logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎన్.టి.ఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి. బద్వేలు:బద్వేలు నియోజకవర్గం, పోరుమామిళ్ళ మండలం, పోరుమామిళ్ళ పంచాయతీ 5వ వార్డు ఉద్దికట్టలో నిర్వహించిన ఎన్.టి.ఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో డిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరి సూర్యనారాయణ రెడ్డి సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి జరుగుతోందని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దకే సేవలు అందించడం కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఓబుళాపురం రాజశేఖర్, యువనాయకులు చెరుకూరి రవికుమార్, పోరుమామిళ్ళ మండల టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు భైరవ ప్రసాద్,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెరుకూరి చెంద్రాయుడు, మాజీ రంగసముద్రం సర్పంచ్ నడిపి వెంకట సుబ్బయ్యా,చిన్న వెంకటసుబ్బయ్య, చంద్రగిరి ప్రహ్లాద రెడ్డి, కల్లూరు దుగ్గిరెడ్డి, ,రహమతుల్లా మొగల్, అరవ శ్రీనివాసరెడ్డి, బిజి వేముల చంద్ర, మాచుపల్లి కృష్ణారెడ్డి, మధుసూదన్ రెడ్డి, రమేష్ రెడ్డి, రాళ్లపల్లి గిరి, గాజులపల్లి రవి,కోడూరు లక్ష్మీనారాయణ, రామయ్య, నరసయ్య, వెంకటసుబ్బయ్య, ప్రసాదు, గులాం గౌస్, పీరా, కమల్ భాష, చాంద్ బాషా, మొగల్ జిలాని, మొగల్ పెద్ద రసూల్,sp షరీఫ్, సుబ్బారాయుడు యాదవ్,తుపాకుల ప్రసాద్,గురుప్రసాద్ రెడ్డి,నవీన్ కుమార్ రెడ్డి,మహేష్,ఉప్పత్తి సుబ్బారెడ్డి,అన్డుడురు వెంకతసుబ్బారెడ్డి,కోటపాటి పెంచాలయ్యా,దేవినేని వెంకతసుబ్బారెడ్డి, క్రిష్ణ ,షేక్ రఫీ, నాయబ్,రఫీ, అన్నపురెడ్డి వెంకటసుబ్బయ్య, ఆఫీజ్, గాజుల వెంకటసుబ్బయ్య, బాలచంద్ర, పుల్లయ్య, నగిరి రమణయ్య, రాజేష్ , సాయికుమార్ , సుధాకర్, వలి,ధర్మవరపు సుబ్బయ్య, గోవిందాయపల్లి బాలు, చెన్నకేశవ నాయుడు, అనిల్,గోపాల్,సందీప్ పగిడి,కోనేటి కేశవ, ప్రభు, మొగల్ జిలాని,బొజ్జ చిన్నబాబు,చిన్నప్ప, కలవకూరి సురేంద్ర,పెద్దఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

1 hr ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
1 hr ago
f285c9e7-31ab-4fe5-bfe2-b3888ff58e65

ఎన్.టి.ఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి. బద్వేలు:బద్వేలు నియోజకవర్గం, పోరుమామిళ్ళ మండలం, పోరుమామిళ్ళ పంచాయతీ 5వ వార్డు ఉద్దికట్టలో నిర్వహించిన ఎన్.టి.ఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో డిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరి సూర్యనారాయణ రెడ్డి సచివాలయ సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి

1e755238-a86a-4f0a-a1f4-e1fc935b868c

ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి జరుగుతోందని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దకే సేవలు అందించడం కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఓబుళాపురం రాజశేఖర్, యువనాయకులు చెరుకూరి రవికుమార్, పోరుమామిళ్ళ మండల టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు భైరవ ప్రసాద్,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చెరుకూరి చెంద్రాయుడు, మాజీ

b09a9c38-33dd-49a6-b629-f3c76f7a4df8

రంగసముద్రం సర్పంచ్ నడిపి వెంకట సుబ్బయ్యా,చిన్న వెంకటసుబ్బయ్య, చంద్రగిరి ప్రహ్లాద రెడ్డి, కల్లూరు దుగ్గిరెడ్డి, ,రహమతుల్లా మొగల్, అరవ శ్రీనివాసరెడ్డి, బిజి వేముల చంద్ర, మాచుపల్లి కృష్ణారెడ్డి, మధుసూదన్ రెడ్డి, రమేష్ రెడ్డి, రాళ్లపల్లి గిరి, గాజులపల్లి రవి,కోడూరు లక్ష్మీనారాయణ, రామయ్య, నరసయ్య, వెంకటసుబ్బయ్య, ప్రసాదు, గులాం గౌస్, పీరా, కమల్ భాష, చాంద్ బాషా, మొగల్ జిలాని, మొగల్ పెద్ద రసూల్,sp షరీఫ్, సుబ్బారాయుడు యాదవ్,తుపాకుల

90a96fda-2665-4af1-ad71-c50a02941a34

ప్రసాద్,గురుప్రసాద్ రెడ్డి,నవీన్ కుమార్ రెడ్డి,మహేష్,ఉప్పత్తి సుబ్బారెడ్డి,అన్డుడురు వెంకతసుబ్బారెడ్డి,కోటపాటి పెంచాలయ్యా,దేవినేని వెంకతసుబ్బారెడ్డి, క్రిష్ణ ,షేక్ రఫీ, నాయబ్,రఫీ, అన్నపురెడ్డి వెంకటసుబ్బయ్య, ఆఫీజ్, గాజుల వెంకటసుబ్బయ్య, బాలచంద్ర, పుల్లయ్య, నగిరి రమణయ్య, రాజేష్ , సాయికుమార్ , సుధాకర్, వలి,ధర్మవరపు సుబ్బయ్య, గోవిందాయపల్లి బాలు, చెన్నకేశవ నాయుడు, అనిల్,గోపాల్,సందీప్ పగిడి,కోనేటి కేశవ, ప్రభు, మొగల్ జిలాని,బొజ్జ చిన్నబాబు,చిన్నప్ప, కలవకూరి సురేంద్ర,పెద్దఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు:బద్వేలు పట్టణం రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జనసేన నేతలు హల్చల్ చేశారు. కళ్యాణ మండపం పరిధిలోని ఇంటిలోనికి ప్రవేశించి తాళాలు పగలగొట్టి మహిళలపై దౌర్జన్యం చేసి ఇండ్లు ఖాళీ చేయకపోతే జెసిపి తో కూల్చి వేస్తామని భయబ్రాంతులకు జనసేన నేతలు చేసినట్లు స్థానికులు తెలిపారు. దినిపై బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు.
    1
    బద్వేలు:బద్వేలు పట్టణం రాధాకృష్ణ కళ్యాణ మండపంలో జనసేన నేతలు హల్చల్ చేశారు.
కళ్యాణ మండపం పరిధిలోని ఇంటిలోనికి ప్రవేశించి తాళాలు పగలగొట్టి మహిళలపై దౌర్జన్యం చేసి ఇండ్లు ఖాళీ చేయకపోతే జెసిపి తో కూల్చి వేస్తామని భయబ్రాంతులకు జనసేన నేతలు చేసినట్లు స్థానికులు తెలిపారు. దినిపై బద్వేలు అర్బన్ పోలీస్ స్టేషన్లో  బాధితులు ఫిర్యాదు చేశారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • రామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు అనే బాలుడు పుట్టుకతోనే అంతుచిక్కని వ్యాధితో జన్మించడం జరిగింది బాబుకి చెకప్ చేపించగా LAD బిగ్ డిసీస్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. పిల్లాడికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వారు సూచించారు కానీ ఆపరేషన్ కి 30 లక్షల దాకా ఖర్చవుతుంది అని డాక్టర్లు చెప్పారు. కావున దాతలు ముందుకు వచ్చి తమకు తోచినంత సహాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మానవతా వాదంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆ పసిబిడ్డ ప్రాణాలని కాపాడాలని అందరూ భావిస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న స్కానర్ కి గాని కింద ఇవ్వబడిన 7207217664 నెంబర్ కి ఫోన్ పే చేసి పిల్లవాడి ప్రాణం కాపాడిన వారు అవుతారు.
    1
    రామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు అనే బాలుడు పుట్టుకతోనే అంతుచిక్కని వ్యాధితో జన్మించడం జరిగింది బాబుకి చెకప్ చేపించగా LAD బిగ్ డిసీస్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. పిల్లాడికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణాలకే ప్రమాదం అని వారు సూచించారు కానీ ఆపరేషన్ కి 30 లక్షల దాకా ఖర్చవుతుంది అని డాక్టర్లు చెప్పారు. కావున దాతలు ముందుకు వచ్చి తమకు తోచినంత సహాయం చేయాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు మానవతా వాదంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఆ పసిబిడ్డ ప్రాణాలని కాపాడాలని అందరూ భావిస్తున్నారు. వీడియోలో కనిపిస్తున్న స్కానర్ కి గాని కింద ఇవ్వబడిన 
7207217664 నెంబర్ కి ఫోన్ పే చేసి పిల్లవాడి ప్రాణం కాపాడిన వారు అవుతారు.
    user_Veera
    Veera
    జమ్మలమడుగు, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • కోవూరు మండలం లేకుంటపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సామాజిక పింఛన్ల పంపిణీ, వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం, ఆయుష్మాన్ ఆరోగ్యం మందిరం భవన నిర్మాణం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ లేగుంటపాడు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అలాగే ఈ గ్రామంలో అభివృద్ధి చేసే నాయకులు ఉన్నారని అలాగే గ్రామంలో లేకుండా చూస్తున్నారు. శంకుస్థాపన అంటే టెంకాయ కొట్టి వదిలేయడం కాదు శంకుస్థాపన చేసిన అక్కడ నుంచి అది అయ్యింది దాకా చెయ్యాలని దాన్ని వదిలేయటం కాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    4
    కోవూరు మండలం లేకుంటపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సామాజిక పింఛన్ల పంపిణీ, వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం, ఆయుష్మాన్ ఆరోగ్యం మందిరం భవన నిర్మాణం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ లేగుంటపాడు గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అలాగే ఈ గ్రామంలో అభివృద్ధి చేసే నాయకులు ఉన్నారని అలాగే గ్రామంలో లేకుండా చూస్తున్నారు. శంకుస్థాపన అంటే టెంకాయ కొట్టి వదిలేయడం కాదు శంకుస్థాపన చేసిన అక్కడ నుంచి అది అయ్యింది దాకా చెయ్యాలని దాన్ని వదిలేయటం కాదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కదిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సమీపాన పోలీసు శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం అభినందినియమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పోలీస్ శాఖకు అభినందించారు. డీఎస్సీ శివనారాయణ స్వామి, సిఐ నిరంజన్ రెడ్డి, నాగేంద్ర, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
    1
    కదిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సమీపాన పోలీసు శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం అభినందినియమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పోలీస్ శాఖకు అభినందించారు. డీఎస్సీ శివనారాయణ స్వామి, సిఐ నిరంజన్ రెడ్డి, నాగేంద్ర, నారాయణరెడ్డి పాల్గొన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    2 hrs ago
  • తిరుచానూరులో శ్రీరామనవమి వైభవం – ఎస్సీ కాలనీలో సీతారాముల కల్యాణం భక్తి సంద్రం. తిరుపతి ధర్మానికి ప్రతీకగా నిలిచిన శ్రీరాముడు, సత్యనిష్ఠకు మార్గదర్శకుడిగా భావించే సీతారాముల వారి కల్యాణోత్సవం తిరుచానూరు ఎస్సీ కాలనీలో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరగడం ఎంత ఆనందకరమైన విషయం.తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో గల రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా నాగరాజు రెడ్డి ఉభయదారులుగా సీతారాముల వారి కల్యాణోత్సవాన్ని నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీరాముడి ఆదర్శాలు, ఆయన జీవితం మనుషులకి నీతి, న్యాయం, కర్తవ్యబోధ నేర్పించే దివ్య సందేశంగా నిలుస్తున్నాయని భక్తులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు తిరునామలి రూపేష్ బాబు, తిరుచానూరు మాజీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్, ఓబీసీ మండలాధ్యక్షులు భూపాలచారి, లేబాకు ప్రసాద్, పరాసరేశ్వర స్వామి టెంపుల్ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి మరియు కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    1
    తిరుచానూరులో శ్రీరామనవమి వైభవం – ఎస్సీ కాలనీలో సీతారాముల కల్యాణం భక్తి సంద్రం.
తిరుపతి ధర్మానికి ప్రతీకగా నిలిచిన శ్రీరాముడు, సత్యనిష్ఠకు మార్గదర్శకుడిగా భావించే సీతారాముల వారి కల్యాణోత్సవం తిరుచానూరు ఎస్సీ కాలనీలో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరగడం ఎంత ఆనందకరమైన విషయం.తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో గల రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా నాగరాజు రెడ్డి ఉభయదారులుగా సీతారాముల వారి కల్యాణోత్సవాన్ని నిర్వహించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీరాముడి ఆదర్శాలు, ఆయన జీవితం మనుషులకి నీతి, న్యాయం, కర్తవ్యబోధ నేర్పించే దివ్య సందేశంగా నిలుస్తున్నాయని భక్తులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు తిరునామలి రూపేష్ బాబు, తిరుచానూరు మాజీ మండల అధ్యక్షులు విజయ్ కుమార్, ఓబీసీ మండలాధ్యక్షులు భూపాలచారి, లేబాకు ప్రసాద్, పరాసరేశ్వర స్వామి టెంపుల్ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి మరియు కూటమి నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    21 min ago
  • బ్యాంక్‌లో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన కంప్యూటర్లు, డాక్యుమెంట్స్‌ హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగడంతో భవనం మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. మంతల ధాటికి రెండో అంతస్తు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సాయం మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్నిచర్, కంప్యూటర్లు, డాక్యుమెంట్స్‌ అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
    1
    బ్యాంక్‌లో అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన కంప్యూటర్లు, డాక్యుమెంట్స్‌ 
హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంటలు చెలరేగడంతో భవనం మొత్తం దట్టమైన పొగ కమ్ముకుంది. మంతల ధాటికి రెండో అంతస్తు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సాయం మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్నిచర్, కంప్యూటర్లు, డాక్యుమెంట్స్‌ అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో మంగళవారం ప్రమాదం జరిగింది. మదనపల్లి పట్టణం ఎస్టేట్లో గల కరెంట్ ఆఫీస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నట్లు సమాచారం. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు, వైసిపి మదనపల్లి మండల పార్టీ పరిశీలకులు హర్షవర్ధన్ రెడ్డికి చెందిన ఫార్చునర్ వాహనం కూడా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.
    1
    మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో మంగళవారం ప్రమాదం జరిగింది. మదనపల్లి పట్టణం ఎస్టేట్లో గల కరెంట్ ఆఫీస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు కార్లు దెబ్బతిన్నట్లు సమాచారం. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు, వైసిపి మదనపల్లి మండల పార్టీ పరిశీలకులు హర్షవర్ధన్ రెడ్డికి చెందిన ఫార్చునర్ వాహనం కూడా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు.
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • ఒంటిమిట్ట శ్రీకోదండ_రామాలయం. పూర్తి వివరణ: ఏకశిలానగరి.. విశేషాల కోదండ రామయ్య ఆలయం ప్రత్యేకతలకు నిలయం. చారిత్రక , రాచరిక ఘట్టాలకు నిలువెత్తు దర్పణం. ఒకే శిలపై కొలువైన సీతారామలక్ష్మణుల మూలమూర్తుల దివ్య దర్శనం.. ఓ అద్భుతం. ఎత్తయిన గోపురాలు.. విశాలమైన ఆలయ రంగమంటపం.. శిల్పకళా వైభవం.. మహాద్భుతం. రామ , లక్ష్మణ తీర్థాలు జలసిరికి నిదర్శనం. హనుమ లేని రాముడి కోవెల.. పండువెన్నెల్లో సీతారాముల కల్యాణం.. విదేశీయులు మెచ్చిన దేవాలయం. ఇలా చెప్పుకుంటూ పోతే ఒంటిమిట్ట దివ్య క్షేత్రంలో ప్రతీదీ అపురూపమే.. రామతీర్థం.. నేటికీ పదిలం రామయ్య ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించే సమయంలో పశుపక్షాదులు దాహం తీర్చుకునేందుకు నీరెట్టని సీతమ్మ ప్రశ్నించింది. సీతాదేవికి దప్పిక ఉన్నట్లు దాశరథి భావించాడు.. తన చేతిలో ఉన్న విల్లు నుంచి భూమిలోకి బాణం వదిలాడు. పుడమి ఒడి నుంచి బుగ్గ ఉవ్వెత్తున ఎగసిపడింది. జాంబవంతుడి ప్రతిష్ట, ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాతన ప్రాశస్త్యం ఉంది. జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు. ఉత్తర దిశలో కూర్చుని రామతారక మంత్రాన్ని జపిస్తూ తప్పస్సు చేశాడు. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. రామయ్యపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది. రామయ్య నడయాడిన నేల శ్రీరామచంద్రుడు తండ్రిమాట కోసం అరణ్యవాసం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. రామయ్య వెంట ధర్మ పత్ని సీతమ్మ , సోదరుడు లక్ష్మణుడు కదలి వచ్చారు. వనవాస కాలంలో దండకారణ్యంలో ఉన్న ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీ రాముడు పర్యటించాడు. ఆ దివ్య స్వరూపుడు పాద స్పర్శతో ఆధ్యాత్మిక క్షేత్రం పునీతమైంది. మృకుండ మహాముని ఆశ్రయంలో యజ్ఞాలు , యాగాలు జరిగేవి. రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారు. ఆ రాక్షస బాధల నుంచి రామయ్య విముక్తి కల్పించినట్లు పురాణగాథ వాడుకలో ఉంది. హనుమ లేని రాముడి కోవెల హనుమంతుడు ఆగమనానికి మునుపే ఈ ప్రాంతంలో శ్రీ రామచంద్రమూర్తి సంచరించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అందుకే ఇక్కడి కోవెలలో ఆంజనేయస్వామి రామయ్య చెంత కనిపించలేదు.. వెన్నెల్లో కల్యాణం:-శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి..ఒంటిమిట్టలో జరిగే కల్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం.పురాణ వేత్తల ప్రకారం వాల్మీకి రామాయణం బాలకాండ చివర సీతారాముల వివాహ ఘట్టం ఉంది. చైత్ర మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో రాముడితోపాటు లక్ష్మణ , భరత , శత్రఘ్నల వివాహాలు కూడా జరిగాయి. అవన్నీ పగటిపూట జరిగాయి.చరిత్ర ప్రకారం బుక్కరాయులు ఒంటిమిట్టలో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ కల్యాణోత్సవం నిర్వహించాలి.రామాయణంలో శ్రీరామచంద్రుని కళ్యాణం జరిగిన నక్షత్రానికే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రామయ్య కళ్యాణం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఉత్సవాల్లో తొలిసారిగా ఈ కళ్యాణం నిర్వహించేందుకు తలపెట్టిన ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి పూట వచ్చింది. లగ్నశుద్ది చూసుకుని బుక్కరాయలు రాత్రిపూటే తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ఆ సంప్రదాయమే నేటికీ కొనసాగుతుండడం విశేషం.రాత్రి వేళ కల్యాణం జరగడంతో చంద్రునికి ఈ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం లభించింది.. బుక్కరాయలు చంద్రవంశానికి చెందిన వారు. తమ వంశ మూల పురుషుడు చంద్రుడు చూస్తూ ఆనందిస్తుండగా శ్రీ సీతారామ కళ్యాణ నిర్వహణ సంతోషాన్ని పొందేందుకు బుక్కరాయలు రాత్రి కల్యాణాలను ఆ తర్వాత కూడా కొనసాగించారు. ఒంటిమిట్ట ప్రాంతం 1340లో అరణ్యంగా ఉండేది. ఆ ప్రాంతంలో కేవలం మృకుండాశ్రమం మాత్రమే ఉండేది. ఆ ప్రాంత బోయ నాయకులైన ఒంటడు - మిట్టడు అక్కడికి వచ్చిన కంపరాయులుకు అక్కడి రామతీర్థంలోని నీటిని ఇచ్చి దాహం తీర్చి ఉపచారాలు చేశారు. అప్పటికే శిథిలమై ఉన్న గుడిని చూపి అభివృద్ధి చేయాలని వారు రాజును కోరారు. కంపరాయలు అంగీకరించి గుడి నిర్మాణంతోపాటు ఊరికి , ప్రజలకు ఆదరువుగా ఉంటుందని భావించి సమీపంలో చెరువు నిర్మాణం తలపెట్టారు. ఈ నిర్మాణ బాధ్యతలను ఒంటడు , మిట్టడులకు అప్పగించారు.గుడి అర్చకుల సౌకర్యం కోసం గుడిలోని ఇతర పెద్ద , చిన్న ఉద్యోగుల కోసం గ్రామంలోని 72 రకాల సేవలు అందించే ప్రజల కోసం ఆయన చెరువును పంచారు. చెరువు సహకారంతో పొలాల ద్వారా వచ్చే ఫలసాయాన్ని అనుభవిస్తూ ఆలయంలో రామునికి సేవలు అందిస్తూ అభివృద్ధి చేయాలని శాసనం చేశారు.కమనీయం.. ఎదుర్కోలు ఉత్సవం ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవమి వేడుకలు ముగిసిన తరువాత పౌర్ణమి రోజు రాత్రి పండు వెన్నెల్లో జానకి రాముల పరిణయ ఘట్టాని అట్టహాసంగా నిర్వహించడం తరతరాలుగా ఆనవాయతీగా వస్తోంది.పెళ్లికి మునుపు సద్గుణ సంపన్నుడైన కళ్యాణరాముడు , లోకోత్తమ సౌందర్యవతి సీతమ్మను అందంగా ముస్తాబు చేస్తారు. కోదండ రామాలయంలో రెండు చిన్న మండపాలు ఉన్నాయి. వీటిని ఎదుర్కోలు మంటపాలని పిలుస్తారు.కళ్యాణం రోజు ఈ రెండు మంటపాలను సుందరంగా ముస్తాబు చేస్తారు. పడమర వైపున్న మండపంలో రామయ్య , తూర్పున ఉన్న మండపంలో సీతమ్మను కొలువుదీర్చి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహిస్తారు. ఆ తరువాత కళ్యాణ వేదికపై కళ్యాణం నిర్వహిస్తారు. .రామయ్య రథం కథ ఇదీ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన (రాజ)గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాలలో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది.ఈ రథం వెనుక ఆసక్తికరమైన చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. కడప కైఫీయత్తుల్లో కూడా ఈ వివరాలు ఉన్నాయి.1605–1700 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పాలించేవారు. బ్రహ్మోత్సవాలలో ఆయనే కొత్తగా రథం చేయించి రథోత్సవాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయించినట్లు సమాచారం. దీన్ని అత్యంత సుందరంగా ఉండేటట్లు శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా తయారు చేసిన రథ శిల్పులకు ప్రజల్లో ఎంతో గౌరవముండేది. రథోత్సవ సమయంలో ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రథంపై రథ శిల్పులు కూడా ఉండే అవకాశం లభించింది.ఆలయంలో తూర్పు ఎదుర్కోలు మండపం వద్ద గల తూర్పు మహా ప్రాకారంపై ఓ బండపై వివరాలు గల శాసనాన్ని గమనించవచ్చు. కడప కైఫీయత్తులలో శాసనం గురించి ప్రస్తావన కూడా ఉంది.రామ మందిరం.. సాహితీ సౌరభం ఒంటిమిట్ట రామయ్య సేవలో ఎందరో కవులు తరించారు. అయ్యల రాజు తిప్పయ్య సా.శ. 1440లో జగదభిరాముడికి సాహితీ సేవ చేసి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒంటిమిట్ట రఘువీర జానకీనాయక మకుటంతో ఆయన వెలువడించిన శతకం లభ్యమైంది. అయ్యల రాజు రామభద్రుడు ఒంటిమిట్టలో నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. రామాభ్యుదయం కావ్యం ఆయన కలం నుంచి జాలువారింది. బమ్మెర పోతనామాత్యుడు మహాకవి. భోగని దండకం రచించారు. ఆ తరువాత భక్తితో భాగవతం రచన చేసి జగదభిరాముడికి అంకితం చేశారు. ఇంకా పలు గ్రంథాలను రాశారు. వావిలి కొలను సుబ్బారావు(వాసుదాసు) వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. కోదండ రామస్వామిని పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య దర్శించి తన్మయం పొందారు. రాముడిపై అద్భుతమైన కీర్తనలను గానం చేశారు. వర కవి నల్లకాలువ అయ్యప్ప , ఉప్పు గొండూరు వెంకట కవి , మాల ఓబన్న తదితర కవులు రాముడిని ఆరాధించి సాహితీ కృషి చేశారు. రాచరికం.. రాజసం సా.శ. 1356–77 వరకు విజయనగర సామ్రాజ్య పాలకుడు బుక్కరాయల సా.శ. 1600–1648 మధ్య కాలంలో సిద్దవటాన్ని పాలించిన మట్లిరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మట్లి అనంతరాజు పర్యవేక్షణలో ఆలయ అభివృద్ధి విశేష స్థాయిలో జరిగింది. అద్భుత శిల్పకళా చాతుర్యం ఆ నాటి శిల్పుల ప్రావీణ్యానికి అద్దం పడుతోంది. ఆ తర్వాత మట్లి కుమార అనంతరాజు పర్యవేక్షణలో కల్యాణ మండపం , ఎదుర్కోలు మండపాలు , ప్రసాద శాల నిర్మాణానికి చొరవ తీసుకున్నారు.
    2
    ఒంటిమిట్ట శ్రీకోదండ_రామాలయం.
పూర్తి వివరణ:
ఏకశిలానగరి.. విశేషాల  కోదండ రామయ్య ఆలయం ప్రత్యేకతలకు నిలయం. 
చారిత్రక , రాచరిక ఘట్టాలకు నిలువెత్తు దర్పణం. ఒకే శిలపై కొలువైన సీతారామలక్ష్మణుల మూలమూర్తుల దివ్య దర్శనం.. ఓ అద్భుతం. 
ఎత్తయిన గోపురాలు.. విశాలమైన ఆలయ రంగమంటపం.. శిల్పకళా వైభవం.. మహాద్భుతం. రామ , లక్ష్మణ తీర్థాలు జలసిరికి నిదర్శనం.
హనుమ లేని రాముడి కోవెల.. పండువెన్నెల్లో సీతారాముల కల్యాణం.. విదేశీయులు మెచ్చిన దేవాలయం.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒంటిమిట్ట దివ్య క్షేత్రంలో ప్రతీదీ అపురూపమే.. 
రామతీర్థం.. నేటికీ పదిలం
రామయ్య ఒంటిమిట్ట ప్రాంతంలో పర్యటించే సమయంలో పశుపక్షాదులు దాహం తీర్చుకునేందుకు నీరెట్టని సీతమ్మ ప్రశ్నించింది. సీతాదేవికి దప్పిక ఉన్నట్లు దాశరథి భావించాడు..
తన చేతిలో ఉన్న విల్లు నుంచి భూమిలోకి బాణం వదిలాడు. పుడమి ఒడి నుంచి బుగ్గ ఉవ్వెత్తున ఎగసిపడింది.
జాంబవంతుడి ప్రతిష్ట,
ఒంటిమిట్ట కోదండ రామాలయానికి పురాతన ప్రాశస్త్యం ఉంది.
జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించాడు. ఉత్తర దిశలో కూర్చుని రామతారక మంత్రాన్ని జపిస్తూ తప్పస్సు చేశాడు. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడు. రామయ్యపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది.
రామయ్య నడయాడిన నేల
శ్రీరామచంద్రుడు తండ్రిమాట కోసం అరణ్యవాసం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. రామయ్య వెంట ధర్మ పత్ని సీతమ్మ , సోదరుడు లక్ష్మణుడు కదలి వచ్చారు. 
వనవాస కాలంలో దండకారణ్యంలో ఉన్న ఒంటిమిట్ట ప్రాంతంలో శ్రీ రాముడు పర్యటించాడు.
ఆ దివ్య స్వరూపుడు పాద స్పర్శతో ఆధ్యాత్మిక క్షేత్రం పునీతమైంది. మృకుండ మహాముని ఆశ్రయంలో యజ్ఞాలు , యాగాలు జరిగేవి. రాక్షసులు ఆటంకాలు సృష్టించేవారు.
ఆ రాక్షస బాధల నుంచి రామయ్య విముక్తి కల్పించినట్లు పురాణగాథ వాడుకలో ఉంది.
హనుమ లేని రాముడి కోవెల
హనుమంతుడు ఆగమనానికి మునుపే ఈ ప్రాంతంలో శ్రీ రామచంద్రమూర్తి సంచరించినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. అందుకే ఇక్కడి కోవెలలో ఆంజనేయస్వామి రామయ్య చెంత కనిపించలేదు..
వెన్నెల్లో కల్యాణం:-శ్రీరాముని కల్యాణం
పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి..ఒంటిమిట్టలో జరిగే కల్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం.పురాణ వేత్తల ప్రకారం వాల్మీకి రామాయణం బాలకాండ చివర సీతారాముల వివాహ ఘట్టం ఉంది. చైత్ర మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో రాముడితోపాటు లక్ష్మణ , భరత , శత్రఘ్నల వివాహాలు కూడా జరిగాయి. అవన్నీ పగటిపూట జరిగాయి.చరిత్ర ప్రకారం బుక్కరాయులు ఒంటిమిట్టలో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ కల్యాణోత్సవం నిర్వహించాలి.రామాయణంలో శ్రీరామచంద్రుని కళ్యాణం జరిగిన నక్షత్రానికే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రామయ్య కళ్యాణం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఉత్సవాల్లో తొలిసారిగా ఈ కళ్యాణం నిర్వహించేందుకు తలపెట్టిన ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి పూట వచ్చింది. లగ్నశుద్ది చూసుకుని బుక్కరాయలు రాత్రిపూటే తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ఆ సంప్రదాయమే నేటికీ కొనసాగుతుండడం విశేషం.రాత్రి వేళ కల్యాణం జరగడంతో చంద్రునికి ఈ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం లభించింది.. బుక్కరాయలు చంద్రవంశానికి చెందిన వారు. తమ వంశ మూల పురుషుడు చంద్రుడు చూస్తూ ఆనందిస్తుండగా శ్రీ సీతారామ కళ్యాణ నిర్వహణ సంతోషాన్ని పొందేందుకు బుక్కరాయలు రాత్రి కల్యాణాలను ఆ తర్వాత కూడా కొనసాగించారు.
ఒంటిమిట్ట ప్రాంతం  1340లో అరణ్యంగా ఉండేది. ఆ ప్రాంతంలో కేవలం మృకుండాశ్రమం మాత్రమే ఉండేది. ఆ ప్రాంత బోయ నాయకులైన ఒంటడు - మిట్టడు అక్కడికి వచ్చిన కంపరాయులుకు అక్కడి రామతీర్థంలోని నీటిని ఇచ్చి దాహం తీర్చి ఉపచారాలు చేశారు. అప్పటికే శిథిలమై ఉన్న గుడిని చూపి అభివృద్ధి చేయాలని వారు రాజును కోరారు. కంపరాయలు అంగీకరించి గుడి నిర్మాణంతోపాటు ఊరికి , ప్రజలకు ఆదరువుగా ఉంటుందని భావించి సమీపంలో చెరువు నిర్మాణం తలపెట్టారు. ఈ నిర్మాణ బాధ్యతలను ఒంటడు , మిట్టడులకు అప్పగించారు.గుడి అర్చకుల సౌకర్యం కోసం గుడిలోని ఇతర పెద్ద , చిన్న ఉద్యోగుల కోసం గ్రామంలోని 72 రకాల సేవలు అందించే ప్రజల కోసం ఆయన చెరువును పంచారు. చెరువు సహకారంతో పొలాల ద్వారా వచ్చే ఫలసాయాన్ని అనుభవిస్తూ ఆలయంలో రామునికి సేవలు అందిస్తూ అభివృద్ధి చేయాలని శాసనం చేశారు.కమనీయం.. ఎదుర్కోలు ఉత్సవం
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవమి వేడుకలు ముగిసిన తరువాత పౌర్ణమి రోజు రాత్రి పండు వెన్నెల్లో జానకి రాముల పరిణయ ఘట్టాని అట్టహాసంగా నిర్వహించడం తరతరాలుగా ఆనవాయతీగా వస్తోంది.పెళ్లికి మునుపు సద్గుణ సంపన్నుడైన కళ్యాణరాముడు , లోకోత్తమ సౌందర్యవతి సీతమ్మను అందంగా ముస్తాబు చేస్తారు. కోదండ రామాలయంలో రెండు చిన్న మండపాలు ఉన్నాయి. వీటిని ఎదుర్కోలు మంటపాలని పిలుస్తారు.కళ్యాణం రోజు ఈ రెండు మంటపాలను సుందరంగా ముస్తాబు చేస్తారు. పడమర వైపున్న మండపంలో రామయ్య , తూర్పున ఉన్న మండపంలో సీతమ్మను కొలువుదీర్చి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహిస్తారు. ఆ తరువాత కళ్యాణ వేదికపై కళ్యాణం నిర్వహిస్తారు. 
.రామయ్య రథం కథ ఇదీ
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం ముఖ్యంగా ప్రధాన (రాజ)గోపురం ఎంత గంభీరంగా ఉంటుందో ఆలయ వార్షికోత్సవాలలో వినియోగించే రథం కూడా అంతే గంభీరంగా ఉంటుంది.ఈ రథం వెనుక ఆసక్తికరమైన చారిత్రక గాథ ప్రచారంలో ఉంది. కడప కైఫీయత్తుల్లో కూడా ఈ వివరాలు ఉన్నాయి.1605–1700 ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మట్లి అనంతరాజు పాలించేవారు. బ్రహ్మోత్సవాలలో ఆయనే కొత్తగా రథం చేయించి రథోత్సవాన్ని తొలిసారిగా ఏర్పాటు చేయించినట్లు సమాచారం. దీన్ని అత్యంత సుందరంగా ఉండేటట్లు శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా తయారు చేసిన రథ శిల్పులకు ప్రజల్లో ఎంతో గౌరవముండేది.  
రథోత్సవ  సమయంలో ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రథంపై రథ శిల్పులు కూడా ఉండే అవకాశం లభించింది.ఆలయంలో తూర్పు ఎదుర్కోలు మండపం వద్ద గల తూర్పు మహా ప్రాకారంపై ఓ బండపై వివరాలు గల శాసనాన్ని గమనించవచ్చు. కడప కైఫీయత్తులలో శాసనం గురించి ప్రస్తావన కూడా ఉంది.రామ మందిరం.. సాహితీ సౌరభం ఒంటిమిట్ట  రామయ్య సేవలో ఎందరో కవులు తరించారు.  అయ్యల రాజు తిప్పయ్య సా.శ. 1440లో జగదభిరాముడికి సాహితీ సేవ చేసి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఒంటిమిట్ట రఘువీర జానకీనాయక మకుటంతో ఆయన వెలువడించిన శతకం లభ్యమైంది.
అయ్యల రాజు రామభద్రుడు ఒంటిమిట్టలో  నివాసం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. రామాభ్యుదయం కావ్యం ఆయన కలం నుంచి జాలువారింది.
బమ్మెర పోతనామాత్యుడు మహాకవి.   భోగని దండకం రచించారు. ఆ తరువాత భక్తితో భాగవతం రచన చేసి జగదభిరాముడికి అంకితం చేశారు. ఇంకా పలు గ్రంథాలను రాశారు.
వావిలి కొలను సుబ్బారావు(వాసుదాసు)  వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని తెలుగులోకి అనువాదం చేశారు.
కోదండ రామస్వామిని పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమయ్య దర్శించి తన్మయం పొందారు. రాముడిపై అద్భుతమైన కీర్తనలను గానం చేశారు. 
వర కవి నల్లకాలువ అయ్యప్ప ,  ఉప్పు గొండూరు వెంకట కవి , మాల ఓబన్న తదితర కవులు రాముడిని ఆరాధించి సాహితీ కృషి చేశారు.  
రాచరికం.. రాజసం
సా.శ. 1356–77 వరకు విజయనగర సామ్రాజ్య పాలకుడు బుక్కరాయల
సా.శ. 1600–1648 మధ్య కాలంలో సిద్దవటాన్ని పాలించిన మట్లిరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. మట్లి అనంతరాజు పర్యవేక్షణలో ఆలయ అభివృద్ధి విశేష స్థాయిలో జరిగింది. అద్భుత శిల్పకళా చాతుర్యం ఆ నాటి శిల్పుల ప్రావీణ్యానికి అద్దం పడుతోంది. ఆ తర్వాత మట్లి కుమార అనంతరాజు పర్యవేక్షణలో కల్యాణ మండపం , ఎదుర్కోలు మండపాలు , ప్రసాద శాల నిర్మాణానికి చొరవ తీసుకున్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.