logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండో రోజు ఏసీబీ దాడులు -రూ.80 వేలకు పైగా లెక్కల్లో లేని నగదు స్వాధీనం -కడప ఏసీబీ డీఎస్పీ సీతారామారావు మదనపల్లె: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల పేరిట సాగుతున్న అవినీతి దందాపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కొరడా ఝుళిపించారు. ప్రభుత్వ రుసుముల కంటే అదనంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో కడప ఏసీబీ డీఎస్పీ సీతారామారావు నేతృత్వంలో అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాత్రి వరకూ కొనసాగిన విచారణ, మంగళవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఏసీబీ అధికారులు దాడుల్లో భాగంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని పలు కీలక పత్రాలు, దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు కార్యాలయంలో జరిగిన లావాదేవీలు, వసూలు చేసిన ఫీజులను తనిఖీ చేశారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ సీతారామ రావు మీడియాతో మాట్లాడుతూ...... సబ్ రిజిస్ట్రార్ గురుస్వామితో పాటు సిబ్బంది సాధారణ ప్రజల వద్ద నుంచి రిజిస్ట్రేషన్ ఫీజుల కంటే అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కార్యాలయంలో ముమ్మర సోదాలు నిర్వహించామన్నారు. కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తులు, లోపల ఉన్న డాక్యుమెంట్ రైటర్లు, హాజరైన ప్రజలను అదుపులోకి తీసుకొని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. లెక్క తేలని నగదు స్వాధీనం తనిఖీల సమయంలో కార్యాలయంలో లభ్యమైన మొత్తం నగదును అధికారులు స్వాధీనం చేసుకుని రికార్డులతో సరిపోల్చామన్నారు. అందులో రూ. 45,000 మాత్రమే ప్రభుత్వానికి చెల్లించాల్సిన చట్టబద్ధమైన ఫీజుగా తేలిందని, మిగిలిన రూ. 82,000 పైగా ఉన్న మొత్తానికి ఎటువంటి లెక్కాపత్రాలు లేకపోవడంతో, అది ప్రజల నుంచి వసూలు చేసిన లంచపు సొమ్ముగా ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక సోదాల్లో రికార్డుల అవకతవకలు, స్వాధీనం చేసుకున్న నగదు తాలూకు వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపుతున్నట్లు డీఎస్పీ సీతారామారావు వెల్లడించారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి అందే తదుపరి ఉత్తర్వులు, ఆదేశాల మేరకు సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి, సంబంధిత సిబ్బందిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

12 hrs ago
user_శ్రీనాధుడు ఎం
శ్రీనాధుడు ఎం
Local News Reporter మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
12 hrs ago
bf4690ba-5b1d-4042-a77c-0b4c65089d8b

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండో రోజు ఏసీబీ దాడులు -రూ.80 వేలకు పైగా లెక్కల్లో లేని నగదు స్వాధీనం -కడప ఏసీబీ డీఎస్పీ సీతారామారావు మదనపల్లె: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల పేరిట సాగుతున్న అవినీతి దందాపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కొరడా ఝుళిపించారు. ప్రభుత్వ రుసుముల కంటే అదనంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున లంచాలు వసూలు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో కడప ఏసీబీ డీఎస్పీ సీతారామారావు నేతృత్వంలో అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాత్రి వరకూ కొనసాగిన విచారణ, మంగళవారం మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఏసీబీ అధికారులు దాడుల్లో భాగంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలోని పలు కీలక పత్రాలు, దస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు కార్యాలయంలో జరిగిన లావాదేవీలు, వసూలు చేసిన ఫీజులను తనిఖీ చేశారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ సీతారామ రావు మీడియాతో మాట్లాడుతూ...... సబ్ రిజిస్ట్రార్ గురుస్వామితో పాటు సిబ్బంది సాధారణ ప్రజల వద్ద నుంచి రిజిస్ట్రేషన్ ఫీజుల కంటే అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు సమాచారం అందిందని చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కార్యాలయంలో ముమ్మర సోదాలు నిర్వహించామన్నారు. కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్న ప్రైవేటు వ్యక్తులు, లోపల ఉన్న డాక్యుమెంట్ రైటర్లు, హాజరైన ప్రజలను అదుపులోకి తీసుకొని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. లెక్క తేలని నగదు స్వాధీనం తనిఖీల సమయంలో కార్యాలయంలో లభ్యమైన మొత్తం నగదును అధికారులు స్వాధీనం చేసుకుని రికార్డులతో సరిపోల్చామన్నారు. అందులో రూ. 45,000 మాత్రమే ప్రభుత్వానికి చెల్లించాల్సిన చట్టబద్ధమైన ఫీజుగా తేలిందని, మిగిలిన రూ. 82,000 పైగా ఉన్న మొత్తానికి ఎటువంటి లెక్కాపత్రాలు లేకపోవడంతో, అది ప్రజల నుంచి వసూలు చేసిన లంచపు సొమ్ముగా ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. ఉన్నతాధికారులకు నివేదిక సోదాల్లో రికార్డుల అవకతవకలు, స్వాధీనం చేసుకున్న నగదు తాలూకు వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి పంపుతున్నట్లు డీఎస్పీ సీతారామారావు వెల్లడించారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి అందే తదుపరి ఉత్తర్వులు, ఆదేశాల మేరకు సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి, సంబంధిత సిబ్బందిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను
    1
    ఫ్రెండ్స్ మా చిన్నబాబు వివేకనంద ఈరోజు బర్త్డే ఫ్రెండ్స్ మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుతున్నాను
    user_Kadiri Anjaneyulu
    Kadiri Anjaneyulu
    కదిరి, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.
    1
    స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా పోటీ జరగకుండా ఏకగ్రీవమైతే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండరు. ఎన్నికల తర్వాత నేను రిపోర్ట్ తెప్పించుకుంటాను. ప్రతి చోటా పోటీ జరగాల్సిందే.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత చిత్తూరు జిల్లా కుప్పం . న్యూస్.. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన చిన్నారులు చందన, లోకియ, నాగవాని, అజయ్, కిరణ్ అనే చిన్నారులకు అస్వస్థత హుటాహుటిన అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు చిన్నారులు క్షేమంగా ఉన్నారని తెలిపిన వైద్యులు
    2
    కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన. ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత
చిత్తూరు జిల్లా కుప్పం . న్యూస్..
ఎర్ర ఆముదం కాయలు తిని 5 మంది చిన్నారులు అస్వస్థత
కుప్పం మండలంలోని కంగుంది ఎస్టీ కాలనీలో ఘటన
చిన్నారులు చందన, లోకియ, నాగవాని, అజయ్, కిరణ్ అనే చిన్నారులకు అస్వస్థత
హుటాహుటిన అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు 
చిన్నారులు క్షేమంగా ఉన్నారని తెలిపిన వైద్యులు
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం
    1
    స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! 

ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను 

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! 
ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను 
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు పులివెందుల మెయిన్ బజార్ లోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అర్చకులు స్వామివారికి కలశారాధన, ఉత్త హోమం, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
    1
    పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు
పులివెందుల మెయిన్ బజార్ లోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వేంకట స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం అర్చకులు స్వామివారికి
కలశారాధన, ఉత్త హోమం, అభిషేకం తదితర పూజలు చేశారు. ఆలయంలో వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకొని
తీర్ధప్రసాదాలు స్వీకరించారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ఘరానా ATM మోసగాడిని అరెస్ట్ చేసిన బంగారుపాలెం పోలీసులు. రెండు ATM మోసం కేసుల ఛేదన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం నందు ఘరానా ATM మోసగాడిని బంగారుపాళ్యం పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద రూ.30,900 నగదు, 67 ATM కార్డులు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.ATM కేంద్రాల వద్ద నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే అమాయక ప్రజలను ATM కార్డులు మార్చి ఏమారుస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదుల మేరకు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ లో Cr.No.139/2026 U/Sec.318(4), 303(2) BNS మరియు Cr.No.140/2026 U/Sec.318(4), 303(2) BNS కేసులను బంగారుపాళ్యం పోలీసులు నమోదు చేయడం జరిగింది. దీనిపై జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు పలమనేరు సబ్- డివిజన్ డీఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు, బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ K. శ్రీనివాసులు గారు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతికతను ఉపయోగించి రాబడిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ గారు ఎస్‌.ఐ. T. ప్రసాద్ మరియు సిబ్బంది 24-08-2026న బంగారుపాళ్యం పాలేరు బ్రిడ్జ్ వద్ద అనుమానాస్పదంగా మోటార్ సైకిల్‌పై వస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో బంగారుపాలెం నందు జరిగిన రెండు ATM ల వద్ద మోసం చేసిన తానే నిందితుడిని అంగీకరించాడు. అనంతరం నిందితుడు ATM కేంద్రాల వద్ద నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే అమాయక ప్రజలను గమనించేవాడు. వారికి ATMలో డబ్బులు డ్రా చేసి ఇస్తానని నమ్మించి, వారి ATM కార్డు మరియు PIN తెలుసుకునేవాడు. అనంతరం వారి అసలు ATM కార్డుకు బదులుగా తన వద్ద ఉన్న వేరొక ATM కార్డును ఇచ్చి మోసం చేసేవాడు. తీసుకున్న అసలు ATM కార్డులను ఉపయోగించి ఇతర ATM కేంద్రాలకు వెళ్లి బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి నగదును డ్రా చేసుకునేవాడని విచారణలో వెల్లడైంది. 1. Cr.No.139/2026 01-08-2026న K.G. సత్రంలోని SBI ATM వద్ద Y. శివనాయుడు అనే వ్యక్తిని మోసం చేసి, అతని ATM కార్డును మార్చి తీసుకున్నాడు. అనంతరం ఆ కార్డును ఉపయోగించి రూ.15,000/- నగదును అక్రమంగా డ్రా చేశాడు. 2. Cr.No.140/2026 16-08-2026న బంగారుపాళ్యం టౌన్, గాజులపల్లి రోడ్డులోని India One ATM వద్ద C. కరుణాకరన్ అనే వ్యక్తిని ఇదే విధంగా మోసం చేసి, అతని ATM కార్డును మార్చి తీసుకున్నాడు. అనంతరం రూ.15,900/- నగదును అక్రమంగా డ్రా చేశాడు. స్వాధీనం చేసుకున్న సొత్తు • రూ.15,000/- నగదు – Cr.No.139/2026 కేసుకు సంబంధించినది. • రూ.15,900/- నగదు – Cr.No.140/2026 కేసుకు సంబంధించినది. • మొత్తం రూ.30,900/- నగదు. • 67 ATM కార్డులు. • ఒక బ్లూ కలర్ Suzuki Access మోటార్ సైకిల్. అరెస్ట్ అయిన నిందితుడి వివరాలు: మేలుమై దుర్గాప్రసాద్, వయస్సు 28 సంవత్సరాలు, S/o M. చంద్రయ్య, R/o 5-39/2, బేరుపల్లి గ్రామం, పెంగరగుంట పోస్టు, పలమనేరు మండలం, చిత్తూరు జిల్లా. నిందితుడిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపడమైనది. కేసులపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ATM వద్ద అపరిచిత వ్యక్తుల సహాయం తీసుకోకండి. మీ ATM కార్డు, PIN, OTP వంటి రహస్య వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు. ATM కార్డు మార్చే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
    4
    ఘరానా ATM మోసగాడిని అరెస్ట్ చేసిన బంగారుపాలెం పోలీసులు. రెండు ATM మోసం కేసుల ఛేదన
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం నందు ఘరానా ATM మోసగాడిని బంగారుపాళ్యం పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద రూ.30,900 నగదు, 67 ATM కార్డులు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు.ATM కేంద్రాల వద్ద నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే అమాయక ప్రజలను ATM కార్డులు మార్చి ఏమారుస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదుల మేరకు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ లో Cr.No.139/2026 U/Sec.318(4), 303(2) BNS మరియు Cr.No.140/2026 U/Sec.318(4), 303(2) BNS కేసులను బంగారుపాళ్యం పోలీసులు నమోదు చేయడం జరిగింది.
దీనిపై జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS గారి ఆదేశాల మేరకు పలమనేరు సబ్- డివిజన్ డీఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు, బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ K. శ్రీనివాసులు గారు దర్యాప్తు ప్రారంభించారు.
సాంకేతికతను ఉపయోగించి రాబడిన సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ గారు ఎస్‌.ఐ. T. ప్రసాద్ మరియు సిబ్బంది 24-08-2026న బంగారుపాళ్యం పాలేరు బ్రిడ్జ్ వద్ద అనుమానాస్పదంగా మోటార్ సైకిల్‌పై వస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో బంగారుపాలెం నందు జరిగిన రెండు ATM ల వద్ద మోసం చేసిన తానే నిందితుడిని అంగీకరించాడు.
అనంతరం నిందితుడు ATM కేంద్రాల వద్ద నగదు డ్రా చేసుకునేందుకు వచ్చే అమాయక ప్రజలను గమనించేవాడు. వారికి ATMలో డబ్బులు డ్రా చేసి ఇస్తానని నమ్మించి, వారి ATM కార్డు మరియు PIN తెలుసుకునేవాడు.
అనంతరం వారి అసలు ATM కార్డుకు బదులుగా తన వద్ద ఉన్న వేరొక ATM కార్డును ఇచ్చి మోసం చేసేవాడు. తీసుకున్న అసలు ATM కార్డులను ఉపయోగించి ఇతర ATM కేంద్రాలకు వెళ్లి బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి నగదును డ్రా చేసుకునేవాడని విచారణలో వెల్లడైంది.
1. Cr.No.139/2026
01-08-2026న K.G. సత్రంలోని SBI ATM వద్ద Y. శివనాయుడు అనే వ్యక్తిని మోసం చేసి, అతని ATM కార్డును మార్చి తీసుకున్నాడు. అనంతరం ఆ కార్డును ఉపయోగించి రూ.15,000/- నగదును అక్రమంగా డ్రా చేశాడు.
2. Cr.No.140/2026
16-08-2026న బంగారుపాళ్యం టౌన్, గాజులపల్లి రోడ్డులోని India One ATM వద్ద C. కరుణాకరన్ అనే వ్యక్తిని ఇదే విధంగా మోసం చేసి, అతని ATM కార్డును మార్చి తీసుకున్నాడు. అనంతరం రూ.15,900/- నగదును అక్రమంగా డ్రా చేశాడు.
స్వాధీనం చేసుకున్న సొత్తు
• రూ.15,000/- నగదు – Cr.No.139/2026 కేసుకు సంబంధించినది.
• రూ.15,900/- నగదు – Cr.No.140/2026 కేసుకు సంబంధించినది.
• మొత్తం రూ.30,900/- నగదు.
• 67 ATM కార్డులు.
• ఒక బ్లూ కలర్ Suzuki Access మోటార్ సైకిల్.
అరెస్ట్ అయిన నిందితుడి వివరాలు:
మేలుమై దుర్గాప్రసాద్, వయస్సు 28 సంవత్సరాలు, S/o M. చంద్రయ్య, R/o 5-39/2, బేరుపల్లి గ్రామం, పెంగరగుంట పోస్టు, పలమనేరు మండలం, చిత్తూరు జిల్లా.
నిందితుడిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపడమైనది. కేసులపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
ATM వద్ద అపరిచిత వ్యక్తుల సహాయం తీసుకోకండి. మీ ATM కార్డు, PIN, OTP వంటి రహస్య వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు. ATM కార్డు మార్చే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • పుంగనూరు పట్టణంలోని కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదం ఇద్దరికి గాయాలు రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగు ప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ ను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    పుంగనూరు పట్టణంలోని కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదం ఇద్దరికి గాయాలు
రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగు ప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ ను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి  గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • పుంగనూరు కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదO. వ్యక్తికి గాయాలు. రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగుప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన వేగ నిరోధకంను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    3
    పుంగనూరు కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదO. వ్యక్తికి గాయాలు.
రామసముద్రం మండలం అరికెల గ్రామానికి చెందిన నారాయణ తన మనవడు హర్ష తో కలిసి ద్విచక్ర వాహనం లో వ్యక్తిగత పని నిమిత్తం పుంగనూరుకు వచ్చి తిరుగుప్రయాణంలో మినీ బైపాస్ రోడ్డు కోర్టు సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. నూతనంగా ఏర్పాటు చేసిన వేగ నిరోధకంను చూసి సడెన్ బ్రేక్ వేయడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. తన మనవడు హర్ష కు కొద్దిపాటి  గాయాలు అవ్వడంతో వెంటనే గుర్తించిన వాహనదారులు, వారిని దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి ఆటోలో తరలించడం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.