Shuru
Apke Nagar Ki App…
వనమహోత్సవం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ మహబూబాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వనమహోత్సవం' కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ పిలుపునిచ్చారు. ఈదులపూసపల్లి లేక్ వ్యూ నేచర్ పార్క్ మరియు చెరువు పరిసర ప్రాంతాల్లో జిల్లా అటవీశాఖ అధికారి బి. లావణ్యతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటి, నీరు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, వివిధ పత్రికలు మరియు ఛానళ్ల మీడియా ప్రతినిధులు, పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా మొక్కలు నాటారు.
ఆడెపు రాంకిషన్
వనమహోత్సవం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ మహబూబాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'వనమహోత్సవం' కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్ పిలుపునిచ్చారు. ఈదులపూసపల్లి లేక్ వ్యూ నేచర్ పార్క్ మరియు చెరువు పరిసర ప్రాంతాల్లో జిల్లా అటవీశాఖ అధికారి బి. లావణ్యతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటి, నీరు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, వివిధ పత్రికలు మరియు ఛానళ్ల మీడియా ప్రతినిధులు, పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా మొక్కలు నాటారు.
More news from తెలంగాణ and nearby areas
- మహాదేవపూర్ బీఆర్‌ఎస్ మాజీ ఉపసర్పంచ్ సల్మాన్ ఖాన్ మృతి.. కన్నీటి వీడ్కోలు పలికిన నాయకులు, అభిమానులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మాజీ ఉపసర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకుడు సల్మాన్ ఖాన్ మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు, స్థానిక నాయకుల్లో విషాదం నెలకొంది. మంథని నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుట్ట మధుకర్ సల్మాన్ ఖాన్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు. సల్మాన్ ఖాన్ మృతి పార్టీకి, స్థానిక ప్రజలకు తీరని లోటని పుట్ట మధుకర్ పేర్కొన్నారు. అంతిమయాత్రలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు. గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.1
- బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- జనగామ బస్టాండ్లో దొంగల హల్చల్ : ప్రయాణికుడి డబ్బు మాయం జిల్లా కేంద్రమైన జనగామ బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద 20 వేల 6 వందల నగదు అపహరణకు గురైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ సంఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసిన ఫలితం లేకపోవడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- తెలంగాణ ఆర్టీసీ బస్సు లో 80 మంది మహిళలు ఇద్దరే పురుషులు కండక్టర్ వీడియో వైరల్ *బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్* మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు. #తెలంగాణా1
- హుస్నాబాద్ 20వ వార్డులో పందుల బెడద................... ......... హుస్నాబాద్ పట్టణంలోని 20వ వార్డులో పందుల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధుల్లో పెద్ద సంఖ్యలో పందులు సంచరిస్తుండటంతో పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పందుల కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురైతే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి పందుల నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.1
- రంగశాయిపేటలో ఘనంగా వనమహోత్సవం.. మొక్కలు నాటిన మంత్రి కొండా సురేఖ వరంగల్: ఖిలా వరంగల్ పరిధిలోని రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక వనమహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. వనమహోత్సవంలో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, ప్రకృతి సంపద సంరక్షణకు సంబంధించిన ప్రదర్శనలను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య శారద, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఫ్రెష్ బస్) ఆరుగురు మృతి, 20 మందికి గాయాలు బ్రేకింగ్ న్యూస్: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (ఫ్రెష్ బస్).. ఆరుగురు మృతి, 20 మందికి గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా కోదాడ మండలం ద్వారకుంట వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ కోసం గాలిస్తున్న సూర్యాపేట జిల్లా పోలీసులు.1