ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు: ఉత్సాహంగా సాగిన క్రికెట్ టోర్నమెంట్ హిందూపూర్ జట్టు విజేత.. విజేతలకు రూ. 1.10 లక్షల నగదు బహుమతి అందజేసిన పారిశ్రామికవేత్త సందా రాఘవ ధర్మవరం ఏప్రిల్ 20 రాష్ట్ర భవిష్యత్తు ప్రదాత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని, స్థానిక పారిశ్రామికవేత్త మరియు టీడీపీ యువ నాయకులు సందా రాఘవ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ఉత్సాహభరితంగా ముగిశాయి. క్రీడలను ప్రోత్సహించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ముగిసింది. నేడు జరిగిన తుది పోరులో హిందూపూర్ వర్సెస్ ధర్మవరం జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన ధర్మవరం జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 109 పరుగులు చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన హిందూపూర్ జట్టు ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే 122 పరుగులు సాధించి అద్భుత విజయాన్ని అందుకున్నారు. విజేతలుగా నిలిచిన హిందూపూర్ జట్టుకు రూ. 1,10,000 నగదు మరియు ట్రోఫీనీ సందా రాఘవ అందజేశారు. రన్నరప్ గా నిలిచిన జట్టుకురూ. 50,000 నగదు మరియు ట్రోఫీని ఆదిత్య స్కూల్ జనార్దన్ మరియు చందు అందజేశారు. మరో రెండు జట్లకు ప్రోత్సాహక బహుమతుల కింద కొత్తపేట ఆది టీంకు రూ. 10,000 మరో జట్టుకు రూ. 5,000 నగదును మాంగల్య సిల్క్స్ జింకా పురుషోత్తం, సందా రాఘవ, సందా రవి అందజేశారు. ఈ కార్యక్రమంలో కమతం కాటమయ్య, పరిసే సుధాకర్, సెట్ చంద్ర, పురుషోత్తం గౌడ్, సింగిల్ విండో చైర్మన్ రామాంజి, CBN రామకృష్ణ, కెసగాళ్ల శీనా, భీమినేని ప్రసాద్, మాధవ రెడ్డి మరియు ఇతర స్థానిక టీడీపీ నాయకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు: ఉత్సాహంగా సాగిన క్రికెట్ టోర్నమెంట్ హిందూపూర్ జట్టు విజేత.. విజేతలకు రూ. 1.10 లక్షల నగదు బహుమతి అందజేసిన పారిశ్రామికవేత్త సందా రాఘవ ధర్మవరం ఏప్రిల్ 20 రాష్ట్ర భవిష్యత్తు ప్రదాత,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని, స్థానిక పారిశ్రామికవేత్త మరియు టీడీపీ యువ నాయకులు సందా రాఘవ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలు ఉత్సాహభరితంగా ముగిశాయి. క్రీడలను ప్రోత్సహించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ నేడు జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో ముగిసింది. నేడు జరిగిన తుది పోరులో హిందూపూర్ వర్సెస్ ధర్మవరం జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన ధర్మవరం జట్టు నిర్ణీత 12 ఓవర్లలో 109 పరుగులు చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన హిందూపూర్ జట్టు ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే 122 పరుగులు సాధించి అద్భుత విజయాన్ని అందుకున్నారు. విజేతలుగా
నిలిచిన హిందూపూర్ జట్టుకు రూ. 1,10,000 నగదు మరియు ట్రోఫీనీ సందా రాఘవ అందజేశారు. రన్నరప్ గా నిలిచిన జట్టుకురూ. 50,000 నగదు మరియు ట్రోఫీని ఆదిత్య స్కూల్ జనార్దన్ మరియు చందు అందజేశారు. మరో రెండు జట్లకు ప్రోత్సాహక బహుమతుల కింద కొత్తపేట ఆది టీంకు రూ. 10,000 మరో జట్టుకు రూ. 5,000 నగదును మాంగల్య సిల్క్స్ జింకా పురుషోత్తం, సందా రాఘవ, సందా రవి అందజేశారు. ఈ కార్యక్రమంలో కమతం కాటమయ్య, పరిసే సుధాకర్, సెట్ చంద్ర, పురుషోత్తం గౌడ్, సింగిల్ విండో చైర్మన్ రామాంజి, CBN రామకృష్ణ, కెసగాళ్ల శీనా, భీమినేని ప్రసాద్, మాధవ రెడ్డి మరియు ఇతర స్థానిక టీడీపీ నాయకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు.
- శ్రీ సత్య సాయి జిల్లా కదిరి రూరల్ మండలం ఎర్రదొడ్డి తాండ గ్రామంలో యూరియా కలిపిన నీరు త్రాగి దాదాపు 40 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల రైతు బోజే నాయక్ గొర్రెలను మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గొర్రెలను తీసుకెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో పంట పొలాలకు యూరియా కలిపి ఉంచిన నీరు గొర్రెలు త్రాగి 40 గొర్రెలు మృతి చెందాయని గ్రామస్తులు తెలుపుతున్నారు. సుమారు గొర్రెలు 4 లక్షల రూపాయలు విలువ చేస్తా అన్నారు. బతుకుదెరువు కోసం ఉన్న గొర్రెలు ఒక్కసారిగా అన్ని మృతి చెందడంతో ఇంటిని ఎలా పోషించుకోవాలని రైతు కన్నీరు పెట్టుకున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి ఆ రైతును ఆదుకోవాలని వేడుకుంటున్నారు.1
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కాలువ తలపెట్టిన 10 రోజుల హోమాలు నేటితో ముగిసాయి. నేడు చంద్రబాబు జన్మదినం సందర్భంగా మహా చండీయాగం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. చంద్రబాబు బాగుంటేనే రాష్ట్రం కూడా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే దైవబలం ఆయనకు సమకూరాలని తాము యజ్ఞాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రభుత్వ విప్ కాలువ శుభాకాంక్షలు తెలిపారు.1
- చంద్రబాబు నాయుడు తోనే రాష్ట్ర అభివృద్ధి : పతిరాజు కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందుతుందని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాదిరాజు లక్ష్మణ పతి రాజు అన్నారు సోమవారం ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్ నందు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ నందు భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ మేరకు ఆయన ప్రసంగిస్తూ ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో కూటమి ప్రభుత్వ రథసారథి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ అదేవిధంగా ప్రకటించనటువంటి కార్యక్రమాలను పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకు దక్కుతుందన్నారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారన్నారు నవీన రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు అనంతరం అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ హరీ రాయల్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవుల రామచంద్రయ్య వేలూరు సుబ్రహ్మణ్యం కార్తీక్ మురళి విద్యాసాగర్ బోయకొండ పవన్ రామకృష్ణ శివప్ప పునీత్ రాజు కుంచి నరేష్ బోయకొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు3
- కర్నూలు జిల్లా... హలహర్వి మండలం మెదేహల్ గ్రామం సమీపంలో ఆటో బోల్తా... ఒకరికి పరిస్థితి విషమంగా ఉంది నలుగురికి గాయాలు... చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది2
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1
- Post by Daatha Foundation Trust1
- బద్వేలు:సరస్వతి శిశు మందిరంలో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితభావంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ వేదికపై ఘనంగా సన్మానం జరిగింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానంతో పాటు, విద్యా విలువలను చాటిచెప్పే పలు కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి. క్రమశిక్షణ, విద్య మరియు సంస్కృతుల కలయికగా సాగిన ఈ ఉత్సవం అందరినీ అలరించింది. ఈ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న పలువురికి సరస్వతి శిశు మందిరం కమిటీ సభ్యులు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు, అనంతరం శిశు మందిరం వార్షికోత్సవ వేడుకల్లో ఉపాధ్యాయులతో పాటు కమిటీ సభ్యులు పలువురు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు2
- గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబునాయుడు గారి 76వ జన్మదిన వేడుకల సందర్భంగా బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వ్యక్తిగత సలహాదారుడైనటువంటి బిజివేముల రాజశేఖర్ రెడ్డి గారు పేదలకు ఉదయాన్నే అల్పాహారం వారి వద్దకు చేర్చడం జరిగింది1