logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*ముదిగుబ్బలో ఉద్రిక్తత* సీఐ శివరాముడిపై టిడిపి నేతల ఆగ్రహం – పోలీస్ స్టేషన్ ఎదుట భారీ నిరసన శ్రీ సత్యసాయి జిల్లా,ముదిగుబ్బ, ఫిబ్రవరి 19: ముదిగుబ్బ పట్టణంలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పట్టణ సీఐ శివరాముడు ఏకపక్ష ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపిస్తూ టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీగా ముదిగుబ్బ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. సీఐ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్న మండలంలో అనవసర ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని వారు విమర్శించారు. *🔹 టిడిపి ఆరోపణలు ఇవీ…* ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ టిడిపి నాయకులు, కార్యకర్తలను తరచూ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదులపై సమగ్ర విచారణ లేకుండానే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. బైండోవర్ పేరుతో తరచూ ఇబ్బందులకు గురిచేస్తూ, కౌన్సిలింగ్ పేరుతో మానసిక ఒత్తిడి కలిగిస్తున్నారని విమర్శించారు. పట్టా భూమి వివాదం వేడెక్కింది,తాజాగా తమ పట్టా భూమిలో ఇల్లు నిర్మాణం చేపట్టిన సుధాకర్, విశ్వనాథ్‌లపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ లేకుండానే కేసు నమోదు చేసి, వారిని నేరస్తుల్లా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి అవమానించారని టిడిపి నేతలు తెలిపారు. ఈ విషయంపై ఆగ్రహంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. డీఎస్పీ జోక్యం – శాంతించిన నిరసన సమాచారం అందుకున్న డీఎస్పీ ఫోన్ ద్వారా టిడిపి నాయకులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది.గత సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా సంకేపల్లి పరసలో జరిగిన ఘటనలో ఎలాంటి నేర చరిత్ర లేని టిడిపి నాయకులపై కేసులు నమోదు చేసి ఇప్పటికీ వేధిస్తున్నారని ఆరోపించారు. అలాగే ముదిగుబ్బ గేట్ కొట్టాల వద్ద ఎలాంటి సంఘటన జరగకపోయినా వైసిపి ఫిర్యాదు మేరకు టిడిపి కార్యకర్తలను పిలిపించి దాడి చేశారని పేర్కొన్నారు. పోస్టర్లు, ఫ్లెక్సీల వివాదం-దొరిగిల్లు గ్రామంలో జగన్ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి రక్తాభిషేకం చేసిన ఘటనలో పోలీసులు మొదట స్పందించలేదని టిడిపి నేతలు తెలిపారు. రాష్ట్ర స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మాత్రమే కేసు నమోదు చేశారని ఆరోపించారు. రక్తంతో ఉన్న ఫ్లెక్సీ నెల రోజులపాటు తొలగించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా సంకేపల్లి వీరనారాయణ స్వామి పరసలో రాజకీయ ఫ్లెక్సీలు, డీజే సౌండ్ సిస్టమ్‌లు పెట్టకూడదని కమిటీ సభ్యులు, పోలీసులు ముందుగా నిర్ణయించినప్పటికీ, వైసిపి కార్యకర్తలు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఘటనను పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. *🔹 లాఠీచార్జ్ ఆరోపణ* అలాగే వైసిపి మాజీ ఎంపీ Gorantla Madhav వాహనం రాక సందర్భంగా అడ్డుగా ఉన్నారని ఆరోపిస్తూ టిడిపి కార్యకర్తలైన సూర్యనారాయణ రెడ్డి, అమరేశ్వర్ రెడ్డిపై లాఠీచార్జ్ చేసి గాయపరిచారని తెలిపారు. గాయపడిన వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్పీకి విజ్ఞప్తి ఈ ఘటనలపై జిల్లా ఎస్పీ స్పందించి సీఐ శివరాముడిపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు.

on 19 February
user_Saddala Adi Narayana Reporter
Saddala Adi Narayana Reporter
ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • లక్షల మంది ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ అనే ఈ మహా యజ్ఞం లో భాగస్వాములు అవ్వండి.చేయి చేయి కలపండి
    1
    లక్షల మంది ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ అనే ఈ మహా యజ్ఞం లో భాగస్వాములు అవ్వండి.చేయి చేయి కలపండి
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ గ్రామానికి చెందిన వైసిపి నాయకులు రమేష్ రెడ్డిని విమర్శించేస్తాయి టిడిపి కార్యకర్తలకు లేదని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పుటాకుల గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశా మన్నారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కుటాగుల గ్రామంలో దేవాలయం అభివృద్ధి చేసినట్లు వైసిపి నాయకులు తెలిపారు. అభివృద్ధి ఏంటో చేసి చూపించిన ఘనత వైసీపీకి దక్కిందన్నారు.
    1
    కదిరి మున్సిపాలిటీ పరిధిలోని కుటాగుళ గ్రామానికి చెందిన వైసిపి నాయకులు రమేష్ రెడ్డిని విమర్శించేస్తాయి టిడిపి కార్యకర్తలకు లేదని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పుటాకుల గ్రామానికి ఎంతో అభివృద్ధి చేశా మన్నారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కుటాగుల గ్రామంలో దేవాలయం అభివృద్ధి చేసినట్లు వైసిపి నాయకులు తెలిపారు. అభివృద్ధి ఏంటో చేసి చూపించిన ఘనత వైసీపీకి దక్కిందన్నారు.
    user_Srivartha news
    Srivartha news
    Kadiri, Sri Sathya Sai•
    11 hrs ago
  • అన్నమయ్య జిల్లాపుంగనూరు చౌడేపల్లి ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ను దర్శించుకున్న చంద్రగిరి, పూతలపట్టు శాసన సభ్యులు చంద్రగిరి శాసన సభ్యులు పులివర్తి నాని, పూతలపట్టు శాసన సభ్యులు కలికిరి మురళీమోహన్ లు అమ్మవారిని దర్శించుకున్నారు. అమరావతి రాజధాని గా అసంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మాణం చేయడంతో సదరు బిల్లును పార్లమెంట్ లో ఆమోదానికి పంపడం జరిగింది మన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అమరావతిని ఒక రాష్ట్ర రాజధాని కాదని ప్రజాసంకల్పంగా తీర్చిదిద్దారని వారు అన్నారు.
    4
    అన్నమయ్య జిల్లాపుంగనూరు
చౌడేపల్లి 
ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ను దర్శించుకున్న చంద్రగిరి, పూతలపట్టు శాసన సభ్యులు
చంద్రగిరి శాసన సభ్యులు పులివర్తి నాని, పూతలపట్టు శాసన సభ్యులు కలికిరి మురళీమోహన్ లు అమ్మవారిని దర్శించుకున్నారు.
అమరావతి రాజధాని గా అసంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మాణం చేయడంతో 
సదరు బిల్లును పార్లమెంట్ లో ఆమోదానికి పంపడం జరిగింది 
మన ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అమరావతిని ఒక రాష్ట్ర రాజధాని కాదని ప్రజాసంకల్పంగా తీర్చిదిద్దారని వారు అన్నారు.
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    16 hrs ago
  • రాజధాని అమరావతి చట్టసభలో అమలు కావడంతో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన టిడిపి తమ్ముళ్లు ... అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి... చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రానికి అభివృద్ధి, పెట్టుబడులు. కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వైకుంఠం శివప్రసాద్ మరియు బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు..
    2
    రాజధాని అమరావతి చట్టసభలో అమలు కావడంతో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన టిడిపి తమ్ముళ్లు ...
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసిన టిడిపి ఇన్చార్జి వైకుంఠం జ్యోతి... 
చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రానికి అభివృద్ధి, పెట్టుబడులు.
కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి  రాష్ట్ర  ఆర్గనైజింగ్  సెక్రెటరీ వైకుంఠం  శివప్రసాద్ మరియు  బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు..
    user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
    రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • బద్వేలు అర్బన్, ఏప్రిల్ 03 : బద్వేలు పట్టణంలోని సిద్ధవటం రోడ్ ఎస్సీ కాలనీ వద్ద శుక్రవారం ఉదయం శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పలువురు దాతల సహకారంతో వేసవి తాపాన్ని తీర్చేందుకు ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని ఎక్సైజ్ శాఖ సీఐ సీతారామిరెడ్డి,బద్వేల్ అర్బన్ ఎస్సై కొండారెడ్డి డాక్టర్ వాసుదేవా రెడ్డి, డాక్టర్ సత్యప్రసాద్, ఫైర్ ఆఫీసర్ చేతుల మీదుగా ప్రారంభించారు,ఈ ఏర్పాటు చేసిన చలివేంద్రానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలువురు అధికారులకు శాలువాలతో ఘనంగా వార్త స్టాప్ రిపోర్టర్ భూమిరెడ్డి వెంకటేష్,అర్బన్ రిపోర్టర్ వల్లo కొండు వెంకటరమణ మరియు కె.వి సుబ్బారావు సి,వి నాగేశ్వరరావు మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి చంద్రశేఖర్ చేతుల మీదుగా సత్కరించడం జరిగింది, ఈ సందర్భంగా సీఐ సీతారామి రెడ్డి,ఎస్ఐ కొండారెడ్డి, ఎక్సైజ్ శాఖ ఎస్సై సతీష్ కుమార్,వాసుదేవా హాస్పిటల్ డాక్టర్ వాసుదేవ రెడ్డి, ప్రసాద్ దంత వైద్యశాల నిపుణులు డాక్టర్ సత్యప్రసాద్ లు మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో గత ఏడు సంవత్సరాలుగా మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చడం ఎంతో సంతోషకరమన్నారు, ఎండలు మండిపోతున్న ఈ సమయంలో బాటసారులకు, విద్యార్థులకు, డైలీ కూలీలకు, తోపుడు బండ్లు వ్యాపారస్తులకు, ఆటో వారికి దాహర్తిని తీర్చడం కన్నా గొప్ప పుణ్యకాలం మరొకటి లేదన్నారు, ప్రజల అవసరాలను గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల సమాజంలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు, వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే మంచినీళ్లు ఎంతో కీలకమన్నారు, దాతలు ముందుకు వచ్చి ఇలాంటి ఏర్పాటు చేయడం వల్ల సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు, ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్న చలివేంద్రాలు ప్రస్తుత వేసవి కాలంలో ఎండల తీవ్రకు దృష్టి సామాన్య ప్రజలకు తాగునీరు అనేది అత్యవసరంగా మారిందన్నారు, మార్కెట్లో లీటర్ దాదాపు పది రూపాయలు విలువ ఉందని ఇటువంటి తరుణంలో రూపాయి ఖర్చు లేకుండా స్వచ్ఛమైన మినరల్ వాటర్ కూల్ వాటర్ ద్వారా ప్రజల దాహార్తి చేర్చడం ఎంతో గొప్ప విషయం అన్నారు, ఈ ఉచిత చలివేంద్రాలు వారి దాహర్తిని తీర్చడమే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో ఆసరాగా నిలుస్తాయని పలువురు కోరారు, మరికొందరు కూడా ముందుకు వచ్చి మరికొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహర్తి తీర్చుట కొరకు కృషి చేయాలని వారు కోరారు, వేసవికాలంలో చలివేంద్రాల వద్ద ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉండే విధంగా చలివేంద్ర నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ వాసుదేవరెడ్డి తెలిపారు, ఈ కార్యక్రమంలో మాజీ ఆర్యవైశ్య వర్తక సంగం అధ్యక్షులు కే,వీ సుబ్బారావు, ఆవోపా సెక్రటరీ సీ,వీ నాగేశ్వరరావు, వల్లం కొండు రాఘవేంద్ర, అనిత్, ఖాదర్ భాషా, ఆవులేటి శేఖర్ రాయల్,ఓబులేష్, బ్రహ్మయ్య, శీలం శంకర్, తో పాటు పలువురు సహకరించిన దాతలు ఎక్సైజ్, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
    3
    బద్వేలు అర్బన్, ఏప్రిల్  03 : బద్వేలు పట్టణంలోని సిద్ధవటం రోడ్ ఎస్సీ కాలనీ వద్ద శుక్రవారం ఉదయం శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో పలువురు దాతల సహకారంతో వేసవి తాపాన్ని తీర్చేందుకు ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని ఎక్సైజ్ శాఖ సీఐ సీతారామిరెడ్డి,బద్వేల్ అర్బన్ ఎస్సై కొండారెడ్డి డాక్టర్ వాసుదేవా రెడ్డి, డాక్టర్ సత్యప్రసాద్, ఫైర్ ఆఫీసర్ చేతుల మీదుగా ప్రారంభించారు,ఈ ఏర్పాటు చేసిన చలివేంద్రానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పలువురు అధికారులకు శాలువాలతో ఘనంగా వార్త స్టాప్ రిపోర్టర్ భూమిరెడ్డి వెంకటేష్,అర్బన్ రిపోర్టర్ వల్లo కొండు వెంకటరమణ మరియు కె.వి సుబ్బారావు సి,వి నాగేశ్వరరావు మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పబ్బతి చంద్రశేఖర్ చేతుల మీదుగా సత్కరించడం జరిగింది, ఈ సందర్భంగా సీఐ సీతారామి రెడ్డి,ఎస్ఐ కొండారెడ్డి, ఎక్సైజ్ శాఖ ఎస్సై సతీష్ కుమార్,వాసుదేవా హాస్పిటల్ డాక్టర్ వాసుదేవ రెడ్డి, ప్రసాద్ దంత వైద్యశాల నిపుణులు  డాక్టర్ సత్యప్రసాద్ లు మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో గత ఏడు సంవత్సరాలుగా మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చడం ఎంతో సంతోషకరమన్నారు, ఎండలు మండిపోతున్న ఈ సమయంలో బాటసారులకు, విద్యార్థులకు, డైలీ కూలీలకు, తోపుడు బండ్లు వ్యాపారస్తులకు, ఆటో వారికి దాహర్తిని తీర్చడం కన్నా గొప్ప పుణ్యకాలం మరొకటి లేదన్నారు, ప్రజల అవసరాలను గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల సమాజంలో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందన్నారు, వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే మంచినీళ్లు ఎంతో కీలకమన్నారు, దాతలు ముందుకు వచ్చి ఇలాంటి ఏర్పాటు చేయడం వల్ల సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు, ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్న చలివేంద్రాలు ప్రస్తుత వేసవి కాలంలో ఎండల తీవ్రకు దృష్టి సామాన్య ప్రజలకు తాగునీరు అనేది అత్యవసరంగా మారిందన్నారు, మార్కెట్లో లీటర్ దాదాపు పది రూపాయలు విలువ ఉందని ఇటువంటి తరుణంలో రూపాయి ఖర్చు లేకుండా స్వచ్ఛమైన మినరల్ వాటర్ కూల్ వాటర్ ద్వారా ప్రజల దాహార్తి చేర్చడం ఎంతో గొప్ప విషయం అన్నారు, ఈ ఉచిత చలివేంద్రాలు వారి దాహర్తిని తీర్చడమే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో ఆసరాగా నిలుస్తాయని పలువురు కోరారు, మరికొందరు కూడా ముందుకు వచ్చి మరికొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహర్తి తీర్చుట కొరకు కృషి చేయాలని వారు కోరారు, వేసవికాలంలో చలివేంద్రాల వద్ద ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉండే విధంగా చలివేంద్ర నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ వాసుదేవరెడ్డి తెలిపారు, ఈ కార్యక్రమంలో మాజీ ఆర్యవైశ్య వర్తక సంగం అధ్యక్షులు కే,వీ సుబ్బారావు, ఆవోపా సెక్రటరీ సీ,వీ నాగేశ్వరరావు, వల్లం కొండు రాఘవేంద్ర, అనిత్, ఖాదర్ భాషా, ఆవులేటి శేఖర్ రాయల్,ఓబులేష్, బ్రహ్మయ్య, శీలం శంకర్, తో పాటు పలువురు సహకరించిన దాతలు ఎక్సైజ్, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • “మీ ఊరు నుంచి మీ జిల్లా వరకూ… తాజా వార్తలన్నీ మీ ముందుకు తెస్తూ… ఇది షురూ లోకల్ న్యూస్!”
    1
    “మీ ఊరు నుంచి మీ జిల్లా వరకూ…  తాజా వార్తలన్నీ మీ ముందుకు తెస్తూ… ఇది షురూ లోకల్ న్యూస్!”
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter Yemmiganur, Kurnool•
    14 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతికి పార్లమెంట్ వేదికగా చట్టబద్ధత లభించడం 5 కోట్ల ఆంధ్రుల కల నెరవేరిన శుభ సందర్భంగా ఎమ్మిగనూరులో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి రెడ్డి గారి పిలుపు మేరకు టీడీపీ నాయకులు ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుంచి జాతీయ జెండాలతో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పద్మశ్రీ మాచని సోమప్ప కూడలిలో బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
    1
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతికి పార్లమెంట్ వేదికగా చట్టబద్ధత లభించడం 5 కోట్ల ఆంధ్రుల కల నెరవేరిన శుభ సందర్భంగా ఎమ్మిగనూరులో ఘనంగా వేడుకలు నిర్వహించారు.  ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి రెడ్డి గారి పిలుపు మేరకు టీడీపీ నాయకులు ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయం నుంచి జాతీయ జెండాలతో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పద్మశ్రీ మాచని సోమప్ప కూడలిలో బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
    user_ITDP Ravi Royal GONEGANDLA
    ITDP Ravi Royal GONEGANDLA
    ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • Post by K AMPAIAH ACHARI
    1
    Post by K AMPAIAH ACHARI
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter Yemmiganur, Kurnool•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.