బాధ్యతతో పనిచేస్తుంది” అని తెలిపారు. మెడికవర్ హాస్పిటల్స్, కాకినాడ సెంటర్ హెడ్ నందికోళ్ల ఆంజనేయస్వామి ( అంజిబాబు) గారు మాట్లాడుతూ “మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడలో Women & Child విభాగం విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ ఒక సంవత్సర కాలంలో మహిళలు మరియు చిన్నారులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మా వైద్య బృందం నిరంతరం పనిచేస్తుంది అని,ముఖ్యంగా హై-రిస్క్ ప్రెగ్నెన్సీలు, ప్రీటర్మ్ డెలివరీలు మరియు నవజాత శిశువులకు అవసరమైన ప్రత్యేక వైద్య సంరక్షణను ఒకే చోట అందించే విధంగా మా సేవలను అభివృద్ధి చేసుకున్నాం. గైనకాలజీ, పీడియాట్రిక్స్ మరియు NICU విభాగాల వైద్యులు, నర్సింగ్ సిబ్బంది మరియు ఇతర సహాయక బృందాల సమన్వయంతో ప్రతి తల్లి, ప్రతి శిశువుకు అవసరమైన సమయంలో సరైన వైద్య సేవలు అందించడమే మా ప్రధాన ఉద్దేశ్యం మరియు Women & Child విభాగం మరింత అభివృద్ధి చెందుతూ, కాకినాడ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన మహిళా మరియు శిశు వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి మెడికవర్ హాస్పిటల్స్ నిరంతరం కృషి చేస్తుంది అని తెలిపారు.
- *ఆలయ పునః నిర్మాణానికి భూరి విరాళాలు* * స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న దాతలు * వేగవంతంగా నిర్మాణ పనులు మురమళ్ల: నిత్య కళ్యాణం పచ్చతోరణం గా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయ పునః నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గురువారం విరాళం అందించిన దాత హైద్రాబాద్ వాస్తవ్యులు శ్రీ ఏ ఆశిష్ 1 లక్ష ముమ్మిడివరం వాస్తవ్యులు శ్రీ తాడి వెంకట రెడ్డి రూ 1 లక్ష 116 విరాళం ఆలయ చైర్మన్ కు అందజేశారు. ఈసందర్భం గా దాతను ప్రత్యేక దర్శనం అందించారు. ఆలయ మర్యాదలతో శేష వస్త్రం, చిత్ర పటం, ప్రసాదం అందించి సత్కరించి వేద ఆశీర్వచనం చేశారు. శ్రీ స్వామి వారి ఆలయ పునః నిర్మాణం స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు వారి పర్యవేక్షణలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాణానికి విరాళాలు అందించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. గర్భాలయ, అంతరాలయ, నంది మండపం సంబంధించి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రూ లక్ష లేదా ఆపై విరాళం అందించే దాత పేరు శిలాఫలకం పై వేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమీషనర్ వి. సత్యనారాయణ అభినందించారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి కఠారి శ్రీనివాస రాజు తదితరులు ఉన్నారు.3
- రామవరంలో ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి కు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్ అనపర్తి మండలం రామవరంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గురువారం బ్రహ్మకుమారీలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని కుతుకులూరు బ్రహ్మకుమారీస్ ఆశ్రమానికి చెందిన ప్రతినిధులు ఎమ్మెల్యేకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సమాజంలో ఆధ్యాత్మికత, సోదరభావం పెంపొందించేందుకు బ్రహ్మకుమారీలు చేస్తున్న సేవలను అభినందించారు.1
- కన్నుల పండువగ శ్రీ పరదేశమ్మ తల్లి తీర్థం, అమ్మవారి నామస్మరణతో మారు మోగుతున్న గ్రామం. కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో గురువారం నాడు గ్రామ దేవత శ్రీ పరదేశమ్మ తల్లి అమ్మవారి తీర్థం కన్నుల పండువగ జరిగింది. పురోహితులు ఆధ్వర్యంలో వేకువ జామున అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించి భక్తులకు దర్శనాలు కల్పించారు. భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు తీర్చుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నిర్వహించే ఈ పండుగ కోసం గ్రామ ప్రజలే కాకుండా, పరిసర ప్రాంతాల్లో ప్రజలు, ఇతర జిల్లాల్లో ప్రజలు, కూడా అమ్మవారిని దర్శించుకున్నటుకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని నిర్వాహకులు తెలియజేశారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలియజేశారు.ఆలయంలో గాజులు వితరణ, మజ్జిగ, మంచినీళ్లు పంపిణీ కార్యక్రమాలు గ్రామ యువత ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.3
- హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి జిల్లా అధికారులకు దళిత సంఘాల జేఏసీ పిర్యాదు *హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* - జిల్లా అధికారులకు దళిత సంఘాల జేఏసీ పిర్యాదు* రాజోలు, ఆగస్ట్ 27 : భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా కలక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు, జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకు రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ సభ్యులు లిఖితపూర్వకంగా పిర్యాదు చేసారు. ఈ మేరకు గురువారం జిల్లా కలక్టర్ను, జిల్లా ఎస్పీని కలసిన రాజోలు నియోజకవర్గ దళిత సంఘాల జేఏసీ నాయకులు హమారా ప్రసాద్ సోషల్ మీడియాలో అంబేడ్కర్ పై చేస్తున్న అసత్య ప్రచారాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని లిఖితపూర్వకంగా కోరినట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ బయట హమారా ప్రసాద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల జేఏసీ నాయకులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాలమహానడు అద్యక్షులు బొంతు మణిరాజు, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవ అద్యక్షులు దేవ రాజేంద్రప్రసాద్, దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ, విసికే పార్టీ రాష్ట్ర నాయకులు బొంతు వెంకట రమణ, దళిత చైతన్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకపాటి శ్రీధర్, ఎస్సీ సంక్షేమ సంఘ రాజోలు మండల అద్యక్షులు మట్టా సురేష్ కుమార్, మాలల న్యాయపోరాట సమితి జేఏసీ మామిడికుదురు మండల అద్యక్షులు మట్టా సత్తిబాబు, దళిత చైతన్య వేదిక రాజోలు మండల అద్యక్షులు మందపాటి మధు, డిహెచ్పీఎస్ జిల్లా కార్యనిర్వక సభ్యులు పుల్లెళ్ళ ఆనంద్, న్యాయవాది వడ్డీ నాగేశ్వరరావు, ఎమ్మార్పీఎస్ నాయకులు మార్లపూడి దొరబాబు, బొంతు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.1
- *మారికవలస గురుకులాన్ని తీసేయమని సాక్షాత్తు గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి గారే ఆదేశించారంట??* *పాడేరు ఐటిడిఏ ఆదిత్య శర్మ గారు అమలు చేశారట...!* ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉంటుందా..? ⁉️ *సాక్షాత్తు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తే....గిరిజన పిల్లలు చదువుకుంటున్న స్కూల్ ని తీసేయండి" అని చెబితే,ఇక ఈ కూటమి ప్రభుత్వానికి గిరిజనుల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతోంది..?*🤦🏻♂️ *యోగా గిన్నిస్ రికార్డులకు గిరిజన బిడ్డలు కావాలి..!* *భోగాపురం ఎయిర్‌పోర్ట్ రెడ్ కార్పెట్ కోసం గిరిజన బిడ్డలు కావాలి..!* *కానీ అదే గిరిజన బిడ్డలు చదువుకునే స్కూల్ ని మాత్రం తీసేయమని గిరిజన మంత్రే చెబుతారా...?* *ఇది #గిరిజనశాఖ కాదు.. #గిరిజనవంచన శాఖ..!* *480 మంది పేద గిరిజన బిడ్డలను అర్ధరాత్రి రోడ్డు మీద నిలబెట్టిన ఘనత ఈ మంత్రి గారిదేనా...?* గిరిజన బిడ్డల కన్నీళ్లకు కారణమైన మంత్రి వెంటనే సమాధానం చెప్పాలి..! #ITDA_Paderu #Araku #Marikavalasa1
- *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II *అమ్మ గీతం అదిశాక్తివి ని సత్తెమ్మ తల్లి అమ్మావారు I గాజువాక II విశాఖపట్నం II1
- కృష్ణాజిల్లా: మచిలీపట్నం *మద్యం నియంత్రణ ఇదేనా..? బెల్ట్ షాపులకు విచ్చలవిడిగా అనుమతులా?* * కల్లుగీత కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు ఫైర్.... మద్యం దశలవారీగా అరికడతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు బెల్ట్ షాపులకు అనుమతులు ఇచ్చి మద్యం విక్రయాలను మరింత పెంచుతోందని ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాకా రామచంద్రరావు తీవ్రస్థాయిలో ఆరోపించారు.కృష్ణాజిల్లా మచిలీపట్నంలో గురువారం ఆంధ్రప్రదేశ్ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వాకా రామచంద్రరావు మాట్లాడుతూ కల్లుగీత వృత్తి రాష్ట్రంలో రోజురోజుకూ కనుమరుగవుతోందని, దీనికి ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఎన్నికల ముందు మద్యం దశలవారీగా నియంత్రిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు బెల్ట్ షాపులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయాయని, అనధికారికంగా పెద్దఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. కల్లుగీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కల్లుగీత కార్మికుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని వాకా రామచంద్రరావు హెచ్చరించారు. కల్లుగీత వృత్తిని పరిరక్షించడంతో పాటు కార్మికుల జీవనోపాధికి భరోసా కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- కొత్త సూరవరంలో ఘనంగా ప్రారంభమైన పరదేశమ్మ తల్లి జాతర మహోత్సవా లు కాకినాడ జిల్లా తుని మండలం కొత్త సురవరం గ్రామంలో 41 జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జాతర మహోత్సవంలో భాగంగా 11 రోజులు దీక్ష అనంతరం మాల ధారణ ధరించిన భక్తులు ఇరుముడులు కట్టుకొని ఎస్. అన్నవరం గ్రామమంతా గిరి ప్రదక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు యువత, పెద్దలు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.అనంతరం అమ్మవారి ఆలయం వద్ద గురు స్వామి చోడిశెట్టి కన్నా ప్రకాష్ ఆధ్వర్యంలో మాల విసర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడుతూ బుధవారం నాడు రాత్రి అమ్మవారి జాతర కార్యక్రమం ఘనంగా జరుగుతుందని తెలిపారు.1