logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*మండపేటలో ఘనంగా మదర్ థెరీసా 116వ జయంతి వేడుకలు...* *ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు...* *మానవాళికి మదర్ థెరీసా అందించిన సేవలు అమూల్యం...* మండపేట: మానవసేవే మాధవసేవ అని చాటిచెప్పిన కరుణామయి మదర్ థెరీసా అని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కొనియాడారు. మదర్ థెరీసా 116వ జయంతిని పురస్కరించుకుని మండపేట పట్టణం 8వ వార్డులో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వేగుళ్ళ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో నెలకొల్పిన మదర్ థెరీసా విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ఆపన్నులకు, అనాథలకు, కుష్టు రోగులకు తన జీవితాంతం నిస్వార్థ సేవ చేసిన మహోన్నత వ్యక్తి మదర్ థెరీసా అని కొనియాడారు. మానవాళికి ఆమె చేసిన సేవలను గుర్తించి ప్రపంచంలోనే అత్యున్నతమైన నోబెల్ శాంతి బహుమతి, దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న లభించాయని గుర్తుచేశారు. అలాగే రామన్ మెగసెసే, పద్మశ్రీ వంటి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన విశ్వమాత మదర్ థెరిస్సా చూపిన సేవామార్గంలో నడవడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు, బీజేపీ కోన సత్యనారాయణ, కాశిన కాశీ విశ్వనాధం, పిల్లి గణేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్, గుండు తాతరాజు, పెందుర్తి ప్రదీప్, కొవ్వాడ అప్పన్నబాబు, పిట్టా రాజుబాబు, ముమ్మిడివరపు నారాయణ తదితరులు పాల్గొన్నారు.

4 hrs ago
user_Nandikolla Raghava
Nandikolla Raghava
Salesperson మండపేట, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago
9e59e27d-6b01-4340-993c-358813e2ccad

*మండపేటలో ఘనంగా మదర్ థెరీసా 116వ జయంతి వేడుకలు...* *ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించిన ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు...* *మానవాళికి మదర్ థెరీసా అందించిన సేవలు అమూల్యం...* మండపేట: మానవసేవే మాధవసేవ అని చాటిచెప్పిన కరుణామయి మదర్ థెరీసా అని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కొనియాడారు. మదర్ థెరీసా 116వ జయంతిని పురస్కరించుకుని మండపేట పట్టణం 8వ వార్డులో నిర్వహించిన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వేగుళ్ళ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో నెలకొల్పిన మదర్ థెరీసా విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ఆపన్నులకు, అనాథలకు, కుష్టు రోగులకు తన జీవితాంతం నిస్వార్థ సేవ చేసిన మహోన్నత వ్యక్తి మదర్ థెరీసా అని కొనియాడారు. మానవాళికి ఆమె చేసిన సేవలను గుర్తించి ప్రపంచంలోనే అత్యున్నతమైన నోబెల్ శాంతి బహుమతి, దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న లభించాయని గుర్తుచేశారు. అలాగే రామన్ మెగసెసే, పద్మశ్రీ వంటి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందిన విశ్వమాత మదర్ థెరిస్సా చూపిన సేవామార్గంలో నడవడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. అనంతరం అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు, బీజేపీ కోన సత్యనారాయణ, కాశిన కాశీ విశ్వనాధం, పిల్లి గణేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్, గుండు తాతరాజు, పెందుర్తి ప్రదీప్, కొవ్వాడ అప్పన్నబాబు, పిట్టా రాజుబాబు, ముమ్మిడివరపు నారాయణ తదితరులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు
    1
    బీసీల అభివృద్ధి ప్రదాత బీపీ మండల్ 
పాలకొల్లులో బీపీ మండల్ 108వ జయంతి వేడుకలు
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    3
    ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న నూతన ఏపీ లోకాయుక్త జస్టిస్ టి. మల్లికార్జున రావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన లోకాయుక్త (రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి) जస్టిస్ తాళ్లప్రగడ మల్లికార్జున రావు మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం విచ్చేశారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న లోకాయుక్త జడ్జి  దంపతులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దేవస్థాన అధికారులు మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (డీఈఓ) కిషోర్ కుమార్ స్వయంగా హాజరై, జడ్జి గారి కుటుంబానికి అమ్మవారి అంతరాలయ దర్శన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.లోకాయుక్త జడ్జి మరియు వారి కుటుంబ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనము అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, డెప్యూటీ ఈఓ కిషోర్ కుమార్ అమ్మవారి శేష వస్త్రం, పవిత్ర తీర్థ ప్రసాదాలు మరియు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి యున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • అయితే ఏంటి, నేను లైవ్ లో చూసాను మహిళలు స్వేచ్ఛ గా ఉన్నారు. స్త్రీ శక్తి పదకం ద్వారా... బస్సులో 80 మంది.. 🚍 ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    1
    అయితే ఏంటి, నేను లైవ్ లో చూసాను మహిళలు స్వేచ్ఛ గా ఉన్నారు. స్త్రీ శక్తి పదకం ద్వారా...
బస్సులో 80 మంది.. 🚍
ఇద్దరే పురుషులు.. 
కండక్టర్ వీడియో వైరల్

TG: మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా 116 వ జయంతి వేడుకలు అనకాపల్లి:స్థానిక సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షు లు బల్లా నాగభూషణం ఆధ్వర్యంలో పట్టణం లో గల కన్యకాపరమేశ్వరి దేవాలయం జంక్షన్ లో గల భారతరత్న మదర్ థెరిస్సా విగ్రహం వద్ద మదర్ థెరిస్సా 116 వ జయంతి వేడుకల ను ఘనముగా నిర్వహించా రు. ఈ కార్యక్రమం లో సంస్థ అధ్యక్షులు బల్లా నాగభూష ణము మదర్ థెరిస్సా విగ్ర హానికి జ్యోతి వెలిగించి పూలమాల వేసి ఘనముగా నివాళి లర్పించారు.విద్యా ర్థులకు, పాదచారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా బల్లా నాగభూషణం మాట్లాడు తూ మదర్ థెరిస్సా గారు భారతదేశమునకు చేసిన సేవలు ఎన్నటికీ మరచి పోలేనివని వారు మన దేశము లో నిరుపేదలకు, కుష్ఠు రోగులకు,క్షయ వ్యాధి గ్రస్తులకు, క్షత గాత్రులకు, తన ఫౌండేషన్ ద్వారా అశేషమైన సేవలను అందించిన మహనీయ వ్యక్తియని, అటువంటి మహనీయ సేవామూర్తి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం వారి శత జయంతి ని పురష్కరించు కొని అత్యుత్తమ భారత రత్న పురస్కారాన్ని ఇచ్చి గౌరవించిందని, అలాగే వారి సేవలకు గాను రామన్ మెగ సేసే అవార్డు, ప్రపంచం నోబెల్ బహుమతీ వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్న సేవా మూర్తి యని, ప్రార్ధించే పెదవులక న్నా సాయం చేసే చేతులు మిన్న అన్న ఆశయ స్ఫూర్తి తో తన జీవితమంతా అన్నార్థుల, అభాగ్యుల సేవల కే అంకితం చేశారని అటువంటి గొప్ప మహనీ య వ్యక్తి 116 వ జన్మదినం సందర్భముగా వారికి ఘన నివాళులు అర్పించుకోవడం ఎంతో గర్వముగా సంతోష ముగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దార్థ అసోసియేషన్ కార్యదర్శి వినకోట నీలేష్ గుప్తా, సహాయ కార్యదర్శులు రొబ్బి మల్లేశ్వరరావు, బల్లా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు అయ్యగారి వెంకటరమణ మూర్తి, పొట్టి శ్రీరాములు భవన్ చైర్మన్ పిరాట్ల నరసింహ మూర్తి, జె. ఎం. జె. స్కూల్ స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్దులు, ఉపాధ్యాయులు పాల్గొన్నా రు.
    1
    సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా 116 వ జయంతి వేడుకలు
అనకాపల్లి:స్థానిక సిద్దార్ధ సోషల్ సర్వీస్ &కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షు 
లు బల్లా నాగభూషణం ఆధ్వర్యంలో పట్టణం లో గల కన్యకాపరమేశ్వరి దేవాలయం జంక్షన్ లో గల 
భారతరత్న మదర్ థెరిస్సా 
విగ్రహం వద్ద మదర్ థెరిస్సా 
116 వ జయంతి వేడుకల
ను ఘనముగా నిర్వహించా 
రు. ఈ కార్యక్రమం లో సంస్థ 
అధ్యక్షులు బల్లా నాగభూష
ణము మదర్ థెరిస్సా విగ్ర
హానికి జ్యోతి వెలిగించి పూలమాల వేసి ఘనముగా 
నివాళి లర్పించారు.విద్యా
ర్థులకు, పాదచారులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా బల్లా నాగభూషణం మాట్లాడు
తూ మదర్ థెరిస్సా గారు 
భారతదేశమునకు చేసిన సేవలు ఎన్నటికీ మరచి పోలేనివని వారు మన దేశము లో నిరుపేదలకు, కుష్ఠు రోగులకు,క్షయ వ్యాధి 
గ్రస్తులకు, క్షత గాత్రులకు, తన ఫౌండేషన్ ద్వారా అశేషమైన సేవలను అందించిన మహనీయ వ్యక్తియని, అటువంటి మహనీయ సేవామూర్తి 
చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం వారి శత జయంతి ని పురష్కరించు కొని అత్యుత్తమ భారత
రత్న పురస్కారాన్ని ఇచ్చి 
గౌరవించిందని, అలాగే వారి సేవలకు గాను రామన్ మెగ
సేసే అవార్డు, ప్రపంచం నోబెల్ బహుమతీ వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్న సేవా మూర్తి
యని, ప్రార్ధించే పెదవులక
న్నా సాయం చేసే చేతులు మిన్న అన్న ఆశయ స్ఫూర్తి
తో తన జీవితమంతా అన్నార్థుల, అభాగ్యుల సేవల కే అంకితం చేశారని 
అటువంటి గొప్ప మహనీ
య వ్యక్తి 116 వ జన్మదినం 
సందర్భముగా వారికి ఘన 
నివాళులు అర్పించుకోవడం 
ఎంతో గర్వముగా సంతోష ముగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిద్దార్థ అసోసియేషన్ కార్యదర్శి వినకోట నీలేష్ గుప్తా, సహాయ కార్యదర్శులు 
రొబ్బి మల్లేశ్వరరావు, బల్లా శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యులు అయ్యగారి వెంకటరమణ మూర్తి, పొట్టి 
శ్రీరాములు భవన్ చైర్మన్ 
పిరాట్ల నరసింహ మూర్తి, 
జె. ఎం. జె. స్కూల్ స్కౌట్ అండ్ గైడ్స్ విద్యార్దులు, ఉపాధ్యాయులు పాల్గొన్నా
రు.
    user_Nagireddy Sivaji
    Nagireddy Sivaji
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    52 min ago
  • దేశంలో బీసీలు 50 శాతం ఉన్నారు. బీసీల జనాభాకు అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించండి - కర్నేన గౌరు నాయుడు డిమాండ్
    1
    దేశంలో బీసీలు 50 శాతం ఉన్నారు. బీసీల జనాభాకు అణుగుణంగా రిజర్వేషన్లు కల్పించండి 
- కర్నేన గౌరు నాయుడు డిమాండ్
    user_Gopi krishna Journalist
    Gopi krishna Journalist
    journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్ తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి
    1
    మేడ్చల్‌లో గంజాయి మత్తులో యువకుల వీరంగం
సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలు

పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో గంజాయి బ్యాచ్ వీరంగం
రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్‌ని ఆపి గంజాయి కావాలంటూ రచ్చ చేసిన 10 మంది యువకులు
గంజాయి నా వద్ద లేదనడంతో ఆగ్రహానికి గురై మత్తులో డ్రైవర్ ఆకాష్‌పై బీర్ సీసాలతో విచక్షణారహితంగా దాడి
గంజాయి యువకుల దాడిలో కార్ డ్రైవర్ ఆకాష్ తలతో పాటు చేయి విరిగిన వైనం
దాడి ఘటనలో దెబ్బలు తట్టుకోలేక పక్కనే ఉన్న తన రూమ్‌కి పరిగెత్తిన డ్రైవర్
తరుముకుంటూ వెళ్లి డ్రైవర్ ఇంటి ఆవరణలో కట్టెలతో విచక్షణారహితంగా దాడి
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    22 min ago
  • సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.
    2
    సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
  • Writing హైదరాబాద్‌–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్‌ రాడ్ల కంటైనర్‌ DCMను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.
    1
    Writing
హైదరాబాద్‌–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్‌ రాడ్ల కంటైనర్‌ DCMను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.